Telugudesam government
-
సు‘బాబు’ల్ ‘మోసం’
సాక్షి, చీమకుర్తి: ‘‘ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అమలు చేయాలని కలెక్టర్‌ను కలిశాం. మంత్రి దృష్టికి తీసుకుపోయాం. చివరకు జిల్లాకు వచ్చినప్పుడు ఒకసారి, రాజధానికే పోయి మరోసారి సీఎంకు కర్ర కొనుగోళ్లలో జరుగుతున్న అన్యాయంపై మొరపెట్టుకున్నాం. పోరాటంతో ఐదేళ్లు గడిచిపోయాయి గానీ కర్రసాగు చేసే మా బాధలు మాత్రం పరిష్కారం కాలేదని’’ రైతులు వాపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, రైతు సంఘం నాయకులు వివిధ దశల్లో పోరాటాలు చేశారు తప్ప రైతుల కష్టానికి ఫలితం లేదు. జామాయిల్ కర్ర టన్నుకు రూ.4400, సుబాబుల్ కర్రకు రూ.4200 వంతున కొనుగోలు చేయాలని ప్రభుత్వమే జీఓ నంబరు 31 విడుదల చేసింది. ఆ జీవో ప్రకారమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుంటే పేపర్ మిల్లుల యజమానులు మార్కెట్ కమిటీలను తుంగలో తొక్కి ప్రత్యేకంగా దళారులను అడ్డం పెట్టుకొని జామాయిల్ టన్నును రూ.2500, సుబాబుల్ టన్నును రూ.2 వేలు వంతున కొంటూ రైతుల కష్టాన్ని దళారులు, పేపర్ మిల్లుల యాజమాన్యాలు దోచుకుంటున్నాయని రైతులు ఆరోపించారు. దళారులు అక్రమ మార్గంలో కొనుగోలు చేస్తున్న కర్ర లారీలను ఆపి రైతులందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోగా దానిపై మంత్రివర్గ ఉపసంఘం కనీసం కన్నెత్తి కూడా చూడలేదనే విమర్శలు రైతుల్లో వ్యక్తమవుతోంది. పేపర్ మిల్లుల యజమానులు కొనుగోలు చేయకపోగా నిలదీశారనే నెపంతో సంతనూతలపాడు, చీమకుర్తి మండలాలకు చెందిన రైతుల కర్రను కక్ష పూరితంగా కొనుగోలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో 42 శాతం వాటా ప్రకాశం జిల్లాదే: రాష్ట్రంలో సాగయ్యే జామాయిల్, సుబాబుల్లో 42 శాతం వాటా ఒక్క ప్రకాశం జిల్లా నుంచే సాగవుతుందని రైతుసంఘం నాయకుల గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. జిల్లాలో జామాయిల్ 1.07 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. సుబాబుల్ 60 వేల ఎకరాల్లో, సరుగుడు 8 వేల ఎకరాల్లో సాగవుతుందని రైతులు చెబుతున్నారు. గతంలో వర్షాలు పుష్కలంగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలకే పొలంలో కర్ర కోతకు వచ్చేది. నాలుగైదేళ్ల నుంచి సకాలంలో వర్షాలు లేక ఐదేళ్లయినా కర్ర కోతకు రాకపోగా ఒక్కో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అనేక వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ కర్రను కొనుగోలు చేసేవారు లేక కోతకు వచ్చిన కర్ర కూడా పొలాల్లోనే ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మార్కెట్లో పేపర్ ఖరీదు టన్నుకు రూ.15 వేలు పెరిగిందని, గతంతో పోల్చుకుంటే 50 శాతం పేపర్ ధర పెరగగా, దానికి ముడి సరుకుగా ఉన్న సుబాబుల్, జామాయిల్ కర్రకు మాత్రం ఐదేళ్ల క్రితం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకపోగా దానిలో సగానికి సగం కోతపెట్టి సగం ధర మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. -
అప్రజాస్వామిక కమిటీలు
సాక్షి, వెంకటగిరి: ప్రజాస్వామ్యాన్ని అపçహాస్యం చేసేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమ సొంత పార్టీ మనుషులకే అందేలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఐదేళ్లుగా రాజకీయ రాక్షస మూకల కమిటీలుగా మారాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నెగ్గిన ప్రజాప్రతినిధులు, ఎన్నో కఠిన పరీక్షల్లో పాసై ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను ఉత్సవ విగ్రహాలుగా మార్చాయి. జన్మభూమి కమిటీల పెత్తనాన్ని ప్రశ్నించలేక జనం సైతం బాధితులుగా మిగిలిపోయారు. ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో పాలన సాగించింది జన్మభూమి కమిటీలే. అధికారుల సాయంతో ప్రజాప్రతినిధులు పాలన సాగించాల్సి ఉండగా గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీ సభ్యులు వ్యవస్థలో రాజ్యాంగేతర శక్తులుగా రెచ్చిపోయారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. పటిష్టంగా వ్యవహరించాల్సిన అధికార వ్యవస్థ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జన్మభూమి కమిటీలకు దాసోహం అయిందని స్థానికులు చెబుతున్నారు. వ్యవస్థలను అపహాస్యం చేస్తూ.. ప్రభుత్వ పథకాల అమల్లో ఈ కమిటీలదే పెత్తనం కావడంతో ప్రజాస్వామ్య వ్యవస్థనే పరిహాసం చేసేలా బాబు వ్యవహరించారు. టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటయిన జన్మభూమి కమిటీలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి కేవలం అధికారపార్టీ వారికే పథకాలను అందిస్తూ మిగిలిన వారికి తీవ్రంగా అన్యాయం జరిగింది. సబ్సిడీ రుణం మంజూరు కావాలన్నా, పింఛన్‌కు అర్హత సాధించాలన్నా, చివరికి రేషన్‌కార్డు మంజూరు కావాలన్నా క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ప్రభుత్వ తీరుపై వ్యతిరేకతకు బీజం పడింది. అధికారులు సైతం జన్మభూమి కమిటీ సభ్యులు ఎంపిక చేసిన వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించారు. అర్హులైన బాధితులు అధికారులను నేరుగా సంప్రదించి తమ గోడు విన్నవించుకున్నా స్పందించని ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులు అని తెలిస్తే చాటు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాదని తేల్చిచెబుతూ ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్లు నిలిపివేసిన వైనం సర్వత్రా విమర్శలు పాల్జేసింది. అనేక సార్లు వారు అధికారులకు తెలిపినా పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ పరిస్థితి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులయిన వారికి పింఛన్ మంజూరు చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు కూడా జన్మభూమి కమిటీ సిఫార్సు లేనిదే ఏమి చేయలేని పరిస్థితిని కల్పించారు. దీంతో అధికార పార్టీపై వ్యతిరేకత రోజురోజుకూ పెరిగింది. జన్మభూమి కమిటీల పెత్తనం గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాలేదు. మున్సిపాలిటీ పరిధిలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తున్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి వెంటనే జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి. నిరంకుశత్వంతో కూడిన అప్రజాస్వామిక విధానాలకు భిన్నంగా పారదర్శకతతో నిండిన ప్రజాస్వామిక చర్యలను చేపట్టాలి. దీనికి అస్మదీయుల ప్రయోజనాలే కీలకమని భావిస్తే బాధిత ప్రజానీకం తమ సమయం వచ్చినప్పుడు చెప్పే గుణపాఠానికి నాయకులు సిద్ధపడాలని ప్రజలంటున్నారు. అర్హత ఉన్నా పింఛన్ రావడం లేదు ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బొమ్మిరెడ్డి కాంతమ్మ. రాపూరు మండలం సిద్ధవరానికి చెందిన ఆమెకు 69 సంవత్సరాల వయసు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పింఛన్ వస్తుండేది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె అందిస్తున్న పింఛన్ రద్దు చేశారు. పింఛన్ పునరుద్ధరించాలని పలుమార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరు చేయలేదు. జన్మభూమి కమిటీ సభ్యుల నిర్వాకం మూలంగానే తనకు వస్తున్న పింఛన్‌ను నిలుపదల చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారి జన్మభూమి కమిటీలు రద్దు అయితే తప్ప తనకు పింఛన్ అందదని ఆమె చెపుతున్నారు. గూడు చెదిరినా.. గుండె కరగలేదు ఈ ఫొటోలో కనబడుతున్న మహిళ పి.ఈశ్వరమ్మ, మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు వీవర్స్‌కాలనీలో నివాసం ఉంటుంది. ఆమెకు ఉన్న చిన్నపాటి రేకుల ఇంటిలో కుమారుడు, పిల్లలతో కలసి నివాసం ఉంటుంది. ఆమె జీవనం సాగిస్తున్న ఇళ్లు చిన్నపాటి వర్షం పడితేచాలు ఇళ్లు అంతా ఉరిసి తడిసిపోతుంది. దీంతో తమకు పక్కా గృహం మంజూరుచేయాలని పలు మార్లు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులకు విన్నవించుకుంది. అయినప్పటికీ జన్మభూమి కమిటీ సభ్యులయిన టీడీపీ నాయకుల ఆమోదం పొందిన వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తున్నారు తప్ప ఇళ్లు మంజూరుకు అన్నివిదాల అర్హత ఉన్న పేదలకు ఇళ్లు మాత్రం మంజూరు చేయలేదు. దీంతో వి«ధిలేక పలిగిన రేకుల ఇంటిలోనే గాలం వెలదీస్తున్నామని వాపోయారు. శాపంగా మారిన జన్మభూమి కమిటీలు ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి డక్కిలి మండలం మార్లగుంట గ్రామానికి చెందిన ఈగ లక్ష్మయ్య. భార్యా భర్తలు ఇద్దరు 70 ఏళ్లకుపై బడిన వయోవృద్ధులు. ఒక్కరికైనా పింఛన్ మంజూరు చేయాలని అధికారులకు మొరపెటుకున్నా, జన్మభూమి సభల్లో అర్జీలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. నాకు పింఛన్ ఇచ్చేందుకు జన్మభూమి కమిటీలు అడ్డుచెపుతున్నారని అంటున్నారు. గిరిజనులమనే కనికరం కూడా లేకుండా ప్రభుత్వ పథకాల్లోనూ రాజకీయం చేస్తున్న జన్మభూమి కమిటీలే శాపంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రుణాల్లోనూ రాజకీయమే ఈ ఫొటోలో కనబడుతున్న మహిళ పేరు పి.శ్రీదేవి. మున్సిపాలిటీ పరిధిలోని ఉపాధ్యాయనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ప్రభుత్వం ద్వారా మంజూరుచేస్తున్న సబ్సిడీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలు కావడంతో జన్మభూమి కమిటీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా ఆమె పేరుతో అర్హుల జాబితా తొలగించారు. రుణం పొందేందుకు అర్హత ఉన్న జన్మభూమి కమిటీ సభ్యులు అవతారమెత్తిన టీడీపీ నాయకుల అరచకాలకు ఆమె లబ్ధి పోయినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. -
సీఎం హామీలు.. నీటిమూటలు
సాక్షి, వెంకటగిరి: ముఖ్యమంత్రి తమ ప్రాంతంలో పర్యటించి సమస్యల పరిష్కారంపై హమీ ఇచ్చారంటే ఆ ప్రాంతవాసులకు ఆనందమే.. ఆనందం. చిరకాల సమస్యలతోపాటు తమ వ్యక్తిగత సమస్యలూ పరిష్కారం అవుతాయని వారి భావన. ఇదే వెంకటగిరీయుల్లోనూ కనిపించింది. అయితే నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా జన్మభూమి కార్యక్రమంలో భాగంగా డక్కిలి, వెంకటగిరిలో వరదలు పోటెత్తిన సమయంలో 2015 నవంబర్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి ఇచ్చిన హమీలకు ఏళ్లు గడుస్తున్నా మోక్షం లభించని దుస్థితి. దీంతో చంద్రబాబు హామీలను నమ్మలేం అంటూ స్థానికులు పెదవి విరుస్తున్నారు. సమన్వయం లేక ఆగిన ఎస్ఎస్ కెనాల్ జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీటి నిల్వలు అందించడంతోపాటు తాగునీటి సమస్యను దూరం చేయాలన్న సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.350 కోట్లు అంచనా వ్యయంతో తెలుగుగంగ అధికారుల పర్యవేక్షణలో మూడు ప్యాకేజీలుగా పనులు విభజించి ప్రారంభించారు. కాలువ నిర్మాణం చేపట్టే ప్రాంతాల్లో పలు చోట్ల అటవీ అనుమతులు రావాల్సి ఉన్నా అప్పట్లో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కె రామకృష్ణల మధ్య సమన్వయం లేక ప్రాజెక్ట్ ప్రశ్నార్థకం అయింది. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం సకాలంలో అందక పనులు నత్తనడకన సాగాయి. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు నీటిని పంపి అక్కడ నుంచి తెలుగుగంగ ద్వారా తమళనాడు ప్రజల దాహార్తిని తీర్చుతున్న చందంగా కండలేరు జలాలను ఎస్ఎస్ కెనాల్‌కు అందించేందుకు వీలుగా నియోజకవర్గంలోని అల్లూరుపాడు వద్ద రూ.230 కోట్లతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎస్ఎస్ కాలువ నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పనులు ఎప్పటికీ పూర్తవుతాయోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు. తప్పుడు కేసులు.. అరదండాలు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రశ్నించిన స్వపక్ష నేతలపైనా పోలీసు కేసులు పెట్టించి జైల్లో కూర్చోపెట్టించిన చరిత్ర వెంకటగిరికే సొంతం. అధికారపార్టీకి చెందిన టీడీపీ కౌన్సిలర్ మంచి బాబు కౌన్సిల్ సమావేశాల్లో అధికారుల తీరు, కమీషన్ల వ్యవహరంపై ప్రశ్నించినందుకే పెన్షన్ వ్యవహరంలో కేసు నమోదు చేయించి బేడీలు వేయించారు. ఇక విపక్షానికి చెందిన నాయకుల మీద అయితే ఐదేళ్లలో లెక్కలేనన్ని తప్పుడు కేసులు నమోదు చేయించారు. వెంకటగిరి మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన సుమారు 57 యాదవ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలవారికిపై సామూహికంగా కేసులు పెట్టించిన సంఘటన వెంకటగిరిలో సంచలనం రేపింది. వివాదరహితులైన వెంకటగిరి రాజా కుటుంబీకులు సైతం ‘నిన్ను నమ్మం బాబూ’ అంటూ టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరడం నియోజకవర్గంలో రాజకీయ సంచలనానికి కేంద్ర బిందువయింది. ఐదేళ్లలో చేసిన పాపాలే శాపాలై పచ్చపార్టీ నేతలకు బుద్ధి చెప్పేందుకు అందరూ రంగం సిద్ధం చేసుకుని పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ మోడల్ కాలనీ ఊసే మరిచారు! సీఎం చంద్రబాబు నాయుడు అదే సంవత్సరం నవంబర్ 20వ తేదీన ఆ కాలనీలో పర్యటించి హామీల వర్షం కురిపించారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరుతో ఉన్న కాలనీ అభివృద్ధిని తన బాధ్యతగా తీసుకుని తక్షణమే డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించి మోడల్‌కాలనీగా మార్చేస్తానని తెలిపారు. ఇది జరిగి సరిగ్గా 40 నెలలు గడిచింది. అయినా ఆ హామీకి సంబంధించి పురోగతి లేకుండా పోయింది. సీఎం హమీల అమలులో ప్రధానభూమిక పోషించాల్సిన అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే రామకృష్ణ, అధికారులు ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా సీఎం హమీ అమలుకాకపోవడంతో ఆ ప్రాంతంవాసుల్లో తీవ్ర నిరాశ అలముకుంది. సీఎం సారు రావడంతో తమ కాలనీ రూపురేఖలు మారుతాయని భావించామని, అయితే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనుషులు లేని చోట రోడ్లు వేసిన స్థానిక టీడీపీ నాయకులు ఏళ్ల తరబడి వర్షం వస్తే మోకాల్లోతు నీళ్లలో నడవాల్సిన ప్రాంతాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము సీఎం హమీ మేరకు రూ.16 కోట్లతో ప్రతిపాదనలు పంపామని అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇక వెంకటగిరి నుంచి నాయుడుపేట మండలం వరకూ ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తామని ఇచ్చిన హామీకి దిక్కులేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతన్నల హమీలదీ అదే దారి! అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్న చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేడు కళాహీనంగా మారింది. శ్రమకు తగ్గ కూలీ లేకపోవడం, మార్కెట్లో ముడిసరుకు ధరలు చుక్కలు తాకడం, ప్రభుత్వ పథకాలు దరిచేరకపోవడం వెరసి చేనేతలు మగ్గాన్ని వీడి ఇతర వృత్తుల్లోకి వెళుతున్నారు. గతంలో ప్రభుత్వం చేనేత కార్మికులకు నెలకు రూ.1000 వంతున ఇస్తున్న సిల్క్ సబ్సిడీని గత 7 నెలలుగా చెల్లించకుండా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చేనేత కార్మికులకు నెలకు రూ.2000 ఇస్తామని హమీలు ఇస్తున్న చంద్రబాబును ఎలా నమ్మాలని చేనేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇక నేతన్నల కుటుంబానికి నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ, వర్షాకాలంలో పనిదినాలు కోల్పోతున్నందుకు నెలకు రూ.2000 వంతున 2 నెలలకు రూ.4000 పరిహారం వంటివి నమ్మదగ్గ హామీలు కాదని వారు పెదవి విరుస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ హామీ అమలు సైతం మరిచిపోయారు. -
తోటపల్లి వెలగాలి
గరుగుబిల్లి (కురుపాం): తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2003లో శంకుస్థాపన చేశారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక జలయజ్ఞంలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టుకు పాలనా అనుమతులను తీసుకొచ్చి పనులను వేగవంతం చేశారు. స్పిల్‌వే, తోటపల్లి కుడిప్రధాన హెడ్ స్లూయిస్, కుడికాలువ నిర్మాణ పనుల్ని 90 శాతం వరకు పూర్తి చేశారు. వైఎస్ ఆకస్మిక మరణంతో ప్రాజెక్టు పనులు మందగించాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కుడికాలువ కల్వర్టు పనులు, స్ట్రక్చర్ పనులను పూర్తిచేసి 2015 సెప్టెంబర్ 10న సాగునీటిని సరఫరా ప్రారంభించారు. కుడి ప్రధాన కాలువ నిర్మాణం ఇలా.. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర నుంచి గుర్ల మండలం గడి గెడ్డ వరకు 117.7 కిలోమీటర్ల కుడి ప్రధాన కాలువ నిర్మాణం చేపట్టారు. ఇందులో నాలుగు బ్రాంచ్ కాలువలు, 29 డిస్ట్రిబ్యూటర్లు, 220 స్ట్రక్చర్లను నిర్మించారు. కుడి ప్రధాన కాలువ ద్వారా విజయనగరం జిల్లాలోని 10 మండలాల్లో 155 గ్రామాలకు 62,055 ఎకరాలకు, శ్రీకాకుళం జిల్లాలోని ఏడు మండలాల్లోని 132 గ్రామాల్లో 57,945 ఎకరాలకు సాగునీరందించడం లక్ష్యం. అంచనాలు మించిన వ్యయం సకాలంలో నిర్వాసితుల సమస్యలు, భూసేకరణ తదితర సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అంచనా వ్యయాన్ని రూ.772.64 కోట్లకు పెంచారు. తరువాత అంచనా వ్యయం రూ.1124 కోట్లకు చేరింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ పనుల నిర్వాహణకు విడుదల చేసిన నిధులు కేవలం రూ.65 కోట్లే. ఈ కొద్దిపాటి నిధులను విడుదల చేసి ప్రాజెక్టును తామే పూర్తి చేశామని.. రైతులను ఆదుకున్నాం అంటూ ప్రసంగాలు చేస్తుంటే రైతులు విస్తుపోతున్నారు. ప్రాజెక్టు అసంపూర్తి పనుల పూర్తికి ఇంకా రూ.300 కోట్లు విడుదల చేయాల్సి ఉందని నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. చెప్పేది లక్షల్లో.. ఇచ్చేది వేలల్లో కుడి ప్రధాన కాలువ నిర్మాణం మినహా పిల్ల కాలువలు నిర్మించకపోవడంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 50 వేల ఎకరాలకు మించి సరఫరా కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. పిల్లకాలువ నిర్మాణానికి ఇంకా 200 ఎకరాల భూసేకరణ జరగాలని అధికారులు చెబుతున్నారు. దీంతో పంట పొలాలకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. నిర్వాసితుల గోడు ప్రాజెక్టు నిర్మాణంలో 21 గ్రామాలు ముంపు గ్రామాలుగా ప్రకటించగా 10 గ్రామాలకు పునరావాసం కల్పించారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేశామని చెప్పుకోవడం తప్ప నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం లేదని ఈ ప్రాంతీయులు ఆరోపిస్తున్నారు. గరుగుబిల్లి మండలంలో సుంకి, నందివానివలస, జియ్యమ్మవలస మండలం బాసంగి, బాసంగి గదబవలస బిత్రపాడు, కొమరాడ మండలం కళ్లికోట, దుగ్గి, గుణానపురం, పార్వతీపురం మండలం పిన్నింటి రామినాయుడువలస గ్రామాలకు ఇంతవరకు పునరావాసం కల్పించలేదు. రైతులకు జగన్ భరోసా ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా గరుగుబిల్లి మండలం తోటపల్లి ప్రాజెక్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించిన సందర్భంగా ఈ ప్రాంత రైతులు ప్రాజెక్టు పరిస్థితిని వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంతోపాటు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాటిస్తే తప్పరు వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి కూడా రైతులకు మాట ఇస్తే వెనుకడుగు వేయరు. పంటల సీజన్ వచ్చిందంటే రైతుల ఖాతాలో పెట్టుబడి నిధి కింద రూ.12,500 జమ చేస్తామని ప్రకటించడం హర్షణీయం. రైతులకు ఉచిత విద్యుత్, వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించడం ముదావహం. – మండల శంకరరావు, ఎంపీటీసీ, తోటపల్లి కుడికాలువ నీరందించాలి ఈ ప్రాంతంలోనే తోటపల్లి ప్రాజెక్టు ఉన్నా కొత్తగా నిర్మించిన కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందడం లేదు. మండల పరిధిలోని గ్రామాల వెంబడి సాగునీరు సరఫరా అవుతున్నా రైతుల పంటపొలాలకు నీరందక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకంతోనైనా సాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి. – ఉరిటి రామారావు, కన్వీనర్, వైఎస్సార్సీపీ, గరుగుబిల్లి సాగునీటి సరఫరాపై ప్రభుత్వం కాకిలెక్కలు తోటపల్లి ప్రాజెక్టు అంకితం 2015లో.. నీరందించినట్టు ప్రకటించింది 50 వేల ఎకరాలు 2016లో 89 వేల ఎకరాలు 2017లో లక్షా ఏడు వేల ఎకరాలు 2018లో లక్షా పది వేల ఎకరాలు వాస్తవానికి నీరందుతున్నది కేవలం యాభై వేల ఎకరాలు -
పేరు మారింది...అంతే!
ప్రజా సంక్షేమం దృష్ట్యా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు తెలుగుదేశం పరిపాలనలో అతీగతీ లేకుండా పోయాయి. టీడీపీ అధికారం చేపట్టిన తరువాత ఆ పథకాల పేర్లు మార్చారే తప్ప వాటి అమలు కొనసాగింపు కాలేదు. దీంతో లబ్ధిదారులు ఆ పథకాలేమయ్యాయి...అంటూ ఆవేదన చెందుతున్నారు. బంగారు తల్లి పథకం తీరిదే...దీని పేరు మాఇంటి మహలక్ష్మిగా మార్చేసి ఇక పనైపోయిందనుకున్నారు పాలకులు. ఫలితంగా ఆ పథకం లక్ష్యాలు లబ్ధిదారులకు దూరమయ్యాయి. శృంగవరపుకోట రూరల్: పుట్టిన ఆడపిల్లకు గ్రాడ్యుయేషన్ వరకు రూ.1,05,500, ఆ ఆడపిల్లల పెళ్లి సమయంలో రూ.50,000 మొత్తంగా రూ.1,55,500 మా ఇంటి మహాలక్ష్మి (‘బంగారుతల్లి’ పేరు మార్పు) పథకంలో నమోదైన ఆడపిల్లల తల్లుల బ్యాంకు ఖాతాలకు దశల వారీగా నగదు జమ చేసే పథకానికి తెలుగుదేశం ప్రభుత్వం పాతరేసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం బంగారుతల్లి పథకం పేరుతో చట్టం కూడా చేసి 2013 సంవత్సరం మే 1 నుంచి పుట్టిన ఆడపిల్లల తల్లుల పేరున బ్యాంకు ఖాతాల్లో దశల వారీగా నగదును జమ చేయడం ప్రారంభించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 జూన్–14 నుంచి ఆడపిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ నిలిపేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు శాఖ నుంచి బంగారుతల్లి పథకం నిర్వహణను ‘మా ఇంటి మహాలక్ష్మి’ పేరుతో ఐసీడీఎస్‌లు అమలు చేసేలా ఉత్తర్వులు విడుదల చేశారు. కేవలం బంగారుతల్లి పథకాన్ని ‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చడంతోనే మిన్నకుండిపోయి పథకంలో ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయక ప్రభుత్వం పక్కన పెట్టడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ఇలా.. పుట్టిన ఆడపిల్లలను ఏ ఒక్కరూ దరిద్రంగా భావించరాదనే ఉద్దేశంతో ఆడపిల్లలను బాగా చదివించి వారికి పెళ్లి చేసే వరకు లబ్ధిదారులుగా ఉన్న ఆడపిల్లల తల్లుల పేరున వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా చట్టం చేసారు. ఇందులో భాగంగా 2013 మే 1 నుంచి పుట్టిన ఆడపిల్లలకు ఆస్పత్రుల్లో ప్రసవాలకు రూ.2500, మొదటి సంవత్సరం టీకాల నిమిత్తం రూ.1000, రెండవ సంవత్సరం రూ.1000, 3 నుంచి 5 సంవత్సరాల వయసు ఆడపిల్లలకు సంవత్సరానికి రూ.1500ల చొప్పున, 6 నుంచి 10సంవత్సరాల వయసు వరకు రూ.2వేలు, 6, 7, 8 తరగతుల వరకు రూ.2500, 9, 10 తరగతులకు రూ.3వేలు, ఇంటర్మీడియెట్ చదువుకు రూ.3500, గ్రాడ్యుయేషన్ కోర్సుకు (నాలుగు సంవత్సరాలు) రూ.4000 చొప్పున అప్పటి వరకు రూ.1,05,000 ఆడపిల్లల తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం, ఆడపిల్ల పెళ్లి ఖర్చుల కోసం రూ.50వేలు, మొత్తంగా రూ.1,55,500 నగదు జమ చేయడం బంగారుతల్లి పథకం ఉద్దేశంగా పొందుపర్చిన చట్టంలో పేర్కొన్నారు. లబ్ధిదారుల్లో నిరాశ.. ఈ పథకం కింద జిల్లాలో 26 మండలాల్లో మొత్తం 13,668 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 2015 జూన్ నెల వరకు వివిధ దశల్లో నగదు జమయ్యేది. తరువాత తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని నిలిపేసింది. పేరు మార్చిందే తప్ప ఆడపిల్లలకు అన్యాయం చేసిందని తల్లులు శాపనార్ధాలు పెడుతున్నారు. ఇది తగదు.. బంగారుతల్లి పథకం కింద ఒక దఫా రూ.2,500 అప్పటి ప్రభుత్వంలో అందుకున్నాను. ఆడపిల్లలు ఉన్న కుటుంబానికి ఎంతో మేలు కలిగించే విధంగా అప్పటి కాంగ్రెస్æ ప్రభుత్వం చట్టం చేసి బంగారుతల్లి పథకాన్ని అమలులోకి తెచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చటంతోనే సరిపెట్టి ఇదే పథకాన్ని నిర్వీర్యం చేసి ఆడపిల్లల కుటుంబాలను మోసం చేయటం తగదు. ఏ ప్రభుత్వమొచ్చిన ఇటువంటి పథకాన్ని కొనసాగించాలి. – పాలిశెట్టి వెంకటసత్యదేవి, పోతనాపల్లి, శృంగవరపుకోట ఉత్తర్వులే ఇచ్చారు.. వెలుగు శాఖ ఆధ్వర్యంలో అమలు చేసిన బంగారుతల్లి పథకాన్ని మా ఇంటి మహాలక్ష్మిగా పేరు మార్చటంతో పాటు ఐసీడీఎస్‌కు బదలాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు మాత్రమే జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించి రికార్డులు కూడా ఇంకా వెలుగు శాఖ ఆధీనంలోనే ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక, పథకం కొనసాగింపు చేయాలనే ఆదేశాలైతే రానిమాట వాస్తవం. – శాంతకుమారి, సీడీపీఓ, శృంగవరపుకోట -
స్మార్ట్‌వైపు చూడని దాతలు!
నరసన్నపేట : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ ఆరంభశూరత్వంగానే మిలుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే కోవలో స్మార్ట్ విలేజి, స్మార్ట్ వార్డు కూడా చేరింది. ఈ కార్యక్రమం ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. దీన్ని ప్రభుత్వం ప్రకటించి రోజులు గడుస్తున్నా ఆశించినంతగా దాతలు ముందుకు రాలేదు. వివరాల్లోకి వెళితే.. దాతల సహకారంతో గ్రామాలను స్మార్ట్ విలేజిలుగా, మున్సిపాల్టీల్లో వార్డులను స్మార్ట్ వార్డులుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కార్యచరణ ప్రణాళిక రూపొందించింది. అవసరమైన గైడ్ లైన్లు కూడా మండల కేంద్రాలకు పంపింది. ఇంటర్ నెట్లో ఉంచింది. మారుమూల గ్రామాల్లో రోడ్ల నుంచి ఇంటర్ నెట్ వరకూ అన్ని రకాల కల్పించేందుకు స్మార్ట్ విలేజి, స్మార్ట్ వార్డు కార్యక్రమాన్ని గత నెల 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి జిల్లా అధికారులు, అధికార పార్టీ ప్రతినిధులు, మంత్రులు కసరత్తు చేసినప్పటికీ దాతలు మాత్రం ముందుకు రావడం లేదు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో పరిస్థితి పరిశీలిస్తే మొత్తం 1098 పంచాతీలు ఉన్నాయి. వీటిలో కేవలం 304 పంచాయతీలనే దాతలు దత్తత తీసుకున్నారు. అలాగే మున్సిపాలిటీల్లో 187 వార్డులు ఉండగా కేవలం 37 వార్డులనే దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు వచ్చారు. ఇంకా 794 పంచాయతీలు, 150 వార్డుల్లో దాతలు కావాలి. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ అనుకున్న విధంగా ముందుకు వెళ్లడం లేదు. మంత్రులు, అధికారులు వత్తిడి చేస్తున్నా దాతల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో జిల్లా యంత్రాంగం కలవర పడుతోంది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు నరసన్నపేట బహిరంగ సభలో అతని పక్కనే కూర్చున్న కలెక్టర్ లక్ష్మీనరసింహాన్ని స్మార్ట్ గ్రామాలపై ప్రస్తావించినట్లు సమాచారం. మరింతగా దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాలో రాజకీయ ప్రముఖులు కొందరు గ్రామాల దత్తత ప్రకటించినా మండలస్థాయిలో ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఇతర గజిటెడ్ అధికారులు అంతగా స్పందించడలేదు. దీనికి నరసన్నపేట మండలంలోని పరిస్థతితే ఉదాహరణ. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నరసన్నపేటను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మిగిలిన ప్రజా ప్రతినిధులు స్పందించడలేదు. ఇతర మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. దీని అమలుకు కమిటీలు వేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. ముందుగా మండలాల్లో కమిటీలు వేసిన అనంతరం జిల్లాస్థాయి కమిటీలు వేస్తారు. జిల్లా కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీలతో పాటు మరో ముగ్గురు జిల్లా అధికారులు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. రెవెన్యూ డివిజన్లలో సంబంధిత ఆర్డీవో సమన్వయ అధికారిగా పనిచేయాల్సి ఉంది. దాతల ఎంపిక ఇలా.. సాయం చేస్తామని ముందుకొచ్చిన దాతల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించి సమగ్రంగా పరిశీలిస్తారు. దాతల ఆసక్తి ఏమిటి, గ్రామానికి ఏమి చేయాలనుకుంటున్నారు, అతని గత అనుభవం ఏమిటనే అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. దత్తత గ్రామాల్లో 20 ప్రామాణికాలను ప్రభుత్వం నిర్దేశించింది. వాటిలో ప్రధానమైనవి ప్రతీ కుటుంబానికి జీవనోపాధి అవకాశాలు పెంచుట. అందరికీ గృహం, మరుగుదొడ్డి, రక్షత నీరు, విద్యుత్ సరఫరా. నూరు శాతం ఆస్పత్రి కాన్పులు పోషకాహార లోపాన్ని నివారించుట శత శాతం అక్షరాస్యత, రోడ్లు , మురుగు కాల్వలు నిర్మించుట, నూతన సాంకేతిక పద్ధతులు. సౌరశక్తి వినియోగం, ఎల్ఈడీ బల్బుల వాడకాన్ని ప్రోత్సహించడం ప్రతీ కుటుంబానికి బ్యాంకు అకౌంట్, కనీసం జన్‌ధన్ ఎకౌంట్ ఉండేలా చూడటం. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు ఒక వైపు స్మార్ట్ విలేజి, స్మార్ట్ వార్డుల కోసం ప్రభుత్వం కృషి చేస్తూ దాతల కోసం వెతుకుతుంటే.. మరో వైపు గ్రామాల్లో సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. ఏ ఒక్క సమస్య అయినా పరిష్కాం అవుతుందా అనే అనుమానం సర్వాత్రా వ్యక్తం అవుతుంది. మురుగు కాలువలు, రోడ్లు, మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. పారిశుద్ధ్యం కూడా అధ్వానంగా ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ దశలో స్మార్టు విలేజిల అభివృద్ధికి కోట్లాది రూపాయలు అవసరం. ఇటీవల నరసన్నపేట మేజర్ పంచాయతీలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాదయాత్ర ద్వారా పలు సమస్యలు తెలుసుకున్నారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కనీసం రూ. 5 కోట్లు కావాలి. ఒక్క నరసన్నపేటలోనే ఈ పరిస్థతి ఉంటే మిగిలిన గ్రామాలు, పట్టణాలు పరిస్థితి ఏమిటీ అనే సందేహం వ్యక్తమవుతోంది. -
రుణాలు కాదు.. వర్షాలు మాఫీ అయ్యాయి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు ప్రజలందరి ముందు ఐదు హామీల అమలుపై సంతకాలు చేసిన చంద్రబాబునాయుడు అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తయినా వాటిలో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిం చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులెవరికీ రుణాలు మాఫీ కాలేదు కానీ రాష్ట్రంలో వర్షాలు మాత్రం పూర్తిగా మాఫీ అయ్యాయని పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బాబు అధికారంలోకి వస్తే కరువేననే నానుడి రాష్ట్రంలో ఉందని.. ఇప్పుడదే నిజమైందని ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురుస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కూడా లేకుండా పోయిందన్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం రెండు నెలల పాలన తీరును ఆయన దుయ్యబట్టారు. బాబు వస్తే ఉద్యోగం వస్తుందని ప్రచారం చేసిన ఆ పార్టీ కార్యకర్తలు కూడా ప్రస్తుతం.. ‘బాబు వచ్చాడు ఉద్యోగం పోయింది’, ‘బాబు వచ్చాడు వర్షాలు పడడం లేదు’ అని అనుకునే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. జిల్లాల కలెక్టర్లను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ముక్కుసూటిగా పనిచేయొద్దు, తమ పార్టీ కార్యకర్తలకు సహకరించమంటూ కోరిన ముఖ్యమంత్రి దేశంలో చంద్రబాబు ఒక్కరేనని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సును ప్రస్తావిస్తూ.. ప్రపంచ చరిత్రలో ఏ పాలనాధిపతి అధికార యంత్రాంగానికి ఇలాంటి ఆదేశాలిచ్చి ఉండరని ఆయన అన్నారు. అత్యున్నత ఐఏఎస్, ఐపీఎస్ హోదాలో ఉన్న వారికీ పచ్చచొక్కాలు తొడగాలని బాబు ప్రయత్నం చేస్తున్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.