tariff plan
-
టెలికాం కంపెనీలపై ట్రాయ్ కన్నెర్ర! ఇష్టారీతిగా ఆఫర్లు ఇవ్వొద్దంటూ ఆదేశం!!
మొబైల్ ఫోన్ ఆపరేటర్లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కన్నెర్ర చేసింది. తమకు తెలియకుండా కస్టమర్లకు ఎటువంటి ఆఫర్లు ఇవ్వొద్దంటూ తేల్చి చెప్పింది. తమ ఆదేశాలు హద్దు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయంటూ ట్రాయ్ వెల్లడించింది. ఫిర్యాదుల వెల్లువ ఇండియన్ మొబైల్ మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొంది. కొత్త చందాదారులను ఆకట్టుకోవడానికి మొబైల్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం వినియోగదారులను ఆకట్టుకునేలా రకరకాల టారిఫ్‌లను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ టారిఫ్‌లు ప్రకటించే ముందు ట్రాయ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన సరిగా అమలు కావడం లేదని, ట్రాయ్ అనుమతి తీసుకోకుండానే మొబైల్ ఆపరేటర్లు ప్రత్యేక టారిఫ్‌లు అమలు చేస్తున్నారంటూ ఒక సంస్థపై మరో సంస్థ తరచుగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. కారణం ఏంటీ మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా కస్టమర్లు తమ నంబర్ మారకుండానే ఆపరేటర్‌ను మార్చుకునే వీలుంది. అయితే ఎంఎన్‌పీ అమలు చేసే సమయంలో ప్రత్యర్థి కంపెనీకి చెందిన చందాదారున్ని ఆకట్టుకునేందుకు ట్రాయ్ దగ్గర అనుమతి తీసుకోని పలు రకాల ఆఫర్లు కస్టమర్లకు ప్రకటిస్తున్నాయి. ఇదే సందర్భంలో తమ దగ్గరి నుంచి కస్టమర్ బయటకు వెళ్లకుండా కూడా అనుమతి లేని ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇదంతా థర్డ్‌పార్టీల ద్వారా జరుగుతోంది. ఇంత కాలం ఈ వ్యవహారం జరుగుతూ వస్తోన్నా .. ఇటీవల మొబైల్ ఆపరేటర్లు ఈ అనధికారిక టారిఫ్‌లపై చర్యలు తీసుకోవాలంటూ ట్రాయ్‌ని ఆశ్రయించారు. తక్షణమే అమలు మొబైల్ సర్వీస్ ఆపరేటర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన ట్రాయ్ అనధికారిక టారిఫ్‌లను అమలు చేయోద్దంటూ ఆదేశించింది. ఈ టారిఫ్ అమలు చేయాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయంది. చదవండి : హైదరాబాద్‌కి వస్తున్న మరో అంతర్జాతీయ సంస్థ -
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్
ముంబై: తారిఫ్ వార్‌లో రిలయన్స జియో విజయం సాధించింది. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ జియోకు క్లీన్ చిట్ ఇచ్చింది. రిలయన్స్ జియో ప్రకటించిన ఫ్రీ తారిఫ్ ఆఫర్లు జీవిత కాలం ఇవ్వడం సాధ్యం కాదని వాదించిన టెల్కోలకు షాకిస్తూ ట్రాయ్ జియోకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. జియో ప్రకటించిన వెల్కం ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ రెండూ ఫండమెంటల్ గా వేరువేరు అని తేల్చి చెప్పింది. రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్లలో ఎలాంటి తప్పులు దొర్లలేదని గతంలో ప్రకటించిన ట్రాయ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్రాయ భారతి ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ సహా ఇతర ఆపరేటర్లకు ఈ సమాచారాన్ని ట్రాయ్ అందించనుంది. కాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకాం తాజా ఆఫర్ పై టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, ఐడియా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ రిలయన్స్ జియో ఫ్రీ కాలింగ్ ఆఫర్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా శాశ్వత కాలం ఫ్రీగా ఇవ్వడం సాధ్యం కాదనీ దీన్ని నిరోధించాలంటూ టెలికాం ట్రిబ్యునల్ (టీడీఎస్‌ఏటి) ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సో.. తాజా హ్యాపీ న్యూయర్ ఆఫర్ ను జియో వినియోగదారులు నిస్సంకోచంగా అనుభవించవచ్చు. మార్చి 31, 2017 వరకు జియో ఆఫర్ చేసిన ఉచిత డ్యాటా, వాయిస్ సేవలను జియో లవర్స్ నిరభ్యంతరంగా ఎంజాయ్ చేయడానికి ట్రాయ్ అనుమతినిచ్చింది. సంబంధిత వార్తలు.. ఇంటి వద్దకే జియో సిమ్..ఎలానో తెలుసా? జియో తరువాతి డాటా ప్లాన్ ఏంటి? క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ జియో జియో డౌన్లోడు స్పీడులో దూసుకుపోయింది! -
ఎయిర్‌సెల్ 5 రూపాయల పథకం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌సెల్ రూ.5కే అయిదు రకాల వాయిస్ పథకాలను ప్రకటించింది. ఎయిర్‌సెల్ నుంచి ఎయిర్‌సెల్‌కు ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు ఉచితం, ఎయిర్‌సెల్ నుంచి ఎయిర్‌సెల్‌కు 6 సెకన్లకు ఒక పైసా, అన్ని స్థానిక కాల్స్ 2 సెకన్లకు 1 పైసా, లోకల్ మరియు ఎస్టీడీ 2 సెకన్లకు 1 పైసాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. వీటితోపాటు ఐఎస్డీ పథకాన్ని కూడా రూపొందిం చింది. ఈ అయిదు పథకాల్లో కస్టమర్లు ఏదైనా ఒకదానిని ఎంచుకోవాలి. పథకాన్నిబట్టి 10 రోజుల నుంచి 30 రోజుల దాకా వ్యాలిడిటీ ఉంది. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు ఉచితం, అన్ని స్థానిక కాల్స్ పథకాల్లో ప్రతి రోజు తొలి 120 సెకన్లకుగాను సెకనుకు 1.5 పైసలు చార్జీ చేస్తారు. లోకల్ మరియు ఎస్టీడీ ప్లాన్‌లో ప్రతి రోజు తొలి 120 సెకన్ల కు సెకనుకు 2 పైసలు చార్జీ ఉంటుంది. ట్రయల్ రన్లో 4జీ: రాష్ట్రంలో 4జీ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ దీపిందర్ తివానా శుక్రవారమిక్కడ తెలిపారు. వాణిజ్యపరం గా సేవలు అందించేందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు. వాస్తవానికి 4జీ ఆధారిత మొబైల్ ఫోన్ల లభ్యత దేశంలో తక్కువగా ఉందన్నారు. వాయిస్ పథకాలను ప్రకటించిన అనంత రం కంపెనీ దక్షిణ ప్రాంత మార్కెటింగ్ హెడ్ భరత్ మోహన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.