Time Travel Movies
-
వెండితెరపై కాలచక్రం.. సమయంతో ప్రయాణం చేస్తున్న టాప్ హీరోలు
వెండితెరపై కాలచక్రం తిరుగుతోంది. ప్రేక్షకలను విభిన్న కాలాలకు తీసుకుని వెళ్లేందుకు కొందరు హీరోలు సిద్ధం అవుతున్నారు... కాలాన్ని కదిలిస్తున్నారు. టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇలా వెండితెరపై సమయంతో ప్రయాణం చేస్తున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం. ఆరువేల సంవత్సరాలు... ఆరువేల సంవత్సరాల టైమ్ లైన్ తో సోషియో ఫ్యాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898ఏడీ’ కథనం సాగుతుందని తెలుస్తోంది. ‘‘ఈ సినిమా కథ మహాభారతం కాలంలో మొదలై, 2898తో పూర్తవుతుంది. అందుకే ‘కల్కి 2898ఏడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం’’ అని ఈ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దీంతో ‘కల్కి 2898 ఏడీ’ టైమ్ ట్రావెల్ ఫిల్మ్ అని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ , కమల్‌హాసన్ ఇతర లీడ్ రోల్స్‌లో కనిపిస్తారు. రాజమౌళి, మలయాళ నటి అన్నా బెన్ , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ అతిథి పాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. భైరవ పాత్రలో ప్రభాస్, పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్ కనిపిస్తారని తెలిసింది. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ‘కల్కి 2898ఏడీ’ సినిమాను మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఐదువందల సంవత్సరాలు... టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సూర్య కెరీర్లో రూపొందిన చిత్రం ‘24’. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ 2016లో విడుదలై హిట్ సాధించింది. ఈ జానర్లోనే తాజాగా సూర్య నటించిన చిత్రంగా ‘కంగువ’ను చెప్పుకోవచ్చు. ఐదువందల (1700 – 2023) సంవత్సరాల టైమ్ పీరియడ్‌లో ఈ చిత్ర కథనం సాగుతుంది. పద్దెనిమిదో శతాబ్దంలో తాను మొదలుపెట్టిన ఓ పనిని పూర్తి చేయలేక మరణించిన ఓ వీరుడు... పునర్జన్మలో ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తాడు? అన్నదే ‘కంగువ’ సినిమా కథనం అని కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించగా, హీరోయిన్ గా దిశా పటానీ, ఓ కీలక పాత్రలో యోగిబాబు, విలన్ గా బాబీ డియోల్ కనిపిస్తారు. స్టూడియోగ్రీన్ , యూవీ క్రియేషన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాదిలోనే విడుదల కానుందని తెలిసింది. మూడు తరాల నేపథ్యంలో... మలయాళ నటుడు టొవినో థామస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజయంతే రందం మోషణం’. ఈ సినిమాలో మణియన్ , అజయన్ , కుంజికేలు.. ఇలా మూడు పాత్రల్లో నటిస్తున్నారు టొవినో థామస్. పాత్రలకు తగ్గట్లే కథ కూడా మూడు తరాల హీరోల నేపథ్యంలో సాగుతుంది. కథ రీత్యా మూడు తరాల్లోనూ హీరోగా టొవినో థామస్‌నే కనిపిస్తారని తెలుస్తోంది. ఇలా మూడు డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో టైమ్ ట్రావెల్‌గా ఈ సినిమా కథనం సాగుతుంది. కృతీ శెట్టి, ఐశ్వర్యా రాజేష్, సురభిలక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా కృతీ శెట్టికి ఇది తొలి మలయాళ చిత్రం. మ్యాజిక్ ఫ్రేమ్స్, యూజీఎమ్ ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. తెలుగులోనూ విడుదల చేయాలనుకుంటున్నారు. త్రీడీలోనూ రిలీజ్ చేయాలని ఈ చిత్రం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని మాలీవుడ్ సమాచారం. ఆధునిక అశ్వత్థామ మహాభారతంలో అమరవీరుడిగా చెప్పుకునే అశ్వత్థామ ఇప్పటి ఆధునిక యుగంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న సినిమా‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ టైటిల్ రోల్ చేస్తున్నారు. కన్నడ దర్శకుడు సచిన్ రవి ఈ సినిమాకు దర్శకుడు. కాగా ఈ సినిమా టైమ్ ట్రావెల్ బ్యాక్డ్రాప్తోనే ఉంటుందని బాలీవుడ్ సమాచారం. జాకీ భగ్నానీ, వసుభగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఇలా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
సైన్స్‌ఫిక్షన్ సినిమాలు చేస్తున్న స్టార్స్!
ప్రయోగం, పరిశోధన, భవిష్యత్ కాల ప్రయాణం, మరమనిషి, ఇలా సైంటిఫిక్ ఎలిమెంట్స్‌తో ముడిపడిపోయారు కొందరు నటీనటులు. సైన్స్‌ఫిక్షన్ చిత్రాలకు సై అంటూ సైన్ చేశారు. ఈ స్టార్స్ చేస్తున్న వెండితెర సైన్స్ ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకుందాం.. 28వ శతాబ్దంలో... ఉన్నట్లుండి కొన్ని వందల సంవత్సరాలు ముందుకు వెళితే ఎలా ఉంటుంది? అసలు.. 28వ శతాబ్దంలో ప్రపంచం ఎలా ఉంటుంది? అనే ఓ ఊహాత్మక కథ వెండితెరపైకి వస్తే అదే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రమట. ప్రభాస్, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ అండ్ టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 18వ శతాబ్దంలో మొదలై 28వ శతాబ్దంలోకి ఈ కథ వెళ్తుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపి స్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజయ్యే చాన్స్ ఉందని టాక్. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. చారిత్రాత్మక కంగువా ఇటీవల విడుదలైన ‘కంగువా’ సినిమా వీడియో గ్లింప్స్‌ను బట్టి ఇది పూర్తి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అనేది కొందరి ఊహ. కానీ చారిత్రాత్మక భాగం కొంతవరకే ఉంటుందని, ఎక్కువ శాతం సమకాలీన కాలంలోనే జరుగుతుందని తెలిసింది. అలాగే కొంత భాగం 18వ శతాబ్దంలో ఉంటుందని, పరాక్రమవంతుడైన ఓ యోధుడు అంతు చిక్కని వ్యాధితో మరణించి, అతనే మళ్లీ జన్మించి, గత జన్మలో తాను ఎలా మరణించాడో తెలుసుకునే అంశాల సమాహారంగా సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ‘కంగువా’ కథనం ఉంటుందని భోగట్టా. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్. కాగా ‘కంగువా’ సినిమాలోని తొలి భాగం 2024 ఏప్రిల్ 12న విడుదల కానున్నట్లు సమాచారం. ఫిక్షనల్ గ్యాంగ్‌స్టర్ సాధారణంగా సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే.. విభిన్నమైన పేర్లతో ఆపరేషన్స్ చేయడం, పరిశోధనలు, ఆవిష్కరణలు వంటి అంశాలు మిళితమై ఉంటాయి. కానీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌కు సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అంశాలను జోడించి ఓ కొత్త ప్రయత్నం చేశారు అధిక్ రవిచంద్రన్. విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ టైమ్‌ట్రావెల్ బేస్డ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. విశాల్‌కు జోడీగా రీతూ వర్మ నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. ఓ గ్రహాంతరవాసి కథ ఓ గ్రహాంతరవాసి భూగ్రహంపై నివాసం ఉండాల్సి వస్తే ఏం జరుగుతుంది? అనే అంశం నేపథ్యంలో బాలీవుడ్లో గతంలో హృతిక్ రోషన్ ‘కోయీ.. మిల్ గయా’, ఆమిర్ ఖాన్ ‘పీకే’ వంటి సినిమాలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాస్త అటూ ఇటూగా ఈ చిత్రాల తరహాలోనే తమిళ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘అయలాన్’ ఉంటుందట. శివ కార్తికేయన్ హీరోగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్. ఈ సినిమాలో ఓ ఏలియన్ పాత్ర ఉన్నట్లు పోస్టర్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇండియాలో ఏలియన్స్ ఉంటే.. ఇండియాలో ఏలియన్స్ నివాసం ఏర్పాటు చేసుకోవాలను కుంటే ఏం జరుగుతుంది? అనే పాయింట్‌తో తమిళ చిత్రం ‘ఏలియన్’ రూపొందుతోందట. తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ షూటింగ్ జరుగుతోంది. రోబోలుగా హీరోయిన్లు ఓ మనిషిని రోబో ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్ రజనీకాంత్ ‘రోబో’లో చూశాం. అయితే ఓ రోబోటిక్స్ ఎక్స్పర్ట్ రోబోతో ప్రేమలో పడితే, రోబోలు ప్రేమించుకుంటే.. అనే అంశాలతో హిందీలో ఓ సినిమా తెరకెక్కుతోందని టాక్. షాహిద్ కపూర్, కృతీ సనన్ జంటగా నటిస్తున్న ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కథ ఇది అని సమాచారం. అమిత్ జోషి, ఆరాధన షా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రోబోగా కృతీ సనన్, రోబోటిక్ ఎక్స్పర్ట్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నారట. మరోవైపు ‘ఎంవై 3’ అనే సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు హన్సిక. ఇందులో హన్సిక చేస్తున్న రెండు పాత్రల్లో రోబో పాత్ర ఒకటి. - శ్రీశ్రీ -
7:11 Movie Review: 7:11 పీఎమ్ మూవీ రివ్యూ
టైటిల్: 7:11 పీఎమ్ నటీనటులు: సాహస్, దీపిక, టెస్, రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు తదితరులు నిర్మాతలు: నరేన్ యనమదల, మాధురి రావిపాటి & వాణి కన్నెగంటి దర్శకత్వం: చైతు మాదాల సంగీతం : గ్యాని సినిమాటోగ్రఫీ: వ శంకర్, ఫాబియో కాపోడివెంటో ఎడిటర్: శ్రీను తోట విడుదల తేది: జులై 7,2023 కథేంటంటే.. ఈ సినిమా కథ 1999లో జరుగుతుంది. కృష్ణా జిల్లా హంసలదీవి గ్రామానికి చెందిన రవి(సాహాస్ పగడాల) డిగ్రీ పూర్తి చేసి ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతుంటాడు. ఖాళీ సమయంలో తన బాబాయ్ మిలిటరీ ప్రభాకర్‌తో కలిసి ‘సైనిక్ గ్యారేజ్’లో పని చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే కృష్ణ(భరత్ రెడ్డి) చెల్లి విమల(దీపికా రెడ్డి), రవి ప్రేమలో ఉంటారు. ఇది కృష్ణకు నచ్చదు. చెల్లికి వార్నింగ్ ఇచ్చి, వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు సిద్ధమవుతుంటాడు. ఇదిలా ఉంటే స్థానిక మంత్రి బసవ పున్నయ్య అండతో రాజేష్ అనే వ్యక్తి ‘అపరిమితం మ్యూచువల్ ఫండ్స్’ కంపెనీ పేరుతో ఊర్లోవాళ్ల డబ్బునంతా దోచుకొని బోర్డు తిప్పేందుకు రెడీ అవుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రవి గ్యాంగ్.. ఎలాగైనా రాజేష్, మంత్రి మోసాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటారు. ఈ క్రమంలో రవి అనుకోకుండా బస్సు రూపంలో ఉన్న ఓ టైమ్ మిషన్ ఎక్కుతాడు. మరుసటి రోజు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ బీచ్‌లో రవి నిద్రలేస్తాడు. అంతేకాదు తాను 1999వ సంవత్సరం నుంచి 2024 కాలంలోకి వెళ్తాడు. అసలు ఆ టైమ్ మిషన్ ఆ ఊరికి ఎలా వచ్చింది? రవి ఎందుకు ఆ బస్సు ఎక్కాల్సి వచ్చింది? రవి తిరిగి తన కాలంలోకి వచ్చాడా? మంత్రి బసవ చేసే కుట్రల గురించి తెలిశాక రవి దానిని ఎలా అడ్డుకున్నాడు? చివరకు తాను ప్రేమించిన అమ్మాయి విమలను కలిశాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. 'ఆదిత్య 369' మొదలు మొన్నటి 'బింబిసార', 'ఒకే ఒక జీవితం' లాంటి చిత్రాలన్ని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ అనిపించుకున్నాయి. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే 7:11 పీఎమ్. ఓ గ్రామాన్ని నాశనం చేసి అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకున్నరాజకీయ నాయకుల పన్నాగాన్ని ఓ యువకుడు ఎలా అడ్డుకున్నాడు. దానికి టైమ్ ట్రావెల్ ఎలా ఉపయోగపడిందనేదే ఈ సినిమా స్టోరీ. ఒక గ్రామం, రెండు గ్రహాలు, మూడు వేర్వేరు కాలాల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ టైమ్ ట్రావెల్ కథకి ఊరి సమస్యను ముడిపెట్టి 7:11 అనే చిత్రాన్ని తీశాడు దర్శకుడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దానిని తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. అసలు కథను ప్రారంభించడానికి చాలా సమయం తీసుకున్నాడు. వేరే గ్రహానికి చెందిన ఇద్దరు వ్యక్తులు భూమి మీదకు రావడంతో కథ ప్రారంభమవుతుంది. ఫస్టాఫ్ మొత్తం హంసలదీవి అనే గ్రామం చుట్టే తిరుగుతుంది. గ్రామ ప్రజలను మోసగించి, అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మంత్రి ప్లాన్ వేయడం..దానిని అడ్డుకునేందుకు హీరో గ్యాంగ్ ప్రయత్నించడం.. ఇలా రొటీన్‌గా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథ ప్రారంభం అవుతుంది. ముందు రోజు ఇండియాలోని ఓ మారుమూల గ్రామంలో బస్ ఎక్కిన వ్యక్తి.. తర్వాతి రోజు ఉదయమే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని సముద్ర తీరాన నిద్రలేవడం, పాతికేళ్లు ముందుకు వెళ్లడం. ఈ పాతికేళ్లతో ఊరిలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? వాటిని అడ్డుకునేందుకు హీరో మళ్లీ తన కాలంలోకి వెళ్లడం..ఇలా ప్రతి సీన్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే చాలా చోట్ల దర్శకుడు సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నాడు. ఫస్టాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకొని, తెలిసిన నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. మొత్తానికి తక్కువ బడ్జెట్లో మన నేటివిటితో తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ..ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కి వెళ్లి చూస్తే అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో చాలా వరకు కొత్త నటీనటులే ఉన్నారు. హీరో హీరోయిన్లుగా నటించిన సాహన్, దీపిక తమ పాత్రలకు న్యాయం చేశారు. కొత్తవాళ్లు అయినా చక్కగా నటించారు. విలన్ పాత్ర పోషించిన వ్యక్తి కూడా తనదైన నటనతో భయపెట్టాడు. రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. సంగీతం పర్వాలేదు. ప్రేక్షకులకు గుర్తిండిపోయే పాటలు ఒక్కటి కూడా లేదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
టైమ్ ట్రావెల్ చేయనున్న 'బింబిసార'.. రిలీజ్ డేట్ ఫిక్స్
Kalyan Ram Bimbisara Movie Theatrical Release Date Announced: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న 18వ చిత్రం 'బింబిసార'. కేథరిన్, సంయుక్త మీనన్, వారీనా హుసేన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు విశిష్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ. కె నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది ట్యాగ్‌లైన్. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఈ సంవత్సరం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఉగాది సందర్భంగా శనివారం సినిమా అధికారిక రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడదల చేశారు. The date is locked for BIMBISARA to ascend the throne 🔥#Bimbisara grand release on 5th August 💥#HappyUgadi ❤️#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt @anilpaduri @NTRArtsOfficial pic.twitter.com/cFhr62CmCe — NTR Arts (@NTRArtsOfficial) April 2, 2022 సామాజిక మాధ్యమాల ద్వారా రిలీజైన ఈ పోస్టర్లో కల్యాణ్ రామ్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాలో అత్యున్నత సాంకేతికతను ఉపయోగించాం. ఇందులో కల్యాణ్ రామ్ రెండు విభిన్న పాత్రల్లో కనువిందు చేయనున్నారు. అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. క్రీస్తూ పూర్వ ఐదో శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు కథతో ఈ మూవీ తెరకెక్కనుంది. టైమ్ ట్రావెల్ మూవీగా వస్తున్న 'బింబిసార'లో బింబిసారుడిగా, నేటితరం యువకుడిగా రామ్ నటిస్తున్నట్లు సమాచారం. -
గతంలోకి వెళ్లాలనుందా..? ఈ సినిమాలు చూసేయండి..
Telugu Time Travel Movies And Web Series: భారతీయ సినీ ప్రపంచంలో అనేక రకాల సినిమాలు వచ్చాయి. అందులో ఎన్నో రకాల జోనర్లు ఉన్నాయి. అది ఏ జోనరైనా సరే ఆ జోనర్‌కు తగినట్టు చూపిస్తే చాలనుకుంటాడు సగటు సినీ ప్రేమికుడు. అలా ప్రేక్షకులు నచ్చే మెచ్చే జోనర్లలో ఒకటి 'టైమ్ ట్రావెల్' జోనర్. కాలంతో పాటు ప్రయాణం చేసే కథలు చాలా అరుదుగానే వస్తుంటాయి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు చేయడం అంటే అంతా ఆశామాషీ కాదు. దానికి అద్భుతమైన స్క్రిప్ట్, బోలెడంత బడ్జెట్‌తో పాటు ప్రేక్షకుడిని కన్విన్స్ చేసేలా కూడా ఉండాలి. అందుకే చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే ఈ టైమ్ ట్రావెల్ కథలతో సినిమాలు చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' నుంచి ఇటీవల వచ్చిన అద్భుతం సినిమా వరకు అలరించిన టైమ్ ట్రావెల్ చిత్రాలను చూద్దాం. 1 - ఆదిత్య 369 నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఆదిత్య 369 చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే తొలి టైమ్ ట్రావెల్ చిత్రం. ఇందులో కృష్ణ కుమార్, శ్రీ కృష్ణదేవరాయలుగా రెండు పాత్రల్లో బాలకృష్ణ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆగస్టు 18, 1991లో విడుదలైన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను హాలీవుడ్ చిత్రం 'బ్యాక్ టూ ఫ్యూచర్', హెచ్.జి. వెల్స్ రచించిన 'టైమ్ మేషీన్' పుస్తకం నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. 2 - 24 తమిళ స్టార్ హీరో సూర్య మూడు విభన్న పాత్రలతో మెప్పించిన చిత్రం 24. ఈ సినిమాను వైవిధ్య చిత్రాల దర్శకుడు కె. విక్రమ్ కుమార్ తెరకెక్కించారు. సమంత హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వాచ్ రిపేరర్, సైంటిస్ట్, విలన్‌గా సూర్య అదరగొట్టారు. ఇందులో వాచ్ రూపంలో టైమ్ మేషీన్ ఉంటుంది. ఆ వాచ్‌ను రిపేర్ చేసే క్రమంలో టైమ్ మేషీన్ ద్వారా సూర్య గతంలోకి ప్రవేశిస్తాడు. 3- ప్లే బ్యాక్ గతం నుంచి ప్రస్తుతానికి ఒక ఫోన్ లైన్ ద్వారా కనెక్షన్ ఏర్పడితే ఎలా ఉంటుందనేదే 'ప్లే బ్యాక్' సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద పనిచేసిన హరిప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో దినేష్, అనన్య ప్రధానపాత్రల్లో నటించారు. వీరిలో ఒకరు 1993లో బ్రతికుంటే, మరొకరు 2019 కాలంలో జీవిస్తూ ఉంటారు. అయితే 26 ఏళ్ల టైమ్ గ్యాప్ ఉన్న ఈ పాత్రల మధ్య సంబంధం ఏంటీ ? ఫోన్ కాల్స్ ద్వారా గతంలో జరిగిన సంఘటనలో మార్పు తీసుకొస్తే ప్రస్తుతం, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో అని తెలిపేదే కథ. ఈ సినిమా ప్రస్తుతం 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 4 - అద్భుతం తేజ సజ్జా, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం అద్భుతం. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న ఇద్దరు ఒక ఫోన్ కాల్‌తో విరమించుకుంటారు. అయితే ఇద్దరికీ ఒకే మొబైల్ నంబర్‌తో ఫోన్ కాల్ వస్తుండంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఇలా ప్రారంభమైన సినిమా వాళ్లిద్దరూ వేరు వేరు సంవత్సరంలో జీవిస్తున్నారని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ మూవీలో 26 సంవత్సరాలు టైమ్ గ్యాప్ ఉంటే ఇందులో ఐదేళ్ల గ్యాప్ ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనలను మార్చే నేపథ్యంతో సాగుతుందీ సినిమా. ఈ చిత్రం నవంబర్ 19, 2021లో హాట్‌స్టార్‌లో విడుదలైంది. 5 - ఆ ! దర్శకుడిగా ప్రశాంత్ వర్మ తొలి చిత్రం ఆ !. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో నాని, ప్రశాంత్ తిపిర్నేని నిర్మించారు. ఇందులో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజీనా కసాండ్ర, శ్రీనివాస్ అవసరాల, ప్రియ దర్శిని, మురళి శర్మ నటించగా, రెండు పాత్రలకు నాని, రవితేజ వాయిస్ ఇచ్చారు. అయితే ఈ సినిమా పూర్తి తరహా టైమ్ ట్రావెల్ చిత్రం కాదు. కానీ ఇందులో వాచ్మెన్ శివ పాత్ర సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు. సైంటిస్ట్ అయి టైమ్ మేషీన్ కనిపెట్టి ఎప్పుడూ చూడని తన తల్లిదండ్రులను కలవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతని దగ్గరికి భవిష్యత్తు నుంచి పార్వతి అనే పాత్ర వస్తుంది. ఇలా ఈ పాత్రల ద్వారా టైమ్ ట్రావెల్‌ను చూపించాడు దర్శకుడు. అయితే పార్వతికి, శివకు ఉన్న రిలేషన్ ఏంటనేది మాత్రం సినిమాలో బెస్ట్ ట్విస్ట్. 6 - కుడి ఎడమైతే టైమ్ ట్రావెల్ జోనర్లో వచ్చిన వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. అమలాపాల్, ఈశ్వర్ రచిరాజు, రాహుల్ విజయ్ నటించిన ఈ వెబ్ సిరీస్‌లో టైమ్ లూప్ (Time Loop) గురించి వివరించారు. ఒకే సమయంలో ఆగిపోవడం. అంటే పాత్రలు, సంభాషణలు, సంఘటనలు రిపీట్ అవుతుంటాయన్నమాట. మల్టీపుల్ స్క్రీన్ ప్లే, కొత్త తరహా కథతో ఆకట్టుకున్నాడు దర్శకుడు పవన్ కుమార్.