Thoongaavanam
-
కమల్ సినిమా రీమేక్ అట?!
చెన్నై: విలక్షణ కథానాయకుడు, దర్శకుడు కమలహాసన్ తాజా చిత్రం 'తూంగవనం' ఒక విదేశీ భాషా చిత్రానికి అఫీషియల్ రీమేక్ అని తెలుస్తోంది. అనధికారిక సమాచారం ప్రకారం ఫ్రెడరిక్ జార్డిన్ దర్శకత్వంలో 2011 విడుదలైన 'న్యూట్ బ్లాంచే' (స్లీప్ లెస్ నైట్స్) అనే ఫ్రెంచ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారట. అయితే తూంగవనం సినిమా విడుదలకు ముందు ఈ విషయాన్ని కమల్‌హాసన్ వెల్లడి చేయాలనుకున్నారట. ఒక పోలీస్ అధికారి తన కొడుకును, తన ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం రాత్రికి రాత్రి ఏం చేశాడనే కథాంశంతో రూపొందించిన చిత్రం న్యూట్ బ్లాంచే. దాదాపు తూంగవనం సినిమా కూడా ఇదే స్టోరీ లైన్లో వస్తోంది. మరోవైపు ఫ్రెంచ్ సినిమాకు కొరియోగ్రాఫర్స్‌గా ఉన్న గిల్స్ కోన్సీల్, సెల్పిన్ గాబెట్, ఆర్నాడ్ ఈ సినిమాకు కూడా పనిచేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తోంది. కమల్ హాసన్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న తూంగవనం సినిమాకు కమల్ చిరకాల మిత్రుడు రాజేశ్ సెల్వ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, మధుశాలిని, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన భూమికను పోషిస్తున్నీ ఈ చిత్రాన్ని కమల్ హాసన్ స్వయంగా తెలుగు,తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళంలో తూంగవనం, తెలుగులో చీకటి రాజ్యం పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఇటీవల ఒక స్టంట్, చేజింగ్ దృశ్యాలను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. -
'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ విడుదల
-
'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ విడుదల
-
'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ విడుదల
హైదరాబాద్: విలక్షణ నటుడు కమల్ హాసన్ కొత్త సినిమా 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ పోసర్లు విడుదలైయ్యాయి. హైదరాబాద్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో దీన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, త్రిష్, ప్రకాశ్ రాజ్, దర్శకుడు రాజేశ్ యం. సెల్వ తదితరులు హాజరయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్రిష, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళంలో 'తూంగా వనం' టైటిట్ ఖరారు చేశారు. ఓ థ్రిల్లర్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. కమల్ భార్యగా ప్రముఖ నటి మనీషా కోయిరాలా నటించే అవకాశముంది. జీబ్రాన్ సంగీతం అందించనున్నాడు. కమల్ హాసన్ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించడం ఇది నాలుగోసారి. -
25న కమల్ 'తూంగా వనం' ఫస్ట్ లుక్
చెన్నై: ఉత్తమ విలన్ చిత్రం తర్వాత ప్రముఖ నటుడు కమల్ హాసన్ తెలుగులో స్ట్రయిట్ చేస్తున్న చిత్రం తూంగా వనం(నిద్రపోని అడవి). రాజేశ్ యం. సెల్వ దర్శకత్వంలో తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మే 25న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం బుధవారం చెన్నైలో ఫొటో షూట్ కూడా పూర్తి చేసినట్లు సినీ వర్గాల సమాచారం. హైదరాబాద్‌లో చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నారని, అదే రోజు దీనిని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంలో త్రిష, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఓ థ్రిల్లర్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ పోలీసు ఆఫిసర్‌గా కనిపించనున్నారు. కమల్ భార్యగా ప్రముఖ నటి మనీషా కోయిరాలా నటించనుంది. ఈ చిత్రాన్ని మూడే నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు.