telaprolu
-
గన్నవరంలో టీడీపీ గలాటా
సాక్షి, మచిలీపట్నం/జగ్గయ్యపేట అర్బన్/ఉంగటూరు: కృష్ణాజిల్లాలో టీడీపీ నాయకులు గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీపై దాడులకు పాల్పడ్డారు. గన్నవరం మండలం ముస్తాబాద్ వద్ద యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు, వైఎస్సార్సీపీ కేడర్‌ను రెచ్చగొట్టడంతో తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న వల్లభనేని వంశీ అక్కడికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు విసురుకున్నారు. ⇒ ఉంగుటూరు మండలం తేలప్రోలు జెడ్పీహైస్కూల్లో ఉన్న 271, 273, 274, 275 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదు పరీశీలించేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావు తన అనుచరులతో ర్యాలీగా చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చిన ఆయన వైఎస్సార్సీపీ నాయకులను రెచ్చగొట్టేలా వల్లభనేని వంశీని, సీఎం జగన్‌ను అసభ్యపదజాలంతో దూషించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు చేరడంతో దాడికి పాల్పడ్డారు.వల్లభనేని వంశీమోహన్ అక్కడకు చేరుకుని కవ్వింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి రవికుమార్, ప్రత్తిపాటి జీవన్‌కుమార్, భీమవరపు యతేంద్ర రామకృష్ణ, తదితరులు తీవ్రంగా గాయపడ్డాడు. వారంతా అవుటుపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.⇒ అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలంకలో వైఎస్సార్సీపీ నాయకుడైన మండల బీసీ సెల్ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావు, ఆయన కుమార్తె కేసాని తేజశ్రీలపై జనసేన నాయకులు దాడికి దిగారు. తండ్రిని కొడుతుండగా కుమార్తె తేజశ్రీ అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆమెపై దాడి చేసి కాలు విరగ్గొట్టారు.కౌన్సిలర్ భర్తపై టీడీపీ గూండాల దాడిఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో సోమవారం పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన 16వ వార్డు కౌన్సిలర్ తన్నీరు నాగమణి భర్త, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి తన్నీరు నాగేంద్రపై స్థానిక టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగేంద్ర ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక చెరువుబజారులోని బీసీ కమ్యూనిటీ భవన్లో ఏర్పాటుచేసిన 33వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఒక మానసిక దివ్యాంగుడికి సహాయంగా అతని కుటుంబ సభ్యుని అనుమతించాలని తన్నీరు నాగేంద్ర ప్రిసైడింగ్ అధికారి అనుమతి తీసుకునేందుకు బూత్‌లోకి వెళ్లారు.అదే సమయంలో స్థానిక టీడీపీ వ్యక్తులు నడిగొండ్ల సతీష్, తాళ్లూరి సోమయ్య, అతని కుమారుడు తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఉత్తపళ్ల వెంకటేశ్వర్లు ఆయనపై దాడికి పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు అరగంట ముందు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సోదరుడు శ్రీరాం చినబాబు అదే బూత్ వద్దకు వచ్చి టీడీపీ నాయకులతో మంతనాలు జరిపాడనీ, ఆయన సూచనతోనే ఈ దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోదరుడు సామినేని రవిచంద్, ఉదయభాను కుమారుడు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, ఉదయభాను కుమార్తె పద్మ ప్రియాంక, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్(చిన్నా), పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్(బాజి) ఇరువర్గాలను విడదీసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఎమ్మెల్యే ఉదయభాను సోదరి చాముండేశ్వరి(బేబి)ని కూడ దుండగులు తోసేయడంతో ఆమె కింద పడి కాలుకు ఫ్రాక్చర్ అయింది. -
వైఎస్ఆర్ సీపీ నేత ఇల్లు కూల్చివేతపై నోటీసులు
►యథాతథస్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశం ►వివరణ ఇవ్వాలని అధికారులకు నోటీసులు ►తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా హైదరాబాద్ : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వి.సాంబిరెడ్డి ఇంటి కూల్చివేతపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ కూల్చివేత వ్యవహారంలో యథాతథస్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సాంబిరెడ్డి చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి, తేలప్రోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉంగుటూరు తహసీల్దార్లకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ రెండు వారాలు వాయిదా వేశారు. తన ఇల్లు పంచాయతీ స్థలంలో ఉందంటూ తన ఇంటిని కూల్చేసేందుకు గ్రామ పంచాయతీ నోటీసు ఇచ్చిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే పంచాయతీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ తేలప్రోలు గ్రామానికి చెందిన సాంబిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌ది గ్రామకంఠంలో ఉన్న ఇల్లని తెలిపారు. 50 ఏళ్లుగా ఇంటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తున్నారని తెలిపారు. అయితే ఇల్లు గ్రామపంచాయతీ స్థలంలో ఉందని, దానిని ఖాళీ చేయకపోతే ఈ నెల 30న కూల్చేస్తామని ఈ నెల 27న పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారన్నారు. పక్కనే ఉన్న మరో ఇంటినిగానీ, గ్రంథాలయం జోలికి పంచాయతీ అధికారులు వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా సాంబిరెడ్డికి మాత్రమే నోటీసు ఇచ్చారని ఆయన హైకోర్టు దృష్టికి తెచ్చారు. సర్పంచ్ కావాలనే ఈ విధంగా కక్షసాధింపు చర్యలు పూనుకుంటున్నారని, ఇంటిని కూల్చాలన్న ఏకైక లక్ష్యంతోనే 30 నుంచి గ్రామంలో 144 సెక్షన్ విధించారని, గ్రామకంఠం అంటే పంచాయతీ భూమి కాదని గతంలో హైకోర్టు తీర్పు కూడా చెప్పిందని పొన్నవోలు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి సాంబిరెడ్డి ఇల్లు కూల్చివేత వ్యవహారంలో యథాతథస్థితి (స్టేటస్కో) కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలు వాయిదా వేశారు. -
జాతీయ పోటీలకు తేలప్రోలు విద్యార్థులు
తేలప్రోలు (ఉంగుటూరు): జాతీయస్థాయి పోటీలకు తేలప్రోలు విద్యార్థులు ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు టి.ప్రసాదు శుక్రవారం తెలిపారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు జెడ్పీలో సబ్ జూనియర్స్ రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలలో కృష్ణాజిల్లా జట్టు తృతీయ స్థానం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయులు రాంబాబు వివరించారు. తేలప్రోలు విద్యార్థులు కె.అనూష, జి.నవీన్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. సెప్టెబంరు 12 నుంచి 16 వరకు కేరళలోని తిరువనంతపురంలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడాకారులను సర్పంచ్ భీమవరపు హరిణికుమారి, ఎస్ఎంసీ చైర్మన్ వింత రమేష్‌రెడ్డి, టి.శ్రీలత తదితరులు అభినందనలు తెలిపారు.