telangana Election Watch
-
గజ్వేల్‌లో కేసీఆర్ ముందంజ
-
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నికలు ఫలితాలు 2023 లైవ్: భారీ మెజారిటీతో రేవంత్‌రెడ్డి విజయం
జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్ధి అనిరుధ్ రెడ్డి గెలుపు మక్తల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి వాకిటి శ్రీహరి గెలుపు దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్ధి మధుసూధన్ రెడ్డి గెలుపు నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి కే. రాజేశ్ రెడ్డి గెలుపు 32000 పైచిలుకు ఓట్లతో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి గెలుపు గాంధీభవన్‌కు బయలుదేరిన రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి భద్రత పెంపు, రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్ కొడంగల్‌లో 23 వేల లీడ్‌లో రేవంత్‌రెడ్డి బర్రెలక్కకు కొల్లాపూర్‌లో ఆరో రౌండ్ పూర్తయ్యాక 1923 ఓట్లు గద్వాలలో 8వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొడంగల్‌లో తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి.. రేవంత్‌రెడ్డికి 12,060 ఓట్ల ఆధిక్యం కొడంగల్‌లో మూడో రౌండ్లో రేవంత్‌రెడ్డికి 4,389 ఓట్ల ఆధిక్యం జడ్చర్ల, మక్తల్‌లో కాంగ్రెస్ ఆధిక్యం కొల్లాపూర్‌లో ఇండిపెండెంట్ అభ్యర్ధి బర్రెలక్క ముందంజ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల గెలుపోటముల వివరాలు ఈ క్రింది పట్టికలో చూడవచ్చు. క్ర.సం నియోజకవర్గం భారాస కాంగ్రెస్ భాజపా ఆధిక్యం గెలుపు 1 మహబూబ్ నగర్ వి.శ్రీనివాస్‌గౌడ్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మిథున్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 2 జడ్చర్ల చర్లకోల లక్ష్మారెడ్డి అనిరుధ్ రెడ్డి చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ కాంగ్రెస్ 3 దేవరకద్ర ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మధుసూధన్ రెడ్డి కొండా ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 4 కొల్లాపూర్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి జూపల్లి కృష్ణారావు ఆల్లెని సుధాకర్ రావు కాంగ్రెస్ కాంగ్రెస్ 5 నాగర్‌కర్నూల్ మర్రి జనార్దన్‌రెడ్డి కే. రాజేశ్ రెడ్డి దిలీప్ చారి కాంగ్రెస్ కాంగ్రెస్ 6 అచ్చంపేట (SC) గువ్వల బాలరాజు చిక్కుడు వంశీ కృష్ణ దేవని సతీష్ మాదిగ కాంగ్రెస్ కాంగ్రెస్ 7 వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జి చిన్నారెడ్డి అశ్వత్థామ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 8 గద్వాల బండ్ల కృష్ణమోహన్డ్డి సరితా తిరుపతయ్య బోయ శివ భారాస భారాస 9 అలంపూర్ (SC) విజేయుడు ఎస్ఏ. సంపత్ కుమార్ రాజగోపాల్ భారాస భారాస 10 నారాయణపేట ఎస్ రాజేందర్ రెడ్డి డా. పర్ణికా చిట్టెం రెడ్డి కేఆర్ పాండురెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 11 కొడంగల్ పట్నం నరేందర్‌రెడ్డి రేవంత్‌రెడ్డి బంతు రమేష్‌కుమార్ కాంగ్రెస్ కాంగ్రెస్ 12 షాద్ నగర్ అంజయ్య యాదవ్ యెల్గనమోని శంకరయ్య అందె బాబయ్య కాంగ్రెస్ కాంగ్రెస్ 13 కల్వకుర్తి జైపాల్ యాదవ్ కశిరెడ్డి నారాయణరెడ్డి తల్లోజు ఆచారి కాంగ్రెస్ కాంగ్రెస్ 14 మక్తల్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి వాకిటి శ్రీహరి జలంధర్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ -
కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఆ నేతలు బీఆర్ఎస్లో చేరతారు: అమిత్ షా
ములుగు: కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ ఆ నేతలు బీఆర్ఎస్లో చేరుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోడు భూముల సమస్య పరిష్కరించలేక.. గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య బీఆర్ఎస్ వివాదం సృష్టిస్తోందని మండిపడ్డారు. గిరిజనులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గిరిజనులను మోసం చేయడం కాంగ్రెస్ లక్షణమని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక పార్టీ అని చెప్పారు. తెలంగాణలో ప్రధాని మోదీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అత్యధిక గిరిజన ఎంపీలు బీజేపీకి చెందినవారే ఉన్నారని స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క పండుగలను జాతీయ పండుగగా చేయాలని ప్రకటించామని చెప్పారు. నవంబర్ 30న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని మోదీ కూడా ఇక్కడే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తూప్రాన్‌లో జరిగిన సభలో మాట్లాడారు. అటు.. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్ -
2024లో సంకీర్ణ సర్కారు ఖాయం: సీఎం కేసీఆర్
నిజామాబాద్: 2024లో దేశంలో సంకీర్ణ సర్కారు ఏర్పడటం ఖాయమని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజల అండ ఉంటుందని ఆకాంక్షించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణను ఎప్పుడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. నిజామాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం:కేసీఆర్ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు పెద్ద ప్రమాదం వస్తోందని అన్నారు. రైతు దుబారానా? అని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ నాయకుల మాటలను ఎండగట్టారు. ఈ ప్రాంతానికి ఆనాడు నీళ్లు ఎందుకివ్వలేదని దుయ్యబట్టారు. ఎల్లారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నేడు ప్రథమ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రైతు బంధు లాంటి పథకాలను దేశంలో తెలంగాణ మాత్రమే అమలు పరుస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుని మత కలహాలు సృష్టించిందని విమర్శించారు. హిందూ, ముస్లింలు సోదరభావంతో ఉన్నారని తెలిపారు. బీజేపీ మత పిచ్చితో మంటలు పెడుతోందని ఆరోపించారు. వంద ఉత్తరాలు రాసినా కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీగాని నవోదయ పాఠశాల గానీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించారు. సింగూరు నీటిని నిజాం సాగర్ కు తరలించామని సీఎం కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ కు ఐటి హబ్ తెచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే భయంకర పరిస్థితులు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు బీడీ కార్మికులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. 2014 తర్వాత చేరిన కొత్త బీడీ కార్మికులందరికి పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్లను 5016కు పెంచుతామని వెల్లడించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. రంగంలోకి ఏఐసీసీ పెద్దలు! -
బిజీ బిజీగా గడిపేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు..!
మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు తరుముతున్న వేళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు బిజీ బిజీగా గడిపేస్తున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగం పెంచుతూ.. పెండింగ్ పనులపై దృష్టి సారిస్తున్నారు. ఇక ప్రతీ రోజు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అక్కడే సభలు, సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు. జిల్లాలో ప్రధాన నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌లో ఉరుకులు, పరుగులతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బతుకమ్మ చీరలు, క్రీడా సామగ్రి పంపిణీ చేస్తున్నారు. ఇక ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని జన్నారంలో కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నారు. మండలంలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ దక్కకపోవడంతో జిల్లాలో మిగతా చోట్ల ఉన్న పరిస్థితి లేదు. తమకు బలం ఉన్న ప్రాంతాలతోపాటు గత ఎన్నికల్లో ఓట్లు తక్కువగా వచ్చిన చోట ఇప్పటివరకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల సీఎం బల్దియాలు, పంచాయతీలకు ప్రకటించిన ప్రత్యేక, ఇతర నిధులతో పనులు ప్రారంభిస్తున్నారు. గత నెల రోజుల్లోనే రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. చెన్నూరులో వేగంగా.. జిల్లాలో మిగతా రెండు నియోజకవర్గాలతో పోలిస్తే చెన్నూరులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వేగంగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఇటీవల మంత్రి కేటీఆర్‌తో సుమారు రూ.312కోట్ల అభివృద్ధి పనుల కార్యక్రమాలు జరిగాయి. ఎన్నికలకు ముందే రెవెన్యూ డివిజన్, రెండు మండలాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. త్వరలోనే మంత్రి హరీశ్‌రావుతో చెన్నూరు పట్టణంలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి చెన్నూర్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్లు, భవనాలు, పాత పనులను వేగవంతం చేయించడం, బతుకమ్మ చీరలు, క్రీడా కిట్లు, ఉచిత చేప పిల్లల పంపిణీ తదితర కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొంటున్నారు. -
‘మిషన్ తెలంగాణ’పై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ‘మిషన్ తెలంగాణ–2023’కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా గెలిచి కాషాయజెండా ఎగురవేసి తీరాలన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల నిర్దేశిత లక్ష్యసాధన దిశగా పకడ్బందీ వ్యూహాలను రచిస్తోంది. ఎప్పటికప్పుడు సర్వే బృందాలతో నివేదికలు తెప్పించుకుంటూ వ్యూహాల అమలు బాధ్యతను, కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యనాయకులకు రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అప్పజెప్పింది. సర్వేలు..స్వయం పరిశీలనలు కర్ణాటక, పుదుచ్చేరి తర్వాత తెలంగాణలో పార్టీ విస్తరణకు అనుకూల పరిస్థితులున్నాయని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. దక్షిణాదిలో అధికార విస్తరణకు రాష్ట్రం కీలకమనే అంచనాల నేపథ్యంలో తెలంగాణకు అన్ని విషయాల్లోనూ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బీజేపీ వాస్తవ పరిస్థితి, క్షేత్రస్థాయిలో బలం, సంస్థాగతంగా పటిష్టతతో పాటు టీఆర్ఎస్ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ప్రభావం చూపే రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలు, నియోజకవర్గాల వారీ బలాబలాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. నియోజకవర్గాల్లో గ్రామస్థాయి వరకు ఉన్న రాజకీయ పరిస్థితులపై పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్ర సంస్థలు, పరిశోధక, అధ్యయన బృందాల ద్వారా సర్వేలు నిర్వహిస్తోంది. ఒకరకంగా పార్టీకి సమాంతరంగా ఒక ప్రత్యేక వ్యవస్థ ఇందుకోసం పనిచేస్తోంది. మరోమారు ముఖ్య నేతల రాక తెలంగాణలోని 119 అసెంబ్లీ నిÄయోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనకు పలువురు కేంద్రమంత్రులు, ముఖ్య నేతలు రెండోసారి రాష్ట్రానికి రానున్నారు. ఇటీవలే షాద్‌నగర్‌లో కేంద్రమంత్రి ఆర్పీ సింగ్, మహేశ్వరం నియోజకవర్గంలో మరో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి పర్యటించారు. త్వరలోనే మరికొన్ని నియోజకవర్గాలకు కేంద్రమంత్రులు, ముఖ్యనేతలు రానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఓ దఫా పరిశీలన గత జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా.. బీజేపీకి చెందిన అతిరథ మహారథులు ‘ప్రవాసీ యోజన’పేరిట చలో తెలంగాణ అంటూ మూడురోజుల పాటు 119 నియోజకవర్గాల్లో పర్యటించారు. దాదాపు 25 రాష్ట్రాలకు చెందిన ఈ నేతల జాబితాలో ఏడెనిమిది మంది కేంద్ర మంత్రులు, పలువురు కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ముఖ్యనేతలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు తాము బస చేసిన కార్యకర్తల ఇళ్లలోనే భోజనాలు చేయడం ద్వారా వారికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, టీఆర్ఎస్ తీరు, అక్కడున్న సమస్యలను పరిశీలించారు. ఆయా అసెంబ్లీ స్థానాల పరిధిలో వివిధ స్థాయిల పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చాలతో సమావేశమై స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజలను కలుసుకుని ప్రధాని మోదీ 8 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, పేదలకు అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. నాయకత్వానికి ప్రాథమిక నివేదికలు ఈ నేతలందరూ తమకు కేటాయించిన నియోజకవర్గాల్లోని పరిస్థితిపై జాతీయ నాయకత్వానికి ప్రాథమిక నివేదికలు సమర్పించారు. ఆ స్థానాల్లో పార్టీపరంగా పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలో రెండో విడత ‘ప్రవాసీ యోజన’కు కేంద్రమంత్రులు సిద్ధమౌతున్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ విధంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నేరుగా అమిత్ షాకే రిపోర్ట్ అమిత్ షా ప్రత్యక్ష పర్యవేక్షణలో, నేరుగా ఆయన కార్యాలయానికే రిపోర్ట్ చేసేలా ‘అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’అనే సంస్థ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం గత కొంతకాలంగా హైదరాబాద్ నుంచి పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రతినిధులు రాష్ట్రంలోని పార్టీ పరిస్థితి, టీఆర్ఎస్ లోపాలు, రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లు, తదితర అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నారు. మరోవైపు ఎన్నికల సంబంధిత వ్యవహారాల్లో నిపుణులు, గతంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో పనిచేసిన వారిని ప్రత్యేకంగా నియమించారు. గత లోక్‌సభ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలతో పాటు, యూపీ ఎన్నికల్లో బీజేపీ కోసం పనిచేసిన వివిధ బృందాల్లో కొన్ని ఇప్పటికే తెలంగాణలో పనిచేయడం ప్రారంభించాయి. యూపీ సహా వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో క్రియాశీలంగా పనిచేసి మంచి ఫలితాలను సాధించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ను తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జిగా నియమించడం గమనార్హం. -
తెలంగాణ ఎన్నికల పరిశీలకుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. ఇతర రాష్ట్రాల ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా ఖరారు చేసింది. ప్రతి జిల్లాకు ఒక్కరి చొప్పున ఎన్నికల పరిశీలకులను నియమించింది. హైదరాబాద్ ఎన్నికల పరిశీలకుడిగా డీఐజీ రేంజ్ అధికారి అజయ్‌దేవ్ కుమార్ నియమితులయ్యారు. ఎన్నికల్లో భద్రత అంశాలపై ఎప్పటికప్పుడు సీఈసీకి పరిశీలకులు సమాచారం ఇవ్వనున్నారు. ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ప్రత్యేక అధికారులు తెలంగాణలో అన్ని జిల్లాలకు చేరుకున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా కట్టుదిట్టం చేశారు. రూ. 25కు మించి చెల్లించవద్దు..! ఓటరు కార్డుకు రూ. 25కు మించి చెల్లించనక్కర్లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. కొత్త ఓటరుగా నమోదయిన వారికి ఇంటిదగ్గర లేదా పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల కమిషనే ఉచితంగా కార్డులు అందజేస్తుందని, పాత కార్డుల వారు మాత్రం రూ. 25 మాత్రమే చెల్లించి ‘మీసేవ’లో ఓటరు కార్డులు పొంద వచ్చని ఆయన వెల్లడించారు. ‘మీ సేవలో’ ఓటరు కార్డుకు రు.100 వసూలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందుతున్నాయనీ, ఇలా వసూలు చేయడం అక్రమమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ. 25కు మించి అదనంగా ఎవరైనా వసూలు చేసినపక్షంలో పూర్తి వివరాలతో 1950కి ఫిర్యాదు చేస్తే.. తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త ఓటర్లుగా నమోదు అయిన వారికి ఇళ్ల వద్ద కానీ, పోలింగ్ జరిగే రోజున అయితే పోలింగ్ కేంద్రం వద్ద కానీ ఎపిక్ కార్డులను ఉచితంగా అంద చేస్తారని వివరించారు. -
మంచి పాలన కోసం ‘టీఎలక్షన్ వాచ్’
‘మంచి మున్సిపల్ కార్పొరేషన్ కావాలంటే మంచి కార్పొరేటర్‌ను ఎన్నుకోవాలి. అంటే ఆ అభ్యర్థికి నేరచరిత్ర ఉండకూడదు.కాంట్రాక్టర్ కాకూడదు. చదువుకున్నవాడై ఉండాలి. నలుగురికీ సేవ చేయాలన్న తపన ఉండాలి. ఇటువంటి అభ్యర్థులను గెలిపించుకునేందుకు సిటీ వాసులు కూడా ఓటింగ్‌కు పోటెత్తాలి. గతంలో నమోదైన 35 శాతం పోలింగ్‌ను 70 శాతం వరకు పెంచాలి. యువత ఇందులో ప్రధాన పాత్ర పోషించాలి..’అని పిలుపునిస్తోంది 20 పౌరసేవా సంస్థలు, 30 మంది సామాజిక కార్యక్రమాలతో ఏర్పాటైన తెలంగాణ ఎలక్షన్ వాచ్. ఈ కార్యక్రమ ఉద్దేశాలను లక్డీకాపూల్‌లోని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ కన్వీనర్ పద్మనాభ రెడ్డి, ఆర్డబ్ల్యూఏ ప్రతినిధి డాక్టర్ రావ్ చెలికాని, అప్పా డెరైక్టర్ శ్రీనివాస్, లెట్స్ వోట్ నిర్వాహకుడు రాఘవేంద్ర మీడియాకు తెలిపారు. తమ సంస్థ ఏ రాజకీయ పార్టీకి, వ్యక్తికి సంబంధించింది కాదని స్పష్టం చేశారు. నేర చరితులు పాలకులుగా ఎంపిక కాకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లకు లేఖలు రాసి నేరగాళ్ల జాబితాను తీసుకుంటున్నామని తెలిపారు. నామినేషన్ సమయాల్లో అభ్యర్థులు సమర్పించే ఆఫిడవిట్లతో వారికి ఏమైనా నేరచరిత్ర ఉందో తెలుసుకుంటామన్నారు. ఒక వేళ నేరచరితులు ఎన్నికల్లో పాల్గొంటే.. ఓటింగ్ కి నాలుగు రోజుల ముందు నుంచి అభ్యర్థుల నేర చరిత్రను జనానికి చెబుతామన్నారు. నో యువర్ క్యాండిడేట్ పేరుతో ఉమ్మడి చర్చా వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాగా.. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రచారం చేయనున్నట్లు వివరించారు. ఎన్నికల ముందు, పోలింగ్ రోజు జరిగే అక్రమాలపై ప్రజలకు సమాచారం ఇచ్చేలా నిఘావేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా.. కార్పోరేటర్ కావాలంటే రాజకీయ పార్టీలన్నీ మంచివారికే టికెట్ ఇవ్వాలనీ.. స్థానికులకే టికెట్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశామని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ లేఖకు సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.