Telangana Committee
-
హస్తం గూటికి చేరేందుకు నేతల ఆసక్తి
-
వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీలో వివిధ నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీకి సంబంధించి పలు నియామకాలు చేశారు. రాష్ట్ర కమిటీలో 10 మంది కార్యదర్శులు, నలుగురు సంయుక్త కార్యదర్శులకు చోటు కల్పించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం వీటిని ప్రకటించారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా ఎండీసయ్యదుద్దీన్ ముక్తార్(నిజామాబాద్),సంగాల ఇరిమియా, పూజారి సాంబయ్యగౌడ్(వరంగల్), సెగ్గెం రాజేశ్, సొల్లు అజయ్‌వర్మ(కరీంనగర్), రమా ఓబుల్‌రెడ్డి, వి.విజయప్రసాద్, కొళ్ల యాదయ్య, బనగాని రఘురామిరెడ్డి(రంగారెడ్డి), ఎండీ సాబీర్‌హుస్సేన్(ఆదిలాబాద్), సంయుక్త కార్యదర్శులుగా దుబ్బా క గోపాల్‌రెడ్డి(రంగారెడ్డి), వరాల శ్రీనివాస్, యల్లంకి రమేశ్, గాలి ప్రశాంత్‌బాబు (కరీంనగర్) నియమితులయ్యారు. జిల్లాల పరిశీలకులు వీరే... రాష్ట్రంలోని 10 జిల్లాలకు సంబంధించిన జిల్లా పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర నాయకులు నియమితులయ్యారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పరిశీలకుడిగా కె.శివకుమార్, గ్రేటర్ హైదరాబాద్ పరిశీలకుడిగా నల్లా సూర్యప్రకాశ్, ఆదిలాబాద్ పరి శీలకుడిగా జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా పరిశీల కుడిగా నర్రా భిక్షపతి, మెదక్ పరిశీలకుడిగా కొండా రాఘవరెడ్డి, మహబూబ్‌నగర్ పరిశీలకుడిగా హెచ్ఏ రెహ్మాన్, వరంగల్ పరిశీలకుడిగా వేముల శేఖర్‌రెడ్డి, రంగారెడ్డి పరిశీలకుడిగా జి.రాంభూపాల్‌రెడ్డిని నియమించారు. మహిళా విభాగానికి అమృతాసాగర్... పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన కె.అమృతాసాగర్, రాష్ట్ర వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షుడిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన బండారు వెంకటరమణ నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాయుడు ప్రకాశ్, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అక్కెనపల్లి కుమార్‌ను నియమించారు. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా అప్పాము కిషన్(భూపాలపల్లి), జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా కంధాడి అచ్చిరెడ్డి(పాలకుర్తి), జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా మారంరెడ్డి కౌటిల్‌రెడ్డి నియమితులైనట్లు వైఎస్సార్సీపీ పార్టీ తెలిపింది. -
తెలంగాణ-కమిటీలు, సూచనలు
తెలంగాణలో ఉద్యోగ, సామాజిక, రాజకీయ అసమానతలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఫలితంగా నాటి ప్రభుత్వాలు కొన్ని కమిటీలను నియమించాయి. ఎన్నో ఉద్యమాలు...ఎన్నో కమిటీలు, నాటి ముల్కీ నిబంధనలపై ఏర్పాటు చేసిన లలిత్ క మిటీ నుంచి మొన్నటి శ్రీకృష్ణ కమిటీ వరకు. ఏ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు! సంబంధిత కమిటీ సూచనలు ఏంటి! ప్రభుత్వాలు వాటిని ఎంతవరకు అమలు చేశాయి! గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ అంశాల్లో పూర్తి పరిజ్ఞానం ఉండాలి. ఈ నేపథ్యంలో వివిధ కమిటీలపై గ్రూప్స్ గెడైన్స్... కమిటీ నెం.1: కుమార్ లలిత్ కమిటీ జై తెలంగాణ ఉద్యమం(1969) కంటే ముందు ముల్కీ ఉద్యమంలో భాగంగా కాసు బ్రహ్మానందరెడ్డి కుమార్ లలిత్ కమిటీని నియమించారు. కమిటీ కర్తవ్యం: 1. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగుల వివరాలు సేకరించటం. 2. తెలంగాణలో మిగులు నిధులు ఎంతన్నది అంచనా వేయటం. నివేదికలో ఏముంది? 1) కమిటీ తన నివేదికలో 4,500 మంది ఆంధ్రా ఉద్యోగులు అక్రమంగా ఉన్నారని తేల్చింది. 2) తెలంగాణాలో మిగులు నిధులు రూ.30 కోట్లని పేర్కొంది. తెలంగాణ వాదుల ఆందోళన 1. 1969లోనే అక్రమ ఉద్యోగుల సంఖ్య 4,500 ఉంటే అది 2014 నాటికి లక్షల్లోకి చేరి ఉంటుందని తెలంగాణ వాదుల ప్రధాన ఆరోపణ. 2. అప్పట్లోనే మిగులు నిధులు రూ.30 కోట్ల మేర ఉన్నాయని లలిత్ కమిటీ తెలిపింది. అప్పట్నుంచి 2014 వరకు వేల కోట్ల తెలంగాణ నిధులను ఆంధ్ర ప్రాంతాలకు తరలించారనే విమర్శలు. మిగులు నిధుల్లోంచి ఒక్క రూపాయి అయినా తెలంగాణాలో ఖర్చు చేశారా! తెలంగాణ రైతులను ఆదుకున్నారా! చేనేత కార్మికులకు చేయూతనిచ్చారా! అనే ఆరోపణలు చేశారు. కమిటీ నెం: 2, భార్గవ కమిటీ లలిత్ కమిటీ పరిశీలించిన అంశాలపై 1969, ఏప్రిల్ 22న భార్గవ్ కమిటీని నియమించారు. సభ్యులు: కమిటీ చైర్మన్‌గా జస్టిస్ వశిష్ఠ భార్గవ్, సభ్యులుగా ఫ్రొ.ఎం.విహారి మాధూర్, హరిభూషణ్ బార్లు, సెక్రటరీగా టీఎన్ కృష్ణస్వామి. ఈ కమిటీ తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 4,500, తెలంగాణ మిగులు నిధులు రూ.28 కోట్లుగా లెక్కతేల్చింది. కమిటీ నెం.3: వాంఛూ కమిటీ ముల్కీ నిబంధనలు ‘కొనసాగించడానికి’ రాజ్యాంగ సవరణ విషయంలో తగిన సూచనలు చేయడం కోసం కేంద్రం ఈ కమిటీని 1969లో ఏర్పాటు చేసింది. కమిటీ- ఏం చెప్పింది 1. కమిటీ ఆంధ్ర పాలకులకు అనుకూలంగా ‘ముల్కీ నిబంధనలు విరుద్ధం’ అని తేల్చింది. 2. తెలంగాణలో ఉద్యోగాలు పొందేందుకు ఆంధ్ర ప్రాంతం వారు కూడా అర్హులని చెప్పింది. కమిటీ నెం.4: భరత్‌రెడ్డి-సుందరేషన్ కమిటీ ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను అంచనా వేసేందుకు ఈ కమిటీని నియమించింది. 1956 నుంచి 1985 వరకు ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా వచ్చినవారు,ఉద్యోగాల్లో చేరినవారు తెలంగాణలో కొనసాగాలా!వద్దా! అనే అంశాలను కమిటీ పరిశీలించింది. కమిటీ ఏం చెప్పింది 1. 1976 అక్టోబరు నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన తెలంగాణేతరులు అందర్నీ 1986 మార్చి 30 నాటికి వెనక్కి పంపాలి. 2. ఆ స్థానాల్లో తెలంగాణా వారిని నియమించి, ఉద్యోగాలు కోల్పోయిన తెలంగాణేతరుల కోసం సూపర్‌న్యూమరరీ పోస్టులను తెలంగాణాలో సృష్టించాలి. 3. జూరాల, శ్రీశైలం ఎడమగట్టు, శ్రీరాంసాగర్‌లో ఉన్న గెజిటెడ్ ఉద్యోగులను వారి సొంత జోన్లకు పంపాలి. 4. సచివాలయంలో వివిధ శాఖల హెచ్ఓడీల్లో జరిగిన అవకతవకలను సరిచేయాలి. 5. బోగస్ లోకల్ సర్టిఫికేట్ల ద్వారా నియమితులైన తెలంగాణేతరులపై చర్యలు తీసుకోవాలి. 6. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్లో చేరిన వారిని, ప్రమోషన్లలో చేరిన వారిని గుర్తించి వెనక్కి పంపించాలి. వాస్తవంగా ఏం జరిగింది: 1. 1956 నుంచి అక్రమంగా చేరిన వారి ప్రస్తావన లేకుండా కమిటీ నివేదికను ఇవ్వడంతో వాంఛూ కమిటీ వివాదాస్పదం. తెలంగాణలో 1976 నుంచి అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని గుర్తిస్తాం అని ప్రభుత్వం చెప్పడంతో విమర్మలు వచ్చాయి. 2. కాని 1976 నుంచి 1985 మధ్య ఉద్యోగాలను పొందిన వారిని వెనక్కి పంపే ప్రక్రియ కూడా జరగలేదు. దీంతో మళ్లీ ఉద్యమాలు, విమర్శలు రేకెత్తి ప్రతేక రాష్ట్ర ఏర్పాటుకు దారితీశాయి. కమిటీ నెం.5 జేఎమ్ గిర్గ్లానీ కమిటీ 1. 2001 జూన్‌లో జీవో ‘610’ అమలును పరిశీలించేందుకు ఏకసభ్య కమిటీ ఏర్పాటు. 2. 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గడువు. 3. కమిటీకి ఎవరూ సహకరించలేదు? 4. కమిటీ చాలా కష్టపడి తన రిపోర్టును సమర్పించింది. కమిటీ- రిపోర్ట్ 1. అన్ని శాఖల్లోనూ సమగ్ర విచారణ చేయాలి. అన్నీ చోట్లా అక్రమాలు జరిగాయి. 2. బోగస్ సర్టిఫికేట్ల ద్వారా ఆంధ్ర ప్రాంతం వారు ఎంత మంది ఉద్యోగాలు పొందారో తేల్చటం కష్టం. ఆ సంఖ్య ఎంతో కచ్చితంగా చెప్పటం కష్టం. 3. తెలంగాణలోని ఓపెన్ పోస్టులను లోకల్, నాన్‌లోకల్‌గా విభజించాలి. 4. న్యాయ శాఖలో చాలా ఉల్లంఘనలు, అక్రమ నియామకాలు జరిగాయి. 5. బ్యాగ్‌లాగ్ పోస్టులను‘ ఓపెన్ కేటగిరీ’లో చేర్చి నాన్‌లోకల్స్‌కు అంటే తెలంగాణేతరులకు అందించారు. కేంద్రం 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.. శ్రీకృష్ణ కమిటీని ఈ కింది అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా కేంద్రం సూచించింది. 1. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకువాస్తవ అంశాలు ఏమిటి? 2. తెలంగాణ రాష్ట్రం ఏమేరకు అవసరం ? 3. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే దానికి రాజధాని‘ హైదరాబాద్ ’ లేదా ప్రత్యామ్నాయం ఉందా! 4. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాల్సి ఉందా! 5. ‘రాయల-తెలంగాణ’ ఏర్పాటు! ప్రత్యామ్నాయం ఉందా! సభ్యులు 1. వి.కె.దుగ్గల్: కార్యదర్శి(కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి) 2. రవీందర్ కౌర్: (ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్) 3. రణ్‌బీర్ సింగ్: నల్సార్ వ్యవస్థాపక దిల్లీ జాతీయ యూనివర్సిటీ, వైస్ చాన్స్‌లర్ 4. అబుసలే షరీఫ్: ఆర్థికవేత్త ఈ కమిటీ 2010, డిసెంబర్ చివరి నాటికి తన నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రం గడువు విధించింది. 2010, ఫిబ్రవరి 12న ఈ కమిటీ రాష్ట్రంలో తొలి పర్యటన జరిపింది. కమిటీ తన నివేదికను 2010, డిసెంబర్ 30న కేంద్ర హోంశాఖకు అందజేసింది. ఈ కమిటీ తీరు ఒక ప్రశ్నకు రెండు ప్రశ్నల్లా సాగింది. నివేదికలోని కొన్ని అంశాలను షీల్డ్ కవర్ ద్వారా కేంద్ర హాం శాఖకు సమర్పించగా, మరికొన్నిటిని ఓపెన్ కవర్లో పెట్టి బహిర్గతం చేసింది. నివేదిక స్వరూపం: 9 చాప్టర్స్: 505 పేజీలు కమిటీ ప్రతిపాదనలు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఆరు ప్రతిపాదనలు చేసింది 1. తెలంగాణ సమస్యను శాంతి భద్రతల సమస్యగా పరిగణించి, కేంద్రసాయంతో రాష్ట్రప్రభుత్వం పర్యవేక్షించటం. 2. తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలి. 3. హైదరాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ ఏర్పాటు. 4. {పత్యేక తెలంగాణ ఏర్పాటు. గుంటూరు, కర్నూల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని మండలాలను కలిపి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. 5. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు. 6. {పధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి రాజ్యాంగ బద్ధ రక్షణ కల్పించడం, రాష్టాన్ని సమైక్యంగా ఉంచడం కమిటీ చివర్లో 6వ ప్రతిపాదన తన ప్రాధాన్యతగా చెప్తూ తెలంగాణ చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అని, ప్రత్యేక తెలంగాణ అవసరం లేదని పరోక్షంగా పేర్కొంది. 6వ ప్రతిపాదన అమలు సాధ్యం కాకపోతే 5వ ప్రతిపాదన తమ రెండో ప్రాధాన్యతగా చెప్పింది. కమిటీ నెం.6: ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణ ఏర్పాటు విషయంలో విస్తృత అంగీకారం కోసం 2005 సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీని నియమించారు. కమిటీ గడువు ఎనిమిది వారాలు. సభ్యులు: 1.రఘువంశ ప్రసాద్‌సింగ్, ఆర్జేడీ (బీహార్) 2.దయానిధి మారన్, డీఎంకే (తమిళనాడు) దేశ వ్యాప్తంగా 36 పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. మాజీ ప్రధానులు వీపీ సింగ్, ఐకే గుజ్రాల్ తదితరులు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతునిచ్చారు. 2008లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణాకు అనుకూలమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చారు. -
టీడీపీలో ఆట మొదలైంది
ఇంతకూ రేవంత్‌కు ఏ పదవి! సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో ఆట మొదలైంది. పార్టీలో కీలకమైన పదవుల కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. ఒకింత ఆలస్యంగానైనా, పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ, తెలంగాణల్లో రాష్ట్ర కమిటీల ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టడంతో పదవి కోసం లాబీయింగ్ ఊపందుకుంది. ఈ వారాంతంలోగా పార్టీ పదవుల భర్తీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆశపడుతున్నారు. కాగా, తెలంగాణ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరిని చేస్తారనే అంశం ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర విభజన తర్వాత అప్పటికప్పుడు ఏపీ కమిటీలో ఉన్న నేతలతోనే తెలంగాణకు ప్రత్యేక కమిటీని ప్రకటించారు. మాజీ మంత్రి ఎల్.రమణ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏర్పాటైన ఆ కమిటీ పదవీ కాలం మహానాడుతోనే ముగిసింది. కమిటీ కొత్త అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ పదవులు ఎవరికి దక్కుతాయో ఇప్పటి దాకా సస్పెన్స్‌గానే ఉంది. తెలంగాణ రాష్ట్ర కమిటీకి కొత్త అధ్యక్షుడు, ఇతర పదవుల భర్తీపై పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నట్లు తెలియగానే తెలంగాణ టీడీపీ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు పడిపోయారు. మొదటి నుంచీ అధ్యక్ష పదవిపై కన్నేసిన, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఈ సారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలన్న పట్టుదలతో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులిస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన రేవంత్.. ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్‌పై బయట ఉన్న ఆయనపై ఉన్న షరతులను కూడా కోర్టు ఎత్తివేయడంతో ఇక, ఏ ఇబ్బందీ ఉండదన్న అభిప్రాయానికి వచ్చారని, తెలంగాణలో పార్టీకి తన అవసరమే ఎక్కువ ఉందని ఆయన సన్నిహితుల వద్ద కూడా అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే పనిలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే మాట ఎత్తితే తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్న రేవంత్.. తనను తాను రాష్ట్ర స్థాయి నేతగా రుజువు చేసుకునే పనిలో పడ్డారని అంటున్నారు. అయితే, ఇప్పటికే ఓ సారి అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.రమణ వెనకబడిన వర్గాల కోటాలో ఈసారీ తనకే అవకాశం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారని అంటున్నారు. దీంతో అధ్యక్ష పదవి రేసులో ఈ ఇద్దరు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు టీ టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ పదవినీ ఆశిస్తున్నారు. ఆయన తొలి కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ సారి తనకు అవకాశం వస్తుందో రాదో అన్న బెంగ ఆయనలో ఉంది. అయినా, చివరి దాకా అధినేతను మెప్పించి పదవి పొందే ప్రయత్నమే చేస్తున్నారని చెబుతున్నారు. వర్గ సమీకరణలు కుదరక, ఒక వేళ రేవంత్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వని పక్షంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చే అవకాశం లేకపోలేదని కూడా పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఎర్రబెల్లి, రేవంత్ మధ్య ఆధిపత్య పోరు తప్పక పోవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ రోజురోజుకూ ఇబ్బందుల్లో పడుతున్న నేపథ్యంలో, తెలంగాణ సీఎం కేసీఆర్ పట్ల దూకుడుగా ఉండే రేవంత్‌రెడ్డి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. ఓటుకు కోట్లు కేసులో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇబ్బందులు పడ్డారన్న సానుభూతి పార్టీ అగ్ర నాయకత్వంలో ఉందని, ఇది ఒక రకంగా రేవంత్‌కు లాభించే అంశమని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఎల్.రమణ, ఎర్రబెల్లి, రేవంత్‌ల మధ్యే అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుని పదవులు దోబూచులాడుతున్నాయని పేర్కొంటున్నారు. వీరిలో అధినేత ఎవరి వైపు మొగ్గు చూపుతారు..? అది పార్టీలో ఎలాంటి అంతర్గత పోరాటానికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. -
పాలమూరుకు పెద్దపీట
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో జిల్లాకు నేతలకు కీలక పదవులు దక్కాయి. పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం జాబితాను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పార్టీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎడ్మకిష్టారెడ్డి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భీష్వ రవీందర్ రాష్ట్ర యువజనవిభాగం అధ్యక్షుడిగా, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుల య్యారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జి.రాంభూపాల్‌రెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా, మిడ్జిల్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు టి.భీమయ్య గౌడ్ (జడ్చర్ల), బంగి లక్ష్మణ్ (కొల్లాపూర్)లను రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తూ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ ఎనిమిదో తేదీ నుంచి 12వ తేదీవరకు ైవె ఎస్ షర్మిల జిల్లాలో ఐదు రోజుల పాటు పరామర్శ యాత్ర చేపట్టారు. యాత్ర సందర్భంగా చురుకుగా వ్యవహరించిన ఎడ్మ కిష్టారెడ్డితో పాటు భీష్వ రవీందర్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి తదితర నేతలకు కీలక పదవులు దక్కాయి. జిల్లాకు చెందిన మిగతా ముఖ్య నేతలకు అనుబంధ విభాగాలు, జిల్లా కమిటీలో చోటు దక్కే అవకాశం ఉంది. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి వరుసగా రెండు పర్యాయాలు జిల్లా కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటం - రైతు విభాగం రాష్ర్ట అధ్యక్షుడు ఎడ్మకిష్టారెడ్డి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటి పరిష్కారం కోసం పోరాడుతాం. తెలంగాణలో రైతులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. కరువు, కరెంటు కోత, అప్పులు దొరకకపోవడంతో పాటు గిట్టుబాటు ధర రాక అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. గతంలో రైతుల సమస్యలపై ఆమరణ దీక్ష, ధర్నాలు చేశాను. రైతులకు ధైర్యం కల్పిస్తా. నాకు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టి రైతుల సమస్యలపై పోరాడే అవకాశం కల్పించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పి. శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు. పార్టీని బలోపేతం చేస్తాం భీష్వ రవీందర్,రాష్ట్రఅధ్యక్షుడు,యువజన విభాగం అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించి యువజన విభాగం కార్యవర్గం ఏర్పాటు చేస్తా. పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటాం. విద్యార్థి, యువజనులకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతాం. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, తెలంగాణ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దిశా నిర్దేశంలో అన్నివర్గాలకు పార్టీ చేరువయ్యేలా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో పార్టీ విస్తరణ, బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా. పార్టీ పటిష్టతకు కృషిచేస్తా - జి.రాంభూపాల్‌రెడ్డి వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింనందుకు జగన్మోహన్రెడ్డి, షర్మిలమ్మ, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానీయను. దివంగత మహానేత వైఎస్సార్ ఆశయాలను, ఆయన హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తా. జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు అంకుటిత దీక్షతో పనిచేస్తా. పార్టీ అధినాయకత్వం నిర్ణయానుసారం పార్టీని ముందుకు నడిపిస్తాం. నమ్మకాన్ని నిలబెడతా - మామిడి శ్యాంసుందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నాపై నమ్మకాన్ని ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జిల్లాపై చెరగని ముద్ర వేశాయి. వైఎస్ పథకాల మూలంగా లబ్ధి పొందిన వారు నేటికీ ఆయన పాలనను తలచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందిస్తాం. -
రాజకీయ లబ్ధికోసమే వాళ్ల ప్రయత్నాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ప్రజా సమస్యలపై తాము చర్చించామని, ముఖ్యమంత్రిని.. గవర్నర్‌ను కలిసి అన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ లబ్ధికోసమే ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు పడుతున్న కష్టాలు, వారి బాధలను పట్టించుకోవడం లేదని పొంగులేటి విమర్శించారు. వైఎస్ఆర్సీపీ మాత్రం ప్రజల పక్షాన ముందుండి పోరాడుతుందని ఆయన చెప్పారు. వచ్చేనెల 9వ తేదీన రంగారెడ్డి, 13న మహబూబ్ నగర్, 17న నల్లగొండలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేతలు జనకప్రసాద్, కిష్టారెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు మూతపడి లక్షలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరారు. -
రాజకీయ లబ్ధికోసమే వాళ్ల ప్రయత్నాలు
-
15వ రీలులో హీరో కథ మార్చేస్తాడు: వైఎస్ జగన్
''సినిమాలో హీరో 14వ రీలు వరకు అష్టకష్టాలు పడతాడు.. అప్పటివరకు అప్పటివరకు విలన్‌దే పైచేయి అవుతుంది. కానీ 15వ రీలు దగ్గరకు వచ్చేసరికే కథ మొత్తం మారుతుంది. అప్పుడు హీరో ఒక్కడే అయినా కథ మొత్తం మార్చేస్తాడు'' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ తెలంగాణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంటును ప్రకటించేందుకు మెహిదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్స్‌లో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన ఉత్తేజపూరితంగా మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... * నిజాం సామ్రాజ్యాన్ని కూడా వ్యతిరేకించిన కొమురం భీమ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి. * తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉంటుందా, ఉండదా అని రకరకాల వ్యక్తులు రకరకాల అనుమానాలు తెస్తున్నారు. అలాంటి వాళ్లందరికీ నేను చెప్పబోయేది ఒక్కటే. యుద్ధం చేయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి. * దమ్ము, ధైర్యం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు తోడుంటారు. మన మనసు మంచిదైతే ప్రజలు మన మాటలు నమ్ముతారు. మనలో ఖలేజా ఉంటే, దమ్ము, ధైర్యం ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారు. నిజాయితీతో ప్రజల చెంతకు ముందడుగు వేయాలి. * సోనియాగాంధీ మన రాష్ట్రం కాదు. అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండాలని పట్టుబడుతున్నారు. ఆమెది మన రాష్ట్రం కాదు, మన భాష అంతకన్నా కాదు. * ఇటీవల బీజేపీ కూడా బలపడేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీకి చెందిన నేత నరేంద్ర మోదీగారికి కూడా తెలుగు రాదు. * తెలుగు భాష రానివాళ్లు కూడా వచ్చి, ఇక్కడ తామే పరిపాలన చేయాలనుకున్నప్పుడు.. ఇక్కడే పుట్టి, ఇక్కడ ఇన్నాళ్లుగా ఉండి, ఇక్కడి సమస్యలు తెలిసినప్పుడు, ఇక్కడవాళ్లకు మంచి చేయడానికి ఒక తెలుగు పార్టీ ఎందుకు ముందు రాకూడదని అడుగుతున్నా. * ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. రాబోయే నాలుగేళ్లలో ఈ పార్టీ ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయే రోజు వస్తుంది. * చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో పరిపాలన చేస్తున్నారు. రోజుకో అబద్ధం, పూటకోమోసం చేస్తున్నారు. అక్కడ కేసీఆర్ గారికి ప్రజా వ్యతిరేకత రావడానకిఇ ఏడాది పడుతుందేమోగానీ, నాలుగు నెలల్లోనే బాబుపై వ్యతిరేకత వస్తుంది. * నాలుగేళ్ల తర్వాత ప్రజా వ్యతిరకతతో టీఆర్ఎస్, టీడీపీ వెళ్లిపోతాయి. ఆ తర్వాత మిగిలి ఉండేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ మాత్రమే. * ఇప్పుడు మన బలం తక్కువ ఉండచ్చు, నాయకులు ఉండకపోవచ్చు. కానీ మన నాయకులను లాక్కుంటున్నారు. వాళ్లు గాలం వేసినప్పుడు చిక్కుకునేవాళ్లు ఆలోచించాలి. నాలుగేళ్ల తర్వాత ఆ పార్టీకి ప్రజా వ్యతిరేకత వస్తే ఇక ఏ పార్టీకి వెళ్తారు? * సోనియాగాంధీకి వ్యతిరేకంగా నిలిచి పోరాడిన వ్యక్తులు ఇద్దరమే.. నేను, మా అమ్మ. మేమిద్దరమే ఆ పార్టీ నుంచి బయటపడ్డాం. ఆరోజు మా వెనక ఎవరూ లేరు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పేరుమోసిన నాయకులు ఎవరూ లేరు. మీరే మమ్మల్ని ముందుండి నడిపించారని గర్వంగా చెబుతున్నా. * బడ్జెట్ కొంచెమే ఉంది కాబట్టి పింఛన్లలోను, ఫీజు రీయింబర్స్మెంట్లోను అన్నింటిలో కోతలు పెడుతున్నారు. ఇలాంటి కోతలు లేకుండా అడుగులు వేయడంలో వైఎస్ఆర్సీపీ ముందుంటుంది. * తెలంగాణలోనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరే రోజు వస్తుంది. -
ఎమ్మెల్యేపై దాడికి వైఎస్ఆర్సీపీ నేతల ఖండన
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ నాయకులు చేసిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. హైదరాబాద్‌లో జరిగిన వైఎస్ఆర్సీపీ తెలంగాణ కమిటీ సమావేశంలో పలువురు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఇక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. వచ్చేనెల 8వ తేదీన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ జిల్లాల ముఖ్యనేతలు, కార్యకర్తలతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయ్యిందని, ఈ విషయమై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని తాము నిలదీస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాటి వెంకటేశ్వర్లు చెప్పారు. -
సరిహద్దుల్లో టెన్షన్, టెన్షన్
చింతూరు, న్యూస్‌లైన్: ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు తెలంగాణ కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో పోలీసు బలగాలు ముమ్మరంగా కూంబింగ్ సాగిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అగ్ర నేత ఒకరు ఇటీవల ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సమావేశం నిర్వహించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారమందింది. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టుల పిలుపు, పోలీసుల ముమ్మర కూంబింగ్‌తో ఎప్పుడేం జరుగుతుందోనని సరిహద్దుల్లోని పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి. గత నెల 10న సరిహద్దునగల చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ లోక్‌సభ ఎన్నికల సమయంలో మావోయిస్టులు భారీ దాడులకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన మావోయిస్టుల దాడిలో ఏడుగురు ఎన్నికల సిబ్బంది మృతిచెందారు. బస్తర్ జిల్లాలో జరిగిన దాడిలో ఎనిమిదిమంది పోలీసులు బలయ్యారు. ఇటువంటి దాడులే తెలంగాణ ఎన్నికల్లో కూడా జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మావోయిస్టులు చింతూరు మండలంలో హల్చల్ సృష్టించారు. శబరి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని తుమ్మల గ్రామానికి చెందిన సీపీఎం నాయకుడు పట్రా ముత్యంను హత్య చేశారు. బుర్కనకోట వద్ద రహదారి పనుల కోసం ఉంచిన తారు డ్రమ్ములను ధ్వంసం చేశారు. చింతూరు మండలంలోని నారకొండ, అల్లిగూడెం, పేగ, ఏడుగురాళ్లపల్లి, తుమ్మల, సరివెల, చిడుమూరు, సుద్దగూడెం పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్నాయి. దీనిలో, నారకొండ పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఇప్పటికే అల్లిగూడెం గ్రామానికి మార్చారు. నారకొండ, అల్లిగూడెం, పేగ పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన సిబ్బందిని మంగళవారం రాత్రి ఏడుగురాళ్లపల్లిలోనే నిలిపేసినట్టు తెలిసింది. వీరిని బుధవారం ఉదయం పోలింగ్ సమయానికి ఆయా కేంద్రాలకు చేర్చే అవకాశముంది. పోలింగు కేంద్రాలపై డేగ కన్ను దుమ్ముగూడెం: నేటి ఎన్నికలకు మావోయిస్టుల నుంచి ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా చూసేందుకు ఆంధ్రా-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించాయి. ‘బూటకపు ఎన్నికలను బహిష్కరించా’లని మావోయిస్టులు పదే పదే హెచ్చరించడంతో సరిహద్దుల్లోని పోలింగ్ కేంద్రాలపై పోలీసులు డేగ కన్ను వేశారు, గిరిజన గ్రామాల్లో పోలింగ్ శాతం పెంచడం ద్వారా మావోయిస్టుల హెచ్చరికలను తిప్పికొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. నాలుగు రోజుల కిందట.. దుమ్ముగూడెం మండలానికి ఆనుకుని ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోగల గొల్లపల్లి పోలీస్ స్టేషన్ అటవీ ప్రాంతంలో ఎడ్లపాడు వద్ద పదిమందితో కూడిన సంతోష్ దళం ఉందన్న సమాచారంతో పోలీసులు దాడికి యత్నించారు. ఆ దళం తప్పించుకుని పరారైంది. సంతోష్‌కు చెందిన 9 ఎంఎం పిస్టల్, మందులు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఎన్నికల బహిష్కరణ పిలుపుతో విధ్వంసానికి దిగేందుకే సంతోష్ దళం ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టులు ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుండవచ్చని భావించిన పోలీసులు కూంబింగ్ సాగిస్తున్నారు. మావోయిస్టుల కొరియర్లు, సానుభూతిపరులుగా భావిస్తున్న వారిపై పోలీసులు ఓ కన్నేశారు. మంగళ, బుధవారాలలో చత్తీస్‌గఢ్ వారపు సంతలను నిలిపేశారు. కొందరు సంత వ్యాపారులను, మావోయిస్టుల కొరియర్లగా అనుమానిస్తున్న వారిని సరిహద్దుల్లోగల పోలింగ్ కేంద్రాల వద్ద ‘పహారా’ కాసేందుకు నియమించారు. వారి కదలికలపై పోలీసులు డేగ కన్ను వేశారు.