tirupati lok sabha constituency
-
పోలింగ్ తగ్గినా వైఎస్సార్సీపీకి పెరిగిన ఓట్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 2019లో జరిగిన ఎన్నికల్లో కన్నా ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటింగ్‌శాతం తగ్గినా వైఎస్సార్సీపీకి లభించిన మెజారిటీ భారీగా పెరిగింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకర్గంలో 79.76 శాతం పోలింగ్ నమోదైంది. వైఎస్సార్సీపీకి 2,28,376 ఓట్ల మెజారిటీ లభించింది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 64.42 శాతం పోలింగ్ నమోదైంది. కోవిడ్ నేపథ్యంలో 15 శాతానికిపైగా పోలింగ్ తగ్గింది. అయినా వైఎస్సార్సీపీకి పోలైన ఓట్లు పెరిగాయి. గత ఎన్నికలకంటే వైఎస్సార్సీపీకి 1.64 శాతం మేర ఓట్లు పెరిగాయి. తాజా ఎన్నికల్లో 2,71,592 ఓట్ల మెజారిటీ లభించింది. -
Tirupati Election Results 2021: జననేత వైపే జనం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన, అభివృద్ధిని ప్రజలు మరోసారి ఆశీర్వదించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 2.71 లక్షలకుపైగా ఓట్లతో తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. 2019 ఎన్నికల కన్నా ఈసారి ఎక్కువ మెజారిటీ కట్టబెట్టడం గమనార్హం. తన 23 నెలల పాలన చూసి ఓటేయాలన్న సీఎం జగన్ మాటను గౌరవిస్తూ విశ్వసనీయతకే పట్టం కట్టారు. ఊహించిందే అయినప్పటికీ భారీ మెజారిటీ రావడం పార్టీ వర్గాల్లో ఆనందోత్సాహాలను నింపుతోంది. ఈ నెలాఖరుతో రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో వెలువడ్డ ప్రజా తీర్పు సీఎం జగన్ పాలన పట్ల రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ దాదాపు 2.28 లక్షల మెజారిటీతో గెలుపొందడం తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో అనివార్యంగా మారిన ఉప ఎన్నికలో రాజకీయ అనుభవం లేని, పాదయాత్రలో తన వెన్నంటి ఉన్న డాక్టర్ ఎం.గురుమూర్తికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. ఫలించని ‘పచ్చ’రాజకీయం! స్థానిక ఎన్నికల్లో కుదేలైన టీడీపీ తాజాగా తిరుపతి ఎన్నికల్లో మరోసారి తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. రోజుల తరబడి అక్కడే మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఉనికి కాపాడుకునేందుకు నానా పాట్లు పడ్డారు. రకరకాల ఎత్తుగడలు వేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకూ వెనుకాడలేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ తన బహిరంగ సభను రద్దు చేసుకుని ఓటర్లకు లేఖ రాస్తే విపక్షం దీన్ని కూడా రాజకీయం చేస్తూ విమర్శలకు దిగింది. అయినప్పటికీ సీఎం సంయమనాన్ని పాటిస్తూ హుందాగా వ్యవహరించారు. ఫలితాల జోరు చూస్తే ఒక్క తిరుపతే కాదు లోక్‌సభ నియోజకవర్గం మొత్తం సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినట్లు స్పష్టమవుతోంది. -
తిరుపతిలో వైఎస్సార్సీపీ ఘన విజయం
సాక్షి, తిరుపతి / సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనకు పట్టంగట్టి తామంతా ఆయన వెంటే ఉన్నామని తిరుపతి ఎన్నికల ఫలితాల సాక్షిగా ప్రజలు మరోసారి నిరూపించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తిని 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించి వరుసగా మూడోసారి పార్టీకి ఘన విజయం చేకూర్చారు. కరోనా పరిస్థితి వల్ల పోలింగ్ శాతం తగ్గిపోయినా వైఎస్సార్సీపీ ఓట్ల శాతం మాత్రం గతం కంటే పెరగడం గమనార్హం. గత ఎన్నికలే కాదు 1989 నుంచి చూసినా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడిన పార్టీలు ఫ్యాన్ ప్రభంజనంలో కొట్టుకుపోయాయి. బీజేపీ – జనసేన, కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కాగా టీడీపీ మరోసారి పరాజయం పాలైంది. తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందడంతో గత నెల 17వ తేదీన జరిగిన ఉప ఎన్నికల్లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో 11,04,927 ఓట్లు పోల్ కాగా 64.42 శాతం ఓటింగ్ నమోదైంది. కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహించింది. తిరుపతి ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ అక్కడే మకాం వేసి రోజుల తరబడి ప్రచారం నిర్వహించారు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. బహిరంగ సభను కూడా రద్దు చేసుకున్నారు. తాను అధికారం చేపట్టిన తరువాత 22 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ప్రజలకు లేఖ రాశారు. 56.67 శాతం ఓట్లతో విజయభేరీ.. తిరుపతి ఉప ఎన్నికలో పోలైన మొత్తం 11,04,927 ఓట్లలో అధికార పార్టీకి సగానికిపైగా 56.67 శాతం ఓట్లు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.76 శాతం పోలింగ్ నమోదు కాగా 55.03 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇప్పుడు కరోనా పరిస్థితుల కారణంగా పోలింగ్ శాతం తగ్గినా గత ఎన్నికల కంటే 1.64 శాతం ఓట్లను అధికంగా వైఎస్సార్సీపీ సాధించడం గమనార్హం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ స్వయంగా ప్రచార రంగంలోకి దిగి ఇంటింటికీ తిరిగినా 2019 ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి 5.57 శాతం ఓట్లు తగ్గిపోవడం గమనార్హం. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. జనసేన జతకట్టడంతో బీజేపీ 5.2 శాతం ఓట్లతో ఎట్టకేలకు ‘నోటా’ను అధిగమించింది. కాంగ్రెస్ 1.78 శాతం ఓట్లను కోల్పోగా సీపీఎం 0.5 శాతం ఓట్లకే పరిమితమైంది. పోస్టల్ బ్యాలెట్ నుంచే ఆధిక్యం.. ఆదివారం ఉదయం 8 గంటలకు నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో సూళ్లూరుపేట, వెంకటగిరి గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలకు, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ నుంచే వైఎస్సార్సీపీ ఆధిక్యం కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్లలో 809 ఓట్ల ఆధిక్యంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఖాతా తెరిచారు. ఆ తర్వాత నుంచి ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ప్రతి నియోజకవర్గంలోనూ సగటున 35 నుంచి 40 వేల ఓట్ల ఆధిక్యంతో కొనసాగారు. మొదటి రౌండ్ నుంచి 20వ రౌండ్ వరకు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆధిక్యం పూర్తి స్థాయిలో కొనసాగింది. ఆ సమయంలో గురుమూర్తితోపాటు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. మొదటి రౌండ్లోనే వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీ రావడంతో పనబాక లక్ష్మి నిరుత్సాహంతో వెనుదిరిగారు. మారుమూల గ్రామం.. మధ్య తరగతి కుటుంబం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామం మన్నసముద్రం దళితవాడకు చెందిన మద్దెల గురుమూర్తిది సామాన్య కుటుంబం. తండ్రి మునికృష్ణయ్య రెండెకరాల ఆసామి. అది కూడా 1975లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిందే. ఈ భూమికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టా ఇచ్చారు. ప్రస్తుతం అందులో మామిడి సాగు చేస్తున్నారు. గురుమూర్తి తల్లి రమణమ్మ గృహిణి. ఆయనకు ఐదుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ఆ తర్వాత ఇంటర్ తిరుపతిలో చదువుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో ఫిజియోథెరఫీ పూర్తి చేశారు. మహానేత స్ఫూర్తి.. జగనన్న వెన్నంటి.. గురుమూర్తి స్విమ్స్‌లో ఫిజియోథెరఫీ చేస్తున్న సమయంలో విద్యార్థి సంఘం నేతగా నాడు సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని తరచూ కలిసేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్రలో ఆయన వెంటే నడిచారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో తన వెంటే నడిచి ప్రజల కష్టాలు తెలుసుకున్న డాక్టర్ గురుమూర్తిని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. డాక్టర్ గురుమూర్తి పేరును ప్రకటించిన రోజే ఆయన విజయం ఖరారైంది. ప్రజలపై ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకాన్ని ఉప ఎన్నిక ఫలితం ద్వారా మరోసారి నిరూపించారు. డిక్లరేషన్ అందుకున్న గురుమూర్తి.. ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ ఎం.గురుమూర్తికి ఆదివారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవిఎన్ చక్రధర్‌బాబు డిక్లరేషన్ అందజేశారు. గురుమూర్తితో పాటు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్‌కుమార్‌యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గురుమూర్తి నెల్లూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ ఘన విజయం అందరిదీ నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు: సీఎం జగన్ ట్వీట్ సాక్షి, అమరావతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఘన విజయం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘23 నెలల పాలన తరవాత తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు మన ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా ఆశీర్వదించారు. ఈ ఘన విజయం ప్రజలందరిదీ. నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు. తిరుపతి పార్లమెంటు ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజారిటీతో దీవిస్తే.. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మనసారా దీవించి.. నన్ను, మన ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రోజు 2.71 లక్షల మెజారిటీ ఇవ్వటం ద్వారా చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పవి. ఇది నా బాధ్యతను మరింతగా పెంచుతుంది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే ఈ విజయం సాధ్యమైంది..’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. -
నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గురుమూర్తి ఘన విజయం సాధించిన సాంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురు మూర్తికి అభినందనలు తెలిపారు. ఇది ప్రజల విజయం అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘23 నెలల పాలన తర్వాత తిరుపతి పార్లమెంట్‌కు జరిగిన ఉపఎన్నికలో ప్రజలు మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తిరుపతి పార్లమెంట్ ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజార్టీతో దీవించారు. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మనసారా దీవించి.. నన్ను, మన ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రోజు 2.71 లక్షల మెజార్టీతో ఆశీర్వదించారు. వారు మనపై చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పది. ఈ విజయం నా బాధ్యతను మరింతగా పెంచుతుంది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే ..ఈ విజయం సాధ్యమైంది అని సీఎం జగన్ తెలిపారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: ఓట్ల సునామీ.. సామాన్యుడిదే గెలుపు -
తిరుపతిలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఊహించినదే
-
తిరుపతి ఉప ఎన్నిక: ఓట్ల సునామీ.. సామాన్యుడిదే గెలుపు
తిరుపతి ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వం వెంటే తామున్నామని స్పష్టం చేశారు. 2 లక్షల 70 వేలపైచిలుకు ఓట్ల మెజార్టీని అందించారు. ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడ్ని అందలం ఎక్కిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి తనానికి ప్రజలు మద్దతు నిచ్చారు. నేటి ప్రజా తీర్పుతో దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేశారు. ఫ్యాన్ సునామీలో కొన్ని ప్రత్యర్థి పార్టీల చావు తప్పి కన్ను లొట్టపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మారు మూల గ్రామం.. సామాన్య మధ్య తరగతి కుటుంబం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామమైన మన్నసముద్రం దళితవాడకు చెందిన మద్దిల గురుమూర్తిది సామాన్య కుటుంబం. తండ్రి మునికృష్ణయ్య రెండెకరాల ఆసామి. అది కూడా 1975లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిందే. ఈ భూమికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టా ఇచ్చారు. ప్రస్తుతం అందులో మామిడి సాగుచేస్తున్నారు. గురుమూర్తి తల్లి రమణమ్మ గృహిణి. ఐదుగురు అక్క చెల్లెల్లు ఉన్నారు. ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో ప్రాథమిక, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో.. ఆ తర్వాత ఇంటర్ తిరుపతిలో చదువుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో ఫిజియోథెరిపీ పూర్తి చేశారు. మహానేత స్పూర్తి.. జగనన్న వెన్నంటి.. స్విమ్స్‌లో ఫిజియోథెరపి చేస్తున్న సమయంలో విద్యార్థి సంఘ నాయకుడిగా సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని తరచూ వెళ్లి కలిసేవారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తూ వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. 2017లో వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ‘ప్రజాసంకల్పయాత్ర’లో ఆయన వెంటే ఉన్నారు. నవంబర్ 2017- జనవరి 2019 వరకు 3,648 కి.మీ మేర సాగిన వైఎస్ జగన్ పాదయాత్రలో ఆయన వెంట నడిచారు. అడుగడుగునా పేదల కష్టాలు చూశారు. ఫిజియోథెరపిస్టు టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బీసీ, ఎస్సీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిని సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సహించే దిశగా విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో తన వెంటే ఉండి ప్రజల కష్టాలు తెలుసుకున్న డాక్టర్ గురుమూర్తిని తిరుపతి ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. సీఎం జగన్.. డా.గురుమూర్తి పేరు ప్రకటించిన నాడే ఆయన విజయం ఖరారు అయిపోయింది. ప్రజలు గురుమూర్తిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి మరోసారి సంక్షేమ ప్రభుత్వానికి కొమ్ము కాశారు. ప్రజలపై ముఖ్యమంత్రి పెట్టుకున్న నమ్మకాన్ని.. ప్రజలకు ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకాన్ని తేటతెల్లం చేశారు. -
2.10 లక్షలు దాటిన వైఎస్సార్సీపీ మెజార్టీ
-
లక్ష పైగా ఆధిక్యంలో వైఎస్సార్సీపీ
-
తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్: లక్షా 50 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజార్టీ
-
వైఎస్ జగన్ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి
-
తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్: పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం
-
తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
-
తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం
Time: 4:04 PM విజయోత్సవ సంబరాలు నిర్వహించొద్దు.. విజయోత్సవ సంబరాలు నిర్వహించొద్దని పార్టీ శ్రేణులను వైఎస్సార్సీపీ ఆదేశించింది. కోవిడ్ నిబంధనలు, ఈసీ సూచనల మేరకు సంబరాలు చేయొద్దని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్సీపీ భారీ విజయం Time: 3:47 PM తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందారు. ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. Time: 3:10 PM 2 లక్షల 25 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజార్టీ.. వైఎస్సార్సీపీ మెజార్టీ 2 లక్షల 25 వేలు దాటింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 2,25,773 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు. Time: 2:48 PM తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల శాతం ఇలా.. వైఎస్సార్సీపీ- 4,61,366(57 శాతం) టీడీపీ- 2,55,271 (31.5 శాతం) బీజేపీ-43,317 (5.4 శాతం) కాంగ్రెస్- 7,233(0.9 శాతం) సీపీఎం- 4,232 (0.6 శాతం) ఇతరులు- 26,316 (3.3 శాతం) నోటా-11,509 (1.4 శాతం) Time: 2:42 PM వైఎస్సార్సీపీ మెజార్టీ 2.12 లక్షలు దాటింది. ఇప్పటివరకు 2,12,227 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు. వైఎస్సార్సీపీకి 4,47,819, టీడీపీకి 2,47,408, బీజేపీకి 42,334 ఓట్లు పోలయ్యాయి. Time: 2:06 PM లక్షా 50 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజార్టీ.. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ మెజార్టీ లక్షా 81 వేలు దాటింది. ఇప్పటివరకు 1,81,570 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల శాతం ఇలా.. వైఎస్సార్సీపీ- 2,96,678 (56 శాతం) టీడీపీ-1,70,547 (32.2 శాతం) బీజేపీ- 30,519 (5.8 శాతం) కాంగ్రెస్- 4,821 (0.9 శాతం) సీపీఎం- 2,949(0.6 శాతం) ఇతరులు- 16,777 (3.2 శాతం) నోటా- 7,202(1.4 శాతం) Time: 1:50 PM లక్ష పైగా ఆధిక్యంలో వైఎస్సార్సీపీ తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ ఓట్ల సునామీ సృష్టిస్తోంది. 1,42,614 ఆధిక్యంలో వైఎస్సార్సీపీ దూసుకెళ్తోంది. టీడీపీ, బీజేపీ వెనుకంజలో ఉన్నాయి. Time: 1:07 PM 95,811 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్న వైఎస్సార్సీపీ.. వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి 95,811 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. గురుమూర్తికి 2,29,424 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,33,613 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 23,223 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌కు 3,594 ఓట్లు పోలయ్యాయి. Time: 12:05 PM వైఎస్సార్సీపీకి తిరుగులేని ఆధిక్యత.. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి 95,811 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. Time: 10:42 AM వైఎస్సార్సీపీకి భారీ ఆధిక్యం.. తిరుపతి: వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 76,202 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్సీపీ 57.22 శాతం ఓట్లు సాధించింది. Time: 9:51 AM భారీ ఆధిక్యం దిశగా వైఎస్సార్సీపీ ముందజలో కొనసాగుతోంది. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మొదటి రౌండ్లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో 1907 ఆధిక్యంలో ఉంది. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. Time: 8:53 AM తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ముందంజలో ఉంది. Time: 8:22 AM పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తారు. Time: 8:05 AM ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజ కవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్న మెంట్ మహిళా కళాశాలలో జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా 48 గంటల ముందు తీసుకున్న కోవిడ్–19 నెగెటివ్ రిపోర్ట్ చూపించాలని, లేదా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నట్లు చూపించినవారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని విజయానంద్ స్పష్టం చేశారు. ఇద్దరు ఏజెంట్లలో ఒక ఏజెంట్ పీపీఈ కిట్ విధిగా ధరించాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొ బైల్ ఫోన్స్ అనుమతించరు. అత్యల్పంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గ కౌంటింగ్ 14 రౌండ్లు, సుళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌం డ్లు కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా లేదా ఓట ర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కౌంటింగ్ దృష్ట్యా మే 1 అర్ధరాత్రి నుంచి మే 3 ఉదయం 10 గంటల వరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. గెలిచిన అభ్యర్థి రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకునేటప్పుడు అభ్యర్థితో పాటు ఇద్దరు వ్యక్తులను మించి అనుమతించరు. అలాగే ఫలితాల తర్వాత ఎటువంటి ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. -
‘తిరుపతి’ పోలింగ్‌కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: కోవిడ్ నిబంధనలను పటిష్టంగా పాటిస్తూ ఏప్రిల్ 17న జరిగే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియడంతో 17న జరిగే పోలింగ్ కోసం చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిత్తూరు, నెల్లూరు జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పలు సూచనలు చేశారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ సమయాన్ని పెంచడంతోపాటు పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. సాధారణంగా ప్రతీ 1,500 మందికి ఒక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తామని, కానీ కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రతీ 1,000 మందికి ఒక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో అదనంగా 477 సహా మొత్తంగా 2,410 పోలింగ్‌బూత్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్‌కు ముందు 48 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయని, పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలవద్ద కోవిడ్ వ్యాప్తిని నిరోధించే విధంగా శానిటైజేషన్, మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచడంతోపాటు ఎండ వేడిని తట్టుకునేలా టెంట్లు, మంచినీటి సౌకర్యం వంటి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 80 ఏళ్లు దాటినవారు, అంగవైకల్యమున్న వారిని ఓటు వేయడానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కేంద్ర బలగాలతో బందోబస్తు.. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చిత్తూరు జిల్లాలోని మూడు, నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, మొత్తం 17,11,195 మంది ఓటర్లు ఉండగా, అందులో 8.38 లక్షలమంది పురుష ఓటర్లు, 8.71 లక్షలమంది మహిళా ఓటర్లు ఉన్నారని విజయానంద్ తెలిపారు. 466 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ కేంద్ర బలగాలతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో 10,796 మంది ఎన్నికల సిబ్బంది, 13,827 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. 23 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలతో బందోబస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. పోలింగ్ కేంద్రం ఎక్కడుందో ఓటరు తెలుసుకునే విధంగా తొలిసారిగా ‘మే నో పోలింగ్ స్టేషన్’ (mayknowpolling station) పేరిట ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించి ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఓటర్ ఐడీ కార్డు నంబర్ నమోదు చేయడం ద్వారా పోలింగ్‌స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. వాహనాల తనిఖీలను కేంద్ర బలగాలకు అప్పగించామని చెప్పారు. వలంటీర్లను ఎన్నికల సంబంధిత కార్యక్రమాల్లో వినియోగించకూడదని విజయానంద్ స్పష్టం చేశారు. -
తిరుపతి ఓటర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ
సాక్షి, అమరావతి: ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ జరిగిన మేలును వివరిస్తూ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు స్వయంగా లేఖలు రాశారు. తన 21 నెలల పరిపాలనలో ప్రభుత్వ పథకాలు, చేపట్టిన కార్యక్రమాలను, వాటి ద్వారా ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని ఈ లేఖలో పొందుపరిచారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం తొలి లేఖపై వైఎస్ జగన్ సంతకం చేశారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ప్రతి కుటుంబంలోని సోదరుడు లేదా అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి నేరుగా ఆయన ఈ లేఖ రాశారు. వైఎస్సార్ సున్నావడ్డీ.. వైఎస్సార్ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ పింఛన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు వంటి పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని ఈ లేఖల్లో పేర్కొన్నారు. వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలు, రైతులు, అక్కచెల్లెమ్మలు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనులు, గ్రామాలు, నగరాలు తదితర అంశాలను జగన్ తన లేఖలో ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీల మీద ఎలాంటి విమర్శలు చేయకుండా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ప్రభుత్వ దార్శనికతను, వాగ్దానాలను నిలబెట్టుకున్న విధానాన్ని ప్రజలకు తెలియజెప్పారు. గత రాజకీయ సంస్కృతికి భిన్నంగా వైఎస్ జగన్ లేఖ సాగడం విశేషం. తిరుపతి ఉప ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటువేసి, వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని తిరుపతి లోక్‌సభ ఓటర్లను జగన్ కోరారు. పార్టీ అధ్యక్షుడి సంతకంతో ఉన్న ఈ లేఖలను వైఎస్సార్సీపీ శ్రేణులు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ప్రతి కుటుంబానికి అందజేయనున్నాయి. -
గురుమూర్తి గెలుపును సీఎం జగన్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలి
నెల్లూరు: వైఎస్సార్సీపీ తిరుపతి లోక్‌సభ అభ్యర్థి గురుమూర్తి ఉన్నతమైన వ్యక్తి అని, అఖండ మెజారిటీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా నెల్లూరులో సోమవారం మంత్రులు ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గురుమూర్తిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఋణం తీర్చుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి పార్టీలకతీతంగా పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంట నడుద్దామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మేనిఫెస్టోని కనుమరుగు చేసిన వ్యక్తి చంద్రబాబు అని, అదే మేనిఫెస్టోలోని హామీలు నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీకి వస్తున్న అదరణచూసే చంద్రబాబు జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల నుంచి పారిపోయాడు అని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకొని జగన్ ఋణం తీర్చుకోవాలని సూచించారు. భారీ మెజార్టీతో గెలిపించాలి: మంత్రి బాలినేని ఏడాదిన్నర పాలనలో ఊహించని సంక్షేమాన్ని ఇచ్చి సీఎం జగన్ పేదల పెన్నిధిగా నిలిచారని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల పక్షపాతి అని కొనియాడారు. ఉప ఎన్నికలో హేమాహేమీలు నిలిచారని, ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రజా సంక్షేమాన్ని పనబాక గాలికి వొదిలేసారని గుర్తుచేశారు. ఇప్పుడు టీడీపీలో చేరి ఓట్లకు వస్తున్నారని చెప్పారు. సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో మెజారిటీ పెంచేందుకు ఆనం చేస్తున్న శ్రమ, కృషి అభినందనీయమని తెలిపారు. గురుమూర్తి గుణమంతుడు: డిప్యూటీ సీఎం గురుమూర్తి మంచి గుణమంతుడని, ఆ గుణాన్ని గమనించే ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ నిలిపారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. అతడిని అనూహ్య మెజారిటీతో గెలిపించి సంక్షేమ సారథి జగన్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. పచ్చమీడియాలో రాష్ట్రం అప్పులపాలైందని తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం వచ్చింది అని చెప్పారు. జగన్‌కి వస్తున్న జనాదరణ చూసి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు త్వరలో టీడీపీని బీజేపీలో విలీనం చేసేస్తాడని జోస్యం చెప్పారు. -
తిరుపతి అభ్యర్థిపై బీజేపీ–జనసేన సుదీర్ఘ మంతనాలు
సాక్షి, అమరావతి: తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ, జనసేన పార్టీల నుంచి ఎవరు పోటీ చేయాలన్న దానిపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్చార్జ్ సునీల్ దేవధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి మధుకర్ ఆదివారం రాత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. సుమారు 3 గంటల పాటు వీరి మంతనాలు సాగాయి. అభ్యర్థి ఎంపికపై ఇంకో దఫా చర్చలు జరపాలని నిర్ణయించారు. చదవండి: (కరోనా పీడలో ఎన్నికల పంచాయతీ!) -
‘తిరుపతి’పై బీజేపీ, జనసేన చర్చలు
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చించేందుకు మిత్రపక్ష పార్టీలైన బీజేపీ, జనసేన మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యాయి. బీజేపీ తరఫున పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సతీష్జీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్‌జీలు పాల్గొనగా.. జనసేన నుంచి పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే దానిపై సమావేశంలో ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే బీజేపీ, జనసేన కలసి పోటీ చేసే విషయాన్ని మాత్రం బాగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చించి, వారి సూచనలకు అనుగుణంగా ఎవరు పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుందామని పవన్‌కల్యాణ్ అన్నట్లు సమాచారం. కేంద్ర బృందంతో విచారణ జరిపించాలి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు అంతుచిక్కని వ్యాధితో అనారోగ్యానికి గురికావడంపై ప్రత్యేక కేంద్ర బృందంతో అధ్యయనం, విచారణ చేయించాల్సిందిగా ప్రధాని మోదీని కోరాలని సమావేశంలో నిర్ణయించినట్టు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. నివర్ తుపాను మూలంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కనబరుస్తోందని బీజేపీ, జనసేనలు అభిప్రాయపడినట్టు ఆ ప్రకటన పేర్కొంది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, ఫలితంగా ఉపాధి అవకాశాలు క్షీణించాయని సమావేశం అభిప్రాయపడినట్టు వివరించింది. -
మీ నిర్ణయం మాకు శిరోధార్యం
సాక్షి, అమరావతి : తిరుపతి ఎస్సీ రిజర్వుడు లోక్‌సభా స్థానం ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు పార్టీ అభ్యర్థి ఎంపిక బాధ్యతను వైఎస్సార్సీపీ నేతలు సీఎం వైఎస్ జగన్‌కే అప్పగించారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పలువురు మంత్రులు, తిరుపతి లోక్‌సభా స్థానం పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. అభ్యర్థి విషయంలో అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. తిరుపతి అభ్యర్థి విషయంలో సీఎం ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకున్నారని, అందరం ఏకగ్రీవంగా సీఎంకే ఎంపిక బాధ్యతను అప్పగించామని తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపిస్తాం : కాకాణి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ విస్తృత ప్రయోజనాలు, స్థానిక పరిస్థితులపై సీఎం జగన్‌కు పూర్తి అవగాహన ఉంది కనుక అభ్యర్థి ఎంపికపై నిర్ణయాన్ని ఆయనకే వదిలిపెట్టామని చెప్పారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎవరిని ఖరారు చేసినా అందరమూ కలసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. అభ్యర్థి ఎవరు? అనే ప్రస్తావనే సమావేశంలో రాలేదని వెల్లడించారు. తాము కేవలం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను సీఎంకు వివరించామన్నారు. గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తామని మాట ఇచ్చామన్నారు. అభ్యర్థి విషయంలో సీఎం ఏరోజు నిర్ణయం తీసుకుంటే ఆరోజు నుంచే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగుతామని చెప్పారు. మీడియా సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కె.ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పి.అనిల్‌కుమార్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వి.వరప్రసాద్, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
వర ‘ప్రసాదమే’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తిరుపతి లోక్‌సభ స్థానం ఎన్నిక విషయం గురించి తెలుగుదేశం పార్టీ నేతలు మరచిపోయారు. ఈ లోక్‌సభ పరిధిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వారు బీజేపీ పేరెత్తాలంటేనే హడలిపోతున్నారు. తమ నోటి వెంట ఆ మాట వస్తే ముస్లిం మైనారిటీ ఓట్లు వచ్చేవి కూడా పోతాయనే భయం పట్టుకుంది. ఎమ్మెల్మే ఓటు తమకు వేయాలనీ ఎంపీ ఓటు మీ ఇష్టం అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రచారం ప్రారంభించారు. రెండు పార్టీల నేతలు కలసి ప్రచారం చేయడానికి కూడా ఇష్టపడటంలేదు. క్షేత్ర స్థాయిలో ఈ రెండు పార్టీల శ్రేణుల మధ్య సఖ్యత కుదరక పోవడంతో పొత్తు చిత్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిస్తున్నాయి. రెండు పార్టీల అగ్రనాయకులు ప్రచార సభలకు వచ్చిన సమయంలో ఈ రెండు పార్టీల నేతలు, శ్రేణులు తమ జెండాలతో హాజరవున్నారు. ముఖ్య నేతలు వెళ్లిపోయిన మరుక్షణం నుంచే ఎవరికి వారే యమునా తీరే అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామం తిరుపతి లోక్‌సభ పరిధిలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు, ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావుకు కలిసొస్తోంది. సర్వేపల్లి : ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రెండేళ్లుగా ప్రతి ఇంటి గడప ఎక్కి దిగారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలవడం, వారిని ఓటు అభ్యర్థించడం, ఎన్నికల ప్రచారం విషయాల్లో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కాకాణి సమీపానికి కూడా రాలేక పోతున్నారు. సోమిరెడ్డి అయిష్టంగా ఇక్కడి నుంచి పోటీకి దిగారనే విషయం గ్రహించిన ఓటర్లు ఆయన్ను కూడా ఆదరించే అవకాశాలే కనిపించడం లేదు. దీంతో సోమిరెడ్డి తన సంగతి తాను చూసుకుని గట్టెక్కితే చాలనుకుంటూ ఎంపీ ఓటు గురించి అడిగే ధైర్యం చేయలేక పోతున్నారు. బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు స్వగ్రామం ఈ నియోజక వర్గంలోనే ఉన్నా ఆ పార్టీ బలం మాత్రం నామమాత్రమే. ఇక్కడ టీడీపీ, బీజేపీ శ్రేణులు కలసి ప్రచారం కూడా చేయలేక పోతున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గూడూరు : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోత్స్నలతకు ఆ పార్టీ శ్రేణుల నుంచి మనస్ఫూర్తిగా సహకారం అందడంలేదు. మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి చంద్రబాబు జోక్యంతో తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే జ్యోత్స్న గెలిస్తే ఇక తమ ఆధిపత్యం లేకుండా పోతుందనే భయంతో బల్లి వర్గం జ్యోత్స్నకు వెన్నుపోట్లు పొడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి పనబాక లక్ష్మి భర్త కృష్ణయ్య నామమాత్రంగానే పోటీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి పాశం సునీల్‌కుమార్‌తో పాటు పార్టీ విజయం కోసం సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఆయనతో పాటు నేదురుమల్లి పద్మనాభరెడ్డి ఇతర ముఖ్య నేతలు ఎమెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం ఉరకలెత్తిస్తున్నారు. ఇక్కడ టీడీపీలోనే అనేక గొడవలు ఉన్నందువల్ల బీజేపీ కేడర్‌తో వారు కలసి పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. వెంకటగిరి : తాజా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి రామకృష్ణకు ఏటికి ఎదురీదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన తానెలా గట్టెక్కాలనే దిశగానే ఓటర్లను కలుస్తున్నారు. ఎంపీ అభ్యర్థి గురించి పట్టించుకునే ఆలోచన, తీరిక ఆయనకు కనిపించడం లేదు. దీంతో ఈ రెండు పార్టీల శ్రేణులు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటూ వారి ఓటు మాత్రమే అడుగుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్య నాయుడు రెండు ఓట్లు ఫ్యాన్‌కు వేయాలని జనంలోకి దూసుకుపోతున్నారు. సూళ్లూరుపేట : టీడీపీ అభ్యర్థి పరసా రత్నం తాను గెలిస్తే చాలనే విధంగా సైకిల్‌కు ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీకి చెప్పుకోదగ్గ కార్యకర్తలు కూడా లేకపోవడంతో ప్రచారంలో ఎంపీ ఓటు గురించి ప్రస్తావనే రావడంలేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్యతో పాటు పార్టీ నేతలు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సత్యవేడు : టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య ఇప్పటి దాకా బీజేపీ కేడర్‌తో కలసి ప్రచారం చేయలేదు. ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ కేడర్ కూడా తక్కువ కావడంతో బీజేపీ గురించి పట్టించుకోకుండా తన ఓటు మాత్రమే అడుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలంతో పాటు పార్టీ నేతలు ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం చేస్తున్నారు. శ్రీకాళహస్తి : టీడీపీ తరపున బరిలో ఉన్న మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బీజేపీ ఊసే ఎత్తడం లేదు. ఆ పేరెత్తితే ముస్లింల ఓట్లు పోతాయని ఆయన చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కండ్రిగ ఉమను సైతం తన వెంట ప్రచారానికి తీసుకువెళ్లేందుకు ఆయన ఇష్టపడటం లేదు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూధన్‌రెడ్డి రెండు ఓట్లూ ఫ్యాన్‌కు వేయాలని జనాన్ని అభ్యర్థిస్తున్నారు. తిరుపతి : టీడీపీ అభ్యర్థి వెంకటరమణ మీద ఇక్కడ బీజేపీ నాయకులు గతంలో అవినీతి పోరాటం చేశారు. ఆయన భూ కబ్జాదారుడని బహిరంగ ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తితో కలసి ప్రచారం చేయడానికి బీజేపీ నేతలు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్, చంద్రారెడ్డి, శాంతారెడ్డి ఇష్టపడటం లేదు. దీంతో బీజేపీ నేతలు తమ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఓటేయాలని వేరుగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి వెంకటరమణ కూడా బీజేపీతో కలిసి ప్రచారం చేస్తే తనకు దెబ్బ తగులుతుందనే ఆలోచనతో వేరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.