దొంగ పట్టివేత
Published Thu, Jul 28 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
దేవరకద్ర : తరచూ దొంగతానికి పాల్పడుతున్న ఓ నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను బుధవారం దేవరకద్ర పోలీస్‌స్టేషన్‌లో ఆత్మకూర్ సీఐ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని పాతతోటకు చెందిన మొండి అంజి జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలోనే దేవరకద్ర పట్టణంలో నాలుగు చోట్ల, గద్వాలలో మరోచోట చోరీకి పాల్పడ్డాడు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చివరకు బుధవారం నిందితుడిని అరెస్టు చేసి ఏడు తులాల బంగారం, 50తులాల వెండి నగలను స్వాధీనపరుచుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు వినయ్‌కుమార్‌రెడ్డి, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement