శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు
కర్నూలు: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు కార్యనిర్వాహణాధికారి భరత్‌గుప్తా తెలిపారు. ఉదయం 5.30 గంటల నుంచి స్వామి, అమ్మవార్ల దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉదయం 6.30 గంటల నుంచి అభిషేకాలు జరుగుతాయన్నారు. భక్తులు ఈ మార్పును గమనించాలని ఈవో కోరారు.