15వ రీలులో హీరో కథ మార్చేస్తాడు: వైఎస్ జగన్ | hero will change entire story in the last reel, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

15వ రీలులో హీరో కథ మార్చేస్తాడు: వైఎస్ జగన్

Published Wed, Oct 8 2014 12:48 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

15వ రీలులో హీరో కథ మార్చేస్తాడు: వైఎస్ జగన్ - Sakshi

15వ రీలులో హీరో కథ మార్చేస్తాడు: వైఎస్ జగన్

''సినిమాలో హీరో 14వ రీలు వరకు అష్టకష్టాలు పడతాడు.. అప్పటివరకు అప్పటివరకు విలన్దే పైచేయి అవుతుంది. కానీ 15వ రీలు దగ్గరకు వచ్చేసరికే కథ మొత్తం మారుతుంది. అప్పుడు హీరో ఒక్కడే అయినా కథ మొత్తం మార్చేస్తాడు'' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ తెలంగాణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంటును ప్రకటించేందుకు మెహిదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్స్లో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన ఉత్తేజపూరితంగా మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

* నిజాం సామ్రాజ్యాన్ని కూడా వ్యతిరేకించిన కొమురం భీమ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి.
* తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉంటుందా, ఉండదా అని రకరకాల వ్యక్తులు రకరకాల అనుమానాలు తెస్తున్నారు. అలాంటి వాళ్లందరికీ నేను చెప్పబోయేది ఒక్కటే. యుద్ధం చేయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి.
* దమ్ము, ధైర్యం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు తోడుంటారు. మన మనసు మంచిదైతే ప్రజలు మన మాటలు నమ్ముతారు. మనలో ఖలేజా ఉంటే, దమ్ము, ధైర్యం ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారు. నిజాయితీతో ప్రజల చెంతకు ముందడుగు వేయాలి.
* సోనియాగాంధీ మన రాష్ట్రం కాదు. అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండాలని పట్టుబడుతున్నారు. ఆమెది మన రాష్ట్రం కాదు, మన భాష అంతకన్నా కాదు.
* ఇటీవల బీజేపీ కూడా బలపడేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీకి చెందిన నేత నరేంద్ర మోదీగారికి కూడా తెలుగు రాదు.
*  తెలుగు భాష రానివాళ్లు కూడా వచ్చి, ఇక్కడ తామే పరిపాలన చేయాలనుకున్నప్పుడు.. ఇక్కడే పుట్టి, ఇక్కడ ఇన్నాళ్లుగా ఉండి, ఇక్కడి సమస్యలు తెలిసినప్పుడు, ఇక్కడవాళ్లకు మంచి చేయడానికి ఒక తెలుగు పార్టీ ఎందుకు ముందు రాకూడదని అడుగుతున్నా.
* ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. రాబోయే నాలుగేళ్లలో ఈ పార్టీ ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయే రోజు వస్తుంది.
* చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో పరిపాలన చేస్తున్నారు. రోజుకో అబద్ధం, పూటకోమోసం చేస్తున్నారు. అక్కడ కేసీఆర్ గారికి ప్రజా వ్యతిరేకత రావడానకిఇ ఏడాది పడుతుందేమోగానీ, నాలుగు నెలల్లోనే బాబుపై వ్యతిరేకత వస్తుంది.
* నాలుగేళ్ల తర్వాత ప్రజా వ్యతిరకతతో టీఆర్ఎస్, టీడీపీ వెళ్లిపోతాయి. ఆ తర్వాత మిగిలి ఉండేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ మాత్రమే.
* ఇప్పుడు మన బలం తక్కువ ఉండచ్చు, నాయకులు ఉండకపోవచ్చు. కానీ మన నాయకులను లాక్కుంటున్నారు. వాళ్లు గాలం వేసినప్పుడు చిక్కుకునేవాళ్లు ఆలోచించాలి. నాలుగేళ్ల తర్వాత ఆ పార్టీకి ప్రజా వ్యతిరేకత వస్తే ఇక ఏ పార్టీకి వెళ్తారు?
* సోనియాగాంధీకి వ్యతిరేకంగా నిలిచి పోరాడిన వ్యక్తులు ఇద్దరమే.. నేను, మా అమ్మ. మేమిద్దరమే ఆ పార్టీ నుంచి బయటపడ్డాం. ఆరోజు మా వెనక ఎవరూ లేరు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పేరుమోసిన నాయకులు ఎవరూ లేరు. మీరే మమ్మల్ని ముందుండి నడిపించారని గర్వంగా చెబుతున్నా.
* బడ్జెట్ కొంచెమే ఉంది కాబట్టి పింఛన్లలోను, ఫీజు రీయింబర్స్మెంట్లోను అన్నింటిలో కోతలు పెడుతున్నారు. ఇలాంటి కోతలు లేకుండా అడుగులు వేయడంలో వైఎస్ఆర్సీపీ ముందుంటుంది.
* తెలంగాణలోనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరే రోజు వస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement