Ticket counter
-
భారత్, ఆసీస్ తొలి వన్డే.. రణరంగంగా ఆజాద్ మైదాన్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ ప్రశాంతంగా సాగుతున్నప్పటికి.. మ్యాచ్ ప్రారంభానికి ముందు మాత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్ రణరంగాన్ని తలపించింది. మ్యాచ్‌కు సంబంధించిన ఆన్లైన్ టికెట్ల విక్రయాన్ని ఆజాద్ మైదానంలోనే ఏర్పాటు చేశారు. కరోనా తదనంతరం పరిస్థితులు మారడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆన్లైన్ టికెట్స్‌వైపే మొగ్గుచూపారు. అయితే నిర్వాహకులు ఒకటే కౌంటర్ ఏర్పాటు చేయడం.. అభిమానులు మాత్రం ఊహించనిస్థాయిలో వచ్చారు. టికెట్ల కోసం క్యూలో నిలబడినప్పటికి రెండు గంటలకు పైగా కౌంటర్ తెరవలేదు. దీంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టికెట్ కౌంటర్ కిటికీ గ్రిల్‌ను ఊడగొట్టి విధ్వంసం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అభిమానులను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో పలువురిపై లాఠాచార్జీ చేశారు. అయితే కాసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి తెచ్చిన పోలీసులు క్యూలో నిల్చున్నవారికి మ్యాచ్ టికెట్లు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Scenes at the Azaad Maidan in Mumbai. Online tickets are supposed to be collected from here. Number of counters should be increased if they know that a large no. of people are expected. Horrible management 👎 Won't suggest to anyone.@MumbaiCricAssoc @NorthStandGang @BCCI pic.twitter.com/rP51wcFDJj — Ojas Naidu (@Cricky_Nerd) March 17, 2023 చదవండి: జడేజాతో అట్లుంటది మరి.. డైవ్ చేస్తూ సంచలన క్యాచ్! వీడియో వైరల్ Rajinikanth: అభిమానం స్టేడియానికి రప్పించిన వేళ.. -
మంగళూరు ఎయిర్‌పోర్టులో బాంబు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు దొరకడం కలకలం రేపింది. టికెట్ కౌంటర్ వద్ద సోమవారం ఉదయం 10 గంటల సమయంలో అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్న విమానాశ్రయ పోలీసులు, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నగర పోలీసు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆ బ్యాగులో పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు. దీంతో ఆ బ్యాగ్‌ను బాంబు తరలింపు వాహనం ద్వారా కిలోమీటరు దూరంలో ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ కట్టుదిట్టమెన భద్రతతో సాయంత్రం 5.30 గంటలకు పేల్చారు. బ్యాగ్‌లోని మెటల్ కాయిన్ బాక్స్‌లో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు నింపారని సమాచారం. సీసీ కెమెరాల్లో నిందితుడు.. సీసీ కెమెరా చిత్రాల ఆధారంతో అధికారులు నిందితుడి ఫొటోలు విడుదల చేశారు. నిందితుడు ఆటోలో రావడం, బ్యాగ్ ఉంచడం తదితర దృశ్యాలు విమానాశ్రయం కెమెరాల్లో రికార్డ య్యాయి. నిందితుడు మధ్యవయస్కుడు, విద్యావంతునిలా కనిపిస్తున్నాడు. బ్యాగ్‌ను కౌంటర్ వద్ద ఉంచి, ముఖాన్ని దాచుకుంటూ ఆటోలో వెళ్లిపోయాడు. దీని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సీఐఎస్ఎఫ్ తెలిపింది. బాంబు విమానాశ్రయంలో పేలి ఉంటే మొత్తం బూడిదై పోయేదని మంగళూరు ఎస్పీ పీఎస్ హర్ష తెలిపారు. చుట్టూ 500 మీటర్ల మేర పేలుడు ప్రభావం ఉండేదన్నారు. మంగళూరు విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో విమానంలో బాంబు ఉందనే వదంతి వ్యాపించింది. దీంతో అధికారులు విమానాన్ని వెనక్కి రప్పించి తనిఖీలు చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. ఈ సంఘటనలతో మంగళూరులో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల మంగళూరులో ఎన్నార్సీకి వ్యతిరేకంగా భారీగా అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. -
టికెట్లు జేబులో! బాబాయి రైల్లో!
తపాలా: దాదాపు 35 యేళ్ల క్రితం సంఘటన ఇది. అప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు రెండు రైళ్లు నడిచేవి. ఉదయం కృష్ణా, మధ్యాహ్నం గోల్కొండ. బీబీనగర్-నడికుడి రైలుమార్గం అప్పుడు లేదు. హైదరాబాద్ వెళ్లాలంటే బెజవాడ మీదుగా పోవాల్సిందే! ఒకసారి మా పిన్నిని, బాబాయిని గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఎక్కించటానికి గుంటూరు స్టేషన్‌కు వచ్చాం. టికెట్ కౌంటర్ దగ్గర బాగా రష్‌గా ఉంది. టికెట్ ఎలా తీసుకోవాలి? అని ఆలోచిస్తూ మా బాబాయి నిలబడ్డాడు. మా తమ్ముడు జయప్రసాద్ అభిమన్యుడిలా గుంపులోకి చొరబడి, ఐదు నిమిషాల్లో కొనుక్కుని వచ్చాడు విజయగర్వంతో. అంతలో ప్లాట్‌ఫారమ్ మీదకు ట్రైన్ వచ్చింది. మేం అన్ని సామాన్లు ఖాళీ కంపార్ట్మెంట్లో పెట్టి, ఇద్దరికీ కిటికీ పక్కన సీటు సంపాదించాం. మా శ్రమకు మెచ్చి చెరో పది రూపాయలు చేతిలో పెట్టాడు బాబాయి. ఆ రోజు ఆలస్యంగా రావటంతో త్వరగా బయలుదేరింది ట్రైన్. మేం వీడ్కోలు చెప్పి స్టేషన్ బయటకు వచ్చాం. మా తమ్ముడు జేబులో డబ్బులు పెట్టుకుంటూ, ‘‘అన్నా! టిక్కెట్లు నా దగ్గరే ఉన్నాయి. పిన్నీవాళ్లకు ఇవ్వలేదు’’ అంటూ ఏడుస్తూ చెప్పాడు. అది వర్షాకాలం. అప్పుడే జోరుగా వర్షం మొదలైంది. మా వద్ద ఉన్న ఆ ఇరవై రూపాయలతో స్కూటర్లో పెట్రోల్ పోయించుకుని, గోల్కొండ ఎక్స్‌ప్రెస్ విజయవాడ చేరేలోపు మేం స్పీడుగా రోడ్డుపై ప్రయాణించి, విజయవాడ చేరాం. అప్పుడే ట్రైన్ ప్లాట్‌ఫారమ్ మీదకు వచ్చింది. మేం పరుగుపరుగున కంపార్ట్మెంట్ దగ్గరకు పోయాం. మమ్మల్ని చూసి, ‘‘ఇదేమిటిరా. మీరు ఇక్కడికి వర్షంలో తడుచుకుంటూ ఎందుకు వచ్చారు?’’ అని ఆశ్చర్యపోయారు పిన్ని, బాబాయి. విషయం చెప్పి, టికెట్లు ఇచ్చి స్టేషన్ బయటకు వచ్చాం. అసలు సంగతేమిటంటే, మేం వారికి టికెట్లు ఇచ్చేవరకు వాళ్లకి ఈ సంగతే గుర్తురాలేదట! - జన్నాభట్ల నరసింహప్రసాద్ నాగారం, రంగారెడ్డి జిల్లా -
ప్రతిపాదనలు పట్టాలెక్కేనా..!
ప్రతీసారి జిల్లావాసులను ఊరిస్తూ ఉసూరుమనిపిస్తున్న రైల్వే బడ్జెట్‌కోసం ఈ సారి వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రైల్వే బడ్జెట్‌కు ముందు జిల్లా ఎంపీలు భారీ ప్రతిపాదనలు పెట్టడం.. తీరా బడ్జెట్లో వాటికి ఆమోదం లభించకపోవడం ఏటా జరుగుతున్న తంతే. ఫలితంగా దశాబ్దాకాలంగా రైల్వేరంగం జిల్లాలో ఆశించినంతగా అభివృద్ధి జరగడం లేదు. యూపీఏ-2 ప్రభుత్వ చిట్టచివరి బడ్జెట్లోనైనా జిల్లాకు న్యాయం జరుగుతుందా? రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో జిల్లా ఎంపీల ప్రతిపాదనలు కార్యరూపం దాలుస్తాయా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. సాక్షి, కరీంనగర్ : జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో సౌకర్యాలపై అధికారులు శ్రద్ధ చూపడం లేదు. కరీంనగర్ రైల్వేస్టే షన్ను ఆదర్శ స్టేషన్‌గా ప్రకటించినా భారీ ఆదాయాలను సమకూరుస్తున్న స్టేషన్లలో కూడా ప్రయాణికులకు కనీస వసతులు కల్పించడం లేదు. రామగుండం రైల్వేస్టేషన్లో రెండో వైపు కూడా టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. నాలుగు కొత్త రైలుమార్గాల కోసం జి ల్లా ప్రజలు,ప్రజాప్రతినిధులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నా మోక్షం లభించడం లేదు. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్, కరీంనగర్ నుంచి హైదరాబాద్, కరీం నగర్ నుంచి హసన్‌పర్తి, రామగుండం నుంచి మణుగూరు లైన్ల కోసం ఏటా ప్రతిపాదనలు చేస్తూనే ఉన్నా రు. జిల్లానుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు లోకసభ సభ్యులు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, మధుయాష్కీలు ఇప్పటికే రైల్వే బోర్డుకు తమ ప్రతిపాదనలు అందించారు. బుధవారం లోకసభలో రైల్వేశాఖ మంత్రి ఖర్గే ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తమ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందని వీరు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. కొత్తపల్లి- మనోహరాబాద్ లైను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఇక్కడనుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించినప్పటి నుంచి ప్రతిపాదిస్తున్నా ఫలితం లేదు. దక్షిణ, ఉత్తర భారతాలను జిల్లా మీదుగా వెళ్తున్న రైలుమార్గం కలుపుతున్నా జిల్లాకు రాష్ట్ర రాజధానికి మాత్రం రైలు లింకు లేదు. ఈ లోటు తీర్చడం వల్ల ప్రయాణికులకు, వాణిజ్య రంగానికి మేలు కలగడమే కాకుండా రైల్వేకు కూడా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ రైలు మార్గాన్ని చేపడితే సిరిసిల్ల, సిద్దిపేట ప్రజలకు కూడా రైలు అందుబాటులోకి వస్తుంది. జిల్లా కేంద్రం నుంచి రాజధానికి ప్రయాణదూరం తగ్గుతుంది. హైదరాబాద్ లైనుతోపాటు కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వరకు కొత్త లై ను వేయాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రతిపాదించారు. దీనివల్ల జిల్లా వాసులకు రైల్వే కనెక్టివిటీ మెరుగవుతుంది. రామగుండం, మణుగూరు లైను కోసం పెద్దపల్లి ఎంపీ వివేక్ ప్రయత్నాలు చేస్తున్నారు. మణుగూరు రైలు మార్గానికి 1982లోనే రూ.650 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పటి నుంచి ఈ లైను గురించి పట్టించుకున్నవారే లేరు. 2010లో ఈ ప్రతిపాదనను రైల్వేమంత్రి దృష్టికి వివేక్ తీసుకుపోగా సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లుగా ఇదే తంతు సాగుతోంది. పెద్దపల్లి-నిజామాబాద్ రైలు మార్గాన్ని త్వరితంగా పూర్తి చేయాలని ముగ్గురు ఎంపీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. 1992లో అప్పటి ప్రధాని అయిన జిల్లావాసి పీవీ నర్సింహారావు చేతుల మీదుగా మొదలైన పెద్దపల్లి-నిజామాబాద్ రైలుమార్గం పనులు ఎడతెగకుండా సాగుతున్నాయి. మూడు దశల్లో పెద్దపల్లి నుంచి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వరకు పనులు పూర్తయ్యాయి. గత బడ్జెట్లోనే పనులు పూర్తి చేస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. 1992లో రూ.400 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించగా ప్రతీ బడ్జెట్లో అరకొర నిధుల కేటాయింపుతో జాప్యం జరిగింది. మొత్తం 178 కిలోమీటర్ల ఈ మార్గం జిల్లాలో 122 కిలోమీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 56 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు అంచనా వ్యయం రెట్టింపయింది. ఇప్పటికే రూ.560 కోట్లు ఖర్చు చేయగా మరో రూ.385 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఎంపీల ప్రతిపాదనలు ఇవీ.. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి మోర్తాడ్ వరకు రైలు మార్గం పూర్తయినందున కరీంనగర్, మెట్పల్లి మధ్య పుష్పుల్ రైలు నడపాలి. కరీంనగర్ నుంచి వరంగల్‌కు రైలు. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి, హుజూరాబాద్ సమీపంలోని ఉప్పల్ వద్ద ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణం. కరీంనగర్ - హసన్‌పర్తి కొత్త రైలుమార్గం కరీంనగర్, పెద్దపల్లి రైల్వేలైను విద్యుదీకరణ వేములవాడలో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు. వివేక్ మణుగూరు-రామగుండం కొత్తలైనుకు నిధులుపెద్దపల్లిలో ఏపీ ఎక్స్‌ప్రెస్ నిలుపుదల. మధుయాష్కీ పెద్దపల్లి-నిజామాబాద్ రైలుమార్గం పూర్తికి అవసరమైన నిధులు మంజూరు