tb section
-
ఇంకెన్నడో?
– క్షయ నివారణ సొసైటీలో భర్తీకి నోచుకోని పోస్టులు – ఏడాది క్రితం నోటిఫికేషన్ ఇచ్చినా ఫలితం శూన్యం – అదిగో..ఇదిగో అంటూ ఊరిస్తున్న అధికారులు – ఎడతెగని జాప్యంపై అభ్యర్థుల్లో ఆందోళన వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటికీ పోస్టులు భర్తీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. దరఖాస్తుల స్వీకరణ నుంచి మెరిట్ జాబితా సిద్ధం చేసే వరకు అన్ని ప్రక్రియలు ముగిసినా ఎందుకనో జాబితాను మాత్రం విడుదల చేయడం లేదు. ఫలితంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. - అనంతపురం మెడికల్ జిల్లా క్షయ నివారణ అధికారి కార్యాలయం పరిధిలో 20 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది మార్చిలో నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 11 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 20 పోస్టులకు 464 దరఖాస్తులు వచ్చాయి. ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఎనిమిది మంది, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ పోస్టుకు 45, టీబీ కౌన్సిలర్ పోస్టుకు 42, టీబీ స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టుకు 58 దరఖాస్తులు వచ్చాయి. 11 సీనియర్ టీబీ సూపర్వైజర్ పోస్టులకు 138, రెండు టీబీ హెల్త్ విజిటర్ పోస్టులకు 62, రెండు ల్యాబ్ టెక్నీషియన్లకు 93, ఒక అకౌంటెంట్ పోస్టుకు 18 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను స్క్రూటినీ చేశాక మెరిట్æ జాబితాను డీఎంహెచ్ఓ, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి కార్యాలయాల్లో ప్రదర్శించాల్సి ఉంది. జాబితా విడుదలలో నిర్లక్ష్యం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దరఖాస్తుల్ని పరిశీలించి జనరల్ మెరిట్ లిస్ట్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే విడుదలలో మాత్రం ఎడతెగని జాప్యం చేస్తున్నారు. దీంతో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరు అభ్యర్థులు గ్రీవెన్స్‌కు సైతం వెళ్తున్నారు. మరికొందరు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డీటీసీఓ డాక్టర్ సుధీర్‌బాబును కలుస్తున్నారు. అయితే వారి నుంచి సరైన స్పందన మాత్రం రావడం లేదు. జాబితా విడుదలలో జాప్యంపై గతంలోనే జేసీ–2 ఖాజామొహిద్దీన్ సైతం ఆరా తీశారు. వారం రోజుల్లో జాబితా తెస్తామని చెప్పిన అధికారులు నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. వాస్తవానికి మూడేళ్ల క్రితం ఇదే శాఖలో విడుదలైన నోటిఫికేషన్ రద్దయింది. ఆ తర్వాత మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం క్షయ వ్యాధి చాపకింద నీరులా పాకుతోంది. కనీసం పోస్టులు భర్తీ అయితే కొద్ది మేరకైనా సేవలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచన చేస్తే అటు రోగులకు.. ఇటు నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే జాబితా విడుదల మెరిట్ జాబితాను సిద్ధం చేశాం. ఇప్పటికే జేసీ–2 ఖాజామొహిద్దీన్ పరిశీలించారు. కొన్ని సూచనలు చేయగా కరెక్షన్ చేశాం. అంతలోనే ఆయన సెలవులో వెళ్లడం.. ఎన్నికల కోడ్ రావడంతో జాప్యం జరిగింది. రెండు, మూడ్రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తాం. అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – డాక్టర్ రావెల సుధీర్‌బాబు, జిల్లా క్షయ నివారణ అధికారి, అనంతపురం -
ఇంకెనాళ్లీ నిరీక్షణ
- క్షయ నివారణ సొసైటీలో భర్తీకి నోచుకోని 20 పోస్టులు అనంతపురం మెడికల్ : ఏ శాఖలో అయినా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తే వీలైనంత త్వరగా అభ్యర్థులను ఎంపిక చేసి పరిపాలన సజావుగా సాగాలని భావిస్తారు. కానీ వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. నోటిఫికేషన్ ఇచ్చారు.. దరఖాస్తులు అందాయి.. స్క్రూటినీ కూడా పూర్తయింది.. కానీ మెరిట్ జాబితా విడుదల చేయడంలో అంతులేని జాప్యం చేస్తున్నారు. జిల్లా క్షయ వ్యాధి నివారణ సొసైటీలో 20 పోస్టుల భర్తీకి 2014లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు... 2016లో అప్పటి నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నోటిఫికేషన్‌ను గత ఏడాది మార్చిలో విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించారు. ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు 8 మంది, ఒక జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌కు 45, ఒక టీబీ కౌన్సిలర్‌కు 42, ఒక టీబీ స్టాటిస్టికల్ అసిస్టెంట్‌కు 58 దరఖాస్తులు వచ్చాయి. అలాగే 11 సీనియర్ టీబీ సూపర్వైజర్ పోస్టులకు 138, రెండు టీబీ హెల్త్ విజిటర్ పోస్టులకు 62, రెండు ల్యాబ్ టెక్నీషియన్లకు 93, ఒక అకౌంటెంట్‌కు 18 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 20 పోస్టులకు 464 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ ముగిసి ఎనిమిది నెలలు గడుస్తున్నా పోస్టులు మాత్రం భర్తీకి నోచుకోవడం లేదు. ప్రాథమికంగా, రెండో సారి కూడా స్క్రూటినీ ముగిసింది. కమిటీ మెరిట్ జాబితాను కూడా తయారు చేసినట్లు తెలుస్తోంది. అయినా ఫైనల్ లిస్ట్ మాత్రం విడుదల చేయడం లేదు. నెలలు గడుస్తున్నా జాబితాను విడుదల చేయకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. అసలు పోస్టులు భర్తీ చేస్తారా, లేక గతంలోలా మళ్లీ బ్రేకులు పడతాయా అనే అనుమానం కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు నిత్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పోస్టులు భర్తీ చేస్తే క్షేత్రస్థాయిలో వైద్యసేవలు కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. -
3న మెరిట్ జాబితా విడుదల
అనంతపురం మెడికల్ : జిల్లా క్షయ నివారణ సొసైటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితాను అక్టోబర్ 3న విడుదల చేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు. 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలు గడిచినా మెరిట్ జాబితా విడుదల కాకపోవడంపై ‘కమిటీలతోనే సరి’ శీర్షికన గురువారం సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన ఆయన ఉదయం జాబితాకు తుది రూపు తెచ్చేందుకు కమిటీ వేశారు. ఇందులో ఎన్ఆర్హెచ్ఎం డీపీఎం డాక్టర్ అనిల్‌కుమార్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ సుధీర్‌బాబు, జబార్ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయమ్మ, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ పురుషోత్తంతో కూడిన కమిటీని వేసి శనివారానికి జాబితా తయారు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. జాబితా సిద్ధం కాగానే కలెక్టర్ కోన శశిధర్‌తో అనుమతి తీసుకుని అక్టోబర్ 3న విడుదల చేస్తామని చెప్పారు.