Television broadcasts
-
ఐపీఎల్లో పది సెకన్ల యాడ్‌కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా?
కరోనా సంక్షోభంతో ఆదాయం పడిపోయిన టెలివిజన్ రంగానికి ఆటలు ఊపిరి పోస్తున్నాయి. ఒకప్పుడు టీవీ యాడ్ రెవెన్యూలో పది శాతంగా ఉన్న స్పోర్ట్స్ వాటా ఇటీవల 20 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా టీమిండియాలో క్రికెట్లో విజయాలు సాధిస్తుంటే దానికి తగ్గట్టుగా టీవీల యాడ్ రెవిన్యూ బౌండరీలు దాటేస్తోంది. ఆదుకున్న ఆస్ట్రేలియా పర్యటన కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఒక్కసారిగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. వ్యాపారాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో దాని ప్రభావం అడ్వెర్‌టైజ్ రంగంపై పడింది. దీంతో యాడ్ రెవెన్యూ ఆధారంగా నడిచే టెలివిజన్ రంగానికి పెద్ద చిక్కే వచ్చి పడింది. అయితే ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా సంచలనం సాధించడం.. ఆ వెంటనే ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకవడంతో ఒక్కసారిగా యాడ్ రెవెన్యూ పట్టాలెక్కింది. మధ్యలో కరోనా కరోనా సెకండ్ వేవ్ ఇబ్బంది పెట్టినా టోక్యో ఒలింపిక్స్ ఆదుకున్నాయి. పెరిగిన స్పోర్ట్స్ వాటా టీవీ యాడ్ రెవెన్యూలో కరోనా ముందు వరకు స్పోర్ట్స్ వాటా 10 నుంచి 15 శాతం వరకే ఉండేది. అయితే ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ప్రారంభంతో ఒక్కసారిగా యాడ్ రెవెన్యూ వాటా 20 శాతానికి పెరిగిందని ఇంటిగ్రేటెడ్ మీడియా ఆఫ్ అడ్వెర్టైజింగ్ కంపెనీ డీడీబీ గ్రూప్ ఎండీ రామ్ మోహన్ సుందరమ్ తెలిపారు. కరోనాకి ముందు టీవీ యాడ్ రెవెన్యూ రూ. 28,000 కోట్లు ఉండగా ఇందులో క్రీడల వాటా రూ. 2,500 కోట్లుగా ఉండేంది. ఐపీఎల్ తర్వాత ఇది ఏకంగా రూ. 4500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు చేరుకుందని ఆయన వెల్లడించారు. అగ్రస్థానం క్రికెట్‌దే టీవీలకు ఆదాయం సంపాదించి పెడుతున్న ఆటల్లో క్రికెట్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్ ద్వారా రూ.300ల నుంచి రూ. 400 కోట్ల ఆదాయం వచ్చింది. త్వరలో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ ద్వారానే రూ.1,200 కోట్ల రెవెన్యూ వస్తుందని యాడ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 14 సీజన్ యాడ్ రెవిన్యూ విలువ అయితే ఏకంగా రూ. 2,500 కోట్లుగా ఉంది. క్షణానికి లక్ష ప్రపంచకప్, టోక్యో ఒలింపిక్స్‌లను మించిన డిమాండ్ బుల్లితెరపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్‌కి ఉంది. ఇటీవల మధ్యలో ఆగిపోయిన సీజన్ 14కి సంబంధించి కేవలం పది సెకన్ల యాడ్‌కి రూ. 14 లక్షల వంతున ఛార్జ్ చేశాయి టీవీలు. అంటే ఒక్క సెకనుకి లక్షకు పైగానే ధర పలుకుతోంది. అయినా సరే కార్పొరేట్ కంపెనీలు వెనక్కి తగ్గడం లేదు. టీవీలు అడిగినంత సొమ్ము చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటున్నాయి. సినిమాను దాటేసింది ఇండియన్ టెలివిజన్ యాడ్ రెవిన్యూలో ఇప్పటికీ అగ్రస్థానం సీరియల్లే ఆక్రమించాయి. ఆ తర్వాత సినిమాలు, న్యూస్, స్పోర్ట్స్, మ్యూజిక్, కిడ్స్ విభాగాలు ఉండేవి. క్రమంగా సినిమాలను స్పోర్ట్స్ వెనక్కి నెట్టేస్తోంది. పిచ్ మాడిసన్ 2019 రిపోర్టు ప్రకారం యాడ్ రెవెన్యూలో న్యూస్ వాటా 11 శాతం ఉండగా స్పోర్ట్స్ వాటా 10 శాతానికి చేరుకుంది. సినిమాలు 8 శాతానికే పరిమితం అయ్యాయి. మ్యూజిక్, కిడ్స్ 3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. చదవండి : Jeff Bezos: ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్ బెజోస్..! -
'17 అయితే 28 గా చూపించారు.. ఏం తాగి వచ్చారా?'
బ్రిస్టల్: టీమిండియా యంగ్ ఉమెన్ క్రికెటర్ షఫాలీ వర్మకు చిత్రమైన అనుభవం ఎదురైంది. అయితే ఆ అనుభవం బ్యాటింగ్ విషయంలో కాదు.. ఆమె వయస్సు విషయంలో. విషయంలోకి వెళితే.. టీమిండియా మహిళల జట్టు ఆదివారం ఇంగ్లండ్ మహిళల జట్టుతో తొలి వన్డే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో షఫాలీ వర్మ టీమిండియా తరపున వన్డే క్రికెట్లో 131వ వుమెన్ క్రికెటర్‌గా అరంగేట్రంచేసింది. 17 ఏళ్ల వయసులోనే షఫాలీ టీమిండియా మహిళల వన్డే జట్టులో చోటు దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఇంతవరకు బాగానే ఉంది. మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా వుమెన్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా షఫాలీ వర్మ, స్మృతి మందన క్రీజులోకి వచ్చారు. మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సోనీ టెన్ చానెల్ నిర్వహకులు షఫాలీ స్టాట్స్‌ను తప్పుగా చూపెట్టారు. షఫాలీ వయస్సు 17 ఏళ్లు అయితే.. ఆమెకు 28 ఏళ్లు అన్నట్లుగా టీవీలో డిస్ప్లే అయింది. ఇంకేముందు ఇది గమనించిన నెటిజన్లు చానెల్ నిర్వాహకులను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడేసుకున్నారు. ''షఫాలీ వయస్సు 17 అయితే.. 28 అని చూపించారు.. ఏం తాగి వచ్చారా..? అరంగేట్రం మ్యాచ్‌లోనే షఫాలీకి వింత అనుభవం.. ఆమెకు తన వయస్సును తప్పుగా చూపించారని తెలిస్తే ఏమవుతుందో పాపం.. చానెల్ నిర్వాహకులు నిద్రపోతూ పనిచేస్తున్నారు''అంటూ కొందరు కామెంట్లు చేశారు. కాగా షఫాలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా షఫాలీ వర్మ టీ20ల్లో దూకుడైన ఆటతీరు కనబరుస్తూ అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. తన దూకుడైన ఆటతీరుతో సెహ్వాగ్‌ను గుర్తుకుతెస్తున్న షఫాలీ కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉంది. ఆమె ఫామ్‌ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఆమెకు వన్డేల్లో ఆడే అవకాశం కల్పించింది. కాగా షఫాలీ టీమిండియా తరపున 22 టీ20ల్లో 617 పరుగులు చేయగా.. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక టీమిండియా మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా వుమెన్స్ జట్టు ప్రస్తుతం 36 ఓవర్లు ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ 41, దీప్తి శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు షఫాలీ 15, సృ్మతి మందన 10 పరుగులు చేసి ఔటయ్యారు. చదవండి: లూయిస్, గేల్ సిక్సర్ల సునామీ.. విండీస్‌దే తొలి టీ20 Look at the age of Shafali verma, 28??🤔😒 Google uncle says just 17 years 😐#ENGvIND pic.twitter.com/48RsrPnpXw — Priya💙Addict (@impriyafan) June 27, 2021 Sony people are drunk or what 😭 Showing Shafali's age as 28 — Udit (@udit_buch) June 27, 2021 -
ఆత్మవిశ్వాసమే దిక్సూచిగా...
విజయయాత్ర పందొమ్మిది వందల ఎనభైల కాలం... టెలివిజన్ ప్రసారాలు అప్పుడప్పుడే సామాన్యులను చేరాయి. అప్పట్లో దూరదర్శన్ ఒక్కటే ఏకైక తెలుగు దృశ్యశ్రవణ మాధ్యమం. టీవీలో ఏ బొమ్మ వచ్చినా ఆశ్చర్యమే. ఆ నేపథ్యంలో ఓ కుర్రాడు ఒకే ఒక కార్యక్రమాన్ని విపరీతంగా చూసేవాడు. అతడి దృష్టి టీవీలో ప్రసారమవుతున్న గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన వారి మీదనే కేంద్రీకృతం అయ్యేది. ఆ జాబితాలో తన పేరు ఉండాలనే ఆకాంక్ష మనసులో నాటుకుంది. కట్ చేస్తే... 2014 మే నెలకంతా ‘ఒక దేశంలో అత్యధిక దూరం సైకిల్ మీద పర్యటించిన వ్యక్తి’గా గిన్నిస్ బుక్‌లో పేరు నమోదు చేసుకున్నాడా యువకుడు. అతడి పూర్తి పేరు ఆర్కాట్ నాగరాజు, వయసు 36 సంవత్సరాలు. కామర్స్‌లో పట్టభద్రుడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నాగరాజు ప్రస్తుతం దుబాయిలో ఎస్టిమేషన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విభాగంలో మేనేజరు. గిన్నిస్ రికార్డులో చేరాలన్న చిన్నప్పటి కోరికకు పెద్దయ్యాక దేశమంతటినీ చూడాలనే కోరిక తోడయింది. సైకిల్ యాత్ర ద్వారా రికార్డు సాధించారు. విజయారంభం! నాగరాజు సైకిల్‌యాత్ర గడచిన ఏడాది అక్టోబర్ 14వ తేదీన విజయదశమి రోజున సికింద్రాబాద్‌లోని సీతాఫల్మండిలో అతడి ఇంటి నుంచి ప్రారంభమైంది. నిరంతరాయంగా 135 రోజుల పాటు కొనసాగి ఈ ఏడాది ఫిబ్రవరి 25న ముగిసింది. ఈ మొత్తం పర్యటనలో నాగరాజు 14,197.55 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. నాగరాజు ప్రస్థానంలో 21 రాష్ట్రాలనూ, కేంద్రపాలిత ప్రాంతాలనూ సందర్శించారు. 2012 ఆగస్టు 25 నుంచి 2014 ఫిబ్రవరి 25 వరకు పద్దెనిమిది నెలల్లో మూడు దఫాలుగా 22.5 వేల కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ మీద పయనించారు. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ ఏకత్వభావమే కనిపించింది అంటారాయన. నగరాల్లో వెళ్తున్నప్పుడు చాలామంది ఆసక్తిగా చూసి వెళ్లిపోయేవారు. పట్టణాలు, గ్రామాల్లో ఎదురు వచ్చి ఆపేసి ‘సైకిల్ మీదనా, దేశమంతా పర్యటనా’ అని ఆశ్చర్యపోయేవారు. ఆతిథ్యం ఇచ్చి ప్రేమగా వీడ్కోలు చెప్పేవారు. అలాంటి అనేక సంఘటనలు నాలో ఎప్పటికప్పుడు ఉత్తేజాన్ని నింపేవి. కేరళకు చెందిన గురుప్రసాద్ గ్వాలియర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో పనిచేస్తారు. ఆయన నా రాక గురించి తెలుసుకుని ఆగ్రాలో నా కోసం ఎదురు చూస్తూ నన్ను ఆనందంగా ఆహ్వానించారు. ఆ కుటుంబం నన్ను చాలా ఆత్మీయంగా చూసుకోవడాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను’’ అంటారు నాగరాజు. ఫేస్బుక్లో అప్డేట్స్... సాధారణంగా రికార్డు కోసం చేసే పర్యటనల్లో ఒకరు సైకిల్ మీద వెళ్తుంటే వెనుక మరో వాహనంలో సహాయకులు అనుసరిస్తుంటారు. కానీ నాగరాజు అలాంటి సహాయాలు తీసుకోకుండా పర్యటించారు. ‘‘ఏ రోజు ఎక్కడ పర్యటించాను, ఎవరెవరిని కలిశాననే వివరాలను రోజూ ఫేస్బుక్లో అప్డేట్ చేస్తూ వచ్చాను. ‘టూర్ ఆఫ్ ఇండియా ఆన్ పెడల్ అండ్ శాడిల్’ పేరుతో నా సైకిల్ పర్యటన వివరాలుంటాయి. భవిష్యత్తులో ఇలాంటి సాహసం చేయాలనుకునే వారికి నా ప్రయాణం గెడైన్స్ అవుతుంది’’ అన్నారు. యాత్రకు తనను తాను... రికార్డు యాత్రకు తనను తాను సిద్ధం చేసుకోవడం కీలకమైన విషయం. 2012లో మొదటిసారి హిమాలయ పర్వతప్రాంతంలో సైకిల్‌పై పర్యటించినప్పుడు నాగరాజు వేగం గంటకు పన్నెండు కిలోమీటర్లకు మించలేదు. దేశమంతా పర్యటించాలంటే కనీసం గంటకు పాతిక కిలోమీటర్ల వేగం తప్పదని నిర్ణయించుకున్న తర్వాత వేగం పెంచడం మీద దృష్టి పెట్టారు. ఏడెనిమిది నెలలపాటు శ్రమించాక వేగం పెరగడంతోపాటు ఆగకుండా యాభై కిలోమీటర్లు ప్రయాణించే శక్తి వచ్చింది. ప్రయాణంలో పదనిసలు... సాహసయాత్ర చేయాలనుకునే వారికి ‘‘వాతావరణ పరిస్థితులకు వెరవకుండా ఎవరికి వారు తమ మీద తామే విశ్వాసంతో ముందుకు సాగిపోవాల’’ని చెబుతారు నాగరాజు. సమాచారం విస్తృతంగా ఉన్న నేటి రోజుల్లో గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. గిన్నిస్ రికార్డు వెబ్‌సైట్‌ని బ్రౌజ్ చేస్తే సమగ్రమైన సమాచారం తెలుస్తుంది. అదే దిక్సూచి అని ప్రోత్సహిస్తున్నారాయన. అందమైన నా దేశం! మన దేశంలో ప్రతి ప్రాంతం దానికంటూ ఒక అందాన్ని సొంతం చేసుకున్న అందమైన ప్రదేశమే. ఈ పర్యటనలో ప్రతి క్షణాన్నీ, ప్రతి సన్నివేశాన్నీ సంతోషంగా ఆస్వాదించాను. నా ప్రయాణంలో బీహార్, పశ్చిమబెంగాల్ రోడ్లు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించాయి. వాతావరణ పరంగానాకు చాలెంజ్‌గా నిలిచింది గుజరాత్ - ఒరిస్సా మధ్య నాలుగువేల కి.మీ.ల ప్రయాణం. విపరీతమైన చలి, మంచు కారణంగా ఒంట్లో నుంచి వణుకు పుట్టేది. ఉత్తర ప్రదేశ్ వాళ్ల మాట కరుకుదనంతో మనసుకు ఇబ్బంది కలిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలు సైకిల్ మీద హెల్మెట్ ధరించి వెళ్లడాన్ని చూసి పెద్దగా నవ్వారు. - ఆర్కాట్ నాగరాజు