డ్యూనెడిన్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో న్యూజిలాండ్ 8 వికెట్లతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ట్రెంట్ బౌల్ట్ (4/27) ధాటికి 41.5 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ 21.2 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా... తన కెరీర్లో 50వ వన్డే ఆడిన నికోల్స్ (49 నాటౌట్; 6 ఫోర్లు) చివరి దాకా క్రీజులో నిలిచాడు. కాన్వే (27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. బౌల్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో వన్డే క్రైస్ట్‌చర్చ్ వేదికగా మంగళవారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment