సదర్ సందడి
నగరంలో రెండో రోజూ సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగారుు. దున్నపోతుల విన్యాసాలు.. డప్పుదరువులు.. కళాకారుల నృత్యాలు.. యువత జోష్తో సదర్ సమ్మేళనం సందడిగా సాగింది. యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నారాయణగూడ చౌరస్తాలో నిర్వహించిన తెలంగాణ యాదవ సదర్ సమ్మేళనం ఆకట్టుకుంది.
వేడుకలో హోంమంత్రి నారుుని నర్సింహారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, టీజీవో నగర అధ్యక్షులు కృష్ణయాదవ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. - కాచిగూడ