the Telugu Desam Party
-
ఇంకెన్నాళ్లో..
అనంతపురం టౌన్ : అనంతపురం మునిసిపాలిటీకీ కార్పొరేషన్ హోదా లభించి తొమ్మిదేళ్లు దాటినా, శివారు పంచాయతీల పరిధిలోని కాలనీలను విలీనం చేయాల్సిన ప్రక్రియకు నేటికీ మొక్షం లభించలేదు. ఈ విషయంలో అనంతపురం కార్పొరేషన్‌పై గత ప్రభుత్వమే కాదు ఇప్పటి ప్రభుత్వం కూడా చిన్న చూపు చూస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మొదలు రాష్ట్రంలోని చిన్నా, పెద్ద మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటైన పురపాలకాలలో పరిసర పంచాయతీలను గత ప్రభుత్వ హయాంలోనే విలీనం చేసే ప్రక్రియ చేపట్టారు. అనంత కార్పొరేషన్లో మాత్రం ఆ పని చేపట్టలేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. వీరు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ, పాలకవర్గం కానీ పంచాయతీల విలీనం గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించం లేదు. పంచాయతీలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్‌కు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సర్ చార్జీ రూపంలో ఏటా రూ.5 కోట్లకు పైగానే ఆదాయం సమకూరుతుంది. నగర శివారులోని పంచాయతీలకు చెందిన పలు కాలనీలు ఇప్పటికే నగర పాలక సంస్థ స్థాయిలో సౌకర్యాలు పొందుతున్నాయి. పంచాయతీలు విలీనం చేయడం ద్వారా అవన్నీ పూర్తి స్థాయిలో కార్పొరేషన్ ఆధినంలోకి వస్తాయి. తద్వారా సంస్థకు ఆస్తిపన్ను రూపంలో అదనపు ఆదాయం చేరుతుంది. ఆ నిధులతో విలీన కాలనీలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించేందుకు అవకాశం లభిస్తుంది. ప్రధానంగా తాగునీటి సమస్యను పరిష్కరించవచ్చు. నీటి యుద్ధాలు తప్పుతాయి నగరంలోకి పంచాయతీలను విలీనం చేస్తే తాగు నీటి సమస్యలు ఓ కొలిక్కి వస్తారుు. అనంతపురం నగరానికి పీఏబీఆర్ ప్రాజెక్టు ద్వారా నీరు సంపూర్ణ స్థాయిలో అందుతోంది. చుట్టుపక్కల ఉన్న నారాయణపురం, రుద్రంపేట, కక్కలపల్లి, కక్కలపల్లి కాలనీ, రాజీవ్ కాలనీ, అనంతపురం రూరల్ పంచాయతీల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. కొద్ది రోజుల క్రితం కార్పొరేషన్ నీటిని అనధికారికంగా మళ్లించుకునేందుకు నారాయణపురం గ్రామస్తులు సిద్ధపడ్డారు. ఆ క్రమంలో పెద్ద ఎత్తున్న గొడవలు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో రాళ్లు రువ్వడంతో పోలీసు వాహనం అద్దం పగలడంతో పాటు మహిళ హోంగార్డ్‌కు గాయాలయ్యాయి. దాదాపు పది మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. పంచాయతీలను విలీనం చేస్తే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఏటా రూ.5 కోట్లు ఆదాయం కార్పొరేషన్ పరిధిలో భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి జరిగే అన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి 2 శాతం సర్చార్జిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నగర పాలక సంస్థ తరఫున ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తుంది. ఏటా కోటి రూపాయల వరకు ప్రభుత్వానికి ఇలా జమవుతోంది. ప్రస్తుతం పంచాయతీల పరిధిలోనే అధికంగా భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వీటిని కార్పొరేషన్లో విలీనం చేస్తే ఆయా పంచాయతీల పరిధిలో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి 2 శాతం సర్‌చార్జి రూపంలో ఏటా రూ.5 కోట్లకు పైగానే సంస్థ నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. విలీనమయ్యే పంచాయితిలు ఇవే... నగర పాలక సంస్థలోకి బుక్కరాయసముద్రం, రాప్తాడు, కక్కలపల్లి, పాపంపేట, నారాయణపురం, అనంతపురం రూరల్ (ఉత్తర, దక్షిణ పంచాయతీల పరిధిలోని కొంత భాగం విలీనం చేసేలా అధికారులు ఏడేళ్ల క్రితమే ప్రతిపాదనలు తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి పంపించారు.) రాజీవ్ పంచాయతీ కేంద్రీయ ఉద్యానవం, తడకలేరు, మహదేవనగర్, రాజీవ్ కాలనీ, భగత్‌సింగ్ కాలనీ, పొట్టిశ్రీరాములు కాలనీ, ముత్యాలమ్మకాలనీ, రిక్షాకాలనీ, ప్రియాంక నగర్, గుత్తిరోడ్డులోని పరిశ్రమలు. అనంతపురం రూరల్ పంచాయతీ లెనిన్‌నగర్, ఎన్టీఆర్ నగర్, రామకృష్ణనగర్, ఎల్ఐసీ కాలనీ, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలోని ప్రొఫెసర్ కాలనీ, భైరవనగర్, సంఘమిత్ర నగర్ ఎక్స్టెన్షన్, అయ్యప్ప స్వామి గుడి, బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మెటల్ క్రషర్, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, దాని సమీపంలోని మెడికల్ కళాశాలలు. నారాయణపురం పంచాయతి ఎ.నారాయణపురం, సుఖదేవనగర్, అల్లూరి సీతారామరాజు నగర్, రాయల్‌నగర్, స్టాలిన్ నగర్, తపోవనం, సోమనాథ్‌నగర్ ఎక్స్టెన్షన్, బళ్లారి రోడ్డులోని ఎపి లై టింగ్ వరకు. పాంపపేట, విద్యారణ్యనగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, బసవతారక నగర్, జొన్నావీరయ్య కాలనీ, కంబైండ్ ఆటో సర్వీస్. కక్కలపల్లి కాలనీ పంచాయతి నారాయణరెడ్డికాలనీ, సీపీఐ కొట్టాలు, సియాన్నగర్, నందమూరినగర్, పిల్లిగుండ్లకాలనీ. కక్కలపల్లి పంచాయతి సంగమేశ్వర పిక్నిక్ సెంటర్, సహార టౌన్‌షిప్‌లోని కొంత భాగం, బైపాస్‌రోడ్డు. రుద్రంపేట పంచాయతి రుద్రంపేట గ్రామం, శ్రీనగర్‌కాలనీ ఎక్స్టెన్షన్. రాప్తాడు పంచాయతి : సహార టౌన్షిప్లో కొంత భాగం, బైపాస్‌రోడ్డు, ప్రభాకర్ చౌదరి కాలనీ, ఈనాడు ఎడిషన్ కార్యాలయం, వాటర్ వర్క్స్, ఆర్డీటీ స్టేడియం, బెంగుళూరు బైపాస్ రోడ్డు, ఆర్డీటీ బ్రెయిలీ రెసిడెన్సియల్ పాఠశాల, సెయింట్ విన్సెంట్ డీ పాల్ పాఠశాల. ఉప్పరపల్లి పంచాయతి ఆర్డీటీ స్టేడియం, రైస్‌మిల్, ఆటవీ శాఖకు చెందిన నర్సరీ. బుక్కరాయసముద్రం పంచాయతి సమ్మర్ స్టోరేజి ట్యాంక్, విరూపాక్షనగర్, గుత్తిరోడ్డులో తడకలేరు వరకు. ప్రసన్నాయపల్లిగ్రామం, ఎల్‌ఆర్‌జీ స్కూల్, చిన్మయనగర్, కళాకారుల కాలనీ, పోస్టల్ కాలనీ. -
పేరు గొప్ప..
కర్నూలు(జిల్లా పరిషత్) : ప్రజల చెంతకే పరిపాలన అంటూ ప్రారంభించిన ‘జన్మభూమి-మా ఊరు’ తూతూమంత్రంగా కొనసాగింది. అధికారులకు డీజిల్ ఖర్చులు, శ్రమ తప్ప ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని తేలిపోయింది. మరోవైపు ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలా సాగిపోయింది. గత నెల 4వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆళ్లగడ్డ ఉప ఎన్నిక, హుదూద్ తుపాను కారణాల వల్ల మధ్యలో రెండుసార్లు వాయిదా పడింది. దీంతో మూడోసారి అధికారులు హడావుడిగా కార్యక్రమాన్ని ముగించేందుకు షెడ్యూల్ రూపొందించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమం జిల్లాలో మంగళవారంతో ముగియనుంది. జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరుగుతున్న తీరును ‘సాక్షి నెట్వర్క్’ జిల్లాలో పలు ప్రాంతాల్లో సోమవారం పరిశీలించింది. నిర్వహించాల్సిందిలా...! వాస్తవానికి జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలనే విషయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను సూచించింది. వీటి ప్రకారం మా తెలుగుతల్లి గీతం, జన్మభూమి పాట, సీఎం సందేశంతో ప్రారంభించాలి. ఆ తర్వాత మనుషులతో పాటు పశువులకూ వైద్యశిబిరాలను నిర్వహించాలి. {పభుత్వం ప్రకటించిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లపై ఉదయం చర్చించాలి. తర్వాత పింఛన్ల పంపిణీ ప్రక్రియ నిర్వహించాలి. {Vూపులుగా ఏర్పడి పొలాలను సందర్శించాలి. గ్రామ సూక్ష్మ ప్రణాళిక కోసం వివరాలు సేకరించాలి. మధ్యాహ్నం తర్వాత వివిధ అధికారుల టీంలు... గ్రామంలో పర్యటించి సమస్యలు, అవసరాల పై విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలి. ఏడాదిలో సాధించబోయే ప్రగతి, ఐదేళ్లలో సాధించే పనులను ఇందులో పొందుపరచాలి. అంతేకాకుండా... రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా చెప్పుకుంటున్న పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు చేపట్టాలి. జరిగిందే మిటంటే.. అయితే, ‘సాక్షి’ పరిశీలించిన ఏ ప్రాంతంలోనూ జన్మభూమి - మా ఊరు కార్యక్రమం ఈ విధంగా జరగడం లేదు. కేవలం వచ్చిన ప్రజల నుంచి అర్జీలను తీసుకోవడమే కనిపించింది. అధికారుల బృందాలు గ్రామాల్లో పర్యటించడమే లేదు. ఎటువంటి పర్యటనలు లేకుండా కేవలం నివేదికలను పేపర్లో తయారు చేస్తున్నారు. అన్నీ ప్రశ్నలే...! జన్మభూమి కార్యక్రమం మొత్తం ఎక్కడా స్పష్టత లేకుండా గందరగోళంగా కొనసాగుతోంది. జన్మభూమి మొత్తంలో తొలగించిన తమ పింఛన్లు, రేషన్‌కార్డులను తిరిగి పునరుద్ధరించమని ప్రజలు పెద్ద ఎత్తున కోరడం ‘సాక్షి’ పరిశీలనలో కనిపించింది. అయితే, ఏ ఒక్క సమస్యకూ అధికారుల నుంచి కానీ అటు ప్రభుత్వం నుంచి కానీ స్పందన కనిపించ లేదు. వాస్తవానికి తొలగించిన పింఛన్లు, రేషన్‌కార్డులను అక్కడికక్కడే పరిశీలించి పునరుద్ధరించే అవకాశం ఉంది. అయితే, ఎక్కడా ఈ పని జరగలేదు. ప్రభుత్వం నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. పైగా వచ్చిన ఫిర్యాదులను రికార్డు చేస్తున్న సందర్భాలూ లేవు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు కనీసం రసీదు కూడా ఇవ్వలేదు. మరికొన్ని చోట్ల పైస్థాయి అధికారులు వస్తారనుకుంటే మినహా మండలస్థాయి అధికారులు పాల్గొనడం లేదు. తమ కిందిస్థాయి అధికారులను కార్యక్రమానికి పంపించి మొత్తం కార్యక్రమాన్ని మమ అనిపించారు. మరికొన్ని ప్రాంతాల్లో రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని ప్రజలు నిలదీశారు. ఒక్క హామీ లభించలేదు... టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం విఫలమైంది. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు అధికారులు పనిచేయడం లేదు. జన్మభూమిలో సభలో ప్రజలు ఇచ్చిన అర్జీలకు అధికారులు రసీదు ఇవ్వాలన్న నిబంధన ఉన్నా ఎక్కడా పాటించలేదు. కొన్ని చోట్ల నోడల్ అధికారులు డుమ్మా కొట్టడం, మరికొన్ని గ్రామాలకు అధికారులు రాకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో నిర్ణీత సమయానికి ఎక్కడా కార్యక్రమం ప్రారంభం కాలేదు. కార్తీక సోమవారం కావడంతో మహిళలు శైవ క్షేత్రాలకు వెళ్లడంతో మహిళల కొరత తీవ్రంగా ఏర్పడింది. మరికొన్ని చోట్ల వర్షం, కార్తీక మాసం దెబ్బతో సమావేశాలు వెలవెలబోయాయి. మొక్కుబడిగా కొనసాగుతున్న జన్మభూమిలో అర్జీలు ఇచ్చి నిరాశతో వెనుదిరిగివెళ్లారు. ఏళ్లు కావస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ప్రజలు వాపోయారు. సమస్యలు ఏమున్నా మొదటఅర్జీలు ఇవ్వాలని అంటున్న అధికారులు చూస్తాం చేస్తామనడం తప్ప పరిష్కారం చేసిందిలేదని ఆయా గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు అర్జీలు ఇవ్వండి పరిశీలిస్తామని అధికారులు అనడంతో ప్రజలు నిట్టూరుస్తున్నారు. కనీసం హామీ కూడా అధికారుల నుంచి లభించకపోవడంతో కొన్నిచోట్ల శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. సామాజిక పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాల కోసం ఒక్క కర్నూలు నగరంలోనే సోమవారం వరకు 32 వేల దరఖాస్తులు ప్రజల నుంచి రావడం గమనార్హం. వెలవెలబోయిన సభ! కర్నూలు నగరంలో 4వ వార్డులోని బాపూజీనగర్‌లో ప్రజలు లేక జన్మభూమి సభ వెలవెలబోయింది. ముందుగానే పొదుపు మహిళలను తెచ్చి కూర్చోబెట్టాలని అధికారులు ఆదేశించినా, అనేక మంది మహిళలు ఇళ్లల్లో పనులు వదిలేసి రావడానికి ఇష్టపడటం లేదు. ఎర్రబురుజులో పింఛన్లు ఇస్తారంటూ తెలుగుదేశం కార్యకర్తలు మహిళలను అధికంగా తరలించారు. ఈ రెండు సభలకూ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి హాజరుకావడంతో అధికారులు, ఉద్యోగులు కార్యక్రమానికి హాజరయ్యారు. కర్నూలు నగరంలోని 36వ వార్డులోని వీకర్‌సెక్షన్ కాలనీలో జరిగిన వార్డు సభలో ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. అధికంగా పింఛన్లు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు కేవలం దరఖాస్తులు మాత్రం స్వీకరించి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వారిపై వృద్దులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా నగర పాలక సంస్థలో విలీనమైన మామిదాలపాడులో ఏర్పాటు చేసిన గ్రామ సభలో అధికంగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. సభకు రాకపోతే రుణం కట్! రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు హడావుడిగా జన్మభూమి కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్న అధికారులు ఆయా సభలకు జనాన్ని ఎలా రప్పించాలో తెలియక తికమక పడుతున్నారు. చివరికి ఆ బాధ్యతను పొదుపు సంఘాల మహిళలకు అప్పగించారు. ఆయా సమాఖ్యల లీడర్లు వారి గ్రూపులోని సభ్యులను తప్పనిసరిగా కార్యక్రమానికి తీసుకురావాలని ఆదేశించారు. లేనిపక్షంలో రుణాలు ఇప్పించమని బెదిరించాలని చెబుతున్నారు. దీంతో జిల్లాలోని అన్నిచోట్లా జన్మభూమి సభల్లో పొదుపు మహిళలే దర్శనమిచ్చారు. సభకు రాని సభ్యులను గ్రూపులోంచి తీసేస్తామని, రుణాలు రానీయకుండా చేస్తామని లీడర్లు బెదిరిస్తున్నారు. సోమవారం పలు చోట్ల కార్యక్రమానికి హాజరుకాని సభ్యులపై గ్రూపుల లీడర్లు ఇదే విధంగా జులుం ప్రదర్శించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం వార్డు సభలను విజయవంతం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేయడం కనిపించింది. సభల్లో అన్నీ తామై వేదికలపైనే కూర్చుని అధికారాన్ని చెలాయించే దృశ్యాల దర్శనమిచ్చాయి. సభకు వస్తే పింఛన్లు ఇప్పిస్తామంటూ నమ్మబలికి వృద్దులు, వితంతువులు, వికలాంగులను రప్పించారు. వారిచేత అధికారులకు అర్జీలు సైతం వందల సంఖ్యలో ఇప్పించడమూ కనిపించింది. -
క్రిష్టియన్ మైనార్టీకి ‘మొండి చేయి’
ఇద్దరు ముస్లిం మైనారిటీలకు అవకాశం మేయర్‌తో క్రిష్టియన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి స్వామిదాస్ వాగ్వాదం అనంతపురం మెడికల్: అన్ని వర్గాలకు పెద్ద పీట వేస్తామని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నగర పాలక సంస్థ కో-ఆప్షన్ ఎన్నికల్లో క్రిష్టియన్ మైనార్టీకి మొండి చేయి చూపింది. ఎంపీ దివాకర్‌రెడ్డి, చీఫ విప్ కాలవ శ్రీనివాసులు సూచించిన వారికి ఇచ్చిన ప్రాధాన్యత క్రిష్టియన్ మైనార్టీకి ఇవ్వలేదని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. బుధవారం జరిగిన కో-ఆప్షన్ ఎన్నికల్లో మైనార్టీ కోటా కింద ఉన్న రెండు స్థనాలను ముస్లిం వర్గాలక కేటాయించడం వివాదాస్పదమయ్యింది. క్రిష్టియన్ వర్గాలను విస్మరించారంటూ టీడీపీ క్రిష్టియన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఈటె స్వామిదాస్ మేయర్ మదమంచి స్వారూపతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెలితే... కార్పొరేషన్ కౌన్సిల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక విషయంలో మైనార్టీ కోటా కింద ఉండే రెండు స్థానాల్లో ఒకటి ముస్లిం వర్గాలకు, మరొకటి క్రిష్టియన్ వర్గాలకు కేటాయించడం ఆనవాయితీ. ఈసారి క్రిష్టయన్ మైనార్టీకి అవకాశం కల్పించలేదు. దీంతో ఈటెస్వామిదాస్ స్థానం దక్కలేదు. అభ్యర్థులను ఖరారు చేస్తూ పంపిన షీల్డ్ కవర్లో ఆయన పేరు లేదు. మైనార్టీ కోటా కింద ఎన్నికైన ఇద్దరిలో ఎంపీ దివాకర్‌రెడ్డి వర్గానికి చెందిన షరీనా, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు తరఫున మున్వర్ ఉన్నారు. దీంతో ఈటెస్వామిదాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పోడియ వద్దకు వచ్చి మైక్ తీసుకుని... పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వలే దు.. మైనార్టీ కోటా కింద రెండు ముస్లిం వర్గాలకే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై మేయర్ స్పందిస్తూ స్వామిదాస్ నుంచి మైక్ లాక్కున్నారు.ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమని, పార్టీ ఎవరిని సూచించిందో వారినే సభ్యులుగా ఎన్నుకున్నారని ఆమె వివరించారు. సందర్భంగా మేయర్‌తో ఈటెస్వామిదాస్ వాగ్వాదానికి దిగారు. కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నికైనా కృష్ణకుమార్, మరికొందరు కల్పించుకుని ఆయనను శాంతింపచేశారు. -
పింఛన్...టెన్షన్
సాక్షి, కడప : 65 ఏళ్లు... ఈ వయసు రాగానే సాధారణంగా మనిషిలో మార్పు ఉంటుంది. ఎన్నో ఏళ్లు శ్రమకోర్చి వృద్ధాప్యంలోకి వచ్చిన వృద్ధులకు అంతో ఇంతో ఆసరాగా నిలవాలని పింఛన్ పథకాన్ని అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం టీడీపీకి సానుభూతిపరులు, కార్యకర్తలుగా ఉన్న కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా వ్యూహం రచిస్తోంది. కొంతమంది వృద్ధులైతే రూ. వెయ్యి సంగతి ఠమొదటిపేజీ తరువాయి పక్కన పెడితే ఇచ్చే రూ. 200 చాలు దేవుడా అంటూ మొక్కుతున్నారు. గతంలో చంద్రబాబు పరిపాలనలో రూ.75గా ఉన్న పింఛన్‌ను దివంగత సీఎం వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే రూ. 200కు పెంచడంతోపాటు నెలనెలా ఠంచనుగా ఇచ్చేలా అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులకు పింఛన్లను ఇచ్చేలా పథకాన్ని అమలు చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కూడా మంజూరు చేసి పింఛన్‌ను అందిస్తూ వచ్చారు. ప్రస్తుత టీడీపీ సర్కార్ పింఛన్ పెంచుతామని మేనిఫెస్టోలో ఆర్భాటంగా ప్రకటించి తీరా అమలులోకి వచ్చేసరికి అర్హుల పేరుతో కోతకు సిద్ధమైంది. మేనిఫెస్టోలో రూ. 500 పింఛన్ రూ.1000కి, వికలాంగులకు వికలాంగశాతాన్ని బట్టి రూ.1500 చొప్పున పెంచుతున్నట్లు పొందుపరిచారేగానీ.... ఇలా అర్హతలను బట్టి వాతలు పెడతామని మాత్రం పేర్కొనలేదు. పింఛన్ పెంచుతున్న నేపధ్యంలో కొన్నింటినైనా తగ్గించగలిగితే అక్కడి సొమ్మును కూడా ఉన్న వాటికి సర్దవచ్చన్న ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోందని పలువురు లబ్ధిదారులు వేలెత్తిచూపుతున్నారు. కమిటీ పేరుతో కోతలు వైఎస్సార్ జిల్లాలో వృద్ధులు 1,24,319, వితంతువులు 65,078, చేనేతలు 8,813, అభయహస్తం 16,895, వికలాంగులు 30,603, కల్లుగీత కార్మికులు 21 మంది చొప్పునమొత్తం 2,45,729మందికి నెలకు రూ. 6,95,16,700 మొత్తాన్ని ప్రతినెల ప్రభుత్వం పింఛన్ రూపంలో అందజేస్తుంది. అక్టోబరు 2 నుంచి పింఛన్ మొత్తాన్నిపెంచుతున్న నేపద్యంలో టీడీపీ సర్కార్ అనర్హుల పేరుతో లబ్ధిదారుల జాబితాలో కోతకు సిద్ధమైంది. భూమి ఉండకూడదు.. ఇంటిలో ఇన్ని గదులే ఉండాలి.. తదితర కారణాలు చూపుతూ పింఛన్లను తగ్గించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి పలు బృందాలు జిల్లాలోని అనేక మండలాల్లోని గ్రామాల్లో లబ్ధిదారుల అర్హతలు, అనర్హతలపై సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులుగా ఉండాలా? వద్దా?అనే విషయాన్ని నిర్ణయిస్తున్నారు. కమిటీలో ఎంపీడీఓతోపాటు వీఆర్వో, డ్వాక్రా మహిళలు, సర్పంచ్, టీడీపీకి సంబంధించిన నాయకులను కూడా పెట్టి ఎంపిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆందోళనలో లబ్ధిదారులు ఏదో నెలనెలా అంతో ఇంతో పింఛన్ రూపంలో ఇస్తుంటే సర్దుకుని పోయేవాళ్లమని, ఇప్పుడు రూ. 1000 పేరుతో కోతలు పెడితే ఎలా బతకాలని పలువురు వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేయడానికి వయస్సు సహకరించదని, ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధుల పట్ల కనికరం చూపాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ తీరుతో జాబితాలో ఎవరి పేరు ఉంటుందో, ఎవరి పేరు ఊడుతుందో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నాలుగైదు నెలలుగా ఐరిస్, వేలిముద్రలు, ఆధార్‌కార్డుల పేరుతో అధికారులు విపరీతంగా ఇబ్బందులు పెట్టారని, రెండు మూడు నెలలుగా కూడా పింఛన్ ఇవ్వకుండా అది సరిపోలేదు, ఇది సరిపోలేదంటూ సతాయించారని...ఇప్పుడేమో అసలుకే ఎసరు పెట్టేందుకు సిద్ధమవడం ఏమిటంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ ద్వంద్వ వైఖరి
పెట్రో కారిడార్‌పై మాటమార్చడం తగదు ఏపీ రైతు సంఘం ధ్వజం అనకాపల్లి టౌన్, న్యూస్‌లైన్ : ప్రతిపక్షంలో ఉండగా పెట్రో కారిడార్ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మాటమార్చడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, మత్స్యకారుల జీవితాలను సమూలంగా నాశనం చేసే ఈ ప్రతిపాదనలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కార్యవర్గం రౌండ్ టేబుల్ సమావేశం గురువారం అనకాపల్లిలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విశాఖ జిల్లా గంగవరం నుంచి కాకినాడ పోర్టు వరకు ప్రతిపాదించిన కారిడార్ కోసం 10 మండలాల పరిధిలోని 1.5 లక్షల ఎకరాల పంట భూముల్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వామపక్షాలతో కలిసి తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. పీసీపీఐఆర్ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వేలాది రైతు కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయన్నారు. మత్స్యకారులు వేట లేక వీధిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం ఈ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు, సీనియర్ నాయకులు పి.జగన్నాథం, కె.రామ సదాశివరావు, వై.సీతారామ్, నాగిరెడ్డి సత్యనారాయణ, సత్తిబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
చీరాల ఉత్కంఠకు తెర
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా మొదటి ఐదు స్థానాల్లో ప్రకాశం జిల్లా ఒకటిగా నిలిచింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను కూడా ముందుగా జిల్లాలోనే ప్రకటించి అధికారులంతా ప్రశంసలు అందుకున్నారు. పోలింగ్‌లోనూ, ఫలితాల విడుదల్లోనూ ప్రకాశించిన జిల్లాను చీరాలలో తలెత్తిన వివాదం ఒక్కసారిగా తల్లకిందులు చేసింది. అప్పటివరకు వచ్చిన ప్రశంసలు చీరాల ఘటన మాటున కొట్టుకుపోయినట్లయింది. అందుకు కారణం.. ఆ నియోజకవర్గంలో ఈవీఎంలను తారుమారు చేశారన్న ఆరోపణలే. వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. అక్కడి స్వతంత్ర అభ్యర్థి గెలుపునకు ఆ అధికారి కృషి చేశారని ఆరోపించారు. అందుకు బలం చేకూర్చే విధంగా చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో ఈవీఎంలు వెలుగుచూశాయి. దీంతో వివాదం తారాస్థాయికి చేరింది. చివరకు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జోక్యం చేసుకుని గుంటూరు జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్, తెనాలి ఆర్డీవో శ్రీనివాసరావు, బాపట్ల తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లును విచారణాధికారులుగా నియమించారు. వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో ఉన్న 71 ఈవీఎంలను చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సమక్షంలో మంగళవారం విచారణాధికారులు తనిఖీ చేయగా అవి రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలుగా తేలింది. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. నియోజకవర్గంలో ఆరు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. -
నేడు నామినేషన్ల ఉపసంహరణ
టీడీపీలో కొనసాగుతున్న మధ్యస్తాలు స్వతంత్రులకు బీఫాం ఇస్తామంటున్న కాంగ్రెస్ నేతలు అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసిన వైఎస్సార్సీపీ సాక్షి, చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా చిత్తూరు కార్పొరేషన్, ఆరు మున్సిపాల్టీలకు మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. మొత్తం 169 వార్డులకు 1,322 నామినేషన్లు వచ్చాయి. వీటిల్లో తిరస్కరణకు గురైనవి 64 మాత్రమే. సోమవారం కూడా ఆయా వార్డుల్లో పార్టీ అభ్యర్థులకు పోటీగా రంగంలోకి దిగినవారిని బుజ్జగించి తప్పించేందుకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుగుబాటుదారులను ఒప్పించేం దుకు పరుగులు దీస్తున్నా కొన్నిచోట్ల మాత్రమే మధ్యస్తాలు సత్ఫలితాలిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పుత్తూ రు, పుంగనూరు, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తి, మదనపల్లె మున్సిపాల్టీల్లో వైఎస్సార్సీపీ మాత్రం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకుని అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది. టీడీపీ గ్రూప్‌ల గొడవలతో ఇంతవరకూ ఒక్కరిని కూడా అభ్యర్థులుగా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దొరక్క కుస్తీపడుతోంది. స్వతంత్రులకైనా తాము బీఫాం ఇస్తే తీసుకోకపోతారా అన్న ఆశతో వారి వెంటపడుతోంది. సోమవారం రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఇక మంగళవారం నామినేషన్లు ఉపసంహరణ వద్ద దగ్గరుండి కొన్నివార్డులకైనా పోటీ లేకుండా టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులను ఉపసంహరింపజేయాలని స్థానిక తెలుగుతమ్ముళ్లు తంటాలు పడుతున్నారు. తడాఖా చూపుతున్న తిరుగుబాటు తమ్ముళ్లు.... తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన తెలుగు తమ్ముళ్లు తమ తడాఖా చూపిస్తున్నారు. ఇప్పుడు కౌన్సిలర్ టికెట్టు ఇవ్వబోమని చెబితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పవర్ ఏంటో చూపిస్తామని, వార్డుల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల్లు ఎలా పడ్తాయో చూస్తామని, తమ వద్దకు ఇక రావద్దని సంకేతాలు ఇస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాము అంతా వర్కౌట్ చేసుకున్న తరువాత ఇప్పుడు సామాజికవర్గం, డబ్బులు చూసి తమ ప్రత్యర్థులకు, కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి కౌన్సిల్ టికెట్టు ఇస్తామంటే ఎలా అని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను నిలదీస్తున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చేస్తున్న మున్సిపల్ మధ్యస్తాలు కాస్తా ఎక్కడ యూ టర్న్ తీసుకుని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమను దెబ్బతీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. వైఎస్సాఆర్సీపీలో అభ్యర్థుల ఎంపిక పూర్తి చిత్తూరు కార్పొరేషన్లో సోమవారం సాయంత్రం 50 డివిజన్లకు పోటీచేయనున్న అభ్యర్థుల పేర్లను నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ అధికారికంగా విడుదల చేశారు. పుంగనూరు, పుత్తూరు, పలమనేరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, నగరి మున్సిపాల్టీల్లో ఇప్పటికే 169 వార్డులకు అధికారికంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఆయా నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు పూర్తి చేశారు. మంగళవారం నామినేషన్లు ఉపసంహరణ పూర్తయిన వెంటనే ఈ పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. స్వతంత్రుల వెంటపడుతున్న కాంగ్రెస్ జిల్లాలో చాలా చోట్ల సింగిల్ డిజిట్ నామినేషన్లు కూడా పడకపోవడంతో మున్సిపాల్టీల్లో పరువు నిలుపుకునేందుకు కనీసం స్వతంత్రులనైనా బతిమలాడి వారికి పార్టీ బీ ఫాం ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించుకునేందుకు కాంగ్రెస్ నేతలు తంటాలు పడుతున్నారు. ఇందుకోసం జిల్లాలో మున్సిపాల్టీల్లో ఉన్న కిందిస్థాయి కాంగ్రెస్ నాయకులకు డీసీసీ ద్వారా సంకేతాలు పంపుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్టుపై పోటీ చేస్తే, ఇతర పదవుల్లో మీకే ప్రాధాన్యం వస్తుందని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సాయం చేయండి అని పార్టీకి వ్యతిరేకంగా స్వతంత్రంగా నామినేషన్లు వేసినవారి వెంటపడుతున్నారు. అయినా వీరికి అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది.