theaf arrested
-
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రంలోని బంగారు ఆభరణాల షాపులో చోరీ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 6.181 కిలోల బంగారు ఆభరణాలు, 90.52 గ్రాముల వెండి బ్రాస్లెట్లు, రూ.15 వేల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ దీపిక శనివారం విలేక రుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చోరీ నిందితుడు లోకేష్ శ్రీవాస్‌ది ఛత్తీస్‌గఢ్. ఓ కేసులో విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. విజయనగరం జిల్లా కేంద్రంగా జనవరి 16న తొలిసారిగా పద్మజ ఆస్పత్రిలో చోరీ చేశాడు. మళ్లీ ఈ నెల 14న సీఎంఆర్‌లో చోరీకి పాల్పడ్డాడు. వారం వ్యవధిలో ఈ నెల 21న పట్టణంలో రెక్కీ నిర్వహించి రవి జ్యుయలరీ, పాండు జ్యుయలరీ షాపుల్లో దొంగతనానికి దిగాడు. రవి జ్యుయలర్స్‌లో ఉన్న 8 కిలోల బంగారు ఆభరణాలు దొంగిలించి పరారయ్యాడు. నాలుగు పోలీస్ బృందాలు గాలించి నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్నాయి. -
కూకట్‌పల్లిలో పట్టుబడ్డ గజదొంగ
కేపీహెచ్‌బీకాలనీ: రాత్రివేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఓ గజ దొంగను కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 19 తులాల బంగారు ఆభరణాలు, 95 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, కూకట్పల్లి ఏసీపీ సురేందర్‌రావు, సిఐ లక్ష్మీనారాయణలు వివరాలను వెల్లడించారు. ♦ ఎల్లారెడ్డిగూడకు చెందిన మొహమ్మద్ ఇబ్రహీం సిద్ధికి (58) మొదట్లో అన్ని రకాల చోరీలు చేసేవాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం ద్వారా జల్సాలకు అలవాటు పడ్డాడు. ♦ హైదరాబాద్ నగరంతో పాటు సైబరాబాద్, సంగారెడ్డి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి 87 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన సిద్ధికి 2018లో ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీ కేసులో అరెస్ట్ అయి పీడీ యాక్ట్ నమోదు చేయగా జైలుకు వెళ్లి 2019లో బయటకు వచ్చాడు. ♦ జైలు నుంచి బయటకు వచ్చిన ఇబ్రహీం సిద్దికి తన మకాంను నగరం నుంచి బీదర్‌కు మార్చాడు. వారాంతాల్లో బీదర్ నుంచి బస్సులో, లారీలో నగరానికి వచ్చి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు. వివరాలు వెల్లడిస్తున్న మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ ఏసిపి సురేందర్‌రావు ♦ రాత్రి వేళలో ఇనుపరాడ్లు, బండరాళ్లతో తాళాలు పగుల గొట్టి ఇంట్లోని బీరువా, కప్బోర్డ్లలో ఉన్న నగదు, బంగారం, వెండి వంటి విలువైన ఆభరణాలను దోచుకొని పారిపోతాడు. ♦ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎనిమిది, చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు, పటాన్ చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడగా 12 కేసులు నమోదయ్యాయి. అన్నిచోట్ల కలిపి మొత్తం 99 కేసులు ఇతనిపై నమోదయ్యాయి. ♦ పరారీలో ఉన్న నిందితుడి ఫోటోను పట్టుకొని గాలింపు మొదలుపెట్టిన కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం విశ్వసనీయ సమాచారంతో నగరంలోని ఎల్లారెడ్డి గూడ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ♦ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి సుమారు రూ.10.20 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ♦ దొంగను అరెస్టు చేసి, చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న కేపీహెచ్‌బీ క్రైమ్ విభాగం అధికారులు సిబ్బందిని డిసిపి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు అందజేసి అభినందించారు. చదవండి: ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం చదవండి: 3 కి.మీ వెంటాడి.. చివరకు సాధించాడు -
మహిళ సాయంతో దుండగుడి చోరీ
సాక్షి, నిజామాబాద్: కొన్ని రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పరిధిలో లలితానగర్‌లో చోరీ చేసిన దుండగులను అరెస్టు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. శనివారం ఐదో టౌన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. లలితానగర్‌లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి, మహిళతోపాటు ఓ దుండగుడు చోరీ చేశారు. ఇంట్లో ఉన్న రెండు గ్రాముల బంగారంతో పాటు కారును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారించారన్నారు. గత శుక్రవారం ఆర్ఆర్ చౌరస్తాలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చిన వారిని పట్టుకున్నామని, అందులో పందిరి స్వామి అనే దుండగుడు కూడా ఉన్నాడని ఏసీపీ తెలిపారు. అతను, అతనికి సాయంగా ఉన్న మహిళ గతంలో అనేక చోరీల కేసుల్లో నిందితులని తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, రెండు యాక్టివాలు, 10 తులల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీనాథ్‌రెడ్డి, రూరల్, నాలుగో టౌన్ పోలీసులు ఉన్నారు. -
ఒక్కడు.. అంతులేని నేరాలు
సాక్షి, నాగోలు: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడి, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘరానా నేరస్తుడిని రాచకొండ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ఒక కారు, రెండు బంగారు ఉంగరాలు, వెండి ఉంగరం, నాలుగు సెల్ ఫోన్లు, ఎనిమిది సిమ్ కార్డ్ లు, రూ.47 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం దవలూరుకు చెందిన ఇత్తెం రవి శేఖర్ అలియాస్ రవి అలియాస్ సతీశ్ అలియాస్ శశిధర్‌రెడ్డి మోసాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. 1994లో వివాహం కాగా 2014 లో భార్య చనిపోయింది. 2011 లో రవిశేఖర్ దగ్గరి బంధువుకు ఉయ్యూరు కేసీపీలో ఉద్యోగం పెట్టిస్తానని రూ.30 వేలు నగదు తీసుకుని మోసం చేయగా ఈ కేస్‌లో అరెస్ట్ అయి జైల్‌కు వెళ్ళివచ్చాడు. మరో కేస్ లో ఓ మహిళను మోసం చేసి జైల్‌కు వెళ్ళి విడుదలయ్యాడు. పలు అధికారులుగా అవతారాలు.. జైలు నుంచి వచ్చిన అనంతరం రవి శేఖర్ రైస్ మిల్లర్స్, రేషన్ డీలర్స్, ఫర్టిలైజర్స్ షాపుల వద్దకు విజిలెన్స్, ఇన్‌కంటాక్స్ అధికారినని, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ నని, జడ్జిలు తనకు బంధువులని చెబుతూ డబ్బు తీసుకుని మోసాలకు పాల్పడేవాడు. నిరుద్యోగ యువకులకు కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బు తీసుకుని మొహం చాటేసేవాడు. విశాఖపట్నంలో ఓ మోసపూరిత వ్యవహారంలో మే 23న కాకినాడ కోర్ట్ నుంచి విశాఖపట్నం జైల్‌కు తరలిస్తుండగా ఎస్కార్ట్ వాహనం నుంచి తప్పించుకుని పారిపోయాడు. అనంతరం జూన్‌లో రైలులో ప్రయాణిస్తున్న క్రమంలో కర్నాటక కొప్పల్ జిల్లాకు చెందిన మహిళతో తాను సెక్యూరిటీ ఆఫీసర్నని పరిచయం పెంచుకున్నాడు. తన వద్ద రూ.3 కోట్ల మేర డబ్బు వుండగా దాంతో స్థలం కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు నమ్మించి అక్కడి స్థలాలకు చెందిన పత్రాలను, కొంత నగదుతో మరో వ్యక్తితో ఐ 20 కారు ను తీసుకుని వస్తూ కార్ డ్రైవర్‌ను మధ్యలో వదిలి కారుతో సహా ఉడాయించాడు. ఆ కారుతో కర్నూలు జిల్లాకు వచ్చి నెంబరు మార్చుకుని తాను గోదావరి జిల్లా సీబీఐ ఆఫీసర్ నని చెప్పి నితిన్ కుమార్ అనే వ్యక్తి వద్ద రూ.50వేలు, ఒక సెల్ ఫోన్ తీసుకుని పారిపోయాడు. ఇలా పలు నేరాలు చేశాడు. గత నెల బొంగులూరు గేట్ సమీపంలో ఓ విద్యార్థికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బాలికను కిడ్నాప్ చేశాడు. అక్కడ నుంచి కడపలో తెలిసిన బంధువులతో జాబ్ గురించి మాట్లాడే పని వుందని చెప్పి కడప, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఆ విద్యార్థిని తిప్పుతూ ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 28 న బాధితురాలిని కారులోనే బంధించి ఆ వాహనం నెంబర్‌ను తిరిగి మార్చి ఎరువుల దుకాణం వద్దకు వెళ్ళి తాను విజిలెన్స్ అధికారినని బెదిరించి వారి నుంచి రూ.82 వేల నగదు, బంగారం, వెండి వుంగరాలు తీసుకుని పరారయ్యాడు. అప్పటికే హయత్ నగర్ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో గత నెల 30న కిడ్నాప్ చేసిన విద్యార్థిని హైదరాబాద్ బస్ ఎక్కించి ‘నువు వెళ్ళిపో.. నేను నీ వెనక వచ్చేస్తా..’ నని చెప్పి అక్కడ నుంచి ఉదాయించాడు. పోలీసులు జీపీఆర్ సిస్టమ్ ద్వారా రవి శేఖర్ ను పంతంగి టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేసి అతడి నుంచి కారు, నగదు, బంగా రం స్వాధీనం చేసుకుని విచారించగా ఇతడిపై తెలంగాణలో 10 కేస్లు, ఆంధ్రప్రదేశ్‌లో 38 కేస్ లు, కర్నాటకలో 1 కేస్లు నమోదైనట్లు గుర్తించారు. రవిశేఖర్ ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ధారాళంగా మాట్లాడుతూ మోసాలకు పాల్పడటంలో దిట్ట అని పేర్కొన్నారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్ బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దొంగ పట్టివేత
దేవరకద్ర : తరచూ దొంగతానికి పాల్పడుతున్న ఓ నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను బుధవారం దేవరకద్ర పోలీస్‌స్టేషన్‌లో ఆత్మకూర్ సీఐ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని పాతతోటకు చెందిన మొండి అంజి జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలోనే దేవరకద్ర పట్టణంలో నాలుగు చోట్ల, గద్వాలలో మరోచోట చోరీకి పాల్పడ్డాడు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చివరకు బుధవారం నిందితుడిని అరెస్టు చేసి ఏడు తులాల బంగారం, 50తులాల వెండి నగలను స్వాధీనపరుచుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ సమావేశంలో ఎస్ఐలు వినయ్‌కుమార్‌రెడ్డి, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.