telangana universities
-
వర్సిటీల్లో పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 11 విశ్వ విద్యాలయాల్లో త్వరలో చేపట్టనున్న 1,061 అధ్యాపక నియామకాల్లో 100 మార్కుల వెయిటేజీతో స్క్రీనింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెట్/స్లెట్/సెట్ ఉన్న సబ్జెక్టులకు రాత పరీక్ష లేకుండానే వెయిటేజీ ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా ఈ విధానాన్ని సూచించింది. ఈ మేరకు ఈనెల 19న విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య నియామకాల మార్గదర్శకాలను పేర్కొంటూ జీవో 2ను జారీ చేశారు. ఇందులో గరిష్టంగా 50 మార్కులు అకడమిక్ రికార్డులకు, 30 మార్కులు సబ్జెక్టు నాలెడ్జి, టీచింగ్ స్కిల్స్‌కు, 20 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించాలని స్పష్టం చేశారు. నెట్/స్లెట్/సెట్ లేని సబ్జెక్టులకు రాత పరీక్ష నెట్/స్లెట్/సెట్ లేని టెక్నికల్/ఇంజనీరింగ్/ఇతర ప్రత్యేక సబ్జెక్టులకు సంబంధించి మాత్రం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్ష నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. ప్రతి తప్పుడు జవాబుకు పావు మార్కు కట్ చేస్తారు. పరీక్ష సిలబస్, పరీక్ష విధానం గేట్ తరహాలో ఉంటుంది. అయితే ఆ 100 మార్కులకు వాటిని 14 మార్కులకు నార్మలైజ్ చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయా సబ్జెక్టులకు సంబంధించి అభ్యర్థికి పీహెచ్డీ ఉంటే పీహెచ్‌డీకి 7 మార్కులను కేటాయించాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కులను మాత్రం మరో 7 మార్కులకు నార్మలైజ్ చేయాలి. మార్గదర్శకాల్లోని మరిన్ని అంశాలు.. పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశాక, అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రతి యూనివర్సిటీ.. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి సబ్జెక్టు వారీగా స్క్రూటినీ కమిటీలను ఏర్పాటు చేయాలి. అందులో సంబంధిత సబ్జెక్టు డీన్, వైస్ చాన్స్‌లర్ నామినీ, ఇతర యూనివర్సిటీల నుంచి సబ్జెక్టు నిçపుణుడు, ఉన్నత విద్యా మండలి నామినేట్ చేసే సబ్జెక్టు నిపుణుడు, డిపార్ట్మెంట్ హెడ్, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఉండాలి. -
9 వర్సిటీలకు వీసీల నియామకం
హైదరాబాద్: తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి పదవి విరమణ చేసిన ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డిని జేఎన్ టీయూ వీసీగా నియమించింది. తెలుగు యూనివర్సిటీ వీసీగా ఎస్ వీ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సాంబశివరావులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక ఉస్మానియ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా రామచంద్రం నియమితులయ్యారు.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా సీతారామారావు, కాకతీయ వీసీగా సాయన్న, ఆర్ జేయూకేటీ వీసీగా సత్యనారాయణ, పాలమూరు వర్సిటీ వీసీగా రాజారత్నం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగగా ప్రవీణ్ రావులను నియమించారు. -
యూనివర్సిటీలకు కొత్త చట్టం
-
యూనివర్సిటీలను గాడిలో పెట్టాల్సిందే: కేసీఆర్
ఇష్టారాజ్యంగా నడుస్తున్న యూనివర్సిటీల పాలనా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీల స్థితిగతులను ఆయన సమీక్షించారు. అవసరమైతే యూనివర్సిటీల చట్టంలో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. అన్ని యూనివర్సిటీలకు ఒకే వ్యక్తి చాన్సలర్‌గా ఉండటం వల్ల పర్యవేక్షణ కష్టం అవుతుందని, యూనివర్సిటీల అవసరాలను బట్టి అనుభవం, నైపుణ్యం ఉన్నవారిని చాన్సలర్లుగా నియమిస్తామని ఆయన అన్నారు. చాన్సలర్లను నియమించే అధికారం ప్రభుత్వానికే ఉండాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వైద్య, ఆరోగ్యశాఖను కూడా విద్యాశాఖ పరిధిలోకి తెస్తామని, వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్.. సనత్ నగర్ పరిధిలోని ఇందిరానగర్ బస్తీని సందర్శించారు. బస్తీలలోని ప్రజలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, ఇరుకైన ఇళ్లలో కనీస వసతులు లేని బస్తీలలో సుమారు 2 లక్షల కుటుంబాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వీరందరికీ దశల వారీగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ఇందిరానగర్ బస్తీ వాసుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలుకు ఎదురుగా ముస్లిల కోసం కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపడతామని ఆయన అన్నారు.