25న కమల్ 'తూంగా వనం' ఫస్ట్ లుక్ | First look of Kamal Haasan's 'Thoongaavanam' out on May 25 | Sakshi
Sakshi News home page

25న కమల్ 'తూంగా వనం' ఫస్ట్ లుక్

Published Thu, May 21 2015 1:20 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

25న కమల్ 'తూంగా వనం' ఫస్ట్ లుక్ - Sakshi

25న కమల్ 'తూంగా వనం' ఫస్ట్ లుక్

చెన్నై: ఉత్తమ విలన్ చిత్రం తర్వాత ప్రముఖ నటుడు కమల్ హాసన్ తెలుగులో స్ట్రయిట్ చేస్తున్న చిత్రం తూంగా వనం(నిద్రపోని అడవి).  రాజేశ్ యం. సెల్వ దర్శకత్వంలో తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మే 25న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం బుధవారం చెన్నైలో ఫొటో షూట్ కూడా పూర్తి చేసినట్లు సినీ వర్గాల సమాచారం.

హైదరాబాద్లో చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నారని, అదే రోజు దీనిని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంలో త్రిష, ప్రకాశ్రాజ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఓ థ్రిల్లర్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ పోలీసు ఆఫిసర్గా కనిపించనున్నారు. కమల్ భార్యగా ప్రముఖ నటి మనీషా కోయిరాలా నటించనుంది. ఈ చిత్రాన్ని మూడే నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement