tax laws
-
పన్ను ఎగవేతను పట్టించే చట్టాలివే.. తస్మాత్ జాగ్రత్త!
పన్ను తప్పకపోవచ్చు. అలాంటప్పుడు కట్టడమే.. నాగరిక పౌరుల బాధ్యత. కట్టాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పన్ను చెల్లించకపోవడమే ‘ఎగవేత’. ఈ ‘ఎగవేత’ సముద్రంలో ఎందరో గజ ఈతగాళ్లను ఏరిపారేసిన చట్టాలున్నాయి. దాని ఊసెత్తకండి. ఎన్నెన్నో మార్గాలు.ఆదాయాన్ని చూపించకపోవడం, ఆదాయం తక్కువ చేయడం, పన్ను చెల్లించకపోవటం, తప్పుడు లెక్కలు చూపడం, లెక్కలు రాయకపోవడం, స్మగ్లింగ్, దొంగ కంపెనీలు, తప్పుడు బిల్లులు, బ్లాక్ వ్యవహారాలు .. ఇలా శతకోటి మార్గాలు. కొన్ని పరిశ్రమ రంగాల్లో అవకాశం ‘ఎండమావి’లాగా ఎదురుచూస్తుంది. సినిమా రంగం, రియల్ ఎస్టేట్, కొన్ని వస్తువుల ఉత్పత్తిలో, బంగారంలో, షేరు మార్కెట్, వ్యవసాయం, బెట్టింగ్, పందాలు, అస్తవ్యస్తమైన రంగాలు.. ఇలా ఎన్నో. చట్టాన్ని అనుసరించడానికి ఒకే మార్గం. రాచమార్గం ఉంటుంది. అతిక్రమించడానికి అన్నీ అడ్డదార్లే.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. 1. తనిఖీ చేయడం 2. సమన్లు ఇవ్వటం 3. పిలిచి ఎంక్వైరీ చేయడం 4. సెర్చ్ 5. సీజ్ చేయడం 6. సర్వే చేయడం 7. ఇతరులను కూడా ఎంక్వైరీ చేయడం 8. సాక్ష్యాలను సేకరించటం 9. పన్ను కట్టించడం (కక్కించడం) 10. వడ్డీ, రుసుములు, పెనాల్టీ విధించడం 11. జైలుకి పంపడం ఇలా ఎన్నో విస్తృత అధికారాలు ఉన్నాయి.బినామీ వ్యవహారాల చట్టం.. ఇది సునామీలాంటి చట్టం. బినామీ వ్యవహారాల ద్వారా పన్ను ఎగవేత చేస్తుంటారు. ఈ చట్టం ప్రకారం అధికార్లకు నోటీసులు ఇవ్వడం, ఎంక్వైరీలు, వ్యవహారంలో ఉన్న ఆస్తులను జప్తు చేయడం మొదలైన అధికారాలు ఉన్నాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ చట్టం ప్రపంచంలో జరిగే వ్యవహారాల మీద నిఘా ఉంటుంది. విదేశీయులతో వ్యవహారాలు, ఎక్స్చేంజ్ వ్యవహారాలు, అనుమతులు లేకుండా ఆస్తుల సేకరణ, ఆస్తులను ఉంచుకోవడం, వ్యవహారాలు చేయడం, వాటి ద్వారా లబ్ధి పొందడం .. ఇలాంటి వాటిపై అధికార్ల వీక్షణం తీక్షణంగా ఉంటుంది. అన్యాయంగా వ్యవహారాలు చేస్తే, తప్పులు చేస్తే ఉపేక్షించదు ఈ చట్టం. అతిక్రమణ జరిగితే ‘అంతే సంగతులు’ .. శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే.మనీలాండరింగ్‌కి సంబంధించిన చట్టం.. అక్రమంగా పొందిన డబ్బుని దాచి.. కాదు దోచి.. దాని మూలాలను భద్రపర్చి.. పన్ను కట్టకుండా.. లెక్కలు చూపకుండా .. దానికి ‘లీగల్’ రంగు పూసే ప్రయత్నమే మనీలాండరింగ్. ఈ ప్రక్రియ చట్టవిరుద్ధం. ఇందులో ఎందరో బడాబడా బాబులు ఇరు క్కుని జైలు పాలయ్యారు. హవాలా వ్యవహారాలు మొదట్లో హల్వాలాగా ఉంటాయి. హలీంలాగా నోట్లో కరిగిపోతాయి. కానీ అవి చాలా డేంజర్. అలవాట్లకు బానిస అయి, తాత్కాలిక ఆర్థిక ఒత్తిళ్లకు తలవంచి ‘లంచావతారం’గా మారిన వారు ఉద్యోగాలు కోల్పోయి.. ఉనికినే కోల్పోయారు. కాబట్టి, సారాంశం ఏమిటంటే ‘ఎండమావి’ భ్రమలో పడకండి. చక్కటి ప్లానింగ్ ద్వారా చట్టప్రకారం సరైన దారిలో వెళ్లే ప్రయత్నం చేయండి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఆ నేరగాళ్లకు రాజీ అవకాశం ఉండదు
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా, ఉగ్రవాదులకు నిధుల చేరవేత, బినామీ ఆస్తులను, రహస్యంగా విదేశీ ఆస్తులను కలిగి ఉండటం, అవినీతి తదితర నేరాలకు పాల్పడేవారికి ఇక నుంచి ఐటీ విభాగంతో రాజీ కుదుర్చుకునే అవకాశాన్ని కల్పించకూడదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) నిర్ణయించింది. పై నేరాలకు పాల్పడేవారు రాజీ కుదుర్చుకునే హక్కును కోల్పోతారంది. అయితే నేరస్తుడి ప్రవర్తన, నేరం స్వభావం, తీవ్రత, నేరానికి పాల్పడేందుకు ప్రేరేపించిన పరిస్థితులు తదితరాలను పరిగణనలోనికి తీసుకున్న అనంతరం, అవసరమనుకుంటే ఆ వ్యక్తులు/సంస్థలకు రాజీ అవకాశం ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థిక మంత్రికి ఉంటుందని స్పష్టం చేసింది. -
అవును.. పన్ను చట్టాలతో లబ్ధి పొందా: ట్రంప్
పన్ను చట్టాలలో ఉన్న లొసుగులను తాను తెలివిగా ఉపయోగించుకున్నానని, వాటివల్ల తాను పెద్ద మొత్తంలోనే లబ్ధి పొందానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఒప్పుకొన్నారు. తాను పన్ను చట్టాల వల్ల ప్రయోజనం పొందానని అంగీకరించారు. చట్టాలను తాను చాలా తెలివిగా ఉపయోగించుకున్నానని, అయితే తాను గెలిస్తే మాత్రం ఈ చట్టాలను మారుస్తానని ఆయన అన్నారు. ''మన పన్ను చట్టాలలోని అనుచిత వైఖరిని నమ్మలేం. నేను ఈ విషయం గురించి చాలాకాలంగా చెబుతున్నాను. కానీ ఈ చట్టాల వల్ల నేను చాలా పెద్ద మొత్తంలో లబ్ధి పొందాను'' అని ట్రంప్ చెప్పినట్లు ఎఫీ న్యూస్ తెలిపింది. కొలరాడో ప్రాంతంలో నిర్వహించిన ఒక ఎన్నికల ర్యాలీలో ఆయనీ విషయం వెల్లడించారు. పన్ను చట్టాల్లో ఉన్న సంక్లిష్త ఇతరుల కంటే తనకు బాగా తెలుసని, తాను వాటివల్ల లబ్ధి పొందానని, ఇప్పుడు తాను అధికారంలోకి వస్తే మాత్రం వాటిని సవరిస్తానని ఆయన చెప్పారు. పన్ను చట్టాలలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని.. ట్రంప్ వీలైనంత తక్కువగా పన్నులు చెల్లించారంటూ ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఇది ఒక్కసారిగా సంచలనం రేపింది. ఒక వ్యాపారవేత్తగా, రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా తాను పన్ను చట్టాలను తన ప్రయోజనం కోసం చట్టబద్ధంగా ఉపయోగించుకున్నానని, తన కంపెనీ కోసం, తన ఉద్యోగుల కోసం అలా చేశానని ట్రంప్ చెప్పారు. అయితే కథనం వచ్చిన రెండు రోజుల తర్వాత గానీ ట్రంప్ ఏ వేదిక మీదా దానిపై స్పందించలేదు. ఎట్టకేలకు ఆయన విషయాలు బయటకు చెప్పడంతో ఇప్పుడు దాని ప్రభావం ఎన్నికలపై ఎలా ఉంటుందోనని అంతా చూస్తున్నారు. తాను విజయవంతమైన వ్యాపారవేత్తగా చట్టాన్ని అమలుచేస్తూ డబ్బు సంపాదిస్తే.. హిల్లరీ మాత్రం రాజకీయాల్లో అవినీతికి పాల్పడ్డారని, చట్టాన్ని ఉల్లంఘించి తన ప్రభుత్వ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టేశారని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. -
పన్ను వసూళ్లలో సముచితంగా వ్యవహరించాలి
ఐఆర్ఎస్ అధికారులతో ఆర్థిక మంత్రి జైట్లీ న్యూఢిల్లీ: పన్ను వసూళ్ల విషయంలో ‘స్థిరంగాను, సముచితంగాను’ వ్యవహరించాలని ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. పన్ను వసూలు అధికారులు ఎటువంటి మినహాయింపులు, డిస్కౌంట్లూ ఇవ్వరాదన్నారు. ఐఆర్ఎస్ (కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్) ప్రొబేషనర్ల 66వ బ్యాచ్ శిక్షణను ప్రారంభించిన సందర్భంగా అరుణ్ జైట్లీ ఈ విషయాలు చెప్పారు. ఏ విధమైన పన్నులు విధించాలి, ఎలాంటివి విధించకూడదు అన్న అంశంలో సమతౌల్యత పాటించాలని సూచించారు. ‘పన్నుల చట్టాలు పటిష్టంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. పన్నుల పరిధిలోకి వచ్చే వాటిపై విధించడం, రాని వాటిపై పన్నుల భారం పడకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మీరు సమతౌల్యత పాటించగలగాలి’ అని జైట్లీ చెప్పారు. 2016 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే వస్తు, సేవల పన్నుల(జీఎస్టీ) విధానం తీరుతెన్నులను ఆకళింపు చేసుకుని, సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పారు. -
2016 నుంచి సీఏ కొత్త సిలబస్
ఐసీఏఐ ప్రెసిడెంట్ కె.రఘు * అంతర్జాతీయ ప్రమాణాలతో కరికులమ్ * మహిళా సీఏల కోసం ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్.. * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి టాస్క్‌ఫోర్స్.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుతున్న అకౌంటింగ్ నిబంధనలు, పన్ను చట్టాలకు అనుగుణంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ సిలబస్‌ను రూపొందిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. 2016 కల్లా కొత్త కరికులమ్‌ను ప్రవేశపెడుతున్నామని, దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ కె.రఘు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త సిలబస్ ఉంటుందన్నారు. శనివారం ఐసీఏఐ ‘కంపెనీల చట్టం, ప్రత్యక్ష పన్నులు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన రఘు విలేకరులతో మాట్లాడారు.అంతర్జాతీయంగా చార్టర్డ్ అకౌంటెంట్స్‌కి అధిక డిమాండ్ ఉందని, ఇక్కడ కోర్సు పూర్తి చేసిన వాళ్లకి విదేశాల్లో అధిక జీతాలకు ఉద్యోగాలు లభిస్తున్నయన్నారు. గతేడాది పరీక్ష రాసిన వాళ్లలో కేవలం ఏడు శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారంటే ఈ కోర్సు ఎంత కఠినమైనదో అర్థం చేసుకోవచ్చని, అందుకే ఇక్కడ ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రారంభ వేతనంగా ఏడు లక్షల నుంచి గరిష్టంగా రూ. 21 లక్షల వరకు పొందుతున్నారన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 20 కేంద్రాల్లో క్యాంపస్ నియామకాలు జరిపామని, బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఐటీ, ఈకామర్స్ రంగాల నుంచి డిమాండ్ బాగుందన్నారు. విద్యార్థులకు మెరుగైన సేవలను అందించే విధంగా క్లౌడ్ క్యాంపస్, 120 రీడింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రఘు తెలిపారు. ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్ ప్రాక్టీసులో ఉన్న మహిళా సభ్యులు కుటుంబ బాధ్యతల వల్ల వృత్తికి దూరమవుతున్నారని, వీరు ఇంటి దగ్గర నుంచే సేవలను అందించే విధంగా ‘ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 40,000 మంది మహిళా సీఏలు ఉండగా ఈ పోర్టల్ ఇప్పటి వరకు రెండు వేల మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వీరి సేవలను ఉపయోగించుకోవడానికి 150 కంపెనీలు ముందుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో కంపెనీల చట్టంలో సవరణలు కొత్త కంపెనీల చట్టంలో సీఏలకు ప్రతికూలంగా ఉన్న కొన్ని నిబంధనలను మార్చడానికి కేంద్రం అంగీకరించిందని, దీనికి సంబంధించి వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సవరణలు జరగొచ్చన్నారు. ముఖ్యంగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ 20కి మించి కంపెనీల్లో పనిచేయకూడదన్న నిబంధనలో ప్రైవేటు కంపెనీలకు మినహాయించడానికి ప్రభుత్వం అంగీకరించిందని, అలాగే ఆడిట్ రొటేషన్, ఫ్రాడ్ రిపోర్టింగ్ నిబంధనలను కూడా సవరించడానికి అంగీకరించినట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్లో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రీ బడ్జెట్ మెమొరాండం తుది దశలో ఉందని, ఈ నెలాఖరుకి కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి ఇవ్వనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీ కోసం టాస్క్ ఫోర్స్ కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సూచనలు సలహాలను ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రఘు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, జనధన యోజన పథకాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. -
జనరల్ అవేర్నెస్ పాఠాలు
1. To review tax laws and suggest ways for a stable and non-adversarial tax administration, the Government of India on August 26, 2013 set up a Tax Administration Reform Com mission (TARC) under the Chairmanship of? 1) Parthasarathy Shome 2) Y.G.Parande 3) S.S.N. Moorthy 4) M.R.Diwakar 5) None of these 2. National Media Center was inaugurated by the Prime Mini ster Dr. Manmohan Singh and UPA Chairperson Sonia Gan dhi on August 24, 2013 in which of the following cities? 1) Hyderabad 2) New Delhi 3) Mumbai 4) Chandigarh 5) Bangalore 3. Who has been chosen for 2012-13 Rajiv Gandhi Khel Ratna, India's highest honour for a sportsperson? (The award will be given on August 31, 2013) 1) Krishna Poonia 2) Gagan Narang 3) Ronjan Sodhi 4) P.V.Sindhu 5) Vijay Kumar 4. Who is the author of the book "My Journey: Transforming Dreams into Actions"? (It was launched in August 2013) 1) Amartya Sen 2) Barack Obama 3) Tony Blair 4) A P J Abdul Kalam 5) Pranab Mukherjee 5. As per a Global digital measur ement and analytics ComScore report released in August 2013, what is India's rank in Internet usage? 1) First 2) Second 3) Third 4) Fourth 5) Fifth 6. Telugu novelist Malathi Chan dur passed away in August 2013. She was a winner of? 1) Jnanpith Award 2) Vyas Samman 3) Saraswati Samman 4) Sahitya Akademi Award 5) None of these 7. Head Office of which of the following banks is in Delhi? 1) UCO Bank 2) Bank of India 3) Corporation Bank 4) United Bank of India 5) Punjab National Bank 8. Pakistan is a member of? 1) ASEAN 2) APEC 3) NATO 4) OPEC 5) SAARC 9. Who is the author of the book 'Diamond Dust'? 1) Salman Rushdie 2) Anita Desai 3) Chetan Bhagat 4) Arundhati Roy 5) Rashmi Bansal 10. Which of the following is the name of a country? 1) Afghani 2) Peso 3) Zagreb 4) Botswana 5) Brasilia 11. Which of the following terms is not used in Banking/Finance? 1) Letter of Credit 2) LIBOR 3) Back up guarantee 4) Factoring services 5) Polymerization 12. Which Russian city will host the 2015 World Aquatic Cham pionships? 1) Kazan 2) Samara 3) Omsk 4) Perm 5) Volgograd 13. 'Copa America', an internatio nal tournament involving 12 teams, is associated with? 1) Basketball 2) Football 3) Tennis 4) Golf 5) Snooker 14. Which of the following terms is used in the field of Banking /Finance? 1) Amendment 2) Reflex Action 3) Dribble 4) Active Asset 5) None of these 15. SAFTA is a trade agreement among the members of? 1) G8 2) G20 3) BRICS 4) SAARC 5) ASEAN 16. The Head of the Public Sector Bank in India is designated as? 1) Governor 2) President 3) Vice President 4) Chief Executive Officer 5) Chairman and MD 17. Who among the following is a famous economist? 1) John Milton 2) John Keats 3) Thomas Malthus 4) Robert Frost 5) O Henry 18. World Ozone Day is celebrated on? 1) September 8 2) November 8 3) November 16 4) September 16 5) September 27 19. The capital of Vietnam is? 1) Phnom Penh 2) Jakarta 3) Manila 4) Hanoi 5) Yangon 20. The term 'Insider Trading' is associated with? 1) Insurance 2) Defense 3) Stock market 4) Parliament 5) Journalism 21. Which of the following is a major function of the Reserve Bank of India? 1) Regulating stock exchanges 2) Deciding foreign trade policy of India 3) Preparing Union Budget 4) Framing Fiscal policy 5) None of these 22. Which of the following coun tries is a member of OPEC? 1) Jordan 2) Libya 3) Syria 4) Bangladesh 5) Bahrain 23. Cotton is normally grown in? 1) Red soil 2) Yellow soil 3) Regur soil 4) Laterite soil 5) Sand 24. Buddh International Circuit is related to? 1) Cricket 2) Hockey 3) Football 4) Formula One 5) Lawn Tennis 25. Which of the following is an advance to priority sector by the banks? 1) Loan to a sick industry 2) Loan given to purchase a house 3) Loan to farmers for agricultu ral purpose 4) Loan to establish a hospital in a city 5) None of these 26. Who is the author of the book 'Inside the Third World: The Anatomy of Poverty'? 1) Paul Harrison 2) Paul Krugman 3) Amartya Sen 4) William Golding 5) Gunnar Myrdal 27. Which was the principal plant used in Green Revolution? 1) Japonica Rice 2) Indian Rice 3) Emmer Wheat 4) Mexican Wheat 5) None of these 28. The rotation of crops is essen tial for? 1) Increasing protein content in plants 2) Getting different crops 3) Increasing soil fertility 4) Both 1 and 2 5) All 1, 2 and 3 29. The study of vegetables is called? 1) Pomology 2) Floriculture 3) Sericulture 4) Olericulture 5) None of these 30. A statement that depicts the financial position of a business organization at a given point of time is called? 1) Reconciliation statement 2) Statement of product details 3) Balance sheet 4) Trading account 5) None of these 31. The currency of Ethiopia is? 1) Birr 2) Rial 3) Peso 4) Manat 5) Dinar 32. By what name were the Comm on wealth Games known when they were first held in 1930? 1) British Empire Games 2) British Empire and Common wealth Games 3) British Common wealth Games 4) Queen's Empire Games 5) None of these 33. Sunita Narain is the editor of which science and environment focused magazine? 1) Seminar 2) Sanctuary 3) Down to Earth 4) National Geography 5) None of these 34. Who propounded the theory of 'Hierarchy of Needs'? 1) Peter Drucker 2) Gary Becker 3) Amos Tversky 4) Abraham Maslow 5) None of these 35. 'Kahani', a Bollywood film that won several awards, was dire cted by? 1) Anurag Basu 2) Anurag Kashyap 3) Sujoy Ghosh 4) Prakash Jha 5) Rituparno Ghosh