the tender process
-
ప్రపంచ బ్యాంక్ నిధులతో రహదారుల అభివృద్ధి
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప శివమొగ్గ : శివమొగ్గ-హానగల్, శికారిపుర-ఆనందపురం మధ్య ఉన్న రాష్ట్ర రహదారులను రూ.425 కోట్ల ప్రపంచబ్యాంకు నిధులతో అభివృద్ధి చేయడానికి ఆమోదం లభించినట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఆదివారం శివమొగ్గలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శివమొగ్గ నగర, గ్రామీణ, హొన్నాళి, శికారిపుర, సాగర, సొరబ, హనగల్ అసెంబ్లీ నియోజకవర్గాలు, శివమొగ్గ, దావణగెరె, హవేరి లోకసభ నియోకవర్గ పరిధిలోని రాష్ట్ర రహదారుల అభివృద్ధికి నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ ద్వారా నివేదికను కూడా రూపొందించినట్లు తెలిపారు. ప్రపంచ బ్యాంక్ మార్గదర్శకాల మేరకు ఇప్పటికే రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను, అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడం జరిగిందని అన్నారు. రోడ్డు విస్తరణకు అవసరమైన భూస్వాధీన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నిధుల కోసం ప్రపంచ బ్యాంక్‌కు నివేదిక సమర్పించడం జరిగిందని చెప్పారు. ఇటీవలె ఈ పనులకు ప్రపంచబ్యాంక్ ఆమోదం లభించిందని, రెండు ప్యాకేజీల్లో నిధులు విడుదల చేసేందుకు బ్యాంక్ అంగీకరించిందని తెలిపారు. వారంలోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి మూడు నెలల్లోపు పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని అన్నారు. బైందూరు, హొసనగర, బట్టేమల్లప్ప, ఆనందపుర, శికారిపుర, మాసూరు రోడ్డు, శిరసి, బనవాసి, శిరాళకొప్ప, హొన్నాళి, హరిహర రోడ్డు, శివమొగ్గ, హనగల్ రహదారులను జాతీయ రహదారులుగా మార్పు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. -
ఈ కాంట్రాక్టు మాకొద్దు!
గజ్వేల్: టెండర్ ప్రక్రియలో జాప్యం ఫలితంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డు విస్తరణ వ్యవహారంలో ప్రతిష్టంభన నెలకొంది. తొమ్మిది నెలల క్రితం రూ.7.7 కోట్ల నిధులు ఈ రోడ్డుకు మంజూరు కాగా, అధికారులు గత నెలలో ఓసారి ఈపనులకు టెండర్ పిలిచారు. అయినా స్పందన లేకపోవడంతో మరోమారు టెండర్లను పిలుస్తున్నారు. ఈసారైనా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందా....? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మృత్యుమార్గం మూడు కిలోమీటర్ల పొడవున ఉన్న గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రహదారి మరమ్మత్తులోపం కారణంగా అధ్వాన్నంగా తయారైంది. ఎక్కడపడితే అక్కడ గుంతలు ఏర్పడి వాహనచోదకులకు శాపంగా మారింది. ఈ క్రమంలో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2001 సంవత్సరంలో ఈ రోడ్డును పూర్తి స్థారుులో విస్తరించడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విస్తరణ పూర్తి చేసి గజ్వేల్ గుమ్మటం నుంచి ప్రజ్ఞాపూర్ చౌరస్తా వరకు డివైడర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విస్తరణ వల్ల ప్రజ్ఞాపూర్‌లో రోడ్డుపక్కన ఇళ్లు కోల్పోతున్న వారు కోర్టుకెక్కి స్టే తీసుకురావడంతో ఈ వ్యవహారం పెండింగ్‌లో పడింది. ఫలితంగా డివైడర్ల ఏర్పాటు పట్టణంలోని గుమ్మటం నుంచి ఇండేన్ గ్యాస్ కార్యాలయం వరకే పరిమితమైంది. డివైడర్ల నిర్మాణానికి నోచుకోని ప్రజ్ఞాపూర్ నుంచి గ్యాస్ కార్యాలయం వరకు తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోడ్డును పూర్తిస్థాయిలో విస్తరించడానికి సర్కార్ తొమ్మిది నెలల క్రితం రూ.7.7 కోట్లు మంజూరు చేసింది. దీంతో అధికారులు కూడా పనులకు గత నెలలో టెండర్లు పిలిచారు. అయితే ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. 2008-09 నాటి రేట్లతోనే ఈ పనులు చేయాలన్న నిబంధనతో తాము నష్టపోతామని, అందువల్లే ఈ రోడ్డు పనుల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం సిమెంట్, స్టీలు, కూలీల ధరల్లో 15 శాతం పెరుగుదల ఉన్నా....పాత రేట్లు ఎలా కట్టిస్తారని ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా, అధికారులు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రహదారి నిర్మాణానికి తాజాగా రెండోసారి టెండర్లు పిలిచారు. టెండర్ వేసేందుకు మరో వారం రోజులే గడువుందని ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ నర్సింహులు చెబుతున్నారు. ఈలోగా ఎవరైనా టెండర్ వేస్తారా...? లేదా అన్నది తెలియడం లేదు. నగర పంచాయతీ ప్రజలు మాత్రం ఈ సారైనా టెండర్లు పూర్తయి రోడ్డు నిర్మాణం పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. -
అత్యాచార ఘటనలు పునరావృతమైతే పోలీస్‌శాఖపై కఠిన చర్యలు
అత్యాచార ఘటనపై సర్కార్‌కు నివేదిక ఇస్తాం ఎత్తినహొలె పథకం టెండర్ ప్రక్రియ పూర్తి త్వరలో పనులు ప్రారంభం మంత్రి యూ టి ఖాదర్ కోలారు : జిల్లాలో అత్యాచార ఘటనలు పునరావృతమైతే పోలీసుశాఖపై కఠిన చర్యలు తీసుకుంటామనిరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ మంత్రి యూటీ ఖాదర్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి పోలీస్ శాఖ ప్రగతి పరిశీలనా సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల వ్యవధిలో మాలూరు తాలూకా, కుప్పూరు గ్రామంలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, బంగారుపేట తాలూకా బేత మంగల గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం, నిందితులను అరెస్టు చేయడంలో జరిగిన జాప్యం తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజలు శాంతియుతంగా జీవించేలా అనువైన వాతావరణం కల్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అత్యాచార, అత్యాచార యత్నం ఘటనకు సంబంధించి సీఎం, హోం మంత్రికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తుందన్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఈ విషయంపై ఇద్దరితో కలిసి చర్చిస్తానన్నారు. కలెక్టర్ స్వాధీనం చేసుకున్న అక్రమ ఇసుక లారీలను ఎస్పీ వదిలేశారనే ఆరోపణలున్నాయన్న విషయాన్ని పాత్రికేయులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా తనకు తెలియదన్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులతో చర్చిస్తానన్నారు. జిల్లాలో అనధికారికంగా నిర్వహించే పాఠశాలల వివరాలను వారం రోజుల్లో తెలపాలని డీఈఓ ను ఆదేశించామని తెలిపారు. అధికారులు ఇచ్చే జాబితాననుసరించి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాకు శాశ్వత నీటిపారుదల సౌలభ్యాలను అందించే ఎత్తిన హొళె పథకానికి టెండర్ ప్రక్రియ పూర్తయిదని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. పడమటి కనుమలలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందువల్ల పరమశివయ్య నివేదిక అమలు ఆలస్య మవుతోందన్నారు. అక్కడి ప్రజలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశంలో ముళబాగిలు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, మాలూరు ఎమ్మెల్యే మంజునాథ్ గౌడ, ఎస్పీ అజయ్ హిలోరి పాల్గొన్నారు.