వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ దీపిక, వెనక ముసుగులో చోరీ నిందితుడు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రంలోని బంగారు ఆభరణాల షాపులో చోరీ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 6.181 కిలోల బంగారు ఆభరణాలు, 90.52 గ్రాముల వెండి బ్రాస్‌లెట్లు, రూ.15 వేల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ దీపిక శనివారం విలేక రుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
చోరీ నిందితుడు లోకేష్ శ్రీవాస్‌ది ఛత్తీస్‌గఢ్. ఓ కేసులో విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. విజయనగరం జిల్లా కేంద్రంగా జనవరి 16న తొలిసారిగా పద్మజ ఆస్పత్రిలో చోరీ చేశాడు. మళ్లీ ఈ నెల 14న సీఎంఆర్‌లో చోరీకి పాల్పడ్డాడు. వారం వ్యవధిలో ఈ నెల 21న పట్టణంలో రెక్కీ నిర్వహించి రవి జ్యుయలరీ, పాండు జ్యుయలరీ షాపుల్లో దొంగతనానికి దిగాడు. రవి జ్యుయలర్స్‌లో ఉన్న 8 కిలోల బంగారు ఆభరణాలు దొంగిలించి పరారయ్యాడు. నాలుగు పోలీస్ బృందాలు గాలించి నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment