Territorial fighting
-
తంపులమారి చైనా..15 దేశాలతో కయ్యం
దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి: చైనా పీపుల్స్ రిపబ్లిక్ దేశంగా ఏర్పడిన నాటి నుంచి సరిహద్దుల విషయంలో భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంది. రెండు దేశాల మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దుకు సంబంధించి అనేక చోట్ల వివాదాలు సృష్టిస్తోంది. మన దేశంలో చైనాతో సరిహద్దు ఉన్న జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో అనేక భూభాగాలు తమవేనంటూ చైనా వాదిస్తోంది. 1950లో టిబెట్‌ను ఆక్రమించుకున్న చైనా అటుపిమ్మట భారత్‌లోని అనే భాగాలు టిబెట్‌కు చెందినవని, వాటిని తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తూనే ఉంది. 1962లో భారత్‌తో జరిపిన యుద్ధం ఫలితంగా ప్రస్తుత కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్లోని భాగమైన 37,244 చదరపు కిలోమీటర్ల అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. అంతేకాదు జమ్మూకశీ్మర్ లోయలోని మరో 5,300 చదరపు కిలోమీటర్ల భూభాగం కూడా తమదేనంటూ ఘర్షణలకు దిగుతూనే ఉంది. 2020 మే నెలాఖరులో చైనా సైన్యం గల్వాన్ లోయ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడినప్పుడు జరిగిన ఘర్షణలో ఇరువైపులా అనేకమంది సైనికులు మరణించారు. 1967లో సిక్కింలోని నాథులా, చోవా ప్రాంతాల్లో కూడా చైనా సైన్యం సరిహద్దుల వెంబడి అనేక చోట్ల భారత సైన్యంతో ఘర్షణలకు దిగింది. ఆ తరువాత కూడా చైనా ఘర్షణలకు పాల్పడుతూనే ఉంది. మరోవైపు అరుణాచల్‌ప్రదేశ్ తమ దేశ అంతర్భాగమని డ్రాగన్ దేశం వాదిస్తోంది. మొదట్లో దాదాపు 90,000 చదరపు కిలోమీటర్లు.. అంటే మొత్తం అరుణాచల్‌ప్రదేశ్ తమదేనని అని వాదించిన చైనా ఇప్పుడు తొలుత 8,000 చదరపు కిలోమీటర్ల భూభాగంపై వివాదాన్ని పరిష్కరించుకుందామని భారత్‌తో బేరాలాడుతోంది. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాల పేర్లను చైనా భాష మాండరిన్‌లోకి మార్చేసింది. వీటిలో 8 పేర్లు పట్టణాలు, 2 పేర్లు నదులు, 5 పేర్లు పర్వతాలకు సంబంధించినవి ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా తన భూభాగమైన జంగ్నన్గా సంబోధిస్తోంది. అర్థం లేని ఆధారాలు పొరుగు దేశాలతో నెలకొన్న వివాదాలకు చైనా ప్రత్యక్ష ఆధారాలు చూపడం లేదు. తన విస్తరణవాదానికి పూర్వకాలం నాటి రాజవంశçస్తుల పాలనా క్షేత్రాన్ని రుజువుగా చూపిస్తోంది. మధ్య యుగాలనాటి హన్, తంగ్, యువాన్, క్వింగ్ రాజవంశీకులు పరిపాలించిన ప్రాంతాలంటూ ఇతర దేశాలతో సరిహద్దుల విషయంలో జగడానికి దిగుతోంది. అందుకోసం ఆయా ప్రాంతాల పేర్లను పూర్వకాలంలో పేర్కొన్న పేర్లుగా మార్చేస్తోంది. అంతర్జాతీయంగా జరిగిన ఏ ఒక్క ఒప్పందాన్ని కూడా చైనా అంగీకరించడం లేదు. దక్షిణ చైనా సముద్ర జలాలపై, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ఆధిపత్యం తమదేనంటూ తాను సృష్టించిన గీతల మ్యాప్‌లను చారిత్రక ఆధారాలుగా చూపుతోంది. ఆరు మహాయుద్ధాలు! 2020 నుంచి 2050 మధ్యకాలంలో ఆరు మహాయుద్ధాలు జరుగుతాయని చైనాకు చెందిన సోహు అనే పోర్టల్‌లో గతంలో పేర్కొన్నట్లు యురేíÙన్ టైమ్స్ అనే ఆన్లైన్ పత్రిక వెల్లడించింది. దాని ప్రకారం 2025 నాటికి తైవాన్, 2030 నాటికి అన్ని దీవులను, 2040 నాటికి అరుణాచల్‌ప్రదేశ్‌ను, 2050 నాటికి జపాన్‌కు చెందిన దీవులను స్వా«దీనం చేసుకోవడానికి యుద్ధా్దలు జరుగుతాయని పోర్టల్ చెబుతోంది. తంపులమారి చైనా మాదిరిగానే భారతదేశం కూడా మౌర్య, చోళ వంశçస్తుల పరిపాలనా క్షేత్రాన్ని ఆధారంగా చూపితే అనేక దేశాలను అఖండ్ భారత్‌లో అంతర్భాగంగా చెప్పొచ్చు. మౌర్య, చోళ వంశస్థుల పరిపాలనకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అందరితోనూ తగువే భారత్ మాత్రమే కాకుండా 15 దేశాలతో చైనాకు సరిహద్దు తగాదాలు కొనసాగుతున్నాయి. వీటిలో తైవాన్, ఫిలిప్పైన్స్, ఇండోనేíసియా, వియత్నాం, జపాన్, ద.కొరియా, కొరియా, సింగపూర్, బ్రూనై, నేపాల్, భూటాన్, లావోస్, మంగోలియా, మయన్మార్ తదితర దేశాలు ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రం అంతా తమ ఏలుబడిలోనే ఉండాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని డ్రాగన్ సవాలు చేస్తోంది. ► తైవాన్ విషయంలో ఆ దేశమంతా తమకు చెందినదేనన్నది చైనా వాదన. అయితే, ప్రస్తుతానికి మెకలిస్ బ్యాంక్, చైనా ఆక్రమణలో ఉన్న దీవులు, సౌత్‌చైనా సముద్రంలో కొంత భూభాగం విషయంలో రెండు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. ► ఫిలిప్పైన్స్ విషయంలో కూడా స్కార్బరో కొండలు, మరికొన్ని దీవులపై చైనా వివాదం సృష్టించింది. వీటివిషయంలో ఫిలిప్పైన్స్‌తో తరచుగా ఘర్షణలకు పాల్పడుతోంది. ► ఇండోనేసియాకు సంబంధించి నతునా దీవులు, సౌత్ చైనా సముద్రంలో కొంతభాగం తమదేనంటూ చైనా తగువులు సృష్టిస్తోంది. ► వియత్నాం విషయానికి వస్తే అనేక భాగాలను తమకు అప్పగించాలని చైనా ఒత్తిడి పెంచుతోంది. పలు ద్వీపాలతోపాటు సముద్ర జలాల్లో ఆధిపత్యం కోసం కాలుదువ్వుతోంది. చైనా నౌకాదళం ఇటీవల వియత్నాంకు చెందిన చేపల వేట పడవను సముద్రంలో ముంచేసింది. ► మలేíసియాతోనూ కొన్ని దీవులు, సముద్ర జల్లాల విషయంలో చైనా జగడం ఆడుతోంది. మలేíÙయా చమురు అన్వేషణ నౌకలను అడ్డుకుంటోంది. ఇటీవల అమెరికా, ఆ్రస్టేలియా యుద్దనౌకలు మలేíÙయాకు అండగా రావడంతో చైనా నౌకాదళం తోకముడిచి వెనక్కి వెళ్లిపోయింది. ► జపాన్‌కు చెందిన రెండు ద్వీప సముదాయాలపై చైనా కన్నుపడింది. అవి సెన్కాకు దీవులు, ర్యూక్యు దీవులు. ఈ దీవుల్లో చమురు నిక్షేపాలు బయటపడినప్పటి నుంచి చైనా వీటి విషయంలో జపాన్‌తో తగువు పడుతోంది. ► దక్షిణ చైనా సముద్రంలో కొంతమేరకు మునిగిపోయిన సొకొట్రా రాక్‌పై దక్షిణ కొరియాతో వివాదానికి దిగింది చైనా. ఈ రాక్ కొరియాకు 149 కిలోమీటర్ల దూరంలో ఉండగా, చైనాకు 287 కిలోమీటర్ల దూరంలో ఉంది. ► దాదాపు 1,400 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఉత్తర కొరియాతో సీ ఆఫ్ జపాన్ సముద్ర జలాల్లో హద్దుల అంశంపై చైనా వివాదం సృష్టించింది. ► దక్షిణ చైనా సముద్ర జలాల విషయమై సింగపూర్‌తో చైనా తగువులాడుతోంది. ► అతిచిన్న ఇస్లామిక్ దేశమైన బ్రూనైతో కూడా కొన్ని దీవులు, సముద్ర జలాలపై చైనా గొడవ పెట్టుకుంది. ► తమ భూభాగంలో కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకున్నట్లు నేపాల్ ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది. పశి్చమ నేపాల్‌లోని హుమ్లా జిల్లాలో చైనా ఆక్రమణలకు పాల్పడింది. ► దాదాపు 290 మైళ్లకుపైగా సరిహద్దు ఉన్న భూటాన్‌తో అనేక చోట్ల హద్దుల విషయంలో చైనా వివాదాలు సృష్టించింది. 1980 నుంచి వీటి విషయంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ► లావోస్‌లో అత్యధిక భాగం తమదేనని చైనా వాదిస్తోంది. అందుకు యువాన్ రాజవంశ పరిపాలనను రుజువుగా చూపిస్తోంది. ► సరిహద్దు వివాదం కారణంగా తమ దేశంలోని ఓ చెక్‌పాయింట్‌పై దాడి జరిగిందని చైనా చెబుతోంది. ఈ ప్రాంతం విషయంలో మంగోలియాకు, చైనాలోని గాన్సు ప్రాంత ప్రజలకు మధ్య వివాదం ఉంది. -
ప్రాదేశికపోరులో నేడే తొలి సమరం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ప్రాదేశిక పోరులో భాగంగా తొలి సమరం ఆదివారం జరగనుంది. జిల్లాలోని 24 జెడ్పీటీసీ, 353 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం 24 మండలాల్లో 1,149 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు అయోమయానికి గురికాకుండా జెడ్పీటీసీకి తెల్లరంగు, ఎంపీటీసీకి గులాబీరంగు బ్యాలెట్ పత్రాలను వాడుతున్నారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో ఇప్పటికే నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 24 జెడ్పీటీసీ స్థానాలకుగాను 129 మంది అభ్యర్థులు, 349 ఎంపీటీసీ స్థానాలకుగాను 1,339 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో మొత్తం 8,85,107 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణలో మొత్తం 5,745 మంది విధులు నిర్వహించనున్నారు. 128 మంది జోనల్, 128 రూట్ ఆఫీసర్లు, 1,149 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 1,149 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 3,447 మంది పోలింగ్ ఆఫీసర్లు ఎన్నికల్లో నిర్వహణలో పాల్గొంటున్నారు. వీరంతా శనివారం రాత్రి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో సహా చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సరళిని 104 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. 340 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం వీడియోగ్రఫీ, వెబ్లైవ్కాస్టింగ్ ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరగనున్న మండలాలు ఇవే తొలి విడతగా 24 మండల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. సంగారెడ్డి, కొండాపూర్, కల్హేర్, మనూరు, కంగ్టి, జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మునిపల్లి, రాయికోడ్, సదాశివపేట, కొల్చారం, అల్లాదుర్గం, నర్సాపూర్, అందోలు, మెదక్, కొండపాక, జగదేవ్‌పూర్, దుబ్బాక, నంగునూరు, మిరుదొడ్డి, చిన్నకోడూరు, సిద్దిపేట మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. -
పల్లెల్లో సారా జోరు
సాక్షి, విజయవాడ : జిల్లాలో సారా జోరు పెరిగింది. ముఖ్యంగా ప్రాదేశిక పోరు నేపథ్యంలో పల్లెలో రాజకీయపార్టీల నేతలు సారా విక్రయాలపై దృష్టిసారించారు. అతి చవకగా దొరికే మద్యం కావటంతో వివిధ రాజకీయపార్టీల నేతలు సారా కొనుగోలు చేసి మరీ మందుబాబులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో జిల్లాలో మళ్లీ సారా విక్రయాలకు భారీగా తెరలేచింది. ప్రసుత్తం జిల్లాలో నెలకు సగటున 30 లక్షల విలువైన సారా విక్రయాలు జరుగుతుండగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పుణ్యమా అని విక్రయాలు రెట్టింపయ్యాయి. సారా కట్టడికి ఎక్సైజ్ అధికారులు తరచు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికి పరిస్థితిలో మార్పు లేదు. మరోవైపు అధికారులు కూడా మద్యం షాపులపై దాడులు చేసేందుకు చూపుతున్న శ్రద్ధ సారా కట్టడిపై చూపటం లేదు. ఈ ఎన్నికల సీజన్లో జిల్లాలో సారా విక్రయాలు కోటి రూపాయలు దాటతాయనేది అంచనా. చర్యలు నామమాత్రం... జిల్లాలోని మైలవరం, జగ్గయ్యపేట, నూజివీడు, తిరువూరు ప్రాంతాల్లో సారా తయారీ కేంద్రాలతో పాటు విక్రయ ఠ మొదటి పేజీ తరువాయి కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు జిల్లా సరిహద్దులోని నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు తండాల్లో నాటుసారా బట్టీలు పదుల సంఖ్యలో నెలకొన్నాయి. అక్కడ తయారైన నాటు సారాను జిల్లాలోని వ్యాపారులు దిగుమతి చేసుకొని ప్యాకింగ్ చేసి మరీ విక్రయాలు సాగిస్తున్నారు. నిత్యం వేల లీటర్ల సారా విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు కట్టడి చేయటంలో విఫలమయ్యారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావటంతో ఎక్కువ కేసులు నమోదుచేశారు. అందుబాటులో లేని మద్యం... ఈ నెల 6, 11 తేదీల్లో జిల్లాలో రెండు విడతలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా గతంతో పోల్చుకుంటే ఎన్నికల ఖర్చులు భారీగా పెరిగాయి. ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే మద్యం ధరలకు రెక్కలు రావటంతో పాటు వరుస ఎన్నికలు రావటంతో జిల్లాలో మద్యం నిల్వల కొరత ఏర్పడింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని మద్యాన్ని వ్యాపారులు రహస్యప్రాంతాల్లో ఇప్పటికే నిల్వలు చేశారు. దీంతో ప్రస్తుత ఎన్నికలు పల్లెలు కేంద్రాలుగా జరగనున్న నేపథ్యంలో మద్యం స్థానంలో సారా విక్రయాలకు తెరలేచింది. దీంతో సారా ధరలకు రెక్కలొచ్చాయి. లాభసాటి బేరం... గతంలో అర లీటరు సుమారు రూ.50కి విక్రయించగా ప్రస్తుతం 100 ఎంఎల్ ప్యాకెట్‌ను రూ.20కి విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపారం లాభసాటిగా ఉందని అనేక మంది బెల్ట్‌షాపుల నిర్వాహకులు సారా విక్రయాలపై దృష్టిసారించారు. ఖమ్మం జిల్లాలోని మధిర ప్రాంతం నుంచి నిత్యం రైలులో నగరానికి, మైలవరం, కొండపల్లి ప్రాంతానికి సారా నిల్వలు దిగుమతి అవుతున్నట్లు సమాచారం. నగరంలోని పాల ఫ్యాక్టరీ సెంటర్లో సారా విక్రయాలు బహిరంగంగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ కృష్ణా పరిధిలోని రెడ్డిగూడెం, జికొండూరు, ఎ.కొండూరు, మైలవరం, తిరువూరు, చాట్రాయి, వీరులపాడు, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో అనధికారికంగా ఉన్న 150కి పైగా బెల్ట్‌షాపుల్లో సారా విక్రయాలు జరుగుతున్నాయి. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం విక్రయాలు నూజివీడులో అధికంగా జరుగుతుంటాయి. నూజివీడులో ప్రత్యేకంగా కొన్ని హోల్‌సేల్ నల్లబెల్లం షాపులు కూడా ఉన్నాయి. 2.4 లక్షల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం... జిల్లాలో నాటుసారా తయారీకి వినియోగించే బెల్లపు ఊట నిల్వల్ని ఎక్సైజ్ అధికారులు గత నెలరోజుల వ్యవధిలో భారీగా ధ్వంసం చేశారు. ముఖ్యంగా విజయవాడ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో అధికంగా సారా విక్రయాలు జరిగే నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేటలో ఎక్కువ నిల్వలు ధ్వంసం చేసి నిర్వాహకులపై కేసులు పెట్టారు. విజయవాడ డివిజన్లో ఇప్పటివరకు 2.17 లక్షల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయగా, 4,100 నాటుసారాను సీజ్ చేసి ధ్వంసం చేశారు. మచిలీపట్నం డివిజన్ పరిధిలో 23 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 990 లీటర్ల సారాను సీజ్ చేసి ధ్వంసం చేశారు. -
ఇక ‘ప్రాదేశిక’ పోరు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : పంచాయతీ సమరం ముగిసింది. మండల పరిషత్తు సంగ్రామానికి తెరలేచింది. మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఆయా స్థానాల విషయమై కసరత్తు వేగవంతం చేసింది. ఈ నెల 13లోగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజనకు ఏర్పాట్లు చకాచకా సాగిపోతున్నాయి. 14న ప్రాథమిక నోటిఫికేషన్, 28 తుది జాబితాను ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తాజా అంచనా ప్రకారం జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు పెరగనున్నాయి. దీనిపై గురువారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనాభా ఆధారంగా ఎంపీటీసీ స్థానాలు జనాభా ఆధారంగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన చేపడుతున్నారు. 2006లో జరి గిన స్థానిక సంస్థల పాలక వర్గాల ఎన్నిక 2001 జనాభా ప్రకారం జరిగింది. ఈ దఫా 2011 జనాభా గణాంకాలు అందుబాటులోకి వచ్చా యి. ఫలితంగా ప్రాదేశిక నియోజకవర్గాల సం ఖ్య పెరగ నుంది. దీని కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించి జిల్లాకు పంపింది. ఒక్కో ఎంపీటీసీ స్థానం పరిధిలో కనీసం 3500 మంది జనాభా ఉండాలని, అత్యధికంగా 4 వేలు మించకూడదని నిబంధన ఉంది. భౌగోళికంగా ప్రత్యేక పరిస్థితుల్లో మినహా ఎంపీటీసీ స్థానాల ఏర్పాటులో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. సాధ్యమైనంత వరకు గ్రామ పంచాయతీ పరిధిలోనే ఎంపీటీసీ స్థానాలు ఉండేలా ప్రయత్నించాలని సూచించింది. సాధ్యం కానిపక్షంలో పక్క పం చాయతీలోని జనాభాను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. 2011 జనాభా లెక్కల ప్రకా రం గ్రామీణ ప్రాంత జనాభా 22.54 లక్షలు. ఈమేరకు ఏయే మండలాల్లో జనాభా పెరిగిందన్న విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై జాబితాలను సిద్ధం చేయాలని అధికారులు ఎంపీడీవోలను ఆదేశించారు. ఇప్పటికే ఆయా జాబితాలను రూపొందించే పనిలో ఎంపీడీవోలు నిమగ్నమయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 624 ఎంపీటీసీ స్థానాలు ఉండగా పునర్విభజన తరువాత ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఎంపీటీసీ లెక్కపై గురువారం ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. 14న ప్రాథమిక నోటిఫికేషన్ : ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ప్రక్రియ ఈ నెల 13 లోగా పూర్తికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 14న ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. దీనిపై 21వ తేదీలోగా అభ్యంతరాలను స్వీకరించి 22 నుంచి 26 వరకు పరిశీలిస్తారు. 28న ఎంపీటీసీ స్థానాల తుది జాబితాను ప్రకటిస్తారు. అదే రోజున దా నిని ప్రభుత్వానికి పంపుతారు. ఎంపీటీసీ స్థా నాలతో పాటు జెడ్పీటీసీ స్థానాల జాబితా రూ పొందించిన తరువాత వీటికి రిజర్వేషన్లను కూడా ఖరారు చేస్తారు. గ్రేటర్లో విలీనమవుతున్న 10 పంచాయతీలను కూడా పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఎం పీటీసీ స్థానాల్లో సగం మహిళలకే దక్కనున్నా యి. మండల అధ్యక్ష స్థానాలతో పాటు సగం జె డ్పీటీసీ స్థానాలకు కూడా రిజర్వు కానున్నాయి. 1933 పోలింగ్ కేంద్రాలు ఈ ఎన్నికల కోసం మొత్తం 1933 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఈ ఎన్నికలకు 4222 బ్యాలెట్ బాక్సులు అవసరమని అధికారులు గుర్తిం చారు. వీటిని సిద్ధం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ పోరు గ్రామాల్లో రాజకీయ వేడిని రగిల్చింది. ఇక పార్టీల గుర్తుల ఆధారంగా జరిగే ఈ జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు బాటలు వేయనున్నాయి. సమైక్యాంధ్ర సెగ ప్రభావం ఈ ఎన్నికలపై పడే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వెంటనే వీటిని నిర్వహించాలని గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ సక్రమంగా జరిగితే వచ్చే నెలాఖరులో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.