పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురు నిందితుల పరారీ!
హైదరాబాద్: పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు. రాచకొండ కమిషనరేట్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. పోలీసుల కళ్లుగప్పి ముగ్గురు నిందితులు తప్పించుకుపోయారు. ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.