Tanuku Assembly Constituency
-
కూటమిలో కుమ్ములాట.. తణుకు ప్రచారంలో ఏం జరగనుందో?
సాక్షి, తణుకు: ఏపీలో ఎన్నికల వేళ కూటమిలో సీట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ పలు చోట్ల కూటమి కార్యకర్తల మధ్య పొసగడం లేదు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీ పెద్దల తీరును తప్పుబడుతున్నారు. దీంతో, కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదిలా ఉండగా.. తణుకు కూటమి రాజకీయంలో సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరాలేదు. తణుకులో టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మధ్య దూరం పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో నేడు తణుకులో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన చీఫ్ పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో తణుకు రాజకీయం హీటెక్కింది. అయితే, కూటమి నేతల ప్రచారం సందర్భంగా తణుకు జనసేన ఇన్చార్జ్ విడివాడకు ఆహ్వనం అందలేదు. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దల తీరుపై జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తణుకు టికెట్ టీడీపీకి ఇవ్వడాన్ని జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో నేడు వీరి ప్రచారంపై ఉత్కంఠ నెలకొంది. అసంతృప్త నేతలతో మాట్లాడి చల్లార్చే ప్రయత్నం చంద్రబాబు, పవన్ ఉమ్మడిగా పర్యటించే తణుకు, అమలాపురంలో టీడీపీ, నిడదవోలు, పి.గన్నవరంలో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమి అభ్యర్థులకు కొందరు సహకరించడంలేదనే ప్రచారం ఉంది. వీరిద్దరి పర్యటనలో అసంతృప్త నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. చంద్రబాబు-పవన్ ఉమ్మడి వ్యూహం కూటమిలో అసంతృప్తులను చల్లారుస్తుందా? టికెట్ దక్కని నేతలు ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పనిచేస్తారా? చూడాలి మరి. -
జనసేన అంటే త్యాగరాజులే..!
తనకు అచ్చొస్తుందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్న గోదావరి జిల్లాల్లో జనసేనకు పొత్తు పార్టీ తెలుగుదేశంతో సెగ తగులుతోంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తే.. దానికి విరుద్ధమైన పరిస్థితులనుటీడీపీ నేతలు సృష్టిస్తున్నారు. తణుకు.. ఎవరికి వణుకు? పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటనతో జనసేన- టీడీపీ రాజకీయం ముదిరి పాకాన పడినట్టయింది. తణుకు అసెంబ్లీ సీటుపై పవన్ కళ్యాణ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. తణుకు జనసేన అభ్యర్ధిగా విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని వారాహియాత్రలో కూడా ప్రకటించాడు పవన్ కల్యాణ్. కానీ ఇక్కడ తెలుగుదేశం కర్చీఫ్ వేస్తున్నట్టు ప్రకటించడం జనసేన క్యాడర్‌కు మింగుడు పడడం లేదు. తణుకులో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదని, ఓడిపోయే సీటు కోసం పోటీ ఎందుకు పడుతున్నారని జనసైనికులు వాదిస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం నుంచి తణుకు టికెట్‌ను టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆశిస్తున్నారు. పైకి టీడీపీ, జనసేనకు పొత్తులు ఉన్నా.. విడివాడ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇద్దరూ టికెట్టు నాదంటే నాదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నరసాపురం.. ఎవరి పరం? పొత్తులో భాగంగా నరసాపురం టికెట్ జనసేనకు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడుని పార్టీలోకి తీసుకోవాలన్నది పవన్ ప్లాన్. గత వారం రోజులుగా సుబ్బరాయుడుతో పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో పవన్ సమక్షంలో కొత్తపల్లి సుబ్బరాయుడు చేరతాడంటూ జనసేన నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే నరసాపురంలో తామే పోటీ చేస్తామని టీడీపీ నేతలు ఖరారుగా చెబుతున్నారు. పైకి పొత్తులు.. లోన కత్తులు ఇప్పటికే తూర్పుగోదావరిలో పర్యటన సందర్భంగా పవన్ కళ్యాన్ చేసిన హడావిడి రెండు పార్టీల మధ్య భగ్గుమనేలా చేసింది. రాజమండ్రి రూరల్, రాజానగరంలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన టీడీపీ సీనియర్లకు మంట పుట్టిస్తోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరీ లాంటి సీనియర్‌ను పట్టించుకోకుండా.. పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ప్రకటనలు ఎలా చేస్తారంటూ టీడీపీ సీనియర్లు మండిపడుతున్నారు. పవన్‌తో పొత్తు వల్ల టీడీపీకి వచ్చే లాభమేమీ లేకపోగా.. కీలక స్థానాల్లో అభ్యర్థులను పెట్టడం వల్ల అసలుకే మోసం వస్తుందంటున్నారు. పైగా తనవల్లే బీజేపీ ఒప్పుకుంటుందని పవన్ ప్రకటనలు చేయడం టీడీపీ స్థాయిని తగ్గించడమేనని, పవన్ పక్కన ఉండగానే జనసేన నాయకులు మూడో వంతు సీట్లలో అంటే 58 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం సరికాదని తప్పుబడుతున్నారు. అయినను హస్తినకు..! భీమవరం టూర్ తర్వాత ఢిల్లీకి పవన్ కల్యాణ్ వెళతాడని జనసేన నాయకులు చెబుతున్నారు. అక్కడి నుంచి పిలుపేమీ లేకున్నా.. ఓ సారి అటెండెన్స్ వేసుకురావాలన్న తొందర పవన్‌లో కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నా... బీజేపీ ఇంకా పొత్తులకు సంబంధించి ఏమీ చెప్పకపోవడం.. ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబుకు తేలు కుట్టిన దొంగలా కిమ్మనకుండా ఉండడం పవన్‌ను చిర్రెత్తిస్తున్నాయి. ఈనెల 25లోపు ఏదో ఒక రోజు ఢిల్లీ వెళ్లి అపాయింట్మెంట్ ఇచ్చే పెద్దలను కలిసి రావాలన్నది పవన్ ఆలోచనలా కనిపిస్తోంది. ఇప్పటికే తాను వస్తానని రెండు సార్లు సమాచారం పంపినా.. నేషనల్ కౌన్సిల్ సమావేశాల వరకు ఆగుమని బీజేపీ నేతలు చెప్పినట్టు సమాచారం. ముందు క్షేత్ర స్థాయిలో బాగా ప్రచారం చేసుకోవాలని, తర్వాత పొత్తుల గురించి మాట్లాడుదామని బీజేపీ నేతలు సూచించినట్టు సమాచారం. అగ్రనేతలు కలుస్తారా? పవన్ ఢిల్లీకి వెళ్తే.. ప్రధాని మోదీ, అమిత్ షాలను పవన్ కల్యాణ్ కలుస్తారని జనసేన నాయకులు చెబుతున్నారు. అక్కడ మాత్రం అంత సీను లేదని, సార్వత్రిక ఎన్నికలతో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా చాలా బిజీగా ఉన్నారని, అసలు ఏపీపై వారిద్దరి దృష్టి అంతగా లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి అపాయింట్మెంట్ దొరక్కపోతే ఏంటన్న ఆందోళన కూడా జనసేన నేతల్లో కనిపిస్తోంది. ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు అన్నట్టు.. పార్టీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ త్యాగాల గురించి చెబుతున్నారట. ఢిల్లీ పర్యటన తర్వాత టీడీపీ అధిష్టానంతో కలిసి టికెట్లు ప్రకటిస్తామని, టికెట్లు రాని వారు త్యాగాలకు సిద్ధపడాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేస్తున్నారట. ముక్తాయింపుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. జనసేనలో చేరే వాళ్లందరూ త్యాగరాజులేనని పార్టీ పెట్టిన నాటి నుంచి ప్రచారంలో ఉంది. -
తణుకులో కదం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం/తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదం తొక్కారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను ఎలు గెత్తి చాటారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో వేల్పూరు రోడ్డులో యాత్ర ప్రారంభమై నరేంద్ర సెంటర్ వరకు సాగింది. బస్సు యాత్రకు నియోజకవర్గం, పరిసర ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి బాణసంచా, పూలవర్షంతో బ్రహ్మరథం పట్టారు. తణుకు సెంటర్లో వేలాది జనం సమక్షంలో జరిగిన సభలో మంత్రులు, నేతలు ప్రసంగించారు. రామోజీకి ఎందుకింత కడుపుమంట? : మంత్రి జోగి రమేష్ బడుగు, బలహీన వర్గాలు సాధించిన సామాజిక సా«దికారతను ఓ వేడుకలా నిర్వహిస్తూ చేపట్టిన సాధికార బస్సు యాత్రలపై రామోజీరావుకు ఎందుకింత కడుపు మంట అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడుతూ.. సభ మొదలవ్వడానికి కొన్ని గంటల ముందు ఖాళీ కుర్చీల ఫొటోలు తీసి, సభ అయిపోయి జనాలు వెళ్లాక ఖాళీ కుర్చీ ఫొటోలు తీసి జనాలు రాలేదంటూ రామోజీరావు, రాధాకృష్ణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై అక్కసుతో విషపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. వెనుక బడిన వర్గాల వారిని చట్ట సభలకు పంపించి వారిని ధైర్యంగా నిలబడేలా చేసింది సీఎంజగన్ మాత్రమేనన్నారు. పేదవాడికి చదువు, వైద్యం అందించిన ఘనత జగన్‌కు దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. సీఎం జగన్ అందించిన సంక్షేమంలో 80 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దకిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రూపాయి అవినీతికి తావు లేకుండా లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేశారన్నారు. గత ప్రభుత్వాలు అన్నీ కలిపి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, ఒక్క జగన్ హయాంలోనే 2.70 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, వీటిలో 76 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చాయని తెలిపారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్వారానే సాధ్యమైందన్నారు. ఈ సమవేశంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీలు మార్గాని భరత్, నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్‌పై దేశవ్యాప్తంగా నమ్మకం: అలీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలుకు సూచనగా ఇప్పు డు చేస్తున్నవి యాత్రలు మాత్రమేనని, 2024లో జాతర జరగబోతోందని, ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా) అలీ చెప్పారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో మోత మోగించిన సీఎం జగన్.. ఈ సారి 175కి 175 నియోజకవర్గా లనూ కైవసం చేసుకుంటారని తెలిపారు. సీఎం జగన్‌పై అందరికీ అపార నమ్మకం ఉందన్నారు. ఆ నమ్మకంతోనే వైజాగ్ సమ్మిట్‌కు అదాని, అంబానీలతో సహా దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చి ఏపీలో పరిశ్రమలు ఏర్పా టు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల ప్రతి కుటుంబంలో ఒక్క ఉద్యోగం వచ్చినా ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకుంటుందని, ఇదంతా సీఎం సుపరిపాలనతోనే సాధ్యమైందన్నారు. -
సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం
సాక్షి, తణకు(పశ్చిమగోదావరి): వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారితను వెలుగెత్తి చాటుతూ సాగుతున్న ఈ బస్సుయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈరోజు(శనివారం) పశ్చిమగోదావరి జిల్లాలోని తణుణు నియోజకవర్గంలో సాగిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీనిలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం ప్రకటించారు. సామాజిక సాధికారత బస్సుయాత్ర బహిరంగ సభ లో ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, ఎలక్ట్రానికి మీడియా సలహాదారు అలీ, మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరావు, మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎంపీ నందిగాం సురేష్, ఎంపీ భరత్‌లతో పాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, వంకా రవీంద్రనాథ్‌లు పాల్గొన్నారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘తణుకు సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రజలు విజయవంతం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం అయ్యింది. రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు జగనన్న అండగా నిలబడుతున్నారు. చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, రైతులు ఇలా అందరికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది. అందుకే ప్రతీ విద్యార్థి ఆయన్ను ఒక మేనమామలా చూస్తున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తోన్న వ్యక్తి సీఎం జగన్. కరోనా లాంటి మహమ్మారి కాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించిన వ్యక్తి సీఎం జగన్. గత ప్రభుత్వాలతో పోలిస్తే జగనన్న హయాంలో పేదరికం 12 శాతం నుండి ఆరు శాతం వరకూ తగ్గింది. అందుకే జగన్ లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి. అలాగే కారుమూరి లాంటి మంచి నాయకుడిని కూడా మళ్ళీ గెలిపించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ‘ఎవ్వరు కొడితే లోకేష్, చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయననే మన జగనన్న. చంద్ర బాబు హయాంలో ఒక్క బీసీనైనా రాజ్యసభ కు పంపారా...?, వందల కోట్లకు సీట్లు అమ్ముకునే వాడు చంద్రబాబు. మళ్లీ కారుమూరి వన్స్‌మోర్’ అంటూ కారుమూరి నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. ‘ బీసీలను నిండా ముంచిన నాయకుడు చంద్రబాబు. సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేశారు. కరోనా సమయంలో చేనేతలకు అండగా నిలిచారు సీఎం జగన్,. చంద్రబాబు హయాంలో చేనేతలకు రూ. 200 కోట్లు ఖర్చు పెడితే, నేడు జగనన్న ముఖ్యమంత్రిగా రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టారు. బీసీలకు లక్షా 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు’ అని స్పష్టం చేశారు. ఇక విశాఖలో జరిగిన సామాజిక సాధికారిత సభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘సగానికి పైగా పదవులను బడుగు బలహీనర్గాలకు కట్టబెట్టారు. ఒక ఊరులో ఇద్దరు బాగుండాలి అంటే చంద్రబాబు కావాలి.. ఊరు మొత్తం బాగు పడాలి అంటే సీఎం జగన్ రావాలి.ఒక యాదవనైన నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు.యాదవులు కు సీఎం జగన్ పదవులు ఇస్తే గొడ్లు కాసుకొనే వారికి పదవులు ఇచ్చారని హేళన చేశారు.శ్రీకృష్ణ డు కూడా గొడ్డెలను కాసుకున్నారు. బీసీలను తోకలు కత్తిరిస్తమని బెదిరించారు.పార్టీ పెట్టి సీఎం కాకూడదనుకున్న వ్యక్తి పవన్. చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వ్యక్తి పవన్.పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అబద్ధాలు మోసాలకు ప్రజలు ప్రలోబకావద్దు.లోకేష్ ఒక పులకేశి.తండ్రి జైల్ లో ఉండే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్..సీఎం జగన్ దమ్ము నాయకుడు.నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయాలని సీఎం జగన్ చెపుతున్నారు.. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘దశాబ్దాలుగా బడుగు బలహీనర్గాల వారు సంక్షేమం అభివృద్ధి దూరంగా ఉన్నారు.బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలను కూరలో కరివేపాకులా చూసేవారు.మత్స్యకారులను చంద్రబాబు బెదిరించారు. రూ. 150 కోట్లతో హార్బర్‌ను ఆధునీకరిస్తున్నారు. సీఎం జగన్ పాలనలో పది హార్బర్ లు, నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారు.సుదీర్ఘమైన తీర ప్రాంతన్ని చంద్రబాబు గాలికి వదిలేసారు.మత్స్యకారుడుని రాజ్యసభకు పంపిన ఘనత సీఎం వైఎస్ జగన్ ది.బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు లేఖలు రాశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మ గౌరవం ను చంద్రబాబు తాకట్టు పెట్టారు.అణగారిన వర్గాల ఆత్మ గౌరవంను సీఎం జగన్ కాపాడారు. ఇంటిపై టిడిపి జెండా కడితేనే పథకాలు ఇచ్చేవారు. సీఎం జగన్ పాలనలో కులాలు మతాలు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ చేశారు.విశాఖ రాజదానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.విశాఖ ను రాజదాని కాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని రాజదాని గా చేశారు