time limits
-
న్యూ ఫండ్ ఆఫర్లకు కాల పరిమితులు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కొత్త పథకాల రూపంలో (ఎన్‌ఎఫ్‌వోలు) సమీకరించే నిధులను ఇన్వెస్ట్ చేసేందుకు కాల పరిమితులను ప్రవేశపెట్టాలని సెబీ నిర్ణయించింది. అలాగే, అస్సెట్ మేనేజ్ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) ఉద్యోగుల ప్రయోజనాలను, యూనిట్ హోల్డర్ల ప్రయోజనాలతో సమీకృతం చేసే నిబంధనలను సడలించాలన్న నిర్ణయానికొచి్చంది. దీనికితోడు అన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను ఇన్వెస్టర్లతో మరింత పారదర్శకంగా పంచుకోవాలని నిర్దేశించింది. వీటికి సంబంధించిన ప్రతిపాదనలకు బుధవారం నాటి సెబీ బోర్డులో ఆమోదం లభించింది. ఎన్ఎఫ్వో ద్వారా సమీకరించిన నిధులను ఏఎంసీలు 30 రోజుల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.ఆలోపు ఇన్వెస్ట్ చేయకపోతే ఇన్వెస్టర్లు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ లేకుండా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ‘‘30 రోజుల్లోపు ఇన్వెస్ట్ చేయడానికి వీలైనంత పెట్టుబడులనే ఓపెన్ ఎండెడ్ ఎన్ఎఫ్వోలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్ సమీకరించాలి. ఎందుకంటే ఇవి ఓపెన్ ఎండెడ్ పథకాలు కనుక ఇన్వెస్టర్లు కావాలంటే తర్వాత తిరిగి ఇన్వెస్ట్ చేసుకోగలరు’’అని సెబీ తెలిపింది.ఏఎంసీ ఉద్యోగులకు సంబంధించి కార్యాచరణను సులభతరం చేయాలని నిర్ణయించింది. దీని కింద ఏఎంసీకి చెందిన నియమిత ఉద్యోగులు ఇన్వెస్ట్ చేయాల్సిన కనీస మొత్తాన్ని తగ్గించింది. ఏఎంసీ నుంచి తప్పుకున్న ఉద్యోగికి సంబంధించి పెట్టుబడులకు లాకిన్ పీరియడ్‌ను సైతం తగ్గించనున్నారు. సెబీ నిర్ణయాలను ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ బగ్లా ఆహా్వనించారు. వేగంగా విస్తరిస్తున్న మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు యూనిట్‌దారుల ప్రయోజనాలను పరిరక్షించే నిపుణులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
కాలపరిమితి ఆదేశాలు సరికాదు
న్యూఢిల్లీ: ట్రయల్ కోర్టుల పరిధిలో కేసుల విచారణకు కాలపరిమితిని విధిస్తూ ఆదేశాలిచ్చే సంస్కృతిని హైకోర్టులు విడనాడాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు ఒక వ్యక్తికి బెయిల్‌ను నిరాకరిస్తూ, కాలపరిమితిలోపు విచారణ పూర్తిచేయాలంటూ ట్రయల్ కోర్టుకు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. గత సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. నకిలీ నోట్ల కేసులో రెండున్నరేళ్లుగా విచారణ ఖైదీగా జైలులో మగ్గిపోతున్న ఒక వ్యక్తికి బెయిల్ మంజూరుచేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ‘‘కాల పరిమితిలోపు కేసు విచారణ పూర్తికాని పక్షంలో బెయిల్ కోసం నిందితుడు చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు చట్టప్రకారం వీలైతే ఆ నిందితుడికి బెయిల్ ఇవ్వడానికే మొగ్గుచూపాలి. మరో అవకాశంలేని పక్షంలో మాత్రమే అతడిని విచారణ ఖైదీగా జైలుకు పరిమితం చేయాలి. బెయిల్ అనేది నియమం, జైలు అనేది ఒక మినహాయింపు అనే సూత్రం ఇక్కడా వర్తిస్తుందని హైకోర్టులు గుర్తుంచుకోవాలి’’అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ప్రతి కోర్టులోనూ క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసు విచారణను కాలపరిమితిలోపు ముగించాలని ట్రయల్ కోర్టులను హైకోర్టులు ఆదేశిస్తే ఆయా కిందికోర్టుల పనితీరుపై తీవ్ర ఒత్తిడి, ప్రభావం పడుతుంది. ఇలాంటి ఆదేశాలను కచ్చితంగా అమలుచేయడం ట్రయల్ కోర్టుకు కష్టమవుతుంది. బెయిల్‌ను నిరాకరిస్తూ నిందితులకు కంటితుడుపు చర్యగా ఆ కేసు విచారణను త్వరగా పూర్తిచేయిస్తామని హైకోర్టులు చెబుతున్నాయి. ఇలాంటి ఆదేశాలతో సంబంధిత వ్యక్తులకు అనవసరంగా ఆశ కలి్పంచినవారమవుతాం. ఇది ఒకరకంగా వాళ్లకు తప్పుడు సందేశం పంపినట్లే’’అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. -
వేళలు పాటించకపోతే చర్యలు
ఏలూరు అర్బ¯ŒS: జిల్లాలో మద్యం దుకాణాలు నిర్ణీత వేళలు కచ్చితంగా పాటించాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ వైబీ భాస్కరరావు హెచ్చరించారు. బుధవారం జిల్లాలో ఆ శాఖ అధికారులు నిర్ణీతవేళలు పాటించని మద్యం దుకాణాలు, అనధికారికంగా మద్యం అమ్ముతున్న విక్రేతలపై దాడులు చేశారు. తాడేపల్లిగూడెం ఎక్సైజ్ స్టేష¯ŒS పరిధిలోని ఉత్తపాలెంలో అనధికారికంగా మద్యం అమ్ముతున్న దుకాణంపై దాడి చేశారు. నిందితుడి నుంచి క్వార్టర్ బాటిల్ మద్యం, 16 బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని డీసీ చెప్పారు.