- చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై విజయం
హరారే: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు దక్కించుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109 బంతుల్లో 90; 8 ఫోర్లు; 1 సిక్స్) నిలకడైన ఆటతీరుకు తోడు బౌలర్ల షో కారణంగా శుక్రవారం చివరిదైన మూడో వన్డేలో కివీస్ 38 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో పర్యాటక జట్టు 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
చివరి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 273 పరుగులు చేసింది. ఓపెనర్ గప్టిల్ (50 బంతుల్లో 42; 6 ఫోర్లు), నీషమ్ (31 బంతుల్లో 37; 2 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. క్రెమెర్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం దిగిన జింబాబ్వే 47.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షాన్ విలియమ్స్ (62 బంతుల్లో 63; 5 ఫోర్లు; 1 సిక్స్), మసకద్జా (94 బంతుల్లో 57; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. మెక్లెనగాన్ మూడు, సోధి రెండు వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా విలియమ్సన్‌కు దక్కాయి.
కివీస్‌దే వన్డే సిరీస్
Published Sat, Aug 8 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM
Advertisement
Advertisement