Tire
-
మడత పెట్టుకునేలా.. ఎలక్ట్రిక్ బైక్‌లు వచ్చేస్తున్నాయ్
-
హైదరాబాద్: టైర్ల గోదాంలో ఎగిసి పడుతున్న మంటలు
-
ప్రాణం తీసిన టైర్ ముక్క.. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి..
సాక్షి, ములుగు(గజ్వేల్): టైర్ ముక్కను తాకి బైక్ అదుపుతప్పడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన లక్ష్మక్కపల్లి రాజీవ్ రహదారిపై జరిగింది. ఎస్ఐ రంగకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం గౌరారం గ్రామానికి చెందిన మంకి సుధాకర్–స్వరూప (34) దంపతులు ములుగు మండలం వంటిమామిడి మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. వీరికి యశ్వంత్ (14), సాత్విక (12) ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున వంటిమామిడిలో కూరగాయలను కొనేందుకు దంపతులు బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో లక్ష్మక్కపల్లి వద్ద రోడ్డుపై టైర్ ముక్క పడి ఉండటం వీరికి కనిపించలేదు. దీంతో దాని మీదుగా వెళ్లిన బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వరూప అక్కడిక్కడే మృతి చెందగా, సుధాకర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంగకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించామని పేర్కొన్నారు. చదవండి: సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. గురుకులంలో 48 మందికి పాజిటివ్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్ఐ రంగ కృష్ణ రెడిమిక్స్ వాహనం ఢీకొని మరొకరు.. గజ్వేల్‌రూరల్: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని ఎదురుగా వచ్చిన రెడిమిక్స్ వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ (పల్లెపహడ్)లో నివాసముంటున్న గుగులోత్ లక్ష్మి (52) తన కొడుకు మహేందర్, కూతురు శాంతి బెజుగామకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో సంగాపూర్‌లో గల మజీద్ వద్దకు రాగానే గజ్వేల్ నుంచి వర్గల్ వైపు వెళ్తున్న రెడిమిక్స్ వాహనం వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేందర్, భుక్య శాంతికి తీవ్ర గాయాలు కాగా.. లక్ష్మి తలపై నుంచి వాహనం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రేమికులపై పైశాచికం: మెడలో టైర్లు వేసి..
భోపాల్: ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని భావించి ఇంటి నుంచి పారిపోయిన ఓ ప్రేమ జంటను దారుణంగా హింసించారు వారి గ్రామస్తులు. స్కూటర్ టైర్ మెడలో వేసి.. డ్యాన్స్ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ ధార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ధార్ ప్రాంతంలోని కుండి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదే ఊరికి చెందిన 23 ఏళ్ల వ్యక్తి ప్రేమించుకున్నారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఈ నెల మొదటి వారంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. (చదవండి: ప్రేమికుల కిడ్నాప్.. అడవుల్లో తిప్పుతూ చిత్రహింసలు!) వారం రోజుల అనంతరం వారు గ్రామానికి తిరిగి వచ్చారు. ప్రేమికుల ప్రవర్తనపట్ల ఆగ్రహంగా ఉన్న గ్రామస్తులు వారి చేసిన పనికి తగిన శిక్ష విధించాలని భావించారు. రచ్చబండ వద్దకు వారిని పిలిపించారు. అనంతరం గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి.. ఆ జంటను కర్రతో పలు మార్లు కొట్టాడు. అనంతరం వారి మెడలో స్కూటర్ టైర్ వేసి డ్యాన్స్ చేయించారు. (చదవండి: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్ ) ఈ ప్రేమ జంటకు సాయం చేసిందనే ఆరోపణలతో 13 ఏళ్ల బాలికను కూడా ఇదే విధంగా హింసించారు. గ్రామస్తుల్లో కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరలయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రేమికుల మీద దాడి చేసిన వారిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. చదవండి: దారుణం: ‘మా అమ్మాయినే వేధిస్తావా?’ మెడకు బెల్ట్ బిగించి.. -
టైర్ల షేర్ల పరుగులు!
⇒ భారత్‌ను వదిలి అమెరికావైపు చూస్తున్న చైనా కంపెనీలు... ⇒ దిగుమతులు తగ్గటంతో దేశీ కంపెనీల హవా ⇒ 25 శాతం పడిపోయిన రబ్బరు ధరలు ⇒ లాభాలు పెరుగుతాయన్న అంచనాలతో షేర్ల జోరు.. సాక్షి, బిజినెస్ విభాగం టైర్ల షేర్లకు... రోడ్డు మునుపెన్నడూ లేనంత క్లియర్‌గా ఉన్నట్లుంది. మార్కెట్లో రయ్యిమని దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలానే మన మార్కెట్లు కూడా మంచి జోరుమీదుండటంతో... ఇతర రంగాల షేర్ల మాదిరిగా టైర్ల షేర్లు కూడా లాభపడుతున్నాయి. టైర్ల తయారీలో ఉపయోగించే రబ్బరు ధరలు బాగా తగ్గడం, చైనా నుంచి పోటీ తగ్గుతుండటం, డిమాండ్ పుంజుకుంటుండటం వంటివి టైర్ల షేర్లను మరింత ముందుకు తీసుకెళుతున్నాయి. పలితం... భవిష్యత్తులో కూడా వీటి లాభాలకు ఢోకా లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా నుంచి పోటీ తగ్గింది... చైనా నుంచి టైర్ల దిగుమతులు ఈ మధ్య బాగా తగ్గాయి. దీనికితోడు రబ్బరు ధరలు పడిపోవడంతో టైర్ల కంపెనీల పంట పండుతోంది. చైనా టీబీఆర్ (ట్రక్, బస్, రేడియల్) టైర్లపై యాంటీ డంపింగ్ సుంకం విధించకూడదని అమెరికా నిర్ణయించింది. దీంతో చైనా కంపెనీలు ఇప్పుడు అమెరికా వైపు తమ టైర్ల ఎగుమతులను మళ్లిస్తున్నాయి. భారత్‌కు దిగుమతి అవుతున్న మొత్తం టీబీఆర్ టైర్లలో చైనా వాటా 90 శాతంగా ఉండేది. గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలానికి చైనా నెలకు సగటున 1,20,000 టైర్లను భారత్‌కు ఎగుమతి చేసిందని అంచనా. అక్టోబర్‌లో 455 కంటైనర్ల టైర్లు చైనా నుంచి దిగుమతి కాగా, ఈ ఫిబ్రవరిలో ఈ కంటైనర్ల సంఖ్య 155కు తగ్గింది. భారత్ కంటే అమెరికాకు ఎగుమతి చేస్తే అధిక లాభాలొస్తాయి కనక చైనా కంపెనీలకు ఇప్పుడు భారత్ కంటే అమెరికా మార్కెట్టే అకర్షణీయంగా కనిపిస్తోంది. అందుకే భారత్‌లో టైర్ల దిగుమతిదారులను నిరుత్సాహపరిచేందుకు భారత మార్కెట్‌కు ఎగుమతి చేసే టైర్ల ధరలను చైనా కంపెనీలు 10–15 శాతం వరకూ పెంచాయి. దీంతో చైనా టైర్ల దిగుమతులు మరింతగా తగ్గుతున్నాయి. ఫలితంగా చైనా టైర్ల నుంచి దేశీయ టైర్ల కంపెనీలకు పోటీ బాగా తగ్గుతోంది. ఇటీవలే కొన్ని భారత టైర్ల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 5 శాతం వరకూ పెంచాయి కూడా. ఈ నెలాఖరు కల్లా ధరలను 15 శాతం వరకూ పెంచుకోవాలని టైర్ల కంపెనీలు యోచిస్తున్నాయి. రబ్బరు ధరలు 25 శాతం పతనం! ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే రబ్బరు ధరలు 25 శాతం వరకూ తగ్గాయి. రబ్బర్ ఎగుమతి చేసే దేశాల్లో రబ్బరు నిల్వలు అపారంగా ఉన్నందున ఇప్పట్లో రబ్బరు ధరలు పెరిగే అవకాశాలు కూడా కనిపించటం లేదు. ఇది టైర్ల కంపెనీలకు సానుకూలమైన అంశం. మరోవైపు కొన్ని రేడియల్ టైర్లపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని ప్రభుత్వం యోచిస్తుండటం కూడా టైర్ల కంపెనీలకు కలసివస్తోంది. లాభాలు కొనసాగుతాయ్... ఇటీవల కాలంలో ఎంఆర్ఎఫ్, బాలకృష్ణ టైర్స్ కంపెనీల షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఎంఆర్ఎఫ్ షేర్ ఈ నెల 3న రూ.61,000కు చేరింది. భారత స్టాక్ మార్కెట్లో అత్యంత ఖరీదైన షేర్ ఇదే. ఇక సియట్, అపోలో టైర్స్, జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీలు తమ జీవిత కాల గరిష్ట స్థాయిలకు 10–22% రేంజ్ దూరంలోనే ఉన్నాయి. చాలా టైర్ల కంపెనీల ఆదాయాలు రీప్లేస్మెంట్ మార్కెట్ నుంచే వస్తాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, ఆర్థిక వ్యవస్థ చక్రీయ ప్రభావం ఈ రీప్లేస్మెంట్ మార్కెట్‌పై ఉండదు కాబట్టి, చైనా నుంచి పోటీ తగ్గడం, రబ్బరు ధరలు కూడా తగ్గడంతో టైర్ల షేర్ల లాభా లు కొనసాగుతాయని నిపుణులు అంచనావేస్తున్నారు. సియట్ షేర్‌ను రూ.1,550, అపోలో టైర్స్ షేర్ రూ.239 టార్గెట్ధరలుగా ప్రస్తుత ధరల్లో కొనుగోలు చేయవచ్చని ఫిలిప్ క్యాపిటల్ చెబుతోంది. -
ఆటో బోల్తా.. మహిళ కూలీ మృతి
- ఆరుగురికి గాయాలు పాములపాడు: టైర్ పగిలి ఆటో బోల్తా పడిన సంఘటనలో ఓ మహిళ కూలీ మృతిచెందగా మరో ఆరుగురు కూలీలు గాయాలపాలయ్యారు. మండలంలోని బానుముక్కల మలుపు నుంచి వేంపెంట గ్రామానికి వెళ్లే రహదారిలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసులు వెళ్లడించారు. ఆత్మకూరుకు చెందిన 14మంది కూలీలు ఆటోలో పని నిమిత్తం వేంపెంటకు బయలుదేరారు. బానుముక్కల మలుపు వద్దకు చేరుకోగానే టైర్ పగలడంతో ఆటో బోల్తాపడింది. ప్రమాదంలో హుసేన్‌బీ(40), ఉప్పరి గాలమ్మ, సబేరాదాబి, హసీనా, గోకారమ్మ, నసీమూన్, సహేరాబాను గాయపడ్డారు. వీరందరికీ ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు నిర్వహించి కర్నూలు తరలించారు. అక్కడ హుసేన్‌బీ కోలుకోలేక మృతి చెందింది. ఎస్ఐ సుధాకరరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టైర్ పంక్చర్.. పోలీసు వాహనం బోల్తా
మునగాల: నల్గొండ జిల్లా మునగాల మండలం బరాకత్‌గూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై ఓ పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. వీరంతా సుమోలో హైదరాబాద్ నుంచి మంగళగిరి వెళ్తుండగా బరాకత్‌గూడెం వద్దకు రాగానే వెనక టైరు పంక్చరై బోల్తాపడింది. క్షతగాత్రులను హుటాహుటిన కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జనరేటైర్
ఇంధనాన్ని సమకూర్చే టైర్ ఉందంటే నమ్ముతారా? ఇది నిజం. విద్యుచ్ఛక్తితో నడిచే కారుకి మరింత బ్యాటరీ పవర్‌ను ఈ రకం టైర్లు అందిస్తాయి. జెనీవాలో జరిగిన ఆటో షోలో ‘గుడ్ ఇయర్ టైర్ అండ్ రబ్బర్ కో’ కంపెనీ ఈ సరికొత్త ‘బీహెచ్ఓ3 టైర్’ను ఆవిష్కరించింది. సహజ ఇంధన వనరులు రానురాను తగ్గిపోతున్నందున ఇంజనీర్లు ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారించి ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లను ఆవిష్కరించారు. కరెంటుతో నడిచే కార్లకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మంచి ప్రాచుర్యం లభిస్తోంది. వాటికి బీహెచ్ఓ3 టైర్లు అమర్చడం వల్ల కారు వేగంగా నడిపే సమయంలో టైర్లలో తీవ్రమైన వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ యాంత్రిక వేడిని విద్యుచ్ఛక్తిగా మార్చి కారు బ్యాటరీకి పంపడం ఈ టైర్ ప్రత్యేకత. అలా మార్చే క్రమంలో కలిగే ఒత్తిడిని తట్టుకునే మెటీరియల్‌తో ఈ టైర్‌ను రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకున్న ప్రధాన సమస్య రీఛార్జింగ్ . పెట్రోల్ దొరికినంత సులువుగా ఎలక్ట్రిక్ రీఛార్జ్ సెంటర్లు దొరకవు. మనదేశంలో అయితే ఎలక్ట్రిక్ కార్ల వాడకం చాలా తక్కువ. ఇప్పుడీ పవర్ జనరేటింగ్ టైర్‌తో ఎలక్ట్రిక్ కార్ల వినియోగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.