three-match ODI series
-
న్యూజిలాండ్ శుభారంభం
డ్యూనెడిన్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో న్యూజిలాండ్ 8 వికెట్లతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ట్రెంట్ బౌల్ట్ (4/27) ధాటికి 41.5 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ 21.2 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా... తన కెరీర్లో 50వ వన్డే ఆడిన నికోల్స్ (49 నాటౌట్; 6 ఫోర్లు) చివరి దాకా క్రీజులో నిలిచాడు. కాన్వే (27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. బౌల్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో వన్డే క్రైస్ట్‌చర్చ్ వేదికగా మంగళవారం జరుగుతుంది. -
పాండ్యా మెరుపులతో... బుమ్రా మలుపుతో...
వరుస సెంచరీలు, శతక భాగస్వామ్యాలు, భారీ స్కోర్లతో చెలరేగిపోతున్న ఆస్ట్రేలియాను ఆఖరి వన్డేలో భారత్ ఆల్‌రౌండ్ దెబ్బకొట్టింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా వీరోచిత పోరాటం, రవీంద్ర జడేజా సందర్భోచిత మెరుపులు భారత్‌కు పోరాడేందుకు సాయపడితే... బౌలింగ్‌లో బుమ్రా అద్భుతమైన మలుపు ఆసీస్ గెలుపు బాటనే కాదు... ఈ సిరీస్‌లోనే జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. కాన్బెర్రా: ఇది ఒకరితో దక్కిన విజయం కాదు. అలాగని ఇదేమీ ఊరట గెలుపు కాదు. ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని, బ్యాటింగ్ బలాన్ని బద్దలు కొట్టిన విజయం. రెండు వన్డేల్లోనూ 370 పైచిలుకు పరుగులు చేసి కూడా చెమటోడ్చిన ఆసీస్‌ను... భారత్ కేవలం 302 పరుగులు చేసి నిలువరించడం గొప్ప విషయం. సిరీస్ చేజారినా ఇక్కడ బ్యాటింగ్... బౌలింగ్... ఆతిథ్య జట్టును పెట్టించిన ‘కంగారూ’ అంతా ఇంత కాదు. క్లీన్‌స్వీప్ తప్పించి శుక్రవారం ఇక్కడే జరిగే తొలి టి20 మ్యాచ్‌కు ముందు భారత్‌కు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన విజయం ఇది. ఆసీస్ లక్ష్యం 303. గత మ్యాచ్‌ల భారీస్కోర్ల దృష్ట్యా, స్మిత్ వరుస సెంచరీల ఫామ్ దృష్ట్యా ఆతిథ్య జట్టుకు ఇదేమాత్రం కష్టం కానేకాదు. అయితే 158 పరుగులకే 5 వికెట్లు కోల్పో వడంతో భారత్‌కు విజయం ఖాయమవుతున్న తరుణంలో మ్యాక్స్‌వెల్ ధాటిగా ఆడిన ఇన్నింగ్స్ ఆసీస్‌ను 268/6 దాకా తీసుకెళ్లింది. ఇక 34 బంతుల్లో 35 పరుగుల విజయ సమీకరణం భారత్‌ను క్లీన్‌స్వీప్ చేసేలా కనిపించింది. కానీ బుమ్రా వేసిన 45వ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేయడంతో 268 పరుగుల వద్ద ఏడో వికెట్ పడింది. తర్వాత టెయిలెండర్లు 21 పరుగుల వ్యవధిలోనే నిష్క్రమించడంతో ఆసీస్ ఆలౌటైంది. భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో నెగ్గిన ఆసీస్ సిరీస్‌ను 2–1తో గెల్చుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (76 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (50 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. తర్వాత ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (82 బంతుల్లో 75; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్ (38 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. శార్దుల్ 3 వికెట్లు, బుమ్రా, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు. కోహ్లి అర్ధ సెంచరీ... భారత ఓపెనర్లలో ధావన్ (16) నిరాశపర్చగా, శుబ్‌మన్ గిల్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. తర్వాత కోహ్లి (78 బంతుల్లో 63; 5 ఫోర్లు) బాధ్యతగా ఆడాడు. కానీ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామమైన ఈ పిచ్‌పై రన్‌రేట్ జోరందుకోలేదు. అయ్యర్ (19), రాహుల్ (5) చేతులెత్తేశారు. కోహ్లి 32వ ఓవర్లో 152 పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఈ దశలో పాండ్యా, జడేజా జోడీ అదరగొట్టింది. ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులు జోడించడంతో భారత్ స్కోరు 300 దాటింది. భయపెట్టిన మ్యాక్స్‌వెల్... అరంగేట్రం చేసిన నటరాజన్, జట్టులోకి వచ్చిన శార్దుల్ ఆసీస్ టాపార్డన్‌ను ఇబ్బంది పెట్టారు. వారి బౌలింగ్‌లో లబ్‌షేన్ (7), స్మిత్ (7) సింగిల్ డిజిట్‌కే పరిమితమైనా మరో ఓపెనర్ ఫించ్ చక్కని ఇన్నింగ్స్‌తో విజయానికి అవసరమైన పరుగులు జతచేశాడు. వరుస విరామాల్లో హెన్రిక్స్ (22), గ్రీన్ (21), క్యారీ (38) ఔట్ కావడంతో భారత శిబిరంలో ఆశలు రేగాయి. కానీ మ్యాక్స్‌వెల్ చెలరేగడంతో ఆసీస్ ఒక్కసారిగా లక్ష్యానికి చేరువైంది. ఈ దశలో బుమ్రా చక్కని డెలివరీతో మ్యాక్స్‌వెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇది మ్యాచ్‌ను అనూహ్య మలుపు తిప్పింది. భారత్‌ను విజేతగా మార్చింది. స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ధావన్ (సి) అగర్ (బి) అబాట్ 16; శుబ్‌మన్ గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అగర్ 33; కోహ్లి (సి) క్యారీ (బి) హజల్‌వుడ్ 63; అయ్యర్ (సి) లబ్‌షేన్ (బి) జంపా 19; రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అగర్ 5; పాండ్యా (నాటౌట్) 92; జడేజా (నాటౌట్) 66; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 302. వికెట్ల పతనం: 1–26, 2–82, 3–114, 4–123, 5–152. బౌలింగ్: హజల్‌వుడ్ 10–1–66–1, మ్యాక్స్‌వెల్ 5–0–27–0, అబాట్ 10–0–84–1, గ్రీన్ 4–0–27–0, అగర్ 10–0–44–2, జంపా 10–0–45–1, హెన్రిక్స్ 1–0–7–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: లబ్‌షేన్ (బి) నటరాజన్ 7; ఫించ్ (సి) ధావన్ (బి) జడేజా 75; స్మిత్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 7; హెన్రిక్స్ (సి) ధావన్ (బి) శార్దుల్ 22; గ్రీన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 21; క్యారీ (రనౌట్) 38; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 59; అగర్ (సి) కుల్దీప్ (బి) నటరాజన్ 28; అబాట్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 4; జంపా (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 4; హజల్‌వుడ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 289. వికెట్ల పతనం: 1–25, 2–56, 3–117, 4–123, 5–158, 6–210, 7–268, 8–278, 9–278, 10–289. బౌలింగ్: బుమ్రా 9.3–0–43–2, నటరాజన్ 10–1–70–2, శార్దుల్ 10–1–51–3, కుల్దీప్ 10–0–57–1, జడేజా 10–0–62–1. వన్డే సిరీస్ ట్రోఫీతో ఆస్ట్రేలియా జట్టు జడేజా, హార్దిక్ పాండ్యా -
దక్షిణాఫ్రికా వన్డే జట్టులో రబడ పునరాగమనం
జొహన్నెస్‌బర్గ్: ఇంగ్లండ్‌తో వచ్చే నెలలో జరిగే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. స్టార్ పేస్ బౌలర్ కగిసో రబడ పునరాగమనం చేశాడు. గత మార్చిలో భారత్‌తో జరిగిన సిరీస్‌కు గాయంతో రబడ దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న రబడ ఐపీఎల్ టి20 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 15 మ్యాచ్‌ల్లో ఆడిన రబడ 25 వికెట్లు తీశాడు. 24 మంది సభ్యులతో ప్రకటించిన ప్రస్తుత జట్టులో పేస్ బౌలర్ స్టర్‌మన్‌కు తొలిసారి స్థానం లభించింది. దక్షిణాఫ్రికా వన్డే జట్టు: డికాక్ (కెప్టెన్), బవుమా, డాలా, డు ప్లెసిస్, ఫార్చూన్, బ్యూరన్ హెన్డ్రిక్స్, రీజా హెన్డ్రిక్స్, క్లాసెన్, జార్జి లిండె, కేశవ్ మహరాజ్, మలాన్, మిల్లర్, ఇన్‌గిడి, నోర్జే, ఫెలుక్వాయో, ప్రెటోరియస్, రబడ, షమ్సీ, సిపామ్లా, స్మట్స్, స్టర్‌మన్, బిల్జాన్, డుసెన్, వెరియన్. -
కివీస్‌దే సిరీస్
మూడో వన్డేలో ఆసీస్‌పై గెలుపు మెరిసిన రాస్ టేలర్, బౌల్ట్ హామిల్టన్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 2–0తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో కివీస్ 24 పరుగుల తేడాతో నెగ్గింది. బ్యాటింగ్‌లో రాస్ టేలర్ (107; 13 ఫోర్లు) శతక్కొట్టగా, బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ (6/33) ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఓపెనర్ డీన్ బ్రౌన్లీ 63; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, ఫాల్క్‌నర్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 47 ఓవర్లలో 257 పరుగుల వద్ద ఆలౌటైంది. బౌల్ట్ వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. కెప్టెన్ ఫించ్ (56; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హెడ్ (53; 5 ఫోర్లు), స్టోయినిస్ (42) రాణించారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో కివీస్ నెగ్గగా... రెండో వన్డే వర్షార్పణమైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌కిది వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక సిరీస్ విజయం కావడం విశేషం. మరోవైపు ఈ సిరీస్ ఓటమితో ఆస్ట్రేలియా వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయే ప్రమాదంలో పడింది. -
కివీస్‌దే వన్డే సిరీస్
- చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై విజయం హరారే: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు దక్కించుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109 బంతుల్లో 90; 8 ఫోర్లు; 1 సిక్స్) నిలకడైన ఆటతీరుకు తోడు బౌలర్ల షో కారణంగా శుక్రవారం చివరిదైన మూడో వన్డేలో కివీస్ 38 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో పర్యాటక జట్టు 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. చివరి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 273 పరుగులు చేసింది. ఓపెనర్ గప్టిల్ (50 బంతుల్లో 42; 6 ఫోర్లు), నీషమ్ (31 బంతుల్లో 37; 2 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. క్రెమెర్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం దిగిన జింబాబ్వే 47.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షాన్ విలియమ్స్ (62 బంతుల్లో 63; 5 ఫోర్లు; 1 సిక్స్), మసకద్జా (94 బంతుల్లో 57; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. మెక్లెనగాన్ మూడు, సోధి రెండు వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా విలియమ్సన్కు దక్కాయి. -
బంగ్లాతో ఆఖరి వన్డే రద్దు
2-0తో సిరీస్ భారత్ కైవసం మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0తో గెలుచుకుంది. గురువారం షేరే బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగాల్సిన చివరిదైన మూడో వన్డే కాస్త జరిగాక వర్షం కారణంగా రద్దయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను 9, 13వ ఓవర్ల సమయంలో వరుణుడు అడ్డుకున్నాడు. దీంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. అయితే 34.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 119 పరుగులు చేసిన సమయంలో మరోసారి భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలు వేచి చూసినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రెండో వన్డేలాగే ఈ మ్యాచ్‌లోనూ బంగ్లా బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. పుజారా (63 బంతుల్లో 27; 2 ఫోర్లు), రైనా (25 బంతుల్లో 25; 3 ఫోర్లు), బిన్నీ (36 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) మాత్రమే రాణించారు. 16 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ఏ సమయంలోనూ కోలుకోలేకపోయింది. ఐదో వికెట్‌కు రైనా, పుజారా మధ్య నెలకొన్న 41 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం. చివర్లో బిన్నీ వేగంగా ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. షకీబ్‌కు మూడు వికెట్లు, తస్కిన్, అల్ అమీన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. స్టువర్ట్ బిన్నీకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) నాసిర్ హుస్సేన్ (బి) మొర్తజా 5; రహానే (సి) నాసిర్ హుస్సేన్ (బి) అల్ అమిన్ 3; పుజారా ఎల్బీడబ్ల్యు (బి) షకీబ్ 27; రాయుడు (సి) రహీమ్ (బి) తస్కిన్ 1; తివారి (సి) అనముల్ హక్ (బి) అల్ అమిన్ 2; రైనా (సి) ముష్ఫికర్ (బి) షకీబ్ 25; సాహా (బి) షకీబ్ 16; బిన్నీ నాటౌట్ 25; పటేల్ (సి) ముష్ఫికర్ (బి) తస్కిన్ 1; మోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) సొహాగ్ 1; ఉమేశ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 3, వైడ్లు 10) 13; మొత్తం (34.2 ఓవర్లలో 9 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1-8; 2-8; 3-13; 4-16; 5-57; 6-89; 7-90; 8-97; 9-119. బౌలింగ్: మొర్తజా 8-1-25-1; అల్ అమిన్ 6-1-23-2; తస్కిన్ 8-1-15-2; షకీబ్ 7.2-0-27-3; నాసిర్ 2-0-14-0; సొహాగ్ 2-0-7-1; మహ్ముదుల్లా 1-0-5-0.