Tiger died
-
విశాఖ జూ పార్కులో పులి మృతి
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ జూ పార్కులో ఓ ఆడ పులి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. 20 ఏళ్ల వయసు గల ఈ రాయల్ బెంగాల్ టైగర్(సీత) వృద్ధాప్యంతో పాటు కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం పులుల ఎన్‌క్లోజర్‌లో మృతి చెందింది. యానిమల్ కీపర్ ద్వారా విషయం తెలుసుకున్న జూ అధికారులు పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. -
రోడ్డు పక్కన చిరుత మృతదేహం
సాక్షి, మంచిర్యాల : అటవీ సమీప పల్లెల్ని పులి భయం వీడట్లేదు. పులి సంచారం అధికంగా ఉన్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలంలోని పది గ్రామాలు ఇంకా భయం గుప్పిటే ఉన్నాయి. గత నెలలో ఇద్దరు గిరిజనులను పొట్టనబెట్టుకున్న పులులను బంధించడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. సోమవారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ శోభ, అధికారులు, ప్రజాప్రతినిధులు పులుల దాడిలో మరణించిన విఘ్నేశ్, నిర్మల కుటుంబాలను పరామర్శించేందుకు కొండపలి్లకి వచ్చారు. అదే సమయంలో యువతిపై దాడిచేసి చంపిన గ్రామమైన కొండపల్లి శివారు శివయ్యకుంటలో మళ్లీ పులి కనిపించడంతో.. పత్తిచేల నుంచి మహిళలు భయంతో పరుగులు తీశారు. పులి భయంతో కూలీలు రాకపోవడంతో చేలలోనే పత్తి ఉండిపోతోందని రైతులు వాపోతున్నారు. చదవండి: ఆవును చంపిన పులి..? బోన్ల చుట్టూ తిరుగుతూ.. పులులను బంధించేందుకు ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ, కొండపల్లి అడవుల్లో 8చోట్ల బోన్లు ఏర్పాటుచేశారు. పందులను ఎరగా ఉంచారు. పులుల కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలతోపాటు అటవీ సిబ్బంది, ఎన్జీవో సభ్యులు ప్రయత్నిస్తున్నారు. కొండపల్లి శివారులో పలుమార్లు బోను వరకు వచ్చిన పులి అక్కడే తిరిగినట్టు అధికారులు గుర్తించారు. చదవండి: జస్ట్ మిస్.. పులికి బలయ్యేవారు..! వలస పులుల గాండ్రింపు రాష్ట్రంలో కొత్త పులుల రాకతో అడవుల్లో గాండ్రింపులు పెరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ పులుల అభయారణ్యానికి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా– అందేరి టైగర్ రిజర్వ్ నుంచి వలస వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వు నుంచి పులులు సరిహద్దు దాటి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అడుగుపెడుతున్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మగపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. గుండాల, ఇల్లెందు, ఆళ్లపల్లి, మణుగూరు, కరకగూడెం, అశ్వరాపురం అడవుల్లో పులి జాడలు బయటపడ్డాయి. మూడ్రోజుల క్రితం ములుగు, వరంగల్ రూరల్ జిల్లాల సరిహద్దు నర్సంపేట అడవుల్లో ఆవును చంపిన పులిని గుర్తించే పనిలో అధికారులున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు డివిజన్లోని కోటపల్లి రేంజీలోకి మరో రెండు పులులు వచ్చాయి. ఇందులో ఒకటి గత వేసవిలో కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కు వలస వచ్చింది కాగా.. మరొకటి కొత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటికే చెన్నూరు ప్రాంతంలో రెండు పులులున్నాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోనే పది పులుల వరకు సంచరిస్తున్నాయి. కొత్త పులుల కదలికలు పెరిగిన నేపథ్యంలో ఆవాసాలు ఇరుకుగా మారి పులులు గ్రామశివార్లు, పొలాల్లోకి వస్తున్నాయని అధికారులు అంటున్నారు. అలాగే, మగపులులు తోడు కోసం వెతుక్కుంటూ అడవి దాటి బయటకొస్తున్నాయని చెబుతున్నారు. బాధితులకు అండగా ఉంటాం పెంచికల్పేట్(సిర్పూర్): ఇటీవల పులి దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పసుల నిర్మల, దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేష్ గత నెలలో పులిదాడిలో మృతిచెందిన విషయం తెల్సిందే. సోమవారం మృతుల కుటుంబ సభ్యులను మంత్రి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించారు. అటవీశాఖ తరఫున పరిహారంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి బాధిత కుటుంబాలకు మరో రూ.5 లక్షల పరిహారం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. రోడ్డుపక్కన చిరుత మృతదేహం సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే దారిలో 44వ జాతీయ రహదారిపై గుడిహత్నూర్ మండలం చింతగూడ వెళ్లే దారిలో సోమవారం సాయంత్రం వాహనదారులు రోడ్డుపక్కన చిరుతపులి పడిపోయి ఉండటాన్ని గమనించారు. కదలిక లేకపోవడంతో కొంతమంది దగ్గరకు వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. వెం టనే గుడిహత్నూర్ పోలీసులకు సమాచారం అం దించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత రోడ్డుపైకి వచ్చినప్పుడు ఏదైనా వాహనం ఢీకొట్టి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
కరోనా: ఢిల్లీలో పులి మృతి కలకలం
న్యూఢిల్లీ: మూత్రపిండాల వ్యాధితో ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో బుధవారం మరణించిన ఆడ పులి ‘కల్పన’ రక్త నమూనాలను కరోనా నిర్ధారిత పరీక్షల కోసం పంపినట్టు అధికారులు వెల్లడించారు. బరేలికి ఈ నమూనాలను పంపించినట్టు తెలిపారు. ‘14 ఏళ్ల కల్పన అనే ఆడపులి మూత్రపిండాలు పనిచేయకపోవడంతో బుధవారం మరణించింది. తర్వాతి రోజే కళేబరాన్ని ఖననం చేశాం. దాని శరీరం నుంచి సేకరించిన రక్త నమూనాలను కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షల కోసం బరేలీకి పంపించామ’ని జూ అధికారి ఒకరు చెప్పారు. కరోనా మార్గదర్శకాలను అనుసరించి కళేబరాన్ని ఖననం చేసేటప్పుడు ఎక్కువ మంది లేకుండా జాగ్రత్త పడినట్టు తెలిపారు. బరేలీలో ఉన్న ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)లోని సెంటర్ ఫర్ యానిమల్ డిసీజ్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్(సీఏడీఆర్‌ఏడీ) నమూనాలను పరీక్షించనుంది. వీటితో పాటు భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యురిటీ యానిమల్ డీసీజ్(ఎన్ఐహెచ్ఎస్ఏడీ), హిసార్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వైన్స్(ఎన్ఆర్సీఈ)లు జంతువులకు సంబంధించిన పరీక్షలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కాగా, న్యూయార్క్‌లోని బ్రాంక్జ్ జంతు ప్రదర్శన శాలలో నాదియా అనే నాలుగేళ్ల పులి కరోనా వైరస్ బారిన పడిన నేపథ్యంలో మన దేశంలోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డిసెంబరులో చైనాలోని వూహాన్లో ముందుగా కనిపించిన కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషుల్లోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు. హాంకాంగ్‌లో ఇప్పటికే రెండు కుక్కలు కూడా కోవిడ్-19 బారిన పడినట్టు సమాచారం. చదవండి: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి -
మానవ తప్పిదానికి.. వన్యప్రాణులు బలి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో మంచిర్యాల జిల్లాలో వన్యప్రాణులు పిట్టల్లా రాలిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకే రైతులు విద్యుత్ తీగలు అమరుస్తున్నారని ఇప్పటి వరకు అటవీ అధికారులు చెప్పిన మాటలన్నీ అబద్దాలేనని స్పష్టమవుతోంది. వన్యప్రాణులను వధించాలనే లక్ష్యంతోనే వేటగాళ్లు అడవుల్లో విద్యుత్ తీగలను అమర్చి అరుదైన జంతు జాతిని అంతమొందిస్తున్నారని తెలుస్తోంది. శివ్వారంలో గత నెలలో విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడ్డ పులికి సంబంధించి రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ చొరవతో జరిపిన దర్యాప్తులో వాస్తవాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. వన్యప్రాణులతోపాటు పులి, చిరుత వంటి అరుదైన జంతు జాలాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే చంపి, వాటి చర్మాన్ని, గోళ్లను విక్రయించాలనే దుర్బుద్ధితో వేటగాళ్లు విద్యుత్ కంచెలు అమరుస్తున్నారని తేలింది. బుధవారం మంచిర్యాలలో మీడియా సమావేశంలో కమిషనర్ వి.సత్యనారాయణ రామగుండం కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న వన్యప్రాణుల వధ, అందుకు సహకరిస్తున్న యానిమల్ ట్రాకర్స్, పులి చర్మం పట్టివేత ముసుగులో చంద్రాపూర్ గ్యాంగ్ చేస్తున్న అకృత్యాలను పూసగుచ్చినట్లు వివరించారు. సిబ్బంది లేరనే ఏకైక కారణంతో అటవీశాఖలోని పైస్థాయి నుంచి బీట్ అధికారుల వరకు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లనే చెన్నూరు, బెల్లంపల్లి, జన్నారం, కాగజ్‌నగర్, మంచిర్యాల డివిజన్లలో వన్యప్రాణులతో పాటు అరుదైన పులులు, చిరుతలు కూడా వేటగాళ్ల బారిన పడుతున్నట్లు స్పష్టమైంది. శివ్వారంలో పులి హతమైనా? కడెం అటవీ ప్రాంతంలో డిసెంబర్ 15న రాయల్ బెంగాల్ టైగర్ జాతికి చెందిన మగ పెద్దపులి సీసీ కెమెరాలకు చిక్కింది. అక్కడి నుంచి 17న కవ్వాల్ అభయారణ్యంలోకి ప్రవేశించి ఓ మేకను చంపి తిన్న ఆనవాళ్లు కనిపించాయి. అటు నుంచి తిర్యాణి మీదుగా డిసెంబర్ 23న ఆసిఫాబాద్ అల్లినగర్ బీట్ ఏరియాలో పులి సంచరించినట్లు పగ్ మార్క్స్ (పంజా అడుగులు) కనిపించాయి. 30వ తేదీన బెల్లంపల్లి రేంజ్ రొట్టెపల్లి ఏరియాలో, జనవరి 6న చెన్నూరు డివిజన్లోని పౌనూరు, శివ్వారం గ్రామాల శివార్లలో పులి అడుగులను గుర్తించారు. ఈ విషయాలను యానిమల్ ట్రాకర్స్ ఎప్పటికప్పుడు బీట్ ఆఫీసర్లకు, రేంజ్ ఆఫీసర్లకు, డీఎఫ్ఓలకు తెలియజేస్తూనే ఉన్నారు. శివ్వారం ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు గ్రామాల్లో దండోరా కూడా వేయించారు. 7వ తేదీ తరువాత పులి జాడ కనిపించలేదు. అలాంటప్పుడు పులి ఏమైందనే విషయంలో కనీసం దృష్టి పెట్టకపోవడం అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. జనవరి 23న పులి చర్మాన్ని పట్టిస్తామని చంద్రాపూర్ గ్యాంగ్ నడుపుతున్న ఎన్జీవో సంస్థ టైగర్ హంటింగ్ ఎండ్ అసోసియేషన్ అధ్యక్షుడు నందుకిషోర్ పింప్లే అనే వ్యక్తి మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వర్రావుకు ఫోన్ చేసినప్పుడు ఆయన గాని, అప్పటి డీఎఫ్ఓ రామలింగం కానీ కనిపించకుండా పోయిన పులి గురించి ఆలోచించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఒక వ్యక్తి పులి చర్మం పట్టిస్తానని ఫోన్ చేయగానే కనీసం స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించకుండా మందమర్రి వెళ్లి, పులి చర్మాన్ని మంచిర్యాలకు తీసుకొచ్చి, ఏదో సాధించినట్లు ఘనంగా మీడియా ముందు ప్రదర్శించిన అధికారులు ఆ చర్మం ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో మందమర్రిలోనే ఆలోచించి ఉంటే ఆ రోజే నిందితులు దొరికేవారు. గతంలో హతమైన పులులు, చిరుతలపై అనుమానాలు 2016లో కోటపల్లి మండలంలో ఓ పులి విద్యుత్ కంచెకు తగిలి మరణించగా, దాన్ని కాల్చి పూడ్చివేశారు. ఈ సంఘటనపై అటవీశాఖ దర్యాప్తు జరిపి, కొందరిని అరెస్టు చేసి, పొలాలను కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నంగా తేల్చేసింది. ఇటీవల పెంబిలో పులిని హతమార్చి, చర్మాన్ని తరలిస్తుండగా అరెస్టు చేశారు. గత నెలలోనే పాత మంచిర్యాలలో చిరుత వేటగాళ్ల ఉచ్చుకు బలైంది. పై రెండు సంఘటనల్లో తూతూమంత్రంగా దర్యాప్తు సాగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోతుగా దర్యాప్తు చేస్తే ఈ ఘటనలకు సంబంధించి కూడా నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ తీగలు తగిలి రామగుండం కమిషనరేట్‌లో 2018లో 9 మంది వ్యక్తులు మృత్యువాత పడగా, వందలాది మూగజీవాలు బలయ్యాయి. 9 మంది మరణానికి కారణమైన వారిపై సెక్షన్ 304పార్ట్–2 కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అలాగే వన్యప్రాణుల మృతికి కారణమైన వారిపై కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. వేటగాళ్లతో యానిమల్ ట్రాకర్స్ దోస్తీ శివ్వారం పులి హత్యకు సంబంధించి అటవీశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులైన ఇద్దరు యానిమల్ ట్రాకర్స్ ఇచ్చిన సమాచారంతోనే వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చి పులిని అంతమొందించారు. వన్యప్రాణులు సంచారాన్ని ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియజేయాల్సిన ట్రాకర్స్ వేటగాళ్లకు సమాచారం ఇస్తూ వారితో కలిసి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కంచె ఏర్పాటు చేసి వన్యప్రాణుల మృతికి కారణమవుతున్న వారిని రామగుండం కమిషనరేట్ పరిధిలో 100 మంది వేటగాళ్లను గుర్తించిన పోలీసులు 9 మందిని బైండోవర్ చేశారు. అటవీశాఖ ఇప్పటికైనా కళ్లు తెరిస్తే వన్యప్రాణులు అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంది. తిప్పేశ్వర్ పులి... శివ్వారంలో బలి అని తేల్చిచెప్పిన ‘సాక్షి’ జనవరి 24న మందమర్రిలో పులి చర్మాన్ని స్వాధీనం చేసుకొని, ఒకడిని అరెస్టు చేసి... మోసపు ఎన్జీవోను వదిలేసిన అటవీశాఖ అధికారులు ఈ విషయాన్ని పీసీసీఎఫ్ ఝా కు తెలియజేయడంతో ఆయనకు అనుమానం వచ్చి కేసు వివరాలను డీజీపీకి తెలియజేసి, పోలీసుల సహకారాన్ని కోరారు. 25న నేరుగా పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ నిందితుడు ఇచ్చిన సమాచారం శివ్వారం వచ్చి పరిశీలిస్తే అక్కడే పులి చనిపోయినట్లు తేలింది. అయితే ఆ పులి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని అప్పటి వరకు అటవీశాఖ గానీ, పోలీసులు గానీ పట్టించుకోలేదు. ఆ మరుసటి రోజు 26న ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘తిప్పేశ్వర్ పులి... శివ్వారంలో బలి’ అనే శీర్షినక కథనం ప్రచురితం కావడంతో అటవీశాఖ, పోలీస్ శాఖ ఆ కోణంలో దర్యాప్తు జరిపాయి. అప్పుడే పులి కదలికలకు సంబంధించిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. అంతకు పది రోజుల ముందే పాత మంచిర్యాల బీట్ పరిధిలో రంగంపేట వద్ద చిరుత పులి వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి బలైంది. ఈ క్రమంలో ‘సాక్షి’ ప్రధాన సంచికలో అంతర్రాష్ట్ర ముఠా పాత్ర, చంద్రాపూర్ గ్యాంగ్ మోసాలను వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఈ కేసును పూర్తిగా పోలీసులకు బదిలీ చేయడంతో రామగుండం కమిషనర్ సత్యనారాయణ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అదనపు డీసీపీలు అశోక్‌కుమార్, రవికుమార్‌ల సారథ్యంలో కేసును ఛేదించారు. ‘సాక్షి’ ప్రచురించిన వార్తా కథనాల వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా పులి మరణంపై కదలిక వచ్చిందని సాక్షాత్తూ కమిషనర్ సత్యనారాయణ మీడియా సమావేశంలో అన్యోపదేశంగా వెల్లడించారు. సాక్షి ప్రతినిధిని స్వయంగా అభినందించడం గమనార్హం. -
విద్యుత్ షాక్‌కు పులి బలి!
తొగిరి(సారవకోట రూరల్):అడవి జంతువుల మాంసం రుచి మరిగిన కొంతమంది వాటిని హతమార్చడానికి విద్యుత్ తీగలను ఉపయోగించారు. వారి కోరిక నెరవేరింది. అడవి పందులు, కుందేళ్లకు బదులు ఏకంగా చిరుత పులే చిక్కింది. విద్యుత్ తీగలను తాకి షాక్‌తో చనిపోవడంతో మాంసాన్ని వాటాలు వేసుకొని అందరూ ఆరగించారు. అంతవరకూ సజావుగా సాగిన మానవమృగాల పన్నాగం పులి గోళ్ల పంపకం విషయంలో తేడాలు రావడంతో విషయం వెలుగు చూసింది. అధికారులు మేల్కొని కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంచలనం రేపిన ఈ సంఘటన సారవకోట మండలంలోని తొగిరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తొగిరి రెవెన్యూ పరిధిలోని బక్కిరికొండ ప్రాంతంలో అటవీ ప్రాంతం విస్తారంగా ఉంది. దీంతో వివిధ అటవీ జంతువులు జీవిస్తున్నాయి. వీటిని హతమార్చి మాంసాన్ని తినడం హాబీగా చాలామంది మార్చుకున్నారు. కొండ దిగువున ఉన్న వాట్షెడ్ వద్దకు మూగ జీవాలు నీటి కోసం వస్తుంటాయి. దీంతో వీటిని చంపేందుకు కొండపైన ఉన్న జీడితోట చుట్టూ కొంతమంది విద్యుత్ తీగలను అమర్చారు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి కూడా ఓ పులి నీటి కోసం వస్తూ విద్యుత్ తీగలను తాకి షాక్‌కు గురై మృతి చెందింది. దీంతో గ్రామస్తులు గుట్టు చప్పుడు కాకుండా శనివారం మధ్యాహ్నం జీడి తోట మధ్యలోకి చనిపోయిన పులిని తీసుకెళ్లి చర్మాన్ని తీసి పంచుకున్నారు. అయితే అదేరోజు సాయంత్రం పులి గోళ్ల పంపకంలో వీరి మధ్య తగాదా వచ్చింది. దీంతో కొంతమంది కోపంతో విద్యుత్ ఎర్త్ కారణంగా పులి చనిపోవడం, దాని మాంసాన్ని పంచుకోవడం, తల, పొట్టెను పాతిపెట్టిన విషయూన్ని ఆదివారం ఉదయం సారవకోట ఎస్ఐ గణేష్, పాతపట్నం అటవీ రేంజర్ యాళ్ల సంజయ్‌కు చేరవేశారు. దీంతో ఎస్ఐ గణేష్ తన సిబ్బంది రవి, గోపాలరావులతో, సారవకోట అటవీ సెక్షన్ అధికారి వెంకటరావు, వీఆర్వో గజపతినారాయణలు సంఘటన స్థలం కోసం గాలించారు. అడవి పంది మాంసం తీసుకెళ్తూ... కానిస్టేబుల్ గోపాలరావు పులి తలను పాతిపెట్టిన స్థలం కోసం వెతుకుతుండగా తొగిరి గ్రామానికి చెందిన సడగాన గోవిందరావు, బైరి సింహాచలంలు అనుమానాస్పదంగా చేతులకు రక్తం మరకలు, కత్తులతో వారికి తారసపడ్డారు. అలాగే తండ్యాల సింహాచలం అనే వ్యక్తి బకెట్‌తో మాంసం పట్టుకుని పారిపోతూ కనిపించారు. దీంతో గోవిందరావు, సింహాచలాన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా విద్యుత్‌షాక్‌తో అడవి పంది చనిపోవడంతో దీన్ని మాంసం చేసి తీసుకెళ్తున్నామని వివరించారు. పులి విషయమై ఆరా తీయగా శుక్రవారం పులి చనిపోవడంతో గ్రామస్తులమంతా పంచుకున్నామని వివరించారు. దీంతో మరింత లోతుగా పోలీసులు, అటవీశాఖాధికారులు వారిని విచారణ చేయగా తల, పొట్టు పాతిపెట్టిన స్థలాన్ని చూపించడంతో వారి చేతనే పాతిపెట్టిన వాటిని బయటకు తీయించి పరిశీలించారు. అలాగే విద్యుత్ ఎర్త్‌లు పెట్టే నేతింటి శ్రీనివాసరావును కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. కొన్ని రోజులుగా కొండ ప్రాంతంలో ఎర్త్‌లు పెడుతున్నట్టు ఆయన అంగీకరించాడు. పులి చనపోరుున విషయూన్ని అటవీశాఖ ఏసీఎఫ్ శ్రీహరగోపాల్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తల, పొట్టు మంసాహార జంతువుదిగా గుర్తించామన్నారు. దొరికిన తల భాగాన్ని చీడిపూడి పశువైద్యాధికారి ఓంకార్ ప్రాథమిక పరిశీలించారని, హైదారాబాద్‌లో ఉన్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీకి పంపిస్తామన్నారు. అక్కడ నుంచి వచ్చే రిపోర్టులు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం సడగాన గోవిందరావు, బైరి సింహాచలం, నేతింటి శ్రీనివాసరావుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూరిస్థాయి నివేదిక వస్తేగాని చనిపోరుునది పులా..కాదా అనే విషయం తెలియదన్నారు.