కాకినాడలో మూడు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు
ఈ రైల్వే బడ్జెట్లోనూ జిల్లాకు ప్రాధాన్యం
ఎంపీ తోట నరసింహం
కరప:
కాకినాడలో మూడు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చినట్టు ఎంపీ తోట నరసింహం తెలిపారు. సోమవారం సాయంత్రం కరపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారి¯ŒS ట్రేడింగ్, ఇండియ¯ŒS ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష¯ŒS టెక్నాలజీ కేంద్రాలను కాకినాడలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని, త్వరలోనే మంజూరవుతాయని చెప్పారు. ఈనెల 31 నుంచి పార్లమెంట్ » బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. ఈ ఏడాది సాధారణ, రైల్వే బడ్జెట్లు కలిపి పెట్టనున్నట్టు తెలిపారు. రైల్వే బడ్జెట్లో గత ఏడాది పిఠాపురం మెయి¯ŒSలైన్, కాకినాడ–నరసాపురం లై¯ŒSకు కేటాయించిన రూ.200 కోట్లతో పనులకు టెండర్లు ఖరారయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. రైల్వేమంత్రి సురేష్‌ప్రభును ఆంధ్రా మంత్రులు, ఎంపీలు కల్సి ఈ ఏడాదికూడా రైల్వేబడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై చర్చించామన్నారు.
గత ఏడాది కేటాయించిన దానికి తగ్గకుండా నిధులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని, అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, దానికి ప్రజలు కూడా సహకరించారని చెప్పారు. తాను దత్తత తీసుకున్న బూరుగుపూడి రోల్‌మోడల్‌గా తయారైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్టంలోని అన్నిప్రాంతాలవారినీ అక్కడకు పంపి, అలాచేసుకోవాలని సూచిస్తున్నారని చెప్పారు. కరప మండలంలోని దత్తత గ్రామమైన గొర్రిపూడిని కూడా అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తానన్నారు. ఉపాధి అనుసంధానంతో ఇప్పటికే రూ.70 లక్షలు కేటాయించామని వివరించారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బుంగా సింహాద్రి, మండల టీడీపీ అధ్యక్షుడు దేవు మధువీరేష్, జిల్లా క్రికెట్ అసోషియేష¯ŒS ఉపాధ్యక్షుడు దేవు మధువీరేస్ తదితరులు ఎంపీ వెంట ఉన్నారు.