Top Stories
ప్రధాన వార్తలు

ఈసారి అధికారం మనదే: వైఎస్ జగన్
రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితుల్లో మీరు కేడర్‌కు ఉత్సాహాన్నివ్వడానికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు క్రియాశీలకంగా పని చేయాలి. వారానికి మూడు రోజులు మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ జిల్లా మీద మీకు పట్టు వస్తుంది. అప్పుడే మీరు చెప్పింది వింటారు. ఇది చాలా ముఖ్యం. మీ వల్ల పార్టీకి మంచి జరగాలి. పూర్తి స్థాయి రాజకీయ నాయకుల్లా పని చేయాలి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. జైలుకు పంపుతారని భయపడకూడదు. కలియుగంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేయాలంటే ఈ రెండు విషయాల్లో వెనకాడకూడదు. అప్పుడే మనం రాజకీయాలు చేయగలుగుతాం. రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, వైద్య రంగాలన్నీ పూర్తిగా నీరుగారి పోయాయి. ప్రతి పథకం కనపడకుండా పోతోంది. మరోవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ స్థాయిలో అవినీతిని ఎప్పుడూ చూసి ఉండం. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో కానీ.. ఈ ప్రభుత్వంలో మాత్రం రూపాయికే ఎకరం చొప్పున లూలూ గ్రూపు లాంటి వాళ్లకు రూ.1,500 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల విలువైన భూములు వస్తాయి. మరొకరికి రూపాయికే ఎకరా చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. ఈ స్థాయిలో ఏమాత్రం భయం లేకుండా విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. -వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్నీ ఆపేయడంతో పాటు చంద్రబాబు చెప్పింది చేయకపోవడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారని, ఓటు అనే వారి ఆయుధంతో చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదని చెప్పారు. సరైన సమయంలో ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారని.. వచ్చే ఎన్నికల్లో అఖండ విజయంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ‘మనల్ని అభిమానించే వారిని కొడుతున్నారు.. ఇబ్బంది పెడుతున్నారు. నన్ను అభిమానించినందుకే కదా.. వీళ్లకు దెబ్బలు తగులుతున్నాయన్నది నన్ను బాధిస్తోంది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే ముందు బాధపడేది నేనే. అందుకే జగన్ 2.0లో ఈ మాదిరిగా ఉండదని స్పష్టంగా చెబుతున్నా. మొదటి ప్రాధాన్యత ఉంటుంది’ అని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చిందని, కేడర్ ధైర్యంగా నిలబడిందని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వస్తున్నారని, రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురి చేస్తుండటం పట్ల ప్రజల్లో తీవ్రమైన అగ్రహం ఉందని తెలిపారు. మన ప్రభుత్వ హయాంలో మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలు తింటున్న కంచాన్ని చంద్రబాబు లాగేశారని చెప్పారు. వారి కడుపు కొట్టారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం అనైతిక పనులు చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు రాకూడదని మన ప్రభుత్వ హయాంలో చాలా కష్టపడ్డాం. చాలా మంది నాయకులను మన పరిపాలనలో కట్టడి చేశాం. తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీకి స్వల్ప ఆధిక్యత వచ్చింది. వైఎస్సార్సీపీకి 16 వార్డులు, టీడీపీకి 18 వార్డులు వచ్చాయి. కానీ అప్పటి వైఎస్సార్సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫలితాన్ని మన వైపు తిప్పుదామని యత్నించారు. కానీ, ఆ రోజు మన ప్రభుత్వంలో మన పార్టీ ఎమ్మెల్యేనే గృహ నిర్భంధం చేశాం. అదే ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది. ఈ రోజు 99.99 శాతం గ్రామ స్థాయిలో కేడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారు. చంద్రబాబునాయుడు 12 నెలల రెడ్ బుక్ రాజ్యాంగం చూసిన తర్వాత ఎమ్మెల్యేలే కాదు, గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా నా దగ్గర నుంచి అదే ఆశిస్తున్నారు. కేసులు పెట్టించుకునే పరిస్థితి లేకపోతే రాజకీయాలు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా పోయింది.అవినీతి కంటికి కన్పిస్తోంది రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి మనం ‘సెకీ’ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో యూనిట్ విద్యుత్ రూ.2.49కే కొనుగోలు చేశాం. రైతులకు ఉచితంగా పగటి పూటే తొమ్మిది గంటల పాటు, నాణ్యమైన విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు అందుబాటులో ఉండేందుకు మనం గొప్ప అడుగులు వేస్తే.. ఇప్పుడు నిస్సిగ్గుగా ఇవాళ వీళ్లు యూనిట్ విద్యుత్ రూ.4.60కు కొనుగోలు చేస్తున్నారు. సెక్షన్–108 ప్రకారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయించుకున్నారు. మెడ మీద కత్తిపెట్టి వాళ్లతో పని చేయించుకున్నారు. అవినీతి కంటికి కనిపిస్తోంది. గ్రామాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. అన్నీ స్కాములే. పేకాట క్లబ్బులు దగ్గర నుంచి మొదలు పెడితే.. విచ్చలవిడిగా బెల్టు షాపులు.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ముట్టజెప్పందే ఏ పనీ కావడం లేదు. పరిశ్రమ నడవాలన్నా, మైనింగ్ యాక్టివిటీ కొనసాగాలన్నా ఎమ్మెల్యే ఆశీస్సులు ఉండాల్సిందే. ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి ఇంత అని దండుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ప్రజలు ఓటు వేసి ఐదేళ్లు పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రజలు గత్యంతరం లేక చూస్తున్నారంతే. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు.చరిత్ర పునరావృతం ఖాయం 2014లో ఇదే కూటమి అధికారంలో ఉంది. ఆ రోజు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదు. చరిత్ర పునరావృతం అవుతుంది. అప్పుడు కూడా రైతులకు రుణమాఫీ అని కొద్దిగా చేసి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు. అది కూడా మోసంగా తయారైంది. ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. అదీ మోసమైంది. ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల స్థలం అన్నాడు.. అదీ మోసంగా మిగిలింది. అదే సమయంలో మనం పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా ఇచ్చాం. చివరకు ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్టు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను చీల్చడానికి తన భాగస్వామిని వేరేగా పోటీ చేయించాడు. అయినా చంద్రబాబు ఓటమిని అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారు. సరైన సమయంలో మొట్టికాయలు వేస్తారు. ముఖ్యమైన వారికి కీలక బాధ్యతలు చాలా ముఖ్యమైన వ్యక్తులుగా భావించిన వారినే పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించాం. పార్టీ నిర్మాణంలో ఎవరైతే క్రియాశీలకంగా ఉండగలుగుతారు.. ఎవరైతే పార్టీని నడపగలుగుతారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి బలంగా ఉపయోగపడతారు.. అని చాలా అధ్యయనం చేశాకే మీకు ఈ బాధ్యతలు అప్పగించాం. ఏం జరుగుతున్నా నాతోనే నేరుగా చెప్పగలిగే చనువు మీ అందరికీ ఉంది. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద 11 నెలలుగా మనం ప్రధానంగా ధ్యాస పెట్టాం. జిల్లా స్థాయి నుంచి గ్రామంలో బూత్ కమిటీల నిర్మాణం వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అందులో భాగంగానే జవసత్వాలు నింపి జిల్లా అధ్యక్షులుగా కొత్తవాళ్లను నియమించాం. జిల్లా కమిటీల నుంచి బూత్ కమిటీల వరకు అన్నీ పూర్తి చేసే బృహత్తర బాధ్యతను జిల్లా అధ్యక్షులకు అప్పగించాం. వాళ్లకు సరైన సపోర్ట్ మెకానిజమ్‌గా రీజినల్ కోఆర్డినేటర్లను తీసుకొచ్చాం. రీజియన్‌ను వారు కోఆర్డినేట్ చేస్తూ, జిల్లా అధ్యక్షులకు అవసరమైన సహకారం అందిస్తూ.. వాళ్లతో పని చేయిస్తారు. అప్పుడే పని సులభం అవుతుంది.రీజినల్ కో–ఆర్డినేటర్లతో సమన్వయం జిల్లాలో ఏదైనా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా.. రీజినల్ కో–ఆర్డినేటర్లతో పాటు, మీరు కూడా మరింత మమేకమై పని చేయాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఆ పార్లమెంట్ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తిని, ఆ పార్లమెంటు నియోజకవర్గంతో భావోద్వేగం లేని వాళ్లను, అల్టిమేట్‌గా పార్టీ కోసం పనిచేసే వారిని నియమించాం. వీళ్లు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తకు ఉపయోగపడేలా పని చేస్తారు. వీళ్లను ఆయా రీజినల్ కో ఆర్డినేటర్లతో మ్యాపింగ్ చేస్తాం. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకం అయి పని చేయాలి. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలి. జిల్లా కమిటీల నుంచి, బూత్ కమిటీల వరకు జిల్లా అధ్యక్షులకు సహాయకారిగా ఉండాలి. ప్రజలకు మరింత చేరువగా.. ప్రతి నియోజకవర్గంలోని పార్టీ ఇన్‌ఛార్జి పనితీరును బేరీజు వేస్తారు. సరిగ్గా పని చేసేలా మోటివేట్ చేయాలి. వారిని ప్రోత్సహించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త గెలవడం చాలా సులభం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిదే. నియోజకవర్గ అభ్యర్థికి ఎవరితోనైనా విభేదాలు ఉంటే, వాళ్ల మధ్య సమన్వయం చేయడంలో కూడా పరిశీలకులదే కీలక బాధ్యత. ఇదంతా జిల్లా అధ్యక్షులతో కలిసి చేయాలి. మీరు, జిల్లా అధ్యక్షులు కలిసి రీజనల్ కోఆర్డినేటర్లకు కాళ్లూ, చేతుల్లా పని చేస్తారు. వారు మీ ద్వారానే అన్ని పనులు చేయించుకుంటారు.గెలుపే మీ పనితీరుకు గీటురాయి మీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఎంత మందిని మీరు గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీకు, జిల్లా అధ్యక్షులకు మీ మీ పనితీరు ఆధారంగానే మంచి పదవులు వస్తాయి. మీ మీద నేను ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలి. అలాగే రీజినల్ కోఆర్డినేటర్లు కూడా, వాళ్ల ప్రాంతాల్లో ఎంత మందిని గెలిపించుకుని వచ్చారన్న దానిపైనే వాళ్లకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అయిందో అందరికీ కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలు చేసి, పారదర్శకంగా పథకాలిచ్చి, రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి, ప్రతి ఇంటికీ పథకాలన్నీ చేర్చిన తర్వాత కూడా మన పరిస్థితే ఇలా ఉంటే, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.మీరు పని చేయండి.. మీ బాధ్యత నాది మీరు పని చేయండి. మీ బాధ్యత నాది. మిమ్నల్ని సముచిత స్థానాల్లో కూర్చోబెట్టే బాధ్యత నాది. ప్రతి గ్రామంలో మన పార్టీ బలంగా ఉంది. దీన్ని మరింత ఆర్గనైజ్డ్గా తీసుకుని రావాలి. గ్రామ కమిటీ సభ్యుడిగానో, బూత్ కమిటీలోనో, మహిళా కమిటీ సభ్యురాలిగానో.. ఇలా ఏదో ఒక చోట ప్రతి కార్యకర్తను తీసుకుని రావాలి. అంతిమంగా మీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని వచ్చారా లేదా అన్నదే నా పరీక్ష. గ్రామ, బూత్, మండల కమిటీలు ఎప్పుడైతే క్రియాశీలకంగా పని చేయడం మొదలవుతుందో అప్పడే గెలుపు సాధ్యం. మోసం మనకు చేతకాదుమనం అధికారంలోకి వచ్చే నాటికి నీరు–చెట్టు కార్యక్రమానికి సంబంధించి రూ.2,300 కోట్లు చంద్రబాబు హయాంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులు మనం చెల్లించాం. మనం ఇచ్చిన హామీ మేరకు ప్రతి పథకం అమలు చేస్తూ బటన్ నొక్కి జమ చేశాం. విలువలు, విశ్వసనీయత, క్రెడిబులిటీ కోసం మనం తాపత్రయ పడ్డాం. ప్రజల కోసమే ఆలోచన చేశాం. కాబట్టి కేడర్‌కు అనుకున్న మేరకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం. చంద్రబాబుకు అవేవీ లేవు. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత మన కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. తొలి ప్రాధాన్యత వారికే. అదే టైంలో చంద్రబాబు మాదిరిగా మనం అబద్ధాలు చెప్పలేం. మోసాలు చేయలేం. ఎప్పుడైనా సరే నిజాయితీగానే రాజకీయాలు చేస్తాను. త్వరితగతిన కమిటీల నిర్మాణంబూత్ కమిటీల నియామకం పూర్తయ్యే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షల మంది ఉంటారు. వారికి ఇన్సూరెన్స్ కచ్చితంగా చేస్తాం. వారి ఆలనా పాలన చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే పార్టీ నిర్మాణంలో 94 శాతం మండల అధ్యక్షుల నియామకం, 54 శాతం మండల కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. అనుబంధ విభాగాలకు సంబంధించి 9 వేల మంది అధ్యక్షులను నియమించాం. మే ఆఖరులోగా మండల కమిటీలు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలి. అప్పుడు మండల కమిటీలు.. గ్రామ స్థాయి కమిటీల నియామకాలను పర్యవేక్షిస్తాయి. జూలై ఆఖరు నాటికి మున్సిపాలిటీ, గ్రామ స్థాయి విలేజ్ కమిటీల నియామకాలు పూర్తి కావాలి. ప్రతి మున్సిపాలిటీలో డివిజన్ ప్రెసిడెంట్ నియామకాలు పూర్తి కావాలి. కార్పొరేటర్ ఉన్నా కూడా డివిజన్ ప్రెసిడెంట్‌ను నియమించాలి. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి బూత్ కమిటీలు కూడా పూర్తి కావాలి. ప్రతి గ్రామంలో అత్యధికంగా సర్పంచ్‌లు మన వాళ్లే ఉన్నారు. తొలుత 18 లక్షల మంది క్రియాశీలక (యాక్టివ్) సభ్యులకు ప్రత్యేకంగా ఐడీ కార్డు, ప్రత్యేక ఇన్సూరెన్స్ వస్తాయి. ఆ తర్వాత సభ్యత్వ నమోదు చేస్తాం. అక్టోబర్ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతాం. తొలుత జిల్లా స్థాయిలో కమిటీలు, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి కమిటీల హెడ్లను నియమించాం. మండల స్థాయిలో అధ్యక్షుల నియామకం దాదాపు 94 శాతం పూర్తి అయింది. తొలుత నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో వివిధ అనుబంధ విభాగాల కమిటీల అధ్యక్షులను నియమించాలి. మీరు వారానికి మూడు రోజులు వెళ్లి పరిశీలించగలిగితే అన్ని నియామకాలు పూర్తవుతాయి. వచ్చే ఏడాది బ్రహ్మాండంగా ప్లీనరీ నిర్వహిద్దాం.మన హయాంలో రైతులకు భరోసా⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితా పెట్టే వాళ్లం. మద్దతు ధర కోసం రూ.7,600 కోట్లు ఖర్చు చేసి రైతులకు మేలు చేశాం. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ఆ పంటలు కొనుగోలు చేసేది. పొగాకు విషయంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ⇒ ప్రైవేటు కంపెనీలతో పోటీ పడి వేలంలో పాల్గొని, రైతులను ఆదుకున్నాం. ఆయిల్‌పామ్ రైతులనూ ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. రూ.80 కోట్లు ఇచ్చాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం. ధాన్యానికి ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. అదనంగా గన్నీ బ్యాగ్స్, లేబర్ చార్జీలు, రవాణా ఖర్చు (జీఎల్టీ) కూడా ఇచ్చాం. ⇒ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సంప్రదాయం మన దగ్గరే ప్రారంభమైంది. క్రమం తప్పకుండా ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్లం. వ్యవసాయ రంగంపై ఇంత ఫోకస్ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్ పెట్టనిది కూటమి ప్రభుత్వం. క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించాం. విపత్తులు వస్తే తక్షణమే వెళ్లి ఆదుకున్నాం. ⇒ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కనీస మద్దతు ధర అందడం లేదు. రైతును పట్టించుకునే నాధుడే లేడు. ప్రజలకు సమస్యలొస్తే మీరు అక్కడికి వెళ్లాలి. ప్రజలకు అండగా ఉండాలి. ప్రజా సమస్యల పట్ల ఎంత ఎక్కువగా వారికి అండగా ఉంటే.. అంత గట్టిగా ప్రజల్లో బలపడే పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా చేసేందుకే చంద్రబాబు వేధింపులకు దిగుతున్నాడు. అయినా ప్రజల కష్టాల్లో వారికి అండగా ఉండాలి’.

తిరుమల ఆలయంపై విమానం చక్కర్లు.. దాడుల వేళ అలర్ట్!
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టిన తీవ్ర కలకలం రేపింది. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల చర్యల కారణంగా తిరుమలకు ముప్పు పొంచి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆలయంపై నుండి విమానం వెళ్లింది. విమానం వెళ్లడాన్ని చూసి తిరుమలలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరిన ఫలితం మాత్రం శూన్యం. కాగా.. నేడు విమానం చక్కర్లపై టీటీడీ భద్రత అధికారులు ఆరా తీస్తున్నారు.మరోవైపు.. దేశంలో ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో తిరుమలకు ప్రమాదం ముప్పు పొంచి ఉంది. అంతకుముందు, జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో దాడి తర్వాత తిరుమలలో హైఅలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తిరుమలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తుల వాహనాలను తనిఖీలు చేశారు.

జత్వానీ కేసు.. ఐపీఎస్ కాంతిరాణా, విశాల్ గున్నీకి ఊరట
సాక్షి, అమరావతి: సినీ నటి జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జత్వానీ వ్యవహారంలో కేసులను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పోలీసుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను జూన్ 30వ తేదీకి వాయిదా వేసింది. గత విచారణలో ఇలా..కొద్ది రోజుల క్రితం డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌కుమార్ దేశ్‌పాండే వివరించారు.జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ.. ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు.చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు?. జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేసింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు.అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్ర పూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.

పో.. పో!.. వరుణ్ చక్రవర్తికి షాకిచ్చిన బీసీసీఐ
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)కి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో మ్యాచ్‌లో అనుచిత ప్రవర్తనకు గానూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి మొట్టికాయలు వేసింది. మ్యాచ్ ఫీజులో ఇరవై ఐదు శాతం మేర కోత విధించింది.అంతేకాదు.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ వరుణ్ చక్రవర్తి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. ఐపీఎల్-2025లో భాగంగా కేకేఆర్ బుధవారం చెన్నైతో తలపడిన విషయం తెలిసిందే.రహానే రాణించినాసొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (11) విఫలం కాగా.. సునిల్ నరైన్ (26) ఫర్వాలేదనిపించాడు.వన్‌డౌన్‌లో వచ్చిన అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ (48) ఆడగా.. మనీశ్ పాండే (36 నాటౌట్), ఆండ్రీ రసెల్ (38) కూడా రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగలిగింది.చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు నూర్ అహ్మద్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. పేసర్ అన్షుల్ కాంబోజ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడుఇక కేకేఆర్ విధించే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఆదిలోనే ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, డెవాన్ కాన్వే డకౌట్ కావడంతో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ 31 పరుగులతో రాణించగా.. ఆరో స్థానంలో వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ దంచికొట్టాడు.కేవలం 25 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన బ్రెవిస్.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. అయితే, హాఫ్ సెంచరీతో జోరు మీదున్న ఈ సౌతాఫ్రికా చిచ్చర పిడుగును కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు.వరుణ్ రౌండ్ ది వికెట్ బౌల్ చేయగా.. బ్రెవిస్ ముందుకు వచ్చి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లాంగాన్ మీదుగా వెళ్లిన బంతి రింకూ సింగ్ చేతిలో పడటంతో.. బ్రెవిస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అత్యంత కీలకమైన ఈ వికెట్ తీసిన తర్వాత వరుణ్ చక్రవర్తి..‘‘ పో.. పో’’ అంటూ వేలు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.pic.twitter.com/vhf3iwOR8o— Knight Vibe Media (@Kkrmediareels) May 7, 2025 డీమెరిట్ పాయింట్ కూడా ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి వరున్ చక్రవర్తికి జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం వరుణ్ చక్రవర్తి లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని.. అందుకే అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది.ఇక బ్రెవిస్ విధ్వసంతో గెలుపు దిశగా వచ్చిన చెన్నై.. శివం దూబే (45), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(17 నాటౌట్) కారణంగా విజయతీరాలకు చేరింది. కేకేఆర్‌పై రెండు వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్లో మూడో గెలుపు నమోదు చేసింది. మరోవైపు.. ఈ విజయంతో చెన్నైకి వరుస ఓటముల తర్వాత ఊరట లభించగా.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.చదవండి: అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాతే..: ధోనిElation for the men in yellow 🥳@ChennaiIPL make it 1⃣-1⃣ against #KKR in the season with a 2⃣ wicket win at Eden Gardens💛 Updates ▶ https://t.co/ydH0hsBFgS #TATAIPL | #KKRvCSK pic.twitter.com/6MTmj6NPMH— IndianPremierLeague (@IPL) May 7, 2025

పాకిస్తాన్ లాహోర్‌లో పేలుళ్లు.. పరుగు తీసిన ప్రజలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో పేలుడు ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌లోని వాల్టన్ విమానాశ్రయం సమీపంలోని లాహోర్‌లోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాలలో వరుసగా బాంబు పేలుడు ఘటన సంభవించింది. ఎయిర్‌పోర్టు వద్ద గురువారం ఉదయం ఒక్కసారిగా సైరన్లు మోగడంతో ఇళ్ల నుంచి పాక్ ప్రజలు బయటకు పరుగులు తీశారు.అయితే, డ్రోన్ కారణంగానే పేలుడు సంభవించినట్లు పాక్ పోలీసులు చెబుతున్నారు. 5-6 అడుగుల పొడవున్న డ్రోన్ పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రోన్ వ్యవస్థను జామ్ చేయడం ద్వారా కూల్చివేసినట్లు చెప్పుకొచ్చారు. వరుస బాంబు పేలుడు ఘటనలతో పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్ సహా పలు విమనాశ్రయాలను అధికారులు మూసివేశారు. ఇక, భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన మరుసటి రోజే పేలుళ్లు సంభవించడం గమనార్హం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ బాంబు పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Panic in Lahore after blast near laWhore airport pic.twitter.com/zsQNyoE4hx— Team Jhaat Official (@TeamJhaant__) May 8, 2025 Utter chaos in Lahore after drone strike at Walton Road which leads to Lahore cantonment. People out on streets in panic. Asim Munir's Jihadist policies have invited war to Pakistan's streets. pic.twitter.com/1195BQxlhf— Divya Kumar Soti (@DivyaSoti) May 8, 2025Something hit Naval college besides #Askari 5. Sirens are #lahore One 1x Drone intercept in #Walton road.#IndiaPakistanWar#Pakistan#PakistanZindabadpic.twitter.com/XN8HkYsi4S— Muhammad Asif (Parody) (@MuhammadAsif26_) May 8, 2025

భారత్-పాక్ యుద్ధం.. బిగ్ ట్విస్ట్ ఇస్తూ ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడుల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం ఆపేయాలని కోరారు. అలాగే, ఇరు దేశాలు సాయం కోరితే తాను అందుబాటులో ఉంటానని ట్రంప్ వెల్లడించారు.ఆపరేషన్ సిందూర్ నేపథ్యం భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు దేశాధినేతలు, రాయబారులు దాడుల ఘటనపై స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్, పాక్‌లను కోరారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం మరోసారి స్పందించారు.ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్, పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దాడులు చేయడం అవమానకరం. రెండు దేశాల గురించి నాకు చాలా తెలుసు. ఎప్పటి నుంచో వారి మధ్య వైరం ఉంది. అయితే, రెండు దేశాలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, వాటిని ఆపేయాలని కోరుకుంటున్నాను. వారు అనుకుంటే ఇప్పుడే ఇది చేయగలరు. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వాయి. అమెరికాతో భారత్, పాక్‌కు మంచి సంబంధాల దృష్ట్యా వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సహాయమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.U.S. President Donald Trump has condemned India's attack, calling it shamefulPakistan Zindabad!#Pakistan #PakistanismyRedLine #donaldjtrump #PakistanZindabad #IndiaPakistanWar pic.twitter.com/iDl8SwVeLH— Anmol Sheraz (@iamanmolsheraz) May 6, 2025 చైనాకు భారత్ వార్నింగ్మరోవైపు.. ఆపరేషన్ సిందూర్‌పై విషం గక్కే ప్రయత్నం చేసిన పొరుగు దేశం చైనా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్‌కు చెందిన మూడు విమానాలను పాక్ కూల్చేసిదంటూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు రాయడం మానుకోవాలని హెచ్చరించింది.

ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ప్రముఖ ఆడిటింగ్ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌజ్‌కూపర్స్(పీడబ్ల్యూసీ) 1,500 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ తాజా నిర్ణయంతో యూఎస్ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఉద్యోగుల తొలగింపు దాని మొత్తం సిబ్బందిలో 2 శాతంగా ఉంది. ఆడిట్, ట్యాక్స్ విభాగాలకు చెందిన బాధిత ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్ ద్వారా లేఆఫ్స్ సమాచారం అందించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.తొలగింపునకు కారణాలుప్రస్తుత వ్యాపార డిమాండ్లకు అనుగుణంగా కంపెనీ తన శ్రామిక శక్తిని సమీకరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ఆలోచనాత్మకంగానే ఈ చర్య తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఆర్థిక అనిశ్చితి, మారుతున్న ఖాతాదారుల డిమాండ్లు, పునర్నిర్మాణ ప్రయత్నాలు వంటి అంశాలను హైలైట్ చేస్తూ డెలాయిట్, కేపీఎంజీ వంటి సంస్థలు కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, మార్కెట్ తీరుకు అనుగుణంగా సంస్థలు మారుతున్నాయి.ఇదీ చదవండి: దేశంలో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఎంతంటే..సవాళ్లుతొలగింపులతో ప్రభావితమైన ఉద్యోగులు తిరిగి కొలువు సాంపాదించాలంటే సవాళ్లను ఎదుర్కోకతప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ రంగంలో ఉపాధి అవకాశాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలు అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. పెరిగిన ఆటోమేషన్, వ్యాపార వ్యూహాలతో ఆడిట్, ట్యాకేషన్ నిపుణులు డేటా అనలిటిక్స్, అడ్వైజరీ సర్వీసులు లేదా ప్రత్యేక ఫైనాన్స్ రంగాల్లో కొత్త అవకాశాలకు అనుగుణంగా మారవలసి ఉంటుంది.

‘సింగిల్’కాల్లో అతనికి ‘శుభం’ చెప్పేశా: సమంత పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ సమంత(samantha) నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీస్ పిక్చర్స్‌లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’(subham movie) మే 9న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సమంత ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ని తన భుజాన వేసుకొని ముందుకు సాగుతోంది. వరుస ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్‌కి తన స్నేహితులను కూడా వాడుకుంటుంది. తాజా వెన్నెల కిశోర్‌తో కలిసి ఓ ఫన్ వీడియో కూడా చేసింది. ఈ వీడియోలో సమంత ‘ నా శుభం మూవీ ప్రీమియర్స్‌కి రావట్లేదా’ అని అడుగుతుంది. వెన్నెల కిశోర్ ఏమో తన నటించిన ‘సింగిల్’(#single) మూవీ కూడా అదే రోజు(మే 9) రాబోతుందని చెప్పాలనుకుంటాడు. కానీ సమంత అతన్ని మాట్లాడనీయకుండా.. ‘నువ్వు, నీ ఫ్యామిలీ తప్పకుండా వస్తారు కదా? నేను నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది తప్పుకుండా రావాలి’ అంటూ గబగబా మాట్లాడేస్తుంది. చివరికి నువ్వు కచ్చితంగా వస్తున్నావు అని కట్ చేసేస్తది. ఈ వీడియోని సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. సింగిల్ ఫోన్ కాల్లో వెన్నెల కిశోర్‌కి శుభం చెప్పేశా.. మే 9న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

అది భారత సోషల్ మీడియా.. పాక్ మంత్రి వింత సమాధానం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) విజయవంతమైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత దళాలు మెరుపు దాడులు చేశాయి. ఇందుకు తామూ సమర్థవంతంగా ప్రతిఘటించామంటూ పాకిస్తాన్ ప్రకటించుకుంది. రాఫెల్స్ సహా ఐదు భారత యుద్ధ విమానాలను తమ బలగాలు కూల్చివేశాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసింది. అయితే దీనిపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు.భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్ బలగాలు కూల్చివేశాయంటూ సోషల్ మీడియాలో చేసిన ఫేక్ ప్రచారాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ తన వాదనను నిరూపించడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో విలేకరి అడిగ్గా ఆసిఫ్ వింత సమాధానం ఇచ్చాడు. ‘అదంతా ఇండియన్ సోషల్ మీడియాలోనే తప్ప మన సోషల్ మీడియాలో కాదు. జెట్ విమానాల శిథిలాలు వారి వైపు పడ్డాయి. ఇదంతా భారత మీడియాలోనే ఉంది' అని వింతగా బదులిచ్చారు.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా తామూ రెండు రాఫెల్ జెట్లు, ఒక సు-30తో సహా మూడు భారత వైమానిక దళ (IAF) యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. అయితే, ఈ వాదనలను భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. కార్యకలాపాల సమయంలో ఐఏఎఫ్ విమానాలు ఏవీ కోల్పోలేదని పేర్కొంది. ఇదంతా ఫేక్ ప్రచారమని తెలిపింది.పాకిస్తాన్ చేస్తున్నది ఫేక్ ప్రచారమని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ నివేదించింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా బహవల్ పూర్ సమీపంలో భారత రాఫెల్ జెట్ ను పాకిస్థాన్ కూల్చివేసిందంటూ సోషల్ మీడియా షేర్ చేసిన ఫొటో 2021లో జరిగిన ప్రమాదానికి సంబంధించినదని తెలిపింది.

నిండుగర్భిణి జోష్‌ఫుల్ స్టెప్పులు..చూస్తే షాకవ్వడం ఖాయం!
ప్రెగ్నెంట్‌తో ఉన్న మహిళలు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే. నడవడం కూడా చీమచిటుక్కు మనకుండా సుతారంగా నడుస్తారు. కొందరు కొద్దిపాటి శారీరక శ్రమ మంచిదని నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అంతేతప్ప మైకేల్ జాక్సన్ మాదిరిగా బాడీ అంతా స్ప్రింగ్‌లు ఉన్నట్లుగా డ్యాన్స్‌లు చేసే డేరింగ్ మాత్రం చేయరు. కానీ ఇక్కడొక మహిళ నిండు గర్భంతో ఏ రేంజ్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిందో చూస్తే.. కళ్లు ఆర్పడమే మర్చిపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సునిధి చౌహాన్ అనే నిండు గర్భిణి బాలీవుడ్ ఫేమస్ సాంగ్ 'డింగ్ డాంగ్ డోల్'కి ఉత్సాహభరితంగా డ్యాన్స్ చేస్తుంది. తన కొరియోగ్రాఫర్ సాయంతో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది వీడియోలో. చూడటానికి ఆమె తొమ్మిదోనెల గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం ఎంతో జోష్‌గా తన కొరియోగ్రాఫర్‌ని బీట్చేసేలా నృత్యం చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు మాతృత్వానికి ఉత్సాహభరితమైన నివాళిగా అభివర్ణించారు. మరికొందరు ఈ సమయంలో ఇలాంటి అవసరమా..? అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఒక డాక్టర్ ఆ పోస్టులకు స్పందిస్తూ..ఆలోచనాత్మక వివరణను అందించారు. గర్భంతో ఉన్నప్పుడూ మహిళలు డ్యాన్స్‌లు చేయొచ్చా..? అంటే..అవుననే అంటానని చెప్పారు. ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే నిర్భయంగా ఎలాంటి ఉత్సాహభరితమైన యాక్టివిటీల్లో అయినా పాల్గొనవచ్చు అని అన్నారు. అంతేగాదు శారీరక శ్రమ అనేది గర్భస్రావం, తక్కువ బరువుతో జననం లేదా ముందస్తు ప్రసవ ప్రమాదం వంటివి పెంచవని తేల్చి చెప్పారు. ఆయా మహిళల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్యులు జాగ్రత్తలు చెబుతారే తప్ప, అందరికీ వర్తించవు అని పోస్టులో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Artist_Dance_Community (@artist_dance_community_) (చదవండి: World Thalassaemia Day: శెభాష్ సమర్థ్ లాంబా ..! వయసుకి మించిన సేవతో ..)
ఎన్నికల ముందు పాలిటిక్స్, ఆ తరువాత ఎకనమిక్స్ చెప్పరాదు సీఎంగారూ!
నితీశ్ రాణా అవుట్.. రాజస్తాన్ జట్టులోకి చిచ్చర పిడుగు
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ‘సాక్షి’పై ఏపీ సర్కార్ కక్ష సాధింపు
దేశ సరిహద్దుల్లో హైఅలర్ట్.. సిద్ధంగా క్షిపణులు
World Ovarian Cancer Day : సైలెంట్‌గా..స్త్రీలకు గండంగా!
జత్వానీ కేసు.. ఐపీఎస్ కాంతిరాణా, విశాల్ గున్నీకి ఊరట
ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్
వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా!
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
పో.. పో!.. వరుణ్ చక్రవర్తికి షాకిచ్చిన బీసీసీఐ
చూడటానికి మొక్కజొన్న పంట.. కానీ దగ్గరకెళ్తే షాకవ్వుతారు!
సారీ సార్! యుద్ధమొస్తే నేనూ వెళ్లిపోతా...
కుమారుడి ధోతి వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి మంజుల (ఫొటోలు)
భారత్ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. శుభవార్తలు వింటారు
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. సంఘంలో గౌరవమర్యాదలు
మొదట్నుంచి మీరే ఏదో రకంగా విదేశీయులకు హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూపిస్తున్నారుగా సార్!!
గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్
ఉగ్రబుద్ధిపై వక్రభాష్యం!
ఫ్లాష్ ఫ్లాష్: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..30 మంది ఉగ్రవాదుల హతం
#MetGala2025 : చరిత్ర సృష్టించిన కియారా.. మొదటిసారి బేబీ బంప్‌తో ఇలా! (ఫొటోలు)
ఆపరేషన్ సిందూర్ అప్డేట్స్.. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం
భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?
నేడు ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల
యుద్ధానికి సిద్ధం!.. నేడు కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష
భారత్ దాడులు.. పాక్ ప్రధాని రియాక్షన్ ఇదే..
IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషబ్ పంత్
మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!
త్వరలో నా డ్రీమ్ ప్రాజెక్ట్‌తో తిరిగొస్తా: కార్తీక్ సుబ్బరాజ్
ఎన్నికల ముందు పాలిటిక్స్, ఆ తరువాత ఎకనమిక్స్ చెప్పరాదు సీఎంగారూ!
నితీశ్ రాణా అవుట్.. రాజస్తాన్ జట్టులోకి చిచ్చర పిడుగు
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ‘సాక్షి’పై ఏపీ సర్కార్ కక్ష సాధింపు
దేశ సరిహద్దుల్లో హైఅలర్ట్.. సిద్ధంగా క్షిపణులు
World Ovarian Cancer Day : సైలెంట్‌గా..స్త్రీలకు గండంగా!
జత్వానీ కేసు.. ఐపీఎస్ కాంతిరాణా, విశాల్ గున్నీకి ఊరట
ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్
వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా!
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
పో.. పో!.. వరుణ్ చక్రవర్తికి షాకిచ్చిన బీసీసీఐ
సినిమా

వెండితెరపైకి అహల్యా బాయి హోల్కర్ జీవితం
మరాఠీ రాణి, ధీర వనిత అహల్యా బాయి హోల్కర్ జీవితం వెండితెరపైకి రానుంది. అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు ఆమె జన్మస్థలం జామ్ఖేడ్ తహసీల్‌లో జరిగాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆమె బయోపిక్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘‘మరాఠీతో పాటు ఇతర భాషల్లోనూ ఈ బయోపిక్ రూపొందనుంది. మహారాష్ట్ర ఫిల్మ్, థియేటర్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గుర్గావ్ ఫిల్మ్ సిటీ ఈ బయోపిక్ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తాయి’’ అని తెలిపారు దేవేంద్ర ఫడ్నవీస్. ప్రభుత్వం తరఫున ఈ సినిమాని నిర్మించనున్నారు కాబట్టి ఆయన స్వయంగా ప్రకటించారు. ఇక 1725 మే 31న అహల్యా బాయి హోల్కర్ జన్మించారు. భర్త ఖండేరావు హోల్కర్, మామ మల్హర్ రావు హోల్కర్ మరణించిన తర్వాత మాల్యా రాజ్యపు రాణిగా ఆమె సింహాసనాన్ని అధిష్టించారు. ఆ కాలంలో జరిగిన యుద్ధాల్లో సైన్యానికి నాయకత్వం వహించారు. దోపిడీ దారులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అంతేకాదు... ఎన్నో హిందూ దేవాలయాలు, ధర్మశాలలను నిర్మించి పేరు, ప్రఖ్యాతులు గడించారామె.

రూ.10 కోట్లు దానం చేసిన హీరో సూర్య
తమిళ హీరో సూర్య మంచి మనసు చాటుకున్నాడు. గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన హిట్ పడట్లేదు. రీసెంట్ గా రెట్రో మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తెలుగులో తేలిపోయింది గానీ తమిళంలో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పుడు తన చిత్రానికి వచ్చిన లాభాల నుంచి ఏకంగా రూ.10 కోట్లని సూర్య దానం చేశాడు. (ఇదీ చదవండి: సడన్ సర్ ప్రైజ్.. ఓటీటీలోకి తమన్నా 'ఓదెల 2') రెట్రో సినిమాలో సూర్య హీరోగా నటించాడు. ఇతడికి చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తాజాగా రూ.104 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే లాభాలు రావడంతో హీరో కమ్ నిర్మాత అయిన సూర్య ఫుల్ హ్యాపీ అయిపోయాడు. తనకు చెందిన అగరం ఫౌండేషన్ కి రూ.10 కోట్లు దానం చేశాడు. ఈ మేరకు నిర్వహకులకు చెక్ అందజేశాడు.2006లో అగరం ఫౌండేషన్ ని సూర్యనే స్థాపించాడు. తమిళనాడులో చదివించే స్థోమత లేని చాలామంది పిల్లలని చదివించడమే ఈ సంస్థ ఉద్దేశం. ఇప్పటికే చాలామంది అగరం ద్వారా చదువుకుని ప్రయోజకులు అయ్యారు.(ఇదీ చదవండి: 'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత)

ఈ బ్యూటీని గుర్తుపట్టారా? కల్కి, మహానటి సినిమాల్లో
తెలుగులో బోలెడంత మంది హీరోయిన్లు. వాళ్లలో కేరళకు చెందిన చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మన సినిమాల్లో వీళ్లు అవకాశాలు దక్కించుకుంటూ అదరగొట్టేస్తున్నారు. ఈమె కూడా అలా వచ్చిన బ్యూటీనే. దాదాపు పదేళ్లుగా తెలుగులో నటిస్తోంది. ఇంతలా చెప్పాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: సడన్ సర్ ప్రైజ్.. ఓటీటీలోకి తమన్నా 'ఓదెల 2') పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు మాళవిక నాయర్. మలయాళీ ఫ్యామిలీకి చెందిన ఈమె.. ఢిల్లీలో పుట్టింది. కొంతవరకు కేరళలో, డిగ్రీ హైదరాబాద్ లో పూర్తి చేసింది. మోడల్ గా పనిచేసిన ఈమెకు 2012లో తొలి ఛాన్స్ ఓ మలయాళ సినిమాలో వచ్చింది. 2015 రిలీజైన 'ఎవడే సుబ్రమణ్యం'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ చిత్రంలో నంది అనే పాత్రలో ఆకట్టుకున్న మాళవిక.. దీని తర్వాత కళ్యాణ వైభోగమే, మహానటి, ట్యాక్సీవాలా, అన్నీ మంచి శకునములే, కల్కి 2898 ఏడీ తదితర చిత్రాల్లో నటించింది. నాగ్ అశ్విన్ తొలి మూవీలో నటించిన ఈమె.. అనంతరం అతడు తీసిన మహానటి, కల్కి చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. తాజాగా ఈమె తన చిన్ననాటి ఫొటో పోస్ట్ చేసింది. అదే పైన కనిపిస్తున్న ఫొటో. (ఇదీ చదవండి: 'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత)

సడన్ సర్ ప్రైజ్.. ఓటీటీలోకి తమన్నా 'ఓదెల 2'
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చాలారోజుల ముందే అనౌన్స్ మెంట్స్ ఇస్తారు. మరికొన్నిసార్లు మాత్రం సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు ఎలాంటి ప్రకటనలు లేకుండానే స్ట్రీమింగ్ చేసేస్తారు. ఇప్పుడు కూడా ఓ చిత్రాన్ని అలానే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు.తమన్నా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల 2. గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కి ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దేశమంతా సినిమాకు ప్రచారం చేశారు. కానీ విడుదల తర్వాత టాక్ తేడా కొట్టేసింది. రెండు మూడు రోజులకే సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మూడు వారాలకే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత) మరికొన్ని గంటల్లో అంటే రేపటి(మే 08) నుంచి ఓదెల 2 చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.ఓదెల 2 విషయానికొస్తే.. ఓదెల అనే ఊరిలో తిరుపతి(వశిష్ఠ) అనే కామాంధుడు కొత్తగా పెళ్లయిన అమ్మాయిల్ని రేప్ చేసి చంపేస్తుంటాడు. ఓ రోజు అతడి భార్య అతడి నరికి చంపేసి జైలుకి వెళ్తుంది. కానీ తిరుపతి ఆత్మకు శాంతి కలగకుండా ఉండాలని సమాధి చేస్తారు. కానీ తిరుపతి ప్రేతాత్మ తిరిగి సమాధిలో నుంచి బయటకొచ్చి ఊరిపై పడుతుంది. దాన్ని నిలువరించడానికి శివశక్తి (తమన్నా) ఓదెలకు వస్తుంది. తర్వాత ఏమైంనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

రెండు స్వర్ణాలపై భారత్ గురి
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా భారత్ ఖాతాలో కనీసం రెండు స్వర్ణాలు లేదా రెండు రజతాలు చేరనున్నాయి. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర)లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు... అభిõÙక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలేలతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. మరోవైపు మెక్సికో పురుషుల, మహిళల జట్లు కూడా ఫైనల్లోకి అడుగు పెట్టాయి. శనివారం భారత్, మెక్సికో జట్లు రెండు స్వర్ణాల కోసం పోటీపడతాయి. క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచినందుకు... భారత జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ లభించింది. క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు 232–229 పాయింట్ల తేడాతో అదెల్ జెక్సెన్‌బినోవా, విక్టోరియా లియాన్, రొక్సానా యునోసోవాలతో కూడిన కజకిస్తాన్ జట్టును ఓడించింది. సెమీఫైనల్లో భారత జట్టు 232–230 పాయింట్లతో ఎల్లా గిబ్సన్, ఇసబెల్లా కార్పెంటర్, లేలా అనిసన్‌లతో కూడిన బ్రిటన్ జట్టుపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో భారత పురుషుల జట్టు 239–232 పాయింట్ల తేడాతో అజయ్ స్కాట్, ఆడమ్ కార్పెంటర్, ల్యూక్ డేవిస్‌లతో కూడిన బ్రిటన్ జట్టుపై నెగ్గింది. సెమీఫైనల్లో భారత బృందం 232–231 పాయింట్ల తేడాతో మథియాస్ ఫులర్టన్, మారి్టన్ డామ్స్‌బో, నిక్లాస్ బ్రెడాల్‌లతో కూడిన డెన్మార్క్ జట్టును ఓడించింది. తొమ్మిదో స్థానంలో ధీరజ్ బుధవారం జరిగిన రికర్వ్ విభాగం పురుషుల క్వాలిఫయింగ్‌లో భారత ఆర్చర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. పారిస్ ఒలింపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 677 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 666 పాయింట్లతో తరుణ్‌దీప్ రాయ్ 28వ స్థానంలో, 652 పాయింట్లతో అతాను దాస్ 57వ స్థానంలో, 651 పాయింట్లతో పార్థ్ సాలుంఖే 60వ స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా 1995 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచిన భారత్‌కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది.రికర్వ్ విభాగం మహిళల క్వాలిఫయింగ్‌లో భారత స్టార్ దీపిక కుమారి 655 పాయింట్లు సాధించి 12వ స్థానాన్ని దక్కించుకుంది. 652 పాయింట్లతో అంకిత 17వ స్థానంలో, 642 పాయింట్లతో అన్షిక 29వ స్థానంలో, 637 పాయింట్లతో సిమ్రన్‌జిత్ కౌర్ 39వ స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా 1949 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో నిలిచిన భారత్‌కు తొలి రౌండ్లో ‘బై’ దక్కింది.

‘శత’క్కొట్టిన జెమీమా
కొలంబో: ముక్కోణపు మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు జట్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. భారత జట్టు తమ నాలుగు మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి ఫైనల్‌కు దూరమైంది. భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో ఆతిథ్య శ్రీలంక జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. శుక్రవారం జరిగే నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక, దక్షిణాఫ్రికా తలపడతాయి. భారత్, శ్రీలంక జట్ల మధ్య టైటిల్ పోరు ఆదివారం జరుగుతుంది. ఫైనల్ బెర్త్ లక్ష్యంగా దక్షిణాఫ్రికాతో పోరు ప్రారంభించిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (101 బంతుల్లో 123; 15 ఫోర్లు, 1 సిక్స్) సఫారీ బౌలర్ల భరతం పట్టి కెరీర్లో రెండో సెంచరీ సాధించింది.ఓపెనర్ స్మృతి మంధాన (63 బంతుల్లో 51; 6 ఫోర్లు) కెరీర్లో 31వ అర్ధ సెంచరీ నమోదు చేసుకోగా... దీప్తి శర్మ (84 బంతుల్లో 93; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి త్రుటిలో శతకాన్ని చేజార్చుకుంది. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసి ఓడిపోయింది. అనెరి డెరెక్సన్ (80 బంతుల్లో 81; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), చోల్ ట్రయాన్ (43 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా రెగ్యులర్ కెపె్టన్ లౌరా వొల్వార్ట్ ఈ మ్యాచ్‌కు దూరంకాగా... చోల్ ట్రయాన్ సారథిగా వ్యవహరించింది. ఈ మ్యాచ్‌తో శుచి ఉపాధ్యాయ్ (భారత్), మియాని స్మిట్ (దక్షిణాఫ్రికా) అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. 122 పరుగుల భాగస్వామ్యం ఫైనల్ బెర్త్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ప్రతీక (1), హర్లీన్ డియోల్ (4), హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 28; 6 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో స్మృతి, జెమీమా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. స్మృతి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అవుటవ్వగా... జెమీమాతో దీప్తి శర్మ జత కలిసింది. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో భారత స్కోరు బోర్డులో వేగం పెరిగింది. ఈ క్రమంలో జెమీమా శతకం పూర్తి చేసుకుంది. ఐదో వికెట్‌కు వీరిద్దరూ 122 పరుగుల భాగస్వామ్యం జోడించాక జెమీమా పెవిలియన్ చేరుకుంది. వన్డేల్లో ఐదో వికెట్‌కు భారత్‌కిదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. గతంలో ఈ రికార్డు మిథాలీ రాజ్–వేద కృష్ణమూర్తి (108 పరుగులు) పేరిట ఉండేది. జెమీమా అవుటయ్యాక దీప్తి శర్మ మరింత దూకుడు పెంచడంతో భారత స్కోరు 300 పరుగులు దాటింది. ఏడు పరుగుల తేడాతో దీప్తి శర్మ సెంచరీని కోల్పోయింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ విజయంపై ఆశలు రేకెత్తించలేదు. డెరెక్సన్, ట్రయాన్ మెరిపించినా దక్షిణాఫ్రికా విజయానికి సరిపోలేదు. భారత బౌలర్లలో అమన్‌జోత్ కౌర్ మూడు వికెట్లు పడగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక రావల్ (సి) డెరెక్సన్ (బి) డి క్లెర్క్ 1; స్మృతి మంధాన (సి) డి క్లెర్క్ (బి) ట్రయాన్ 51; హర్లీన్ డియోల్ (బి) క్లాస్ 4; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) షాంగేస్ (బి) డెరెక్సన్ 28; జెమీమా రోడ్రిగ్స్ (సి) సునె లుస్ (బి) క్లాస్ 123; దీప్తి శర్మ (సి) ట్రయాన్ (బి) డి క్లెర్క్ 93; రిచా ఘోష్ (సి) బ్రిట్స్ (బి) మలాబా 20; అమన్‌జోత్ కౌర్ (సి) స్మిట్ (బి) మలాబా 5; శ్రీ చరణి (రనౌట్) 6; స్నేహ్ రాణా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 337. వికెట్ల పతనం: 1–9, 2–18, 3–50, 4–138, 5–260, 6–296, 7–314, 8–336, 9–337. బౌలింగ్: మసబటా క్లాస్ 8–0–51–2, నదినె డి క్లెర్క్ 9–0–54–2, అనెరి డెరెక్సన్ 6–0–36–1, మలాబా 8–0–71–2, షాంగేస్ 6–0–43–0, చోల్ ట్రయాన్ 8–0–46–1, సునె లుస్ 3–0–15–0, మియాని స్మిట్ 2–0–20–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: లారా గుడాల్ (సి) రిచా ఘోష్ (బి) అమన్‌జోత్ కౌర్ 4; తజ్మీన్ బ్రిట్స్ (సి) జెమీమా (బి) అమన్‌జోత్ కౌర్ 26; మియాని సిŠమ్ట్ (బి) దీప్తి శర్మ 39; అనెరి డెరెక్సన్ (బి) అమన్‌జోత్ కౌర్ 81; షాంగేస్ (సి) హర్లీన్ డియోల్ (బి) ప్రతీక రావల్ 36; సినాలో జాఫ్టా (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీ చరణి 21; చోల్ ట్రయాన్ (బి) దీప్తి శర్మ 67; నదినె డి క్లెర్క్ (నాటౌట్) 22; సునె లుస్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 314. వికెట్ల పతనం: 1–7, 2–70, 3–89, 4–159, 5–188, 6–260, 7–311. బౌలింగ్: స్నేహ్ రాణా 7–1–53–0, అమన్‌జోత్ కౌర్ 9–0–59–3, శ్రీ చరణి 10–0–58–1, శుచి ఉపాధ్యాయ్ 9–0–59–0, దీప్తి శర్మ 10–0–57–2, ప్రతీక రావల్ 3–0–15–1, స్మృతి మంధాన 2–0–12–0.

ముంబై, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు!
న్యూఢిల్లీ/ధర్మశాల: ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం (మే 11) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం పంజాబ్ రెండో సొంత మైదానమైన ధర్మశాలలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా... ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రెండు రోజుల పాటు ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ముంబై జట్టు ధర్మశాలకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ను ముంబైలోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకార చర్యగా భారత సైన్యం... పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు విమానాశ్రయాలను మూసి వేసింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ కోసం ముంబై జట్టు ధర్మశాల చేరుకోవడంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... ‘ఈ మ్యాచ్ ముంబైలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని అన్నారు. కాగా... గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ యథావిథిగా జరగనుంది. ఈ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే ధర్మశాల చేరుకోవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ‘బీసీసీఐ నుంచి కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో గురువారం మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేశాం. అధికారికంగా చెప్పనంత వరకు షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తాం’ అని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు వేదిక మార్పునకు సంబంధించిన బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం వెల్లడించింది. ఇక ఐపీఎల్ సాగడంపై ఎలాంటి అనుమానాలు లేవని... ప్రభుత్వ సూచనల మేరకు లీగ్ నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు.

టెస్టు క్రికెట్‌కు రోహిత్ గుడ్‌బై
4 జనవరి, 2025: ‘బ్యాటింగ్‌లో పరుగులు సాధించలేకపోతున్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఈ మ్యాచ్‌లో ఆడరాదని నేనే నిర్ణయం తీసుకున్నా. నేను టెస్టుల నుంచి తప్పుకోవడం లేదు. ఇది నా రిటైర్మెంట్ ప్రకటనకాదు’... ఆ్రస్టేలియాతో సిడ్నీ టెస్టు సమయంలో రోహిత్ శర్మ చెప్పిన మాట ఇది. 7 మే, 2025: ‘నేను టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. సాంప్రదాయ ఫార్మాట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. ఇకపై వన్డేల్లో మాత్రం కొనసాగుతాను’... టెస్టుల్లో తాను రిటైర్ అవుతున్నట్లు రోహిత్ ప్రకటన.న్యూఢిల్లీ: దాదాపు నాలుగు నెలల క్రితం రోహిత్ సిడ్నీ టెస్టు నుంచి తనంతట తాను తప్పుకున్నప్పుడే అంతా అతని కెరీర్ ముగిసిందని భావించారు. పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అతను వచ్చే జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళతాడా లేదా అనే సందేహాలు అప్పుడే వినిపించాయి. అయితే క్రికెట్లో వేగంగా అంతా మారిపోతుందని, రాబోయే కొన్ని నెలల్లో తాను పరుగులు సాధిస్తానంటూ రిటైర్మెంట్ వార్తలను 38 ఏళ్ల రోహిత్ కొట్టిపారేశాడు. ఇటీవల ఇంగ్లండ్ టూర్ కోసం కుదించిన 30 మంది జాబితాలో అతని పేరు కూడా ఉందని తేలడంతో ఇంగ్లండ్‌కు వెళ్లడం ఖాయమనిపించింది. అయితే ఇప్పుడు అతని రిటైర్మెంట్ ప్రకటన వచ్చిoది. మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో తన టెస్టు కెరీర్ గురించి ఉన్న సందేహాలపై స్పష్టత వచ్చేలా అతను నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాది టి20 వరల్డ్ కప్‌లో సారథిగా భారత్‌ను విజేతగా నిలిపిన అనంతరం ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్న రోహిత్ ఇప్పుడు టెస్టులకు దూరమయ్యాడు. ఇకపై తనకు బాగా కలిసొచ్చిన, ఇష్టమైన వన్డే ఫార్మాట్లో మాత్రం కొనసాగనున్నాడు.కారణాలు స్పష్టం...రోహిత్ శర్మపై నిర్ణయానికి సంబంధించి మంగళవారం సెలక్టర్లు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చాంపియన్స్ ట్రోఫీలో జట్టును గెలిపించడంతో రోహిత్‌కు నాయకుడిగా తిరుగు లేదు. అయితే వన్డే ఫామ్‌ను టెస్టులకు అన్వయించరాదని సెలక్టర్లు భావించారు. ముందుగా అతని కెప్టెన్సీపై చర్చ జరిగింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చూస్తే మరొకరికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం మేలని అనుకున్నారు. కెపె్టన్‌గా కాదంటే బ్యాటర్ కోణంలో చూస్తే టెస్టుల్లో అతని ఫామ్ చాలా పేలవంగా ఉంది. సిడ్నీ తరహాలోనే తుది జట్టులో స్థానం దక్కడం కూడా కష్టం. ఇలాంటప్పుడు విఫల బ్యాటర్‌ను కెప్టెన్ కాబట్టి తుది జట్టులోకి తీసుకోవడంలో అర్థం లేదని భావించిన సెలక్టర్లు రోహిత్‌కు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ నుంచి రోహిత్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. 2 టెస్టుల్లో కలిపి 42 రన్స్ చేసిన అతను... న్యూజిలాండ్‌పై 3 టెస్టుల్లో కలిపి కేవలం 91 పరుగులు చేయడమే కాకుండా చరిత్రలో తొలిసారి కివీస్ చేతిలో భారత్ 0–3తో సిరీస్ కోల్పోయింది. ఆపై ఆసీస్‌తో తొలి టెస్టు ఆడని రోహిత్ తర్వాతి 3 టెస్టుల్లో కలిపి 31 పరుగులే చేశాడు. పేలవ ఫామ్‌తో చివరి టెస్టు నుంచి తనే తప్పుకున్నాడు.రోహిత్ టెస్టు కెరీర్ గణాంకాలుఆడిన టెస్టులు: 67 ఆడిన ఇన్నింగ్స్: 116 చేసిన పరుగులు: 4301 సగటు: 40.57 అత్యధిక స్కోరు: 212 సెంచరీలు: 12 అర్ధ సెంచరీలు: 18 ఫోర్లు: 473 సిక్స్‌లు: 88 పట్టిన క్యాచ్‌లు: 88 తీసిన వికెట్లు: 2అప్పుడప్పుడు కొన్ని ‘హిట్స్’వన్డేల్లో రోహిత్ శర్మ పేరిట అసాధారణ రికార్డులు ఉన్నాయి... టి20ల్లో రెండు వరల్డ్ కప్ విజయాల్లో భాగం... కెపె్టన్‌గా రెండు ఐసీసీ టోర్నీలు నెగ్గిన ఘనత... కానీ వీటితో పోలిస్తే అతని టెస్టు కెరీర్ అంత ఘనంగా కనిపించదు. అక్కడక్కడ కొన్ని గుర్తుంచుకునే ప్రదర్శనలు వచ్చినా ఈ ఫార్మాట్లో రోహిత్ ఎప్పుడూ తనదైన ముద్ర వేయలేకపోయాడు. సరిగ్గా చెప్పాలంటే అతని టెస్టు కెరీర్ ఎప్పుడూ నిలకడ లేకుండా పడుతూ లేస్తూనే సాగింది. SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో కలిపి 25 టెస్టులు ఆడినా ఒకే ఒక శతకం ఉండటం అతని కెరీర్లో ఒక వైఫల్యం. అయితే ఈ విషయంలో అతను ఎప్పుడూ నిరాశ చెందలేదు. తనకు తెలిసిన ఆటను, తనదైన శైలిలోనే ఆడుకుంటూ పోయాడు తప్ప కొత్తగా ‘అత్యుత్తమ టెస్టు క్రికెటర్’ అనిపించుకోవాలనే తాపత్రయం, పట్టుదలను కనబర్చలేదు. టెస్టుల్లో మిడిలార్డర్ బ్యాటర్‌గా, ఆపై ఓపెనర్‌గా రెండు పార్శా్వల్లో అతని కెరీర్ సాగింది. ఘనారంభం... 2010లో నాగపూర్‌లో దక్షిణాఫ్రికా టెస్టు... వీవీఎస్ లక్ష్మణ్ గాయం నుంచి కోలుకోకపోవడంతో రోహిత్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. అయితే మ్యాచ్ ఆరంభానికి కొద్దిసేపు ముందు వామప్‌లో భాగంగా ఫుట్‌బాల్ ఆడుతూ గాయపడటంతో మ్యాచ్ ఆడలేకపోయాడు. ఆ తర్వాత మరో మూడున్నరేళ్ల పాటు టెస్టు అవకాశం కోసం వేచి చూడాల్సి వచ్చిoది. 2013లో వెస్టిండీస్‌తో ఆడిన తొలి రెండు టెస్టుల్లో 177, 111 నాటౌట్ స్కోర్లతో తన రాకను ఘనంగా చాటాడు. అయితే ఆ తర్వాత ఆటలో పదును లోపించడంతో వైఫల్యాలు ఎదురయ్యాయి. అప్పుడప్పుడు అనూహ్యంగా వచ్చిన అవకాశాలను కూడా వాడుకోలేకపోయాడు. తర్వాతి ఐదేళ్లలో 23 టెస్టులు ఆడితే ఒకే ఒక సెంచరీ సాధించాడు! బౌన్సీ పిచ్‌లపై అతని అవసరం ఉందంటూ సెలక్టర్లు ఆ్రస్టేలియాలో రెండు టెస్టులు ఆడించగా ఒక అర్ధసెంచరీ చేశాడు. ఓపెనర్‌గా చెలరేగి... వన్డేల్లో ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ అయిన రోహిత్ ను టెస్టుల్లోనూ ఓపెనర్‌గా ప్రయత్నించవచ్చని కోచ్ రవిశాస్త్రి చేసిన సూచన రోహిత్ కెరీర్‌ను మార్చింది. తన అమ్మ ఊరు విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై ఓపెనర్‌గా ఆడిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో 176, 127 పరుగులు చేసి కొత్త రోహిత్ పరిచయమయ్యాడు. అదే సిరీస్‌లో చేసిన 212 పరుగులు అతని కెరీర్లో ఏకైక డబుల్ సెంచరీ. ఓపెనర్‌గానే 43 టెస్టుల్లో 2697 పరుగులు సాధించిన అతను 9 శతకాలు నమోదు చేసి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఓవల్‌లో సత్తా చాటి... చెన్నైలో స్పిన్‌తో గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై 161 (ఇంగ్లండ్‌పై) స్వదేశంలో అతని చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్. అయితే రోహిత్ కెరీర్లో హైలైట్‌గా నిలిచిన ఇన్నింగ్స్‌లో 2021 ఓవల్ మైదానంలో వచ్చింది. ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యం కోల్పోయిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతూ అతను చేసిన 127 పరుగులు జట్టును గెలిపించాయి. భారత్‌కు 24 టెస్టుల్లో రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించగా జట్టు 12 మ్యాచ్‌లు గెలిచి 9 ఓడింది. 2023 వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్లో టీమిండియాను ఫైనల్ చేర్చడం అతని నాయకత్వంలో అత్యుత్తమ ప్రదర్శన. – సాక్షి క్రీడా విభాగం
బిజినెస్

బంగారం మళ్లీ లక్ష పైకి
న్యూఢిల్లీ: పసిడి మరోసారి రూ.లక్ష మార్క్‌పైకి చేరింది. ఇటీవలే మొదటిసారి రూ.లక్ష దాటిన తర్వాత అమ్మకాల ఒత్తిడితో పుత్తడి ఆ స్థాయిని కోల్పోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో బంగారానికి మళ్లీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా 99.9 శాతం స్వచ్ఛత బంగారం బుధవారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,00,750 స్థాయిని చేరుకుంది. పాకిస్తాన్–భారత్ మధ్య ఉద్రిక్తతలతో కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,050 పెరిగి రూ.1,00,350 స్థాయికి చేరింది. ఏప్రిల్ 22న పసిడి రూ.1,01,600 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేయడం గుర్తుండే ఉంటుంది. మరోవైపు వెండి కిలోకి రూ.440 పెరిగి రూ.98,940 స్థాయిని సమీపించింది. అంతర్జాతీయ మార్కెట్లో భిన్నమైన పరిస్థితి కనిపించింది. బంగారం 25 డాలర్ల నష్టంతో 3,397 డాలర్ల వద్ద ఉంది. యూస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయాలకు ముందు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అనుసరించినట్టు తెలుస్తోంది. ‘వాణిజ్య చర్చల్లో పురోగతిపై ఆశలతో మళ్లీ రిస్కీ ఆస్తులవైపు మార్కెట్లు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ మధ్య ప్రాచ్యం, రష్యా–ఉక్రెయిన్, భారత్–పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతుంది’ అని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా పేర్కొన్నారు.

ప్రైవేటు పెట్టుబడులు తగ్గుముఖం!
న్యూఢిల్లీ: ప్రైవేటు మూలధన వ్యయాలు (పెట్టుబడులు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం మేర తగ్గిపోవచ్చని కేంద్ర ప్రభుత్వ సర్వే అంచనా వేసింది. రూ.4.88 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ నిర్వహించిన ‘ఫార్వార్డ్ లుకింగ్ సర్వే’ తెలిపింది. 2024–25లో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు రూ.6.56 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 2023–24లో రూ.4.22 లక్షల కోట్లు కాగా, 2022–23లో రూ.5.72 లక్షల కోట్లు, 2021–22లో రూ.3.94 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఈ సర్వే నివేదిక వెల్లడించింది. వీటి ప్రకారం 2021–22 నుంచి 2024–25 మధ్య కాలంలో మొత్తం మీద ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు 66.3 శాతం పెరిగా యి. 2021–22లో ఒక్కో సంస్థ గ్రాస్ ఫిక్స్డ్ అస్సెట్ (జీఎఫ్ఏ) రూ.3,151 కోట్లుగా ఉంది. ఇది 2022–23లో రూ.3,279 కోట్లకు (4 శాతం వృద్ధి).. 2023–24లో రూ.4,183 కోట్లకు (27 శాతం వృద్ధి) పెరిగింది. విద్యుత్, గ్యాస్, స్టీమ్, ఎయిర్ కండీషనింగ్ సప్లై విభాగంలో ఒక కంపెనీ నుంచి అత్యధిక జీఎఫ్ఏ రూ.14,000 కోట్లుగా ఉంది. 2021–22లో ఒక్కో సంస్థ సగటున రూ.109 కోట్లను మూలధన వ్యయాలపై వెచ్చించింది. 20 22–23లో ఇది రూ.149 కోట్లు, 2023–24లో రూ. 1.07 కోట్లు, 2024–25లో రూ.172 కోట్ల చొప్పున ఉన్నాయి. తయారీ రంగం నుంచి 43.8 % మూ లధన వ్యయాలు ఉంటే.. ఐటీ నుంచి 15.6 %, రవాణా, స్టోరేజీ నుంచి 14 % చొప్పున ఉన్నాయి. వృద్ధి కోసమే పెట్టుబడులు.. ప్రస్తుత ఆస్తుల విలువను పెంచుకోవడంపై పెట్టుబడులకు 28.4 శాతం కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. 11.5 శాతం సంస్థలు అవకాశాలను విస్తృతం చేసుకోవడంపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఆదాయ వృద్ధి కోసం 2024–25లో మూలధన వ్యయాలు చేసినట్టు 49.6 శాతం ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు తెలిపారు. 30.1 శాతం సంస్థలు సామర్థ్యాల పురోగతికి, 2.8 శాతం సంస్థలు వైవిధ్యంపై పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించాయి.

టారిఫ్‌లకు రెండు వైపులా పదును
న్యూఢిల్లీ: టారిఫ్‌లనేవి రెండువైపులా పదునున్న కత్తిలాంటివని హెచ్‌సీఎల్ గ్రూప్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. అమెరికాలాంటి పెద్ద మార్కెట్లలో టారిఫ్ ప్రభావిత పరిశ్రమలు నెమ్మదించినా వాటికి సేవలు కొనసాగించాల్సి రావడం ఒకెత్తైతే, టారిఫ్‌లవల్ల వ్యయాలు పెరగకుండా చూసుకోవడం మరో ఎత్తవుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇవన్నీ కూడా భారతీయ ఐటీ కంపెనీలు కొత్త వ్యాపారావకాశాలను దక్కించుకునేందుకు కూడా తోడ్పడవచ్చని, ఇందుకు టెక్నాలజీ ఉపయోగపడగలదని ఆమె తెలిపారు. అమెరికా టారిఫ్‌ల ప్రభావం నేరుగా ఐటీ సంస్థలపై పడకపోయినా, అవి సేవలందించే మార్కెట్లలో పరిశ్రమలు మందగించడం వల్ల పరోక్షంగా దెబ్బతినొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో రోష్ని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టారిఫ్‌లు, డీగ్లోబలైజేషన్లాంటి భౌగోళికరాజకీయాంశాలు ఐటీ సేవలపై ప్రభావం చూపొచ్చని ఇటీవలే ఆరి్థక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సి. విజయకుమార్ కూడా తెలిపారు.

హైదరాబాద్‌లో 5% పెరిగిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి త్రైమాసింకంలో 5 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర 2024 డిసెంబర్ త్రైమాసికం చివరికి రూ.7,053గా ఉంటే, 2025 మార్చి చివరికి రూ.7,412కు చేరుకుంది. ఎంఎంఆర్, ఢిల్లీ–ఎన్సీఆర్, పుణె, చెన్నై నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగగా.. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతాలో ధరలు 4–5 శాతం మధ్య పెరిగినట్టు ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడించింది. ఇళ్ల ధరలు గత కొన్నేళ్ల నుంచి ఏటా పెరుగుతూ వచ్చాయని.. ఆ పెరుగుదల వేగం ఇటీవలి త్రైమాసికాల్లో నిదానించినట్టు తెలిపింది. 2022–24 మధ్య ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగిన అనంతరం.. మోస్తరు స్థాయికి చేరడంతో వినియోగ డిమాండ్‌కు ఊతమిస్తుందని పేర్కొంది. టాప్–8 నగరాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 19 శాతం తక్కువగా 98,095 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్ టైగర్ గత నెలలో విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం గమనార్హం. గత కొన్ని త్రైమాసికాలుగా ఇళ్ల ధరల పెరుగుదల మోస్తరుగా ఉండడం మార్కెట్ స్థిరపడినట్టు సంకేతమిస్తోందని హౌసింగ్ డాట్ కామ్, ప్రాప్ టైగర్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. ధరలు తగ్గడం నిజమైన కొనుగోలుదారులకు ప్రేరణనిస్తుందని బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేడి అభిప్రాయపడ్డారు. నగరాల వారీగా ధరలు.. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల ధర చదరపు అడుగుకు రూ.12,600గా ఉంది. → ఢిల్లీ–ఎన్సీఆర్లోనూ ఎలాంటి మార్పు లేకుండా రూ.8,106, చెన్నైలో 7,173, పుణెలో రూ.7,109 చొప్పున చదరపు అడుగు ధర మార్చి త్రైమాసికంలో ఉంది. → అహ్మదాబాద్‌లో చదరపు అడుగు ధర డిసెంబర్ చివరికి రూ.4,402గా ఉంటే, మార్చి చివరికి రూ.4,568కి చేరింది. → బెంగళూరులో ఇళ్ల ధర చదరపు అడుగుకు రూ.7,536 నుంచి రూ.7,881కి చేరింది. → కోల్‌కతాలో రూ.5,633 నుంచి రూ.5,839కి పెరిగింది.
ఫ్యామిలీ

గుడ్ ఫార్మర్ స్టాన్లీ..!
అమెరికా తొలి గుడ్ ఫార్మర్ అవార్డుకు మహిళా సేంద్రియ రైతు క్లారెండా ‘ఫార్మర్ సీ’ స్టాన్లీ ఎంపికయ్యారు. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రసిద్ధ రోడేల్ ఇన్స్టిట్యూట్, డావైన్స్ గ్రూప్ సంయుక్తంగా ఈ పురస్కార ప్రదానానికి శ్రీకారం చుట్టటం విశేషం. పదేళ్లకు మించకుండా పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం (రీజనరేటివ్ ఆర్గానిక్ అగ్రికల్చర్)ను ఆచరిస్తూ, పర్యావరణానికి, సమాజానికి ఉత్తమ సేవలు అందించిన ఆదర్శ కృషీవలురికి ఈ పురస్కారం ఇవ్వటం ఈ ఏడాది ప్రారంభించామని అమెరికాలో 1947 నుంచి సేంద్రియ వ్యవసాయ పరిశోధనలకు పట్టుకొమ్మ అయిన రోడేల్ ఇన్స్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జెఫ్ ట్రాక్ అన్నారు. ‘స్టాన్లీ తన గ్రీన్ హెఫ్ఫ ఫామ్స్‌లో చేస్తున్న పని తన వ్యవసాయ క్షేత్రాన్ని సుసంపన్నం చేయటంతోపాటు కొత్త తరం రైతులకు ప్రేరణగా నిలుస్తోంది. తొట్టతొలి ద గుడ్ ఫార్మర్ అవార్డ్ యుఎస్ పురస్కారాన్ని ప్రదానం ఆమెకు ప్రదానం చేయటం గర్వంగా ఉంది’ అన్నారాయన. నార్త్ కరోలినలో గ్రీన్ హెఫ్ఫ ఫామ్స్‌ను నిర్వహిస్తున్న స్టాన్లీ సేంద్రియ విలువల పట్ల నిబద్ధతతో వ్యవసాయం చేస్తున్న హెర్బలిస్టు. రీజెనరేటివ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఆర్థిక ప్రగతితోపాటు, సమానత్వం, విద్య, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న విశేష కృషికి గాను ఆమెను పురస్కారం వరించింది. 20 రాష్ట్రాల నుంచి సుమారు వంద దరఖాస్తులు రాగా స్టాన్లీని జ్యూరీ ఎంపికచేసింది. ఈ పురస్కారం కింద పది వేల డాలర్ల నగదును, జ్ఞాపికను అందజేస్తారు. స్టాన్లీ విలువైన ఔషధ మొక్కలను, తేయాకును పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నారు. కొత్తగా సేద్యవృత్తిని చేపట్టిన వారికి ఆమె శిక్షణ ఇస్తున్నారు. చారిత్రకంగా అణగారిన వర్గాల బడుగు వారికి ఆమె ప్రాధాన్యం ఇస్తారు. నేలను సేంద్రియ పద్ధతుల్లో పునరుజ్జీవింపజేసుకుంటూనే పంటలు పండిస్తూ ఈ వ్యవసాయం ఆర్థికంగానూ, పర్యావరణపరంగా, ఆహార భద్రతాపరంగానూ గిట్టుబాటు వ్యవహారమే అని స్టాన్లీ నిరూపించుకున్నారు. ‘గ్రీన్ హెఫ్ఫ ఫామ్స్‌లో మేం అనుసరిస్తున్న సాగు పద్ధతికి ఈ పురస్కారం వెన్నుతట్టింది. ఈ క్షేత్రంలో మేం పంటలను మాత్రమే పండించటం లేదు, పరివర్తనను పెంపొందిస్తున్నాం’ అన్నారు స్టాన్లీ సంతోషంగా. డావైన్స్ గ్రూప్ ఐదేళ్ల క్రితం ఇటలీలోని పర్మలోయూరోపియన్ రీజెనరేటివ్ ఆర్గానిక్ సెంటర్‌ను రోడేల్ ఇన్స్టిట్యూట్ తోడ్పాటుతో నెలకొల్పింది. అక్కడ జరిగే సభలో స్టాన్లీకి పురస్కార ప్రదానం జరుగుతుంది. ఆమె రాకపోకల ఖర్చులన్నీ డావైన్స్ గ్రూప్ భరిస్తుంది. ఆమె తమ దేశానికి రావటం వల్ల రీజనరేటివ్ ఆర్గానిక్ వ్యవసాయ స్ఫూర్తి తమ ప్రాంత రైతులకు ప్రేరణ కలిగిస్తుందని భావిస్తున్నామని డావైన్స్ గ్రూప్ సంతోషిస్తోంది. పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం చేయటంతోపాటు.. పండించిన ఆహారాన్ని తినిపించి వ్యాధులు నయం చేసే ఆసుపత్రిని పొలంలోనే నిర్వహించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్న స్టాన్లీ సింగిల్ వుమన్ ఫార్మర్ కావటం మరో విశేషం. (చదవండి: మెగా గుమ్మడి!)

మెగా గుమ్మడి!
దక్షిణాఫ్రికాలోని కల్లినన్ ప్రాంత రైతు సంఘం ప్రతి ఏటా గుమ్మడికాయల పోటీ పెడుతుంటుంది. కార్నెలి బెస్టర్ అనే రైతు ఈ ఏడాది 445 కిలోల గుమ్మడి ఫస్ట్ ప్రైజ్ గెల్చుకున్నారు. ఈ అవార్డు ఆయనకు కొత్త కాదు. గత ఏడాది ఏకంగా 730 కిలోల గుమ్మడితో ఆయనే ఫస్ట్ ప్రైజ్ గెల్చుకోవటం విశేషం. ఏడాదిలో అతిపెద్ద గుమ్మడి సైజు అంత ఎందుకు తగ్గిందో తెలీదు. బహుశా భూతాపోన్నతి కావచ్చు. అదలా ఉంచితే, 2023లో ఇంకా బరువైన గుమ్మడి కాయను పండించిన వైకస్ లాంప్రెచ్ట్ విజేతగా నిలిచారు. ఆయన గుమ్మడి కాయ బరువెంతో తెలిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది.. 890 కిలోలు! వ్యవసాయం పట్ట మక్కువను పెంపొందించే లక్ష్యం తోపాటు నిధుల సమీకరణ కోసం కల్లినన్ రైతు సంఘం ఈ వార్షిక ΄ోటీలు పెడుతుంటుంది. అట్లాంటిక్ జెయింట్ గుమ్మడితో సంకపరచిన వంగడంతో సాగు చేసిన కాయలనే ఇక్కడ పోటీలో ఉంచుతారు. పోటీ ముగిసిన తర్వాత ప్రిటోరియా నగరంలో పేదలకు ఈ గుమ్మడి కాయలను పంచుతారు! (చదవండి: దిల్ మ్యాంగో మోర్..! నోరూరించే వెరైటీ మ్యాంగ్ డెజర్ట్స్..)

బ్యూటీ విత్ పర్పస్..
నగర వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల గురించి విధితమే. అయితే ప్రతి అంశానికి, కార్యక్రమానికి విధిగా నియమావళి ఉన్నట్లే మిస్ వరల్డ్ పోటీలకు సైతం నియమాలు, అర్హతలు, తదితర అంతర్జాతీయ అంశాలు ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఈ పోటీలకు సంబంధించిన నియమాలు, పోటీల్లో పాల్గొనే వారి అర్హతలు తదితర అంశాల గురించి ఆరా తీస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాల కోసం గూగుల్‌ను సైతం ఆశ్రయిస్తున్నారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన నియమావళి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక అందగత్తెల పోటీగా మిస్ వరల్డ్ పరిచయమైంది. మిస్ వరల్డ్ పోటీ అనేది కేవలం అందాన్ని ఆరాధించడమే కాక, వ్యక్తిత్వం, సామాజిక బాధ్యతలు, సామాజిక చైతన్యాన్ని కూడా ప్రోత్సహించే గొప్ప వేదిక. ఇది ప్రతి మహిళకూ తన ప్రతిభను ప్రపంచానికి చూపించేందుకు ఒక గొప్ప అవకాశం కలి్పస్తుంది. 1951లో ప్రారంభమైన ఈ పోటీ ద్వారా.. ప్రతి యేటా వివిధ దేశాల మహిళలు తమ అందం, ప్రతిభ, సామాజిక బాధ్యత, వ్యక్తిత్వం ఆధారంగా ప్రపంచానికి పరిచయమవుతారు. మిస్ వరల్డ్ పోటీని నిర్వహించే ప్రతిపాదనలు, నియమాలు, అర్హతలు, అంతర్జాతీయ అంశాలు విస్తృతంగా ఉంటాయి. నియమాలు, నిబంధనలు.. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉంటాయి. మొత్తం 140కు పైగా దేశాలు ఈ పోటీలో ప్రతినిధులను పంపిస్తాయి. ఇందులో ప్రతి దేశం తమ దేశంలో ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది, విజేతలు ఎంట్రీ పాసులు పొందుతారు. పోటీలో పాల్గొనడానికి మహిళలు వారి వయసు కనీసం 18 సంవత్సరాలు పూర్తయ్యి ఉండాలి. గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు, అంటే 27వ సంవత్సరంలోకి ప్రవేశించే వారు పోటీలో పాల్గొనలేరు.ఇవే అర్హతలు.. జాతీయత : ప్రతి దేశం తన తరపున ఒక్క మహిళను పంపిస్తుంది. ఆ మహిళ ఆ దేశం సిటిజన్‌గా ఉండాలి. భాష : అభ్యర్థులు ఆంగ్ల భాషలో మాట్లాడగలిగితే అది వారి పోటీ కోసం అనుకూలంగా ఉంటాయి. విద్య, సామాజిక బాధ్యత : మహిళలకు సాధారణంగా మంచి విద్య ఉండాలి. అలాగే వారి సామాజిక బాధ్యతలు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ముఖ్యం.అంతర్జాతీయ అంశాలు.. మిస్ వరల్డ్ పోటీ కేవలం అందం మాత్రమే కాక, సామాజిక, సాంస్కృతిక, శక్తివంతమైన అంశాలపై దృష్టి సారిస్తుంది. ప్రతి ఏడాది పోటీ ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే థీమ్ ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందులో అభ్యర్థులు ప్రపంచవ్యాప్తంగా తమ కమ్యూనిటీలకు సహాయం చేసే విధంగా వనరులను ఉపయోగిస్తారు. వాటిలో విద్య, ఆరోగ్యం, మహిళల హక్కులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు ముఖ్యంగా ఉంటాయి.ప్రత్యేక అంశాలు.. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడం స్నేహపూర్వక పోటీ మాత్రమే కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పరిచయమవ్వడానికి కూడా ఒక మార్గం. అభ్యర్థులు వివిధ ప్రదర్శనల్లో పాల్గొని, ప్రపంచంలోని వివిధ సాంస్కృతిక నేపథ్యాలను అంగీకరిస్తారు. ఇదే కాకుండా, వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, సాంకేతికంగా కూడా సమాజానికి అవసరమైన మార్పు తీసుకురావడంలో శక్తిమంతంగా వ్యవహరిస్తారు.

దిల్ మ్యాంగో మోర్..! నోరూరించే వెరైటీ మ్యాంగ్ డెజర్ట్స్..
విదేశీ ట్రెండు నుంచి సీజనల్‌గా వచ్చే పండు దాకా కాదేదీ మిక్సింగ్‌కు అనర్హం అంటున్నారు నగర నలభీములు. అసలే మామిడి సీజన్ అందులోనూ వెరైటీలు కోరుకునే నగరవాసులు.. ఇంకేం ఉంది.. నగరంలోని రెస్టారెంట్స్, కేఫ్స్, పార్లర్స్.. మ్యాంగో మానియాతో ఊగిపోతున్నాయి. పోటా పోటీగా మామిడిని రకరకాల వంటకాలకు జతచేస్తూ మెనూలను రూపొందిస్తున్నాయి. ఆ విశేషాలు ఇవిగో.. జూబ్లీ హిల్స్‌లోని లిల్లీస్ – ది బోహో కేఫ్ మామిడి ఆధారిత డెజర్ట్స్‌ను అందిస్తోంది. అలాగే కొబ్బరి పాలు, తాజా మామిడి ముక్కలు, హోమ్మేడ్ గ్రానోలాతో మామిడి చియా పుడ్డింగ్‌ను వడ్డిస్తోంది. బ్రియోష్ బ్రెడ్, మామిడి కంపోట్, కొబ్బరి క్రీమ్‌తో మామిడి ఫ్రెంచ్ టోస్ట్‌తో నోరూరిస్తోంది. అరటి, ఖర్జూరాలతో తయారు చేసిన మామిడి స్మూతీ బౌల్, మామిడి ఫ్రాప్పే, మామిడి ప్యాషన్, ఫ్రూట్ కూలర్ వంటి పానీయాలు కూడా అందుబాటులోకి తెచ్చింది. పదుల సంఖ్యలో.. బంజారా హిల్స్‌లోని ఖండానీ రాజధాని ‘ఆమ్లీíÙయస్’ పేరిట అందిస్తున్న ఫుడ్ ఫెస్టివల్లో పదుల సంఖ్యలో మామిడి వంటకాలు కొలువుదీరాయి. కైరీ చనా దాల్ ధోక్లా, మామిడి కోఫ్తా పులావ్, మలబారి మామిడి కఢీ, మామిడి పచ్చడి, మామిడి రైతాలతో పాటుగా మామిడి జిలేబి, మామిడి బాసుందీ వంటి డెజర్ట్స్ కూడా ఇందులో భాగమే. నాన్‌వెజ్ స్టార్టర్స్‌లో.. గచ్చిబౌలోని 3.63 డిగ్రీస్ సమర్పిస్తున్న ‘మామిడి మానియా’ ఫెస్టివల్లో మామిడి చికెన్ వింగ్స్, మామిడి ల్యాంబ్ చాప్స్, మామిడి క్రిస్పీ ఫిష్ వంటి స్టార్టర్లు. మామిడి దాల్, మామిడి అనాస పులావ్, మామిడి చికెన్ కర్రీ వంటి వాటితో మెయిన్ కోర్సులు, ఆమ్రస్ ఫౌంటెన్‌తో కూడిన డెజర్ట్స్ అందిస్తోంది. డెజర్ట్స్, మెయిన్ కోర్సులు.. జూబ్లీహిల్స్‌లోని ప్యూర్ వెజిటేరియన్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ తత్వాలో.. ఆమ్రఖండ్, మామిడి మిలే ఫ్యూయిల్, మామిడి కులీ్ఫ, మామిడి టార్ట్ వంటి తీపి రుచులను అందిస్తున్నారు. మాధాపూర్‌లోని వెస్టిన్ హోటల్ అందిస్తున్న ‘మామిడి బ్రంచ్’లో మామిడి గిలాఫీ, మాహీ అండ్ కచ్చే, మామిడి సుషీ, మామిడి చికెన్ సౌవ్లాకీ వంటి స్టార్టర్లు. మామిడి క్రేప్స్, దసేరి ఆమ్, ముర్గ్ కే పసందే, మామిడి చికెన్ సౌవ్లాకీ వంటి మెయిన్ కోర్స్‌లు ఉన్నాయి. అలాగే మామిడి స్రూ్టడెల్, మామిడి గటో, మామిడి శ్రీఖండ్, మామిడి పాయసం వంటి డెజర్ట్స్..ను సర్వ్ చేస్తోంది. డియరెస్ట్..డెజర్ట్స్.. మెయిన్ కోర్సు పూర్తయ్యాక డెజర్ట్స్ తినడం అలవాటుగా మారింది. మామిడిని మేళవిస్తూ అనేక డెజర్ట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చారి్మనార్ ప్రాంతంలోని మిలన్ జ్యూస్ సెంటర్లో రుచికరమైన మ్యాంగో మలాయ్, కోఠిలోని జోకొలెట్ కొత్తగా పరిచయం చేసిన మ్యాంగో డెజర్ట్, జూబ్లీహిల్స్‌లోని టారో రెస్టారెంట్లో శాఫ్రోన్ మ్యాంగో స్టిక్కీ రైస్, జూబ్లీహిల్స్‌లోని స్పైసీ వెన్యూ అందిస్తున్న మంగమ్మ మామిడి పుడ్డింగ్, టెగర్ లిల్లీ కేఫ్ బిస్ట్రో అందిస్తున్న మామిడి రసమలై ఫ్రెంచ్ టోస్ట్, బంజారాహిల్స్‌లోని ఫెరానోజ్లో మామిడి క్రోసెంట్ ఫ్రెంచ్ టోస్ట్.. ఇలా నగరం నలుమూలలా మామిడి తియ్యదనం పరుచుకుని దిల్ మ్యాంగో మోర్ అనిపిస్తోంది. ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో అంతో ఇంతో వంటకాలకు కలపడం సాధారణమే కానీ.. మ్యాంగో సీజన్లో భోజన ప్రియుల అభిరుచికి అనుగుణంగా మామిడి ఆధారిత వంటకాలను కలిగి ఉన్న ప్రత్యేక మెనూలను సిటీ వంటశాలలు తయారు చేస్తున్నాయి. స్టార్టర్స్‌తో మొదలుపెట్టి మెయిన్ కోర్స్, డిజర్ట్స్ దాకా.. ఆఖరికి సలాడ్లు కూడా వైవిధ్యభరిత వంటకాలెన్నో సిటీ రెస్టారెంట్స్‌లో సందడి చేయడం ఈ సారి విశేషంగా చెప్పొచ్చు. (చదవండి: కనుమరుగవుతున్న మామిడి వెరైటీలు ఇవే..! దొరికితే ఆస్వాదించేయండి..)
ఫొటోలు
అంతర్జాతీయం

పాక్ పీఎం యాక్షన్.. ఆర్మీ చీఫ్ నో యాక్షన్!
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ ‘యాక్టింగ్ కెప్టెన్’ పాత్రకు రెడీ అయ్యారు. భారత్‌తో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. భారత్ తమపై దాడి చేసిందని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామనీ అన్నారు. రైట్ టు రెస్పాండ్ హక్కు మాకూ ఉందన్నారు. ఈ మేరకు అత్యవసరం సమావేశం కూడా ఏర్పాటు చేశారు.ఆర్మీ చీఫ్ ఎక్కడ..?ఈ మేరకు హై లెవిల్ సెక్యూరిటీ మీటింగ్ కు పాక్ ప్రధాని షరీఫ్ పిలుపునిచ్చారు. అయితే దీనికి ఆ దేశ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ హాజరుకాలేదు. కనీసం మునీర్ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నడుమ మునీర్ ఎక్కడో కీలక ప్రాంతంలో దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తో యుద్ధాన్ని ఆర్మీ చీఫ్ మునీర్ వద్దనుకునే కీలక మీటింగ్ లకు దూరంగా ఉంటున్నాడనే వాదన కూడా తెరపైకి వచ్చింది.ఇప్పుడు పాక్ ప్రధాని షరీప్ కాస్త యాక్టింగ్ లోకి దిగుదామని ప్రయత్నిస్తున్నా అక్కడ సైన్యం పూర్తిగా సహకరించడం లేదనడానికి మునీఫ్ గైర్హాజరీనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం భారత్ పై తిరుగుబాటు చేస్తే పాక్ కే నష్టమని పలువురు దేశ, విదేశీ రాజకీయనాయకులు చెబుతున్న మాట. ఇదే ఫాలో అవుతున్నట్లున్నాడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. పాక్ లో అత్యంత శక్తివంతుడుగా విస్తృత ప్రచారంలో ఉన్న మునీర్.. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్లో పాక్ పెద్దలకు అర్థం కావడం లేదు. హైలెవిల్ మీటింగ్ కు రావాలని పాక్ భద్రతా దళాల అధికారులకు ప్రధాని ఆదేశాలు ఇచ్చిన తరుణంలో మునీర్ ఎందుకు దూరంగా ఉన్నట్లు. పాక్ పీఎం యాక్షన్ ప్లాన్ కు ఆ దేశ ఆర్మీ చీఫ్ నుంచి ఎటువంటి యాక్షన్ లేకపోవడం ఏంటనేది ఇప్పుడు ఆ దేశంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు..మునీర్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. తమ పార్టీ మాత్రం ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాల్లో పాల్గొదనే సంకేతాలిచ్చాడు. దాంతోనే ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీలోని పార్లమెంట్ సభ్యులు కూడా ప్రభుత్వంపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ కూడా కీలక సమయంలో పాక్ హ్యాండిచ్చాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తూ భారత్ వార్నింగ్ ఇచ్చిన మునీఫ్.. సరైన సమయానికి మాత్రం ఎస్కేపింగ్ ప్లాన్ చేసుకున్నట్లు కనబడుతోంది.మరో ముషారఫ్ రాజ్యం రాబోతుందా..?పాకిస్తాన్ లో ప్రభుత్వాలను కూల్చేసి ఆర్మీ చీఫ్ లు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గతంలో చూశాం. మరి మునీఫ్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అయితే మునీఫ్ అంత సీన్ లేదనే కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతం పాక్ లో ప్రభుత్వాన్ని మునీర్ కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకే సైలెంట్ మోడ్ లోకి మునీఫ్ వెళ్లాడని, ఇది పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్ కు మేలు చేయడం కోసమేనని పాక్ లోనే వినిపిస్తోంది. గతంలో పాక్ మాజీ సైనాకాధికారి ముషారఫ్.. సైన్యం మద్దతు విశేషంగా కూడగట్టుకుని పాక్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధ్యక్షుడయ్యాడు.ముషారఫ్.. 1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్ ఎగ్జిక్యూటివ్’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో గద్దె దిగక తప్పలేదు.

అక్కడ జరిగిందేమిటి?.. మీరు చేస్తున్నదేమిటి?
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల్ని ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల వేరివేత లక్ష్యంగా భారత్ ‘ ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. పాక్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసిన భారత్.. 90 మంది వరకూ టెర్రర్ మూకలను మట్టుబెట్టింది. అయితే భారత్ విజయవంతంగా పూర్తి చేసిన ఆపరేషన్ సిందూర్ పై చైనా మీడియా విషం కక్కింది. చైనాలోని గ్గోబల్ టైమ్స్’ అనే మీడియా సంస్థ ఆపరేషన్ సిందూర్ భారత్ విమానాలను పాక్ కూల్చిందంటూ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. కొన్ని పాత ఫోటోలను జత చేసి వాటిని ప్రస్తుత ఆపరేషన్ సిందూర్ కు ఆపాదించింది. దీనిపై చైనాలోని భారత్ ఎంబాసీ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అక్కడ జరిగింది ఏమిటి.. మీరు చేస్తున్నదేమిటి అంటూ మండిపడింది ఒక విషయాన్ని వార్త రూపంలో ప్రచురించేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని, దానికి మూలాలను అన్వేషించి వార్తలు వేయాలని గ్లోబల్ టైమ్స్ కు చురకలంటించింది. అక్కడా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తే మీరు దాన్ని వక్రీకరించడం తగదంటూ హితవు పలికింది. కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులు హతమయ్యారు.

పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటాం: అజిత్ దోవల్
ఢిల్లీ: ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశ్యం భారత్‌కు లేదని.. పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటామంటూ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తేల్చి చెప్పారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ ఎన్ఎస్ఏలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. రష్యా, ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతో దోవల్ చర్చించారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై ఇతర దేశాల మద్దతు కూడగట్టే క్రమంలో అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులు, కార్యదర్శులతోచర్చించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై తీసుకున్న చర్యలు.. ఆపరేషన్ నిర్వహించడానికి గల కారణాలను ఆ దేశాల ప్రతినిధులకు వివరించారు.కాగా, పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్పూర్తో పాటు లాహోర్ లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్ టు సర్ఫేస్’ మిసైళ్లను ప్రయోగించారు. దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్’ అంటూ భారత్ సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు.

Masood Azhar: ఆపరేషన్ సిందూర్‌పై జైషే చీఫ్ మసూద్ అజహర్ ఓవరాక్షన్
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌పై జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత మసూద్ అజహర్ లేఖ విడుదల చేశారు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు. ఆపరేషన్ సిందూర్‌పై నాకు భయం లేదు. నిరాశ లేదు. విచారం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, భారత్‌ను నాశనం చేస్తానంటూ లేఖలో ఓవరాక్షన్ చేశారు.ఆపరేషన్ సిందూర్‌లో జైషే మమ్మద్ స్థావరం పూర్తిగా నేలమట్టమయ్యింది. నామ రూపాల్లేకుండా పోయింది. ఇద్దరు మహిళా అధికారులు ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు నాయకత్వం వహించిన ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజహర్ కుటుంబలో 14 మంది మృతి చెందారు. మసూజ్ అజహార్ సోదరి,బావ,మేనల్లుడు సైతం ఉన్నారు.
జాతీయం

Jammu and Kashmir: దశాబ్దాలుగా నరమేధమే
అందాల కశ్మీరం ఉగ్రవాదులతో దశాబ్దాలుగా అగ్నిగుండంగా మారింది. 2000 నుంచి అక్కడ జరిగిన దాడులకు 700 మందికి పైగా భద్రతా సిబ్బంది, పౌరులు బలయ్యారు. వాటిలో ముఖ్యమైనవి.. 2000 మార్చి 21: అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ టెర్రరిస్టులు చెలరేగిపోయారు. అనంత్‌నాగ్ జిల్లా చట్టీసింగ్పురా గ్రామంలో 36 మంది సిక్కులను కాల్చి చంపారు. ∙ 2000లోనే అమర్నాథ్ యాత్రికులపై పహల్గాం బేస్ క్యాంప్ వద్ద జరిగిన ఉగ్ర దాడిలో 32 మంది మరణించారు. ∙ 2001లో 13 మంది, 2002లో 11 మంది అమర్నాథ్ యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ∙ 2001 అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ప్రాంగణంపై జరిగిన ఆత్మాహుతి దాడికి 36 మంది బలయ్యారు. ∙ 2002లో జమ్మూ–శ్రీనగర్ హైవేపై ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు భద్రతా సిబ్బందితో పాటు 19 మంది మరణించారు. ∙ 2003లో పుల్వామా జిల్లా నందిమార్గ్‌లో 24 మంది కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ∙2014: ఉరిలో ఆత్మాహుతి దాడికి దిగి 17 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. ∙2015: కథువా పోలీస్ స్టేషన్‌పై దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. ∙2016: ఉరిలో సైనిక క్యాంపుపై దాడికి తెగబడి 18 మంది సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు. ∙2017లో అమర్నాథ్ యాత్ర నుంచి తిరిగొస్తున్న భక్తులపై కాల్పుల్లో 18 మంది మరణించారు. ∙2019: పుల్వామాలో సీఆరీ్పఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడికి 40 మంది జవాన్లు బలయ్యారు. ∙2025 ఏప్రిల్ 22: బైసారన్‌లో 26 మంది పర్యాటకులను కాల్చిచంపారు.

Operation Sindoor: ఆ 9 లక్ష్యాలు ఇవే..
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ కోసం ఎంపిక చేసిన 9 లక్ష్యాలను పక్కాగా సేకరించిన నిఘా సమాచారం ఆధారంగా సైన్యం నిర్ణయించుకుంది. ఇవన్నీ ఆరోగ్య కేంద్రాలు తదితర ముసుగుల్లో నడుస్తున్నాయి. వీటిని కచ్చితంగా గుర్తించడం మన నిఘా వర్గాలకు సవాలుగా నిలిచింది. ఈ ఉగ్ర కేంద్రాలు, శిబిరాలను బయటి ప్రపంచం దృష్టి నుంచి దాచి ఉంచేందుకు పాక్ ప్రభుత్వం, సైన్యం అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటాయి. ఇందుకోసం ఎప్పటికప్పుడు వాటి గుర్తింపులు మార్చడం వంటి పనులు చేస్తుంటాయి. పాకిస్తాన్ భూభాగంలో ఉన్నవి (4) 1: మర్కజ్ సుభాన్జైషే మహ్మద్ ప్రధాన స్థావరం. అంతర్జాతీయ సరిహద్దులకు 100 కి.మీ. దూరంలో పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో బహావల్పూర్ సమీపంలో నరోవల్ జిల్లా తెహ్రా కలాన్ గ్రామంలో ఉంది. ఉగ్రవాదుల చేరిక, శిక్షణ వంటివి ఇక్కడ జరుగుతాయి. జైషే చీఫ్ మసూద్ అజర్ ఇక్కడినుంచే కార్యకలాపాలు సాగిస్తుంటాడు. భద్రతా దళాలకు చిక్కిన అతన్ని 1999లో జైషే ఉగ్రవాదులు ప్రయాణికుల విమానాన్ని హైజాక్ చేసి విడిపించుకున్నారు. అజర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్ తదితర అగ్ర నేతల నివాసాలు తదితరాలూ ఇక్కడే ఉన్నాయి. ప్రస్తుతం ఇది అస్గర్ కనుసన్నల్లో నడుస్తోంది. సరిహద్దుల గుండా ముష్కరులు చొరబడేందుకు అనువైన ప్రాంతాలను ఇక్కడినుంచే గుర్తించడం, అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సొరంగాలు తవ్వడం జేషేకు నిత్యకృత్యం. అంతేగాక డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలు, డ్రగ్స్ వంటివి పంపే లాంచ్‌ప్యాడ్ కూడా ఇదే. 2000లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2001లో పార్లమెంటుపై దాడి మొదలుకుని 2019లో 40 మంది సీఆరీ్పఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడుల దాకా ప్లానింగ్ జరిగిందిక్కడే. 2: మర్కజ్ తొయిబా‘టెర్రర్ ఫ్యాక్టరీ’గా పేరు పొందింది! నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో లాహర్ సమీపంలో మురిద్కేలో ఉంది. ఇది హఫీజ్ సయీద్ నేతత్వంలో పని చేసే లష్కరే తొయిబా ప్రధాన కేంద్రం. దానికి ఆయువుపట్టు కూడా. 1990లో ఉనికిలోకి వచ్చింది. నిత్యం కనీసం 1,000 మంది రిక్రూట్లకు ఇక్కడ 2 వారాల ప్రాథమిక కోర్సు నడుస్తుంటుంది. అందులో భాగంగా శారీరక, మతోన్మాద శిక్షణ ఇస్తారు. ముంబై ఉగ్ర దాడుల కుట్ర పురుడు పోసుకుంది ఇక్కడే. వాటికి పాల్పడ్డ కసబ్ బృందానికి దౌరా–ఎ–నిబ్బత్ (నిఘా) సంబంధిత శిక్షణ ఇక్కడే ఇచ్చారు. ముంబై దాడుల సూత్రధారులు డేవిడ్ హెడ్లీ, తహవ్వుర్ రాణా కూడా ఇక్కడ శిక్షణ పొందారు. ఇక్కడ ‘అతిథి గృహం’నిర్మాణానికి అప్పటి అల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ రూ.10 లక్షలిచ్చాడు. జమ్మూ కశ్మీర్‌తో పాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల బాంబు పేలుళ్లు లష్కరే పనే. 3: సర్జాల్ అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 6 కి.మీ. దూరంలో సియాల్కోట్లో ఉంది. గత మార్చిలో నలుగురు జమ్మూ కశ్మీర్ పోలీసు సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు శిక్షణ పొందింది ఇక్కడే. 4: మెహమూనా జోయా అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 12 కి.మీ. దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉంది. హిజ్బుల్‌కు కీలక శిక్షణ కేంద్రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముసుగులో పని చేస్తోంది. జమ్మూలోని కథువా ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే కార్యకలాపాలకు ఇది కంట్రోల్ సెంటర్‌గా వ్యవహరిస్తోంది. పఠాన్‌కోట్ వైమానిక బేస్‌పై దాడుల వంటివాటికి ఇక్కడినుంచే వ్యూహరచన జరిగింది. జమ్మూ నగరంలో పలు ఉగ్ర దాడులకు కారకుడైన ఇర్ఫాన్ టండా ఈ కేంద్రానికి సారథి. పీఓకేలో ఉన్నవి (5) 5: అహ్నే హదీత్ (బర్నాలా) క్యాంప్ నియంత్రణ రేఖకు 9 కి.మీ. దూరంలో భీంబర్ వద్ద ఉంది. ఆయుధాల వాడకంతో పాటు అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ) తయారీలో ఇక్కడ శిక్షణ ఇస్తారు. 150 మంది దాకా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వగలదు. 6: మర్కజ్ తొయిబాలష్కరే తొయిబా ముఖ్య కేంద్రాల్లో ఒకటి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో తాంగ్దార్ సెక్టర్లో ఉంది. కీలక ఉగ్ర శిక్షణకు ఇఎది కేంద్రం. ముంబైపై 26/11 దాడులకు తెగబడ్డ అజ్మల్ కసబ్ ఉగ్రవాద బృందం పూర్తిస్థాయి శిక్షణ పొందింది ఇక్కడే. ఇది 2000లో పుట్టుకొచ్చింది. పాక్ సైనిక, ఐఎస్ఐ అధికారులు ఇక్కడికి నిత్యం వస్తూ పోతూ ఉంటారు. ఏకకాలంలో 250 మందికి పైగా ఉగ్రవాదులు ఉండేందుకు ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయి. ఇక్కడినుంచి వారు ప్రధానంగా ఉత్తర కశ్మీర్లోకి చొరబడుతుంటారు. కొత్తగా చేర్చుకున్న వారికి మత, ఉగ్రవాద శిక్షణ కూడా ఇక్కడ అందుతుంది. పహల్గాంలో ఉగ్రవాదులపై దాడులకు తెగబడింది ఇక్కడినుంచి చొరబడ్డ ఉగ్రవాదులే! 2024లో కశ్మీర్‌లోని సోన్మార్గ్, గుల్మార్గ్లో భద్రతా బలగాలు, పౌరులపై దాడులు కూడా వారి పనే. 7: గుల్పూర్ క్యాంప్నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో కోట్లిలో ఉంది. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఆపరేట్ చేసే లష్కరే ఉగ్రవాదులకు బేస్. పూంచ్ 2023 దాడులు, 2024లో యాత్రికులపై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ ఈ శిబిరానికి తరచూ వచ్చి రిక్రూటీలకు మతోన్మాద ప్రసంగాలిచ్చేవాడు. 8: అబ్బాస్ క్యాంప్ నియంత్రణ రేఖకు 13 కి.మీ. దూరంలో కోట్లీలో ఉంది. లష్కరే ఆత్మాహుతి బాంబర్లకు ప్రధాన కేంద్రం. 150 మందికి పైగా ఉగ్రవాదులకు ఏకకాలంలో శిక్షణ ఇచ్చేందుకు వసతులున్నాయి. పూంచ్, రాజౌరీల్లో చొరబాట్లు, ఉగ్ర దాడులకు వ్యూహరచన మొత్తం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక్కడి వ్యవహారాలు చూసేది క్వారీ జరార్. జేషే చీఫ్ మసూద్ సోదరుడైన అస్గర్‌కు సన్నిహితుడు. పలు ఎన్ఐఏ కేసుల్లో జరార్ ప్రధాన నిందితుడు. హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణ కేంద్రం కూడా ఇక్కడే ఉంది. బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ)తో పాటు స్నైపర్ దాడులు తదితరాలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. 9: సయీద్నా బిలాల్ క్యాంప్జైషే ఉగ్ర శిబిరం. ముజఫరాబాద్‌లో ఉంది. తొలుత ఉగ్ర సామగ్రి నిల్వ కేంద్రం. తర్వాత ఆధునీకరించి ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాల వాడకం, అడవులు, ప్రతికూల పరిస్థితుల్లో సుదీర్ఘకాలం ఉండటం తదితరాల్లో శిక్షణ ఇచ్చే కేంద్రంగా మార్చారు. నిత్యం కనీసం 100 మందికి పైగా ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. పాక్ సైన్యానికి చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ వీరికి నేరుగా శిక్షణ ఇస్తుంది!

పాక్ సైన్యం కర్కశ కాల్పులు
జమ్మూ/శ్రీనగర్/పూంచ్: ఉగ్రస్థావరాలపై భారత్ దాడి తర్వాత బరితెగించిన పాకిస్తాన్ సైన్యం సరిహద్దువెంట కన్నుమిన్నుకానక కర్కశంగా కాల్పులకు తెగబడింది. గతంలో ఎన్నడూలేనంతగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ తూటాల వర్షం కురిపించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌లోని పూంచ్æ జిల్లాలో సరిహద్దు వెంట డజన్ల కొద్దీ గ్రామాలపై పాకిస్తాన్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సాధారణ నివాస ప్రాంతాలపై జరిపిన కాల్పుల్లో నలుగురు చిన్నారులు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 57 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయాలపాలైన కొందరిని ఆస్పత్రిలో చేరి్పంచారు. వారిలో కొందరు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన వారిలో బల్విందర్ కౌర్ అలియాస్ రూబీ(33), మొహ్మద్ జైన్ ఖాన్(10), జోయా ఖాన్(12), మొహ్మద్ అక్రమ్(40), అమ్రిక్ సింగ్(55), మొహ్మద్ ఇక్బాల్(45), రంజీత్ సింగ్(48), షకీలా బీ(40), అమీర్‌జీత్ సింగ్(47), మరియం ఖటూన్(7), విహాన్ భార్గవ్(13), మొహ్మద్ రఫీ(40), ఒక లాన్స్ నాయక్‌లను గుర్తించారు. పూంచ్ జిల్లాతోపాటు బాలకోటె, మెన్ధార్, మాన్‌కోటె, కృష్ణ ఘతి, గుల్పార్, కెర్నీ సెక్టార్లలో పాక్ రేంజర్ల భారీ స్థాయిలో మోర్టార్లతో కాల్పులు జరిపారు. చారిత్రక ప్రాధాన్యమున్న పూంచ్ కోట, ఆలయాలు, గురుద్వారాలపైనా బుల్లెట్ల వర్షం కురిసింది. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో ఐదుగురు మైనర్లుసహా పది మంది గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెకాŠట్‌ర్‌లో బాంబుల శకలాలు పడి మంటలు అంటుకుని పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. బుధవారం మధ్యాహ్నందాకా ఈ కాల్పులు ఆగలేదు. ఈ కాల్పుల్లో ఇళ్లు, దుకాణాలు, వాహనాలు, బస్టాండ్లు ధ్వంసమయ్యాయి. జనావాసాలపై తుపాకులు ఎక్కుపెట్టడాన్ని మాజీ జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వేద్ తీవ్రంగా తప్పుబట్టారు. బోర్డర్‌కు ఆవల డజన్ల మంది మృతి పాక్ రేంజర్ల కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. భారత సైన్యం కాల్పుల్లో సరిహద్దుకు ఆవల పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్లు ఇండియన్ ఆర్మీ బుధవారం ప్రకటించింది. దాయాది ఆర్మీ పోస్ట్‌లను ధ్వంసం చేసింది. ముందు జాగ్రత్తగా సరిహద్దు జిల్లాలైన జమ్మూ, సాంబా, కథువా, రాజౌరీ, పూంఛ్‌లలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను బుధవారం మూసేశామని డివిజనల్ కమిషనర్ రమేశ్ కుమార్ చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు వెంట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా 13వ రోజు. పూంఛ్–రాజౌరీలోని భీంబర్ గలీలో పాక్ కాల్పులు కొనసాగిస్తోందని భారతఆర్మీలో అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. కాల్పుల బారిన పడకుండా అధికారులు సరిహద్దు ప్రాంతాల్లోని వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

‘ప్రధాని మోదీ చేతుల్లో భారత్ సురక్షితంగా ఉంది’
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడిని స్వాగతించారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్. ఉగ్రవాదాన్ని ఎప్పుడూ ప్రోత్సహించకూడదని, అది మానవాళి మనుగడకు అత్యంత ప్రమాదమన్నారు రవిశంకర్. ఆపరేషన్ సిందూర్ పై రవిశంకర్ మాట్లాడుతూ.. ‘ మనం నాగరిక సమాజంలో ఉన్నాం. మానవాళిని నాశనం చేసే ఉగ్రవాదులు దాడులు కానీ మిలిటెంట్ల దాడులను కానీ ఎంతమాత్రం ఉపేక్షించకూడదుఉగ్రవాదం అనేది ఓ ఆటవిక చర్య. భారత్ కేవలం పాక్‌లోని ఉగ్రస్థాపరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసింది. ఇది హర్షించదగ్గ విషయం. భారత్ చేసిన దాడులపై ఏ ఒక్కరు మాట్లాడాలన్నా మాట్లాడటానికి ఏమీ లేదు. ఎందుకంటే భారత్ కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసింది.ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని సహించబోమని పదే పదే చెబుతూ ఉన్నారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించలేదని చాలాసార్లు చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేయాల్సి వచ్చింది. ఇది కచ్చితంగా తెలివైన నిర్ణయమే. ప్రస్తుతం భారత్ నరేంద్ర మోదీ చేతుల్లో సురక్షితంగా ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలతో భారత్ కు మేలే జరుగుతుంది. ఆయనకు మరింత ఆత్మస్థైర్యం కలగానికి ప్రార్దిద్దాం అని రవిశంకర్ అన్నారు.
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

డాడీ.. లే డాడీ..
తంగళ్లపల్లి (సిరిసిల్ల): తండ్రి నిద్రపోయాడనుకున్న ఆ రెండేళ్ల చిన్నారి చనిపోయిన తండ్రిని ‘డాడీ.. లే డాడీ’.. అంటూ పిలవడం అందరినీ కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌నగర్ (డబుల్ బెడ్రూం సముదాయం)లోని బ్లాక్ నంబర్ 18, రూం నంబర్ 6లో నివాసముంటున్న తాడూరి రామ్‌కుమార్ (38) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. రామ్‌కుమార్ 14 ఏళ్ల కిత్రం వేములవాడకు చెందిన అనితను కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం సుఖజిత్ (11), శ్రీవాస్తవ్ (5), విహాన్ (2). రామ్‌కుమార్ జిరాక్స్ మెషీన్ మెకానిక్‌గా, వివాహ ఈవెంట్లలోనూ పనిచేస్తుండేవాడు. పనులు సరిగాలేక రామ్‌కుమార్‌కు రూ.3 లక్షల వరకు అప్పులు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం మధ్యాహ్నం భార్య వంట గదిలో ఉన్న సమయంలో పెద్ద కొడుకు సుఖజిత్తో మాట్లాడిన రామ్‌కుమార్, తమ్ముళ్లను బాగా చూసుకోమని చెప్పి గదిలోకి వెళ్లి డోర్ వేసుకుని ఉరేసుకున్నాడు. ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో భార్య కేకలతో స్థానికులు వచ్చి తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే మృతిచెందాడు. ట్రెయినీ ఎస్సై వినీతారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కర్రిగుట్టల్లో రక్తపుటేర్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టలు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 38 మంది మావోయిస్టులు చనిపోయినట్టు విశ్వసనీయవర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ మాత్రం.. 22 కంటే ఎక్కువ మావోయిస్టుల మృతదేహాలు లభించినట్లు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ బుధవారం ఉదయమే జరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలైంది. తొలుత 15 మంది మావోయిస్టులు మాత్రమే చనిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత ఈ సంఖ్య గంటగంటకూ పెరగగా, ఛత్తీస్‌గఢ్ సీఎం మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని రోజులుగా కర్రిగుట్టల దగ్గర యాంటీ నక్సలైట్ ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా దళాలకు ఈ రోజు భారీ విజయం దక్కింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది..’అని వెల్లడించారు. మృతదేహాలేవీ..? బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రిగుట్టల సమీపాన గుంజపర్తి – ఇత్తగూడ సమీపంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టు సమాచారం. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నామని ఛత్తీస్‌గఢ్ సీఎం ప్రకటించినా..ఎవరెవరు చనిపోయారు? ఆ మృతదేహాలను ఎక్కడికి, ఎలా తరలించారనే అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో చనిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేతలు ఉన్నారా లేక దళ సభ్యులు, జన మిలీషియా సభ్యులే ఉన్నారా? అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ గుట్టలపై తెలంగాణ మావోయిస్టు కమిటీతో పాటు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, పీఎల్జీఏ బెటాలియన్ వన్ ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు బుధవారం ఐఈడీ పేలి ఓ జవాను గాయపడగా, ఎలుగుబంటి దాడిలో ఇంకొకరు గాయపడినట్టు తెలుస్తోంది. అయితే వీటిపై పోలీసు వర్గాల నుంచి అధికారిక సమాచారం అందలేదు. మిషన్‌లో అంతా గోప్యతే మంగళవారం డ్రోన్‌తో తీసిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. కొందరు సాయుధులు నడిచి వెళ్తున్న దృశ్యాలు వాటిల్లో కనిపించాయి. ఈ వీడియో ‘మిషన్ సంకల్ప్’కు సంబంధించినదే అని ప్రచారం జరిగినా, అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. అయితే ఆ మరుసటి రోజే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఒక్క వీడియోనే కాదు మిషన్ సంకల్ప్ మొదలైనప్పటి నుంచి అన్ని విషయాల్లో భద్రతా దళాలు గోప్యత పాటిస్తున్నాయి. మావోయిస్టులు ఉపయోగించిన గుహలు అంటూ వైరల్ అయిన వీడియోలపైనా స్పష్టత కరువైంది. ఏప్రిల్ 24న జరిగిన ఒక ఎన్కౌంటర్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు చనిపోయారని ప్రకటించి, వారి పేర్లు, ఫొటోలు వెల్లడించడానికి 72 గంటల సమయం తీసుకున్నారు. వారు ఎక్కడివారనేది వెల్లడించలేదు. అలాగే మంగళవారం చనిపోయిన మరో మహిళా మావోయిస్టుకు సంబంధించిన వివరాలపై కూడా స్పష్టత లేదు. ప్రస్తుత భారీ ఎన్కౌంటర్ విషయంలోనూ అదే గోప్యత కొనసాగుతోంది. కొనసాగుతున్న ఆపరేషన్ మిషన్ సంకల్ప్ ఏప్రిల్ 21న మొదలైంది. ఈ ఆపరేషన్‌లో 24 వేల మంది బలగాలను, నాలుగు హెలీకాప్టర్లు, రెండు డ్రోన్లు, 20 వరకు ఆన్మ్యాన్డ్ వెహికల్స్(యూఏవీ)ను ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు కర్రిగుట్టల్లో 70 శాతం ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ అ«దీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 6 తర్వాత దశల వారీగా ఇక్కడ బలగాలను తగ్గించాలని ముందుగా నిర్ణయించినా, బుధవారం నాటి ఎన్కౌంటర్ నేపథ్యంలో మరికొన్ని రోజులు యధాతథంగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 184 మంది మావోయిస్టులు చనిపోయారు.ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటుములుగు: మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు బుధవారం లొంగిపోయినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో కొమటిపల్లికి చెందిన ఆర్పీసీ సభ్యుడు మడావి భీమా, జంగిల్శాఖ సభ్యుడు మడావి కోస, డీకేఏఎంఎస్ సభ్యుడు మడివి భీమా, ఆర్పీసీ సభ్యుడు వంజం ఊర, చైతన్య నాట్యమండలి సభ్యురాలు వంజం హుంగి ఉన్నట్లు చెప్పారు.

నూడుల్స్ తిని భర్త మృతి.. భార్యపై అనుమానం..!
జూలూరుపాడు: పూడ్చి పెట్టిన యువకుడి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసిన ఘటన మంగళవారం జూలూరుపాడులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జూలూరుపాడు ఎస్సీకాలనీకి చెందిన కత్తి రాములు, నాగమణి దంపతుల కుమారుడు కత్తి అరవింద్ (26) ఇటీవల మృతి చెందగా.. మృతిపై అనుమానాలున్నాయని తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.తహసీల్దార్ స్వాతిబిందు సమక్షంలో జేసీబీ సాయంతో సమాధి తొలగించి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. ఫోరెన్సిక్ నిపుణులు రమణమూర్తి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవి, సీఐ ఇంద్రసేనారెడ్డి వివరాలు వెల్లడించారు. ఐదు నెలల కిందట అరవింద్‌కు ఏన్కూర్‌కు చెందిన సింధుతో వివాహమైంది. గత నెల 1వ తేదీన పుట్టింటికి వెళ్లిన సింధు అత్తగారింటికి వచ్చింది. ఏప్రిల్ 2న ఫ్రైడ్ రైస్, నూడుల్స్ తిన్న అరవింద్ విరేచనాలు, వాంతలు కావడంతో ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. 7వ తేదీన అరవింద్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా.. ఐదు రోజుల అనంతరం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 16న మృతి చెందాడు. కాగా, ఈ నెల 4న మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని వెలికితీసి, తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించామని సీఐ పేర్కొన్నారు. ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ సీహెచ్ ఆదినారాయణ, పంచాయతీ సెక్రటరీలు హరిబాబు, లక్ష్మణ్, పోలీసులు పాల్గొన్నారు.

ప్రియుడితో వెళ్లిపోయిన పెళ్లి కూతురు
నారాయణపేట రూరల్: మూడు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కాబోయే వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో పరువు పోయిందన్న మనస్తాపంతో పెళ్లి కొడుకు తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణలోని నారాయణపేటలో చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన కాంజి గోవిందరావు కుమారుడు అభిషేకు జ్ఞాని విజయ్‌కుమార్ కూతురు శ్వేతతో పెళ్లి కుదిరింది. నాలుగు నెలల క్రితం ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని సైతం ఘనంగా నిర్వహించారు.ఈ నెల 9వ తేదీన పెళ్లి ముహూర్తం నిశ్చయించి పెళ్లిపత్రికలు కూడా పంచారు. కాగా.. ఆదివారం ఉదయం పెళ్లి కూతురు శ్వేత తన ప్రియుడు వెంకటేశ్‌తో వెళ్లిపోయింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. అయితే మంగళవారం తన కుమారుడిని పెళ్లి కొడుకుని చేయాల్సి ఉండగా ఇలా పెళ్లి ఆగిపోవడం భరించలేక.. మనస్తాపంతో తండ్రి గోవిందరావు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసినా విజయ్‌కుమార్ దాచిపెట్టి.. పెళ్లికి సిద్ధమై పరువు తీశారని, అందుకే గోవిందరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.చదవండి: కన్నీటి నిశ్చితార్థం.. తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు దుర్మరణం