Telangana CLP
-
టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరారు. అయితే తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఈ ముగ్గురు టీఆర్ఎస్లో చేరితే.. మొత్తం 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినట్టు అవుతుంది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్కు అందజేసేందుకు టీఆర్ఎస్ మంతనాలు జరుపుతోంది. సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయాల్సిందిగా వీరు స్పీకర్ కార్యాలయాన్ని కోరనున్నారు. జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈలోపే విలీన పక్రియ పూర్తి చేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. -
26న తెలంగాణ సీఎల్పీ సమావేశం
హైదరాబాద్: ఈ నెల 26న అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు, ఓటుకు కోట్లు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేయనున్నారు. -
'ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదు'
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సరిగా పనిచేయడం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నాడు పి. జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 26 మంది ఎమ్మెల్యేలున్నా చంద్రబాబు ప్రభుత్వంపై సమర్థవంతంగా పోరాడామని గుర్తు చేశారు. నేడు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతున్నా సీఎల్పీ పట్టించుకోవడం లేదని పాల్వాయి వాపోయారు. -
టీసీఎల్పీ ఉపనాయకుడిగా ‘కోమటిరెడ్డి’
నీలగిరి : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనభ పక్ష ఉపనాయకుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటికే టీపీసీసీ పక్ష నేతగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. టీ పీసీసీ ఉపనేత పదవి కూడా జిల్లాకు దక్కడం విశేషం. నల్లగొండ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలుపొంది రికార్డు సృష్టించిన కోమటిరెడ్డి గతంలో రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేశారు. కాగా ప్రస్తుతం టీపీసీసీ ఉపనేతగా ఎన్నిక కావడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.