Tendulkar
-
‘బ్యాండ్ లేని లాయర్.. బ్యాట్ లేని టెండూల్కర్ ఒక్కటే’
న్యూఢిల్లీ: కోర్టులో వాదించే న్యాయవాదులు, తీర్పులు చెప్పే న్యాయమూర్తులు నల్ల కోట్ ధరించి ఉంటారు. కోర్టుకు హాజరయ్యే సమయంలో ఏ విధంగా డ్రెస్ చేసుకోవాలనే అంశంపై కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ విషయంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఓ యువ న్యాయవాది బ్యాండ్(టై) ధరించకుండా కోర్టు విచారణకు హాజరయ్యారు. వాదనలు వినిపించే సమయంలో బ్యాండ్ ధరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ లాయర్‌కు కీలక సూచనలు చేశారు జస్టిస్ డీవై చంద్రచూడ్. ‘కోర్టులో ధరించవద్దు.. అది చాలా అసహ్యంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘మీ కళాశాలలో నమూనా కోర్టు నిర్వహించాల్సింది. దీనిని నమూనా కోర్టుగా భావించు. లంచ్‌కు వెళ్లేందుకు మాకు 10 నిమిషాల సమయం ఉంది. అన్ని వివరాలను తెలుసుకుని వాదనలు వినిపించు. నీవు వాదించగలవని అనుకుంటున్నాం. మీ సీనియర్ గైర్హాజరైనప్పుడు వాదనలు వినిపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక న్యాయవాది బ్యాండ్(టై) లేకుండా రావటం.. బ్యాటు లేకుండా క్రికెట్ గ్రౌండ్లోకి సచిన్ టెండూల్కర్ రావటం ఒక్కటే.’ అని పేర్కొన్నారు జస్టిస్ డీవై చంద్రచూడ్. అయితే, ఒక యువ న్యాయవాదికి జస్టిస్ డీవై చంద్రచూడ్ సలహాలు ఇవ్వటం ఇదేం మొదటిసారి కాదు. గత ఏడాది ఓ యువ న్యాయవాది కోర్టుకు సమర్పించాల్సిన రాతపూర్వక పత్రాన్ని తీసుకురాకపోవటంతో పలు సూచనలు చేశారు. #Courtroomexchange Counsel appears before #SupremeCourt without his band. Justice Chandrachud: A lawyer without his band is like Sachin Tendulkar without his bat. J. Kohli: Well said. Counsel attempts to wear band in Court DYC: Now don’t dress up in Court, that is worse. — Live Law (@LiveLawIndia) September 1, 2022 ఇదీ చదవండి: ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కోటాపై సుప్రీంకోర్టులో విచారణ -
కార్చిచ్చు బాధితుల కోసం
-
ఆ కమిటీ ఎక్కడ?
సరిగ్గా ఆరు నెలల క్రితం... భారత క్రికెట్లో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. ఆట అభివృద్ధి, జట్టు విజయాల కోసం సలహా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌ల రూపంలో ముగ్గురు దిగ్గజాలతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ కేవలం ఒక్కసారి మాత్రమే సమావేశమైంది. ఆ తర్వాత ఈ కమిటీ గురించి ఎక్కడా వార్త లేదు. తాజాగా బీసీసీఐ ప్రకటించిన కొత్త కమిటీల్లో అసలు ఈ కమిటీ పేరు కూడా లేకపోవడం గమనార్హం. * కనిపించని బీసీసీఐ సలహా కమిటీ * తాజా జాబితాల్లోనూ లేని త్రిమూర్తుల పేర్లు సాక్షి క్రీడావిభాగం: ‘స్వదేశంలో భారత జట్టు బాగాఆడుతున్నా... విదేశాల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుతం జట్టులో ఎక్కువ మంది యువ క్రికెటర్లు ఉన్నందున వారికి దిశానిర్దేశం చేయడానికి అనుభవజ్ఞులు అవసరం...’ సరిగ్గా ఇవే మాటలతో బీసీసీఐ త్రిసభ్య సలహా కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి బోర్డు అధ్యక్షుడు, దివంగత జగ్మోహన్ దాల్మియా, కార్యదర్శి ఠాకూర్ కలిసి చర్చించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. జూన్ 1న ఈ కమిటీ ఏర్పాటును ప్రకటించిన తర్వాత అదే నెల ఆరో తేదీన కోల్‌కతాలో సచిన్, లక్ష్మణ్, గంగూలీ సమావేశమయ్యారు. అంతే... ఆ తర్వాత ఈ ముగ్గురూ కలిసి కూర్చున్నది లేదు. దాల్మియా మరణానంతరం గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా ఎన్నికవడం, లక్ష్మణ్ కామెంటరీతో బిజీగా మారడం, సచిన్ రకరకాల వ్యాపకాలతో ప్రపంచాన్ని చుట్టేస్తుండటంతో ఈ ముగ్గురూ కలవలేదు. ఈ లోగా బీసీసీఐలోనూ రకరకాల పరిణామాలు జరిగాయి. కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పగ్గాలు అందుకోగానే అన్ని కమిటీలను ప్రక్షాళన చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కమిటీల్లో మెంబర్ల సంఖ్యను తగ్గించి మార్పు చేర్పులతో కొత్త కమిటీలను ప్రకటించి వీటిని బీసీసీఐ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో త్రిమూర్తులతో కూడిన క్రికెట్ సలహా కమిటీ ఊసే లేదు. వారికైనా తెలుసా? అసలు ప్రస్తుతం ఈ కమిటీ ఉందా? లేదా? ఒకవేళ ఉంటే బీసీసీఐ జాబితాలో ఎందుకు చూపించలేదు..? లేకపోతే ఆ విషయం సచిన్, లక్ష్మణ్, గంగూలీలకు తెలిపారా? ఈ ప్రశ్నలకు ఎక్కడా సమాధానం లేదు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం బీసీసీఐ అధికారుల్లో చాలామందికి అసలు ఈ కమిటీ గురించే తెలియదు. ‘ఈ కమిటీ ఉందని నేను అనుకోవడం లేదు’ అని బోర్డు అధికారి ఒకరు అన్నారు. మరోవైపు క్రికెటర్లు దీని గురించి బాహాటంగా ఏమీ చెప్పకపోయినా... వారి సన్నిహితులు మాత్రం ‘ఈ కమిటీ ఉందో లేదో క్రికెటర్లకు తెలియదు’ అని చెబుతున్నారు. అంటే బోర్డు నుంచి వీరికి ఎలాంటి సమాచారం లేదనేది స్పష్టం. ఎందుకు ఏర్పాటు చేశారంటే... జూన్ ఆరో తేదీన ఈ కమిటీ సమావేశమైనప్పుడు కార్యాచరణ గురించి మాట్లాడారు. విదేశాల్లో భారత జట్టు ప్రదర్శన మెరుగుపడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంతర్జాతీయ క్రికెట్లో షెడ్యూల్ బిజీగా మారినందున... మూడు ఫార్మాట్లను సీనియర్లు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దేశంలో మౌళిక సదుపాయాల పెంపునకు ఏం చర్యలు తీసుకోవాలి..? దేశంలో జూనియర్ క్రికెట్ స్థాయిలోనే నాణ్యతను ఎలా పెంచాలి?... ఇలా కొన్ని అంశాలపై ఈ ముగ్గురూ బీసీసీఐకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉండాలి. అయితే ఆ తర్వాత బోర్డు వీరికి ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదు. షెడ్యూల్ ప్రకారం జూలై నెలాఖరులో వీరు సమావేశం కావలసి ఉన్నా బోర్డు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ద్రవిడ్‌కు ముందే తెలుసేమో..! బీసీసీఐ ఏర్పాటు చేసే కమిటీలు, బీసీసీఐ వ్యవహారశైలి గురించి అందరిలోకీ ద్రవిడ్‌కే ఎక్కువ ఆలోచన ఉండి ఉంటుంది. అందుకే ఆనాడు నలుగురు క్రికెటర్లతో కమిటీని ఏర్పాటు చేస్తామంటే తను తిరస్కరించాడు. కమిటీల పట్ల తనకు ఆసక్తి లేదని, జూనియర్ జట్లకు కోచ్‌గా పని చేస్తాననే ప్రతిపాదనతో వచ్చాడు. కాబట్టి తను ఇప్పటికీ తన బాధ్యతలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అండర్-19 జట్టుకు కోచ్‌గా శ్రీలంకలో ఉన్నాడు. నిజానికి బోర్డు ఈ కమిటీని నిర్లక్ష్యం చేయడం ఈ దిగ్గజాలను అవమానించడమే. ఇప్పటికైనా బీసీసీఐ మేలుకొని ఈ కమిటీ విషయంలో ఓ నిర్దిష్ట ప్రకటన చేస్తే మంచిది. -
ఆ నలుగురికీ కృతజ్ఞతలు
బీసీసీఐ సన్మానం సందర్భంగా సచిన్, కుంబ్లే, ద్రవిడ్, గంగూలీలను గుర్తు చేసుకున్న సెహ్వాగ్ న్యూఢిల్లీ: కెరీర్లో తనకు మార్గదర్శనం చేసిన మాజీ క్రికెటర్లు సచిన్, ద్రవిడ్, గంగూలీ, కుంబ్లేలకు సెహ్వాగ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సెహ్వాగ్‌ను నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు బీసీసీఐ సన్మానించింది. ఈ సందర్భంగా వీరూ తన మాజీ సహచరులను గుర్తు చేసుకున్నాడు. ‘నా కెరీర్ మొత్తం ఎంతోమంది ప్రోత్సాహం అందించారు. నా తండ్రి, కోచ్‌లు సతీష్, రాజు, ఏఎన్‌శర్మ, తొలి కెప్టెన్ జడేజాలతో పాటు ఆ నలుగురు దిగ్గజాలు కూడా మార్గదర్శనం చేశారు. కష్టకాలంలో మద్దతుగా నిలిచిన అభిమానులతో పాటు బీసీసీఐ, డీడీసీఏలకు కృతజ్ఙతలు’ అని సెహ్వాగ్ అన్నాడు. టెస్టుల్లో చేసిన తొలి సెంచరీ ఎప్పటికీ ప్రత్యేకమని, టెస్టుల్లో 400 చేయలేకపోవడం లోటు అని చెప్పాడు. సన్మాన కార్యక్రమంలో సెహ్వాగ్ తల్లి కృష్ణ, భార్య ఆర్తి, కుమారులు ఆర్యవీర్, వేదాంత్ పాల్గొన్నారు. టెస్టుల్లో తాను చేసిన 319 పరుగుల రికార్డును ఏ స్థాయిలోనైనా తన పిల్లలు ఇద్దరిలో ఎవరైనా అధిగమిస్తే ఫెరారీ కారు బహుమతిగా ఇస్తానని వీరూ చెప్పాడు. -
స్వామికార్యం... స్వకార్యం...
ఏ ముహుర్తాన ఎవరికి వచ్చిన ఆలోచనోగానీ... సచిన్, షేన్‌వార్న్ కలిసి అమెరికాలో నిర్వహించిన క్రికెట్ ఆల్‌స్టార్స్ సిరీస్ సూపర్ హిట్ అయింది. అమెరికాలో క్రికెట్‌ను అభివృద్ధి చేయడమనే లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు చెబుతున్నా... ఆర్థికంగా కూడా ఈ లీగ్ కాసుల వర్షం కురిపించింది. దీంతో స్వామికార్యం... స్వకార్యం.. రెండూ నెరవేరాయి. క్రికెట్ ఆల్‌స్టార్స్ సిరీస్ సూపర్ హిట్ సాక్షి క్రీడావిభాగం: ఇంతకాలం క్రికెట్ ప్రధానంగా కామన్వెల్త్ దేశాలలోనే ఆదరణ పొందింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలకూ ఈ ఆటను విస్తరించడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకూ ఎంతో కొంత ఆటను తీసుకెళ్లగలిగారు. అయితే ఏ దేశంలోనూ ఈ ఆటకు ప్రాముఖ్యతను పెంచలేకపోయారు. అసోసియేట్, అఫిలియేట్ సభ్యులుగా ఈ దేశాలన్నింటికీ ఐసీసీలో స్థానం కల్పించి, బాగానే నిధులూ ఇస్తున్నారు. అయినా దీనిని మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలియని పరిస్థితి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్ ఈ మూడు దేశాలూ ప్రస్తుతం క్రికెట్‌కు ప్రధాన ఆధారం. ఈ జాబితాలో చైనా, అమెరికా చేరితే ఆట మరింత విసృ్తతమవుతుంది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే ఆలోచనలో ఐసీసీ ఉన్న సమయంలో సచిన్, షేన్‌వార్న్ ఓ కొత్త ప్రతిపాదనతో ఐసీసీ దగ్గరకు వెళ్లారు. ఇంగ్లండ్‌లో బీజం గత ఏడాది లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లను కలిపి రెండు జట్లుగా తయారు చేసి మ్యాచ్ నిర్వహించారు. అందులో ఆడిన మాజీలు బాగా ఉత్సాహంగా కనిపించారు. దీంతో మాజీలతో లీగ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన సచిన్, వార్న్‌లకు వచ్చింది. వెంటనే దీని గురించి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి దేశంలోనూ ఓ లీగ్ ఉన్నందున... అమెరికాలాంటి ప్రదేశంలో మ్యాచ్‌లు ఆడితే బాగుంటుందని భావించారు. అయితే ఆటకు ఆదరణ లేని చోట ఇంత మంది స్టార్లతో వెళ్లి ఆడటం కూడా అంత సులభం కాదు. అమెరికా క్రికెట్ సంఘం ఇప్పటికే రకరకాల వివాదాల్లో ఉంది. అయినా ఈ దిగ్గజాలు మొండిగా ముందుకెళ్లారు. ఐసీసీని ఒప్పించడం వీరి తొలి విజయం. మౌలిక సదుపాయాలు లేనందున అక్కడి బేస్‌బాల్ స్టేడియాలలో మ్యాచ్‌లను నిర్వహించాలని భావించారు. మొత్తానికి నవంబరు 7 నుంచి 14 వరకు మూడు టి20 మ్యాచ్‌లు నిర్వహించారు. పిల్లలకు పాఠాలు అమెరికాలోని స్థానికులకు ఈ ఆటను ఏ మేరకు పరిచయం చేశారనేది ఇప్పుడే చెప్పలేం. అయితే అక్కడ వివిధ దశలలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులకు మాత్రం ఈ సిరీస్ వరంలా మారింది. అమెరికా తరఫున అన్ని దశలలో క్రికెట్ ఆడేవారంతా దిగ్గజాలతో కలిసి గడిపారు. చిన్న పిల్లలకు వార్న్, సచిన్ స్వయంగా ఆటలో మెళకువలు నేర్పించారు. ఈ సిరీస్ ద్వారా క్రికెట్‌కు సంబంధించి వారం రోజుల పాటు అమెరికాలో జరిగిన హడావుడి ఐసీసీలోనూ సంతోషం పెంచింది. న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో వార్న్, సచిన్ గంట మోగించడం సహా రకరకాల కార్యక్రమాలతో మీడియా దృష్టినీ ఆకర్షించగలిగారు. భారతీయులే లక్ష్యం నిజానికి ఈ టోర్నీ విజయవంతం అవుతుందనే నమ్మకం మొదటి నుంచీ ఉండటానికి కారణం అమెరికాలో భారీసంఖ్యలో స్థిరపడిన భారతీయులు. కరీబియన్ దీవుల్లో భారత్ ఏ మ్యాచ్ ఆడినా అమెరికా నుంచి భారీగా అభిమానులు వెళుతుంటారు. అక్కడ ప్రపంచకప్‌లు జరిగితే భారత్ ఆడే మ్యాచ్‌లకు సగం స్టేడియం అమెరికాలో ఉన్న భారతీయులతోనే నిండుతుంది. సచిన్ ఆడుతున్నాడంటే కచ్చితంగా భారతీయులు క్రికెట్ చూడటానికి వస్తారు. వాస్తవంలోనూ అదే జరిగింది. మ్యాచ్‌లు జరిగింది మూడు నగరాల్లోనే అయినా... పెద్ద దేశం అమెరికాలో ప్రతి మూల నుంచీ క్రికెట్ అభిమానులు మ్యాచ్‌లకు వచ్చారు. భారీగా ఆదాయం అమెరికాలో బేస్‌బాల్ చాలా పెద్ద ఆట. ఎక్కడ బేస్‌బాల్ మ్యాచ్ జరిగినా స్టేడియంలో ప్రేక్షకులు నిండిపోతారు. అయితే బేస్‌బాల్ మ్యాచ్‌కు కనిష్టంగా టిక్కెట్ ధర డాడ్జర్ స్టేడియంలో పై స్టాండ్‌లో 9 డాలర్లు (రూ. 593). కింది స్టాండ్‌లో గరిష్ట టిక్కెట్ ధర 50 డాలర్లు (రూ. 3,300). ఈ సిరీస్‌కు అదే స్టేడియంలో పైస్టాండ్లో టిక్కెట్‌ను 50 డాలర్లకు అమ్మారు. కింది స్టాండ్‌లో టిక్కెట్‌ను 175 డాలర్లకు (రూ. 11,600) అమ్మడం విశేషం. అయినా సరే అభిమానులు భారీగా వచ్చారు. మూడు మ్యాచ్‌లకు కలిపి లక్షమంది హాజరయ్యారని వార్న్ చెప్పాడు. ఇందులో కోటా టిక్కెట్లు, ఉచిత పాస్‌లు పోయినా కనీసం 50 వేల టిక్కెట్లు కొన్నారని అనుకున్నా... సగటున ఒక్కో టిక్కెట్ ధర 125 డాలర్లు అనుకుంటే... సుమారుగా 38 కోట్ల రూపాయలు టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం. ఇక ఈ సిరీస్ కోసం 9 కంపెనీలు స్పాన్సర్లుగా వ్యవహరించాయి. వీటికి అదనంగా క్రికెటర్లతో కలిసి డిన్నర్లు ఏర్పాటు చేశారు. ప్రతి నగరంలో సుమారు 700 మంది దీనికి హాజరయ్యారు. వీటి ద్వారా సుమారు 25 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక క్రికెట్ ఆడే అన్ని దేశాల్లోనూ ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. వీటికి కూడా ప్రకటనలు బాగానే వచ్చాయి. టీవీ రైట్స్‌కు ఎంత మొత్తం లభించిందనేది బయటకు తెలియకపోయినా... కనీసం ఓ 20 కోట్ల రూపాయలైనా వస్తుంది. మొత్తం మీద ఆల్‌స్టార్స్ సిరీస్ ద్వారా 100 కోట్ల రూపాయలకు పైనే ఆదాయం వచ్చింది. స్టేడియాలు, టిక్కెట్లు, హోటల్స్, సెక్యూరిటీ ఇలా అనేక రకాల ఖర్చులు ఉంటాయి. అన్ని పోయినా కనీసం 50 కోట్ల రూపాయలైనా దీని ద్వారా లాభం వస్తుందని అంచనా. ఇందులో ఐసీసీకి 20 శాతం వాటా ఇచ్చినా సుమారు 40 కోట్లు ఇద్దరు దిగ్గజాలకు దక్కి ఉండాలి. క్రికెటర్లకూ లాభమే ఈ సిరీస్‌లో ఆడినందుకు ఒక్కో క్రికెటర్‌కు 20 లక్షల రూపాయలు చెల్లించారని సమాచారం. మొత్తం 30 మందికి కలిపి సుమారు 6 కోట్ల రూపాయలు ఆటగాళ్లకు దక్కాయి. ఇదే సమయంలో మాజీలందరికీ ఇదో పెద్ద పిక్నిక్లా కనిపించింది. దాదాపు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్‌లా వెళ్లారు. తాము ఆడే రోజుల్లో ఐపీఎల్ లేకపోవడం వల్ల ఈ మాజీలలో మెజారిటీ సభ్యులకు క్రికెట్ ద్వారా వచ్చే డబ్బు రుచి తెలియలేదు. వాళ్లందరికీ ఇప్పుడు డబ్బులు రావడంతో పాటు అమెరికాలో క్రికెట్ ఆడిన కొత్త అనుభవం కూడా లభించింది. -
భారంగా ఓ ఏడాది..!
ప్రియమైన సచిన్, అప్పుడే నువ్వు ఆటను వదిలేసి ఏడాది గడిచింది. ఇది జీర్ణించుకోవడం ఇంకా కష్టంగానే ఉంది. నీ ఆటను చూస్తూ పెరిగిన మాకు... ఈ ఏడాదంతా నీ జ్ఞాపకాలే సరిపోయాయి. నువ్వు రిటైరైన రోజే... భారతరత్న ప్రకటించగానే మా గుండె సంతోషంగా ఉప్పొంగింది. ఇక మైదానంలో నిన్ను చూడలేమనే బాధ ఆ ఆనందాన్ని మింగేసింది. పులి ఎక్కడున్నా పులే... సచిన్ ఆడినా ఆడకున్నా సచినే. అందుకే ఏడాదంతా నీ గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. 24 ఏళ్ల పాటు కుటుంబానికి దూరంగా ప్రపంచం అంతా తిరిగి మాకు వినోదాన్ని పంచిన నీకు ఇక విశ్రాంతి దొరుకుతుందిలే అనుకున్నాం. కానీ నువ్వు మాత్రం కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రపంచం అంతా తిరుగుతున్నావ్. ఈ రోజు లండన్‌లో ఉంటే... ఉదయాన్నే కొచ్చిలో కనిపిస్తున్నావ్. ఆ మరుసటి రోజే మరో దేశంలో దర్శనమిస్తున్నావ్. ఇంకా ఇంత ఓపిక ఎక్కడిది. నీకు అలుపే రాదా? ఇప్పటికీ నీ ఇంటికి క్యూ కట్టే స్పాన్సర్లను చూస్తే ఎవరికైనా తెలుస్తుంది నీ విలువ ‘అమూల్యమని'. పార్లమెంట్‌కు రాలేదని గగ్గోలు పెట్టే విమర్శకులకేం తెలుసు... నువ్వు బయటే చాలా సేవ చేస్తున్నావని. ‘అప్నాలయా’లోని చిన్నారులకు తెలుసు నీ మనసేమిటో..! ‘యూనిసెఫ్’ అధికారులకు తెలుసు నీ సమయం ఎంత విలువైనదని. స్ఫూర్తి నింపడంలో నీకు నువ్వే సాటి. ప్రధాని ‘స్వచ్ఛ భారత్’ అనగానే... వెళ్లి చీపురు పట్టావ్. పుట్టిన రోజు నాడు విహారయాత్రను వదిలేసి వచ్చి మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసి... ఓటు విలువ ఎంతో చెప్పావ్. బైపాస్ సర్జరీ చేయించుకున్న సోదరుడికి సేవలు చేసి కుటుంబానికి అండగా నిలిచావ్. ‘ఎయిర్‌ఫోర్స్ డే’ వేడుకలకు వెళ్లి... దేశం కోసం కష్టపడేవాళ్లను సంతోషపెట్టావ్. ఈ ఏడాది మా రాష్ట్రాలకూ బాగానే వచ్చావ్. హైదరాబాద్ ప్యారడైజ్ హోటల్లో, విజయవాడలో మాల్ ఓపెనింగ్‌లో... నువ్వు ఎక్కడకు, ఎప్పుడు వచ్చినా మేం ఈగల్లా ముసురుకున్నాం. అయినా విసుక్కోలేదు. వీలైనంతగా మమ్మల్ని కలిసే ప్రయత్నం చేశావ్. అన్నింటికంటే ముఖ్యంగా మా తెలుగు గ్రామాన్నే దత్తత చేసుకున్నావ్. చాలామంది ఎంపీలు వాళ్ల రాష్ట్రంలోని గ్రామాలకే పరిమితమైతే... నువ్వు మా తెలుగు ప్రజల మీద ప్రేమ చూపించావ్. రిటైరయ్యాక ఎనిమిది నెలలకు లార్డ్స్‌లో నువ్వు మళ్లీ వన్డే ఆడితే మా మది పులకించింది. ఆ రోజు నువ్వు బ్యాటింగ్‌కు వస్తుంటే... ఇంగ్లండ్‌లో అభిమానులు నీకు ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ చూసి... ఓ భారతీయుడిగా గర్వించా. ఈ దేశం నీ మీద చూపించిన ప్రేమకు రుణం తీర్చుకుంటున్నావ్ అనిపిస్తోంది. ఆటంటే క్రికెట్ ఒక్కటే కాదు... మిగిలిన ఆటలూ బాగా ఎదగాలన్న నీ తపన నీ మీద అభిమానాన్ని మరింత పెంచింది. ఫుట్‌బాల్ కోసం ‘ఐఎస్ఎల్’లో భాగం అయ్యావ్. హాకీ జట్టు క్యాంప్‌కు వెళ్లి వాళ్లలో స్ఫూర్తి పెంచావ్. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన వారిని దగ్గరకు వెళ్లి అభినందించావ్. నీ కీర్తికిరీటంలో లేని అవార్డులేంటి? అయినా రిటైరయ్యాక నిన్ను పరాయి దేశస్థులూ సత్కరిస్తుంటే ముచ్చటేస్తోంది. ‘బ్రాడ్‌మన్ హాల్ ఆఫ్ ఫేమ్’లో నీకు చోటు దక్కింది. అందులో చోటు నీకు కాకుంటే ఇంకెవరికైనా దక్కుతుందా? నీకంటే అర్హులున్నారా? లేరు. ఇదుగో అదిగో అంటుండగానే నీ ఆత్మకథ వచ్చేసింది. గతంలో చాపెల్ అంటే మాకు మంచి అభిప్రాయం లేకపోయినా... ఎప్పుడూ వివాదాల జోలికి పోని నువ్వే చాపెల్‌ను విమర్శించావంటే... మేం అతడిని చీదరించుకున్నాం. నీ జీవితాన్ని తెరచిన పుస్తకం చేసి... నీ అనుభవాల పాఠాలను తర్వాతి తరానికి అందించావ్. ‘సచిన్ రిటైరయ్యాక మ్యాచ్‌లు చూడటం మానేశా’... ఇలాంటి మాటలనూ విన్నాం. నువ్వు లేని క్రికెట్‌ను చూడలేమని అనుకుంటూనే... ఆటపై అభిమానాన్ని చూపిస్తూనే ఉన్నాం. లార్డ్స్‌లో మనోళ్లు 28 ఏళ్ల తర్వాత టెస్టు గెలిస్తే సంబరపడ్డాం. రోహిత్ డబుల్ సెంచరీకి చిందులు వేశాం. ఇంగ్లండ్‌లో ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లిని నువ్వు దగ్గరుండి పాఠాలు నేర్పించి మళ్లీ గాడిలో పెట్టావ్. అక్కడే మళ్లీ మరోసారి మా మనసు దోచుకున్నావ్. ఒక్క విరాట్‌కే ఎందుకు... మొత్తం భారత క్రికెట్‌కే సరైన నిర్దేశనం చేయొచ్చుగా. అర్జున్ను మైదానంలో చూడాలనుకుంటున్నాం. నీకంటే మార్గ నిర్దేశనం చేయగలవారెవ్వరు? కాస్త తన ఆట కోసం సమయం కేటాయించు. వీలైనంత త్వరగా మా ముందుకు తీసుకురా. కొంత విశ్రాంతి తర్వాతైనా... మళ్లీ నిన్ను మైదానంలో చూసే అవకాశం కల్పించు. భవిష్యత్‌లో భారత్ కోచ్‌గా నిన్ను చూడాలని ఉంది. నేను సాధారణ సచిన్‌నే అని నువ్వు చెప్పినా... మా క్రికెట్ దేవుడివి మాత్రం నువ్వే. నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నువ్వు ఆటకు దూరమైనా మా మనసులో మాత్రం ఎల్లకాలం ఉంటావు. - నీ అభిమాని (గత ఏడాది సరిగ్గా ఇదే రోజు (నవంబరు 16) సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు) -
టెండూల్కర్ సిరీస్
-
రాజ్యసభలో సచిన్
న్యూఢిల్లీ:మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోమవారం రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యాడు. నల్ల ప్యాంటు, నీలి రంగు గీతల చొక్కా ధరించిన మాస్టర్ వర్షాకాల సమావేశం తొలి రోజు చర్చలను ఆసక్తిగా ఆలకించాడు. గతేడాది సచిన్ రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రాజీవ్ శుక్లాతో కలిసి సభలోకి అడుగుపెట్టిన సచిన్... ఈ సమావేశాలకు హాజరవడం ఇది రెండోసారి. గతేడాది వర్షాకాల సమావేశాలకు కూడా ఓసారి హాజరయ్యాడు. సభలోనే ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గరకు వెళ్లి సచిన్ కరచాలనం చేశాడు. సినీ రచయిత జావేద్ అక్తర్ పక్కనే కూర్చున్న ఈ దిగ్గజ క్రికెటర్ ఆయనతో సంభాషిస్తూ కనిపించాడు. అలాగే ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ, జింబాబ్వే పర్యటనలో సిరీస్ గెలిచిన భారత జట్టును చైర్మన్ హమీద్ అన్సారీ అభినందించగా సచిన్ కూడా తన ముందున్న బల్లపై చరుస్తూ హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు అతిథుల గ్యాలరీలో భార్య అంజలి కూర్చుని సభా కార్యక్రమాలను తిలకించారు.