title dead
-
రైతులకు పట్టా పండుగ.. సంక్రాంతిలోగా సాగు భూమికి పట్టా!
అనంతపురం అర్బన్: సంక్రాంతి ప్రత్యేకంగా రైతుల పండుగ. ఈ పండుగకు మరింత శోభ తీసుకువచ్చి రైతుల కుటుంబాల్లో సంతోషం నింపే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. జీవనాధారంగా ప్రభుత్వభూమిని ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేద రైతులకు డీ పట్టాలు పంపిణీ చేసి అండగా నిలిచేందుకు సిద్ధమయ్యింది. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న పేద రైతులకు తరి రెండున్నర ఎకరాలు, మెట్ట ఐదు ఎకరాలకు మించకుండా డీ– పట్టా ఇవ్వనున్నారు. ఇప్పటికే అర్హులైన 2,090 మంది సాగు రైతులు 2,897 ఎకరాలు ప్రభుత్వ భూమిలో సాగు చేస్తున్నట్లు గుర్తించారు. వీరందరికీ సంక్రాంతి పండుగలోగా పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేసింది. అసైన్మెంట్ కమిటీ ఆమోదానికి.. సాగుభూమికి సంబంధించి రైతులకు పట్టా ఇచ్చేందుకు ప్రత్యేకంగా అసైన్మెంట్ కమిటీని (ఏసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా జిలా ఇన్చార్జి మంత్రి వ్యవహరిస్తారు. మెంబర్ కన్వీనర్‌గా జాయింట్ కలెక్టర్, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్సీ ఉంటారు. మెంబర్లుగా జిల్లా మంత్రి, ఎమ్మెల్యే, ఆర్డీఓ ఉంటారు. 2023 జనవరిలో జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన అసైన్మెంట్ కమిటీ సమావేశం జరగనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. కమిటీ ఆమోదం తీసుకుని సంక్రాంతి పండుగలోగా రైతులకు పట్టాలు పంపిణీ చేస్తారు. అర్హతలివీ.. సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమి తప్ప రైతుకు ఇతరత్రా పట్టా భూమి ఉండకూడదు. సాగు చేసుకుంటున్న భూమిని ఇంతకు ముందుకు ఎవరికీ డీ –పట్టా ఇచ్చి ఉండకూడదు. దరఖాస్తులో పొందుపరచిన భూమిలో సదరు రైతు తప్పనిసరిగా సాగు చేసుకుంటూ ఉండాలి. అర్హత ఉన్న రైతుకు తరి 2.50 ఎకరాలు లేదా మెట్ట 5 ఎకరాల మించకుండా డీ–పట్టా మంజూరు చేస్తారు. ఏ భూములకు పట్టా ఇవ్వరంటే... ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొరంబోకు భూములు, వాగులు, వంకలు, కొండలు, గుట్టలకు పట్టాలు ఇవ్వరు. వ్యవసాయ యోగ్యమైన భూమిని మాత్రమే అసైన్డ్ చేస్తూ డీ – పట్టా ఇస్తారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సంక్రాంతిలోగా పంపిణీకి చర్యలు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ నిబంధనల ప్రకారం పట్టా పొందేందుకు అర్హులైన పేద రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది. వచ్చే నెలలో జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన అసైన్మెంట్ కమిటీ సమావేశం ఉంటుంది. కమిటీ ఆమోదం తీసుకుని సంక్రాంతి పండుగలోగా పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాం. – కేతన్‌గార్గ్, జాయింట్ కలెక్టర్ -
పాస్‌బుక్, టైటిల్ డీడ్ లేకుండానే..పంట రుణం
గత నెలలోనే ఆర్డినెన్స్ జారీ ⇒ అయినా పట్టించుకోని బ్యాంకులు ⇒ ఆర్డినెన్స్‌కు ప్రచారం లేకపోవడమే కారణం ⇒ ఇకపై టైటిల్‌డీడ్ కమ్ పాస్‌బుక్ ఒకటే రికార్డు ⇒ ఆన్లైన్లోనే ఆర్వోఆర్ రికార్డుల నిర్వహణ సాక్షి, హైదరాబాద్ పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ లేకుండానే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. నెల రోజుల కిందే ఈ ఆర్డినెన్స్‌ను అమల్లోకి తెచ్చింది. ‘తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ (అమెండ్మెంట్)’పేరుతో గత నెల 17న జారీ చేసిన ఆర్డినెన్స్‌లో దీనితో సహా పలు కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. వాటి ప్రకారం రాష్ట్రంలో బ్యాంకులు రైతుల వద్ద పూచీకత్తు పత్రాలేవీ తీసుకోకుండానే రుణాలు మంజూరు చేయాలి. కానీ ఈ ఉత్తర్వులు ఇంకా క్షేత్రస్థాయిలో అమల్లోకి రాలేదు. పట్టాదారు పాస్ పుస్తకం లేదా టైటిల్ డీడ్, సంబంధిత వ్యవసాయ అధికారి ధ్రువీకరణ ఉంటే తప్ప రుణం ఇచ్చే ప్రసక్తే లేదంటూ బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తగినంతగా ప్రచారం చేయకపోవడం, విధి విధానాల అమలుపై దృష్టి కేంద్రీకరించక పోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. టీఎల్ఆర్ఎంఎస్లో భూముల వివరాలు ఆర్డినెన్స్ ప్రకారం రాష్ట్రంలో భూముల యా జమాన్య సంబంధిత రెవెన్యూ రికార్డులన్నీ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) ఎలక్ట్రానిక్ నమూనాలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏ సర్వే నంబర్లో ఉన్న భూమి అయినా ఏ రైతుకు చెందినదో తెలుసుకునేందుకు వీలుగా ‘తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (టీఎల్‌ఆర్‌ఎంఎస్)’ను రూపొందించారు. టీఎల్ఆర్ఎంఎస్తో పాటు మీసేవ పోర్టల్‌లో ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి. బోగస్ పాస్‌బుక్‌లు, టైటిల్డీడ్లకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పాత పద్ధతి వీడని బ్యాంకులు కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకర్లు టీఎల్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లోని లోన్ మాడ్యుల్ ద్వారా రైతుకు సంబంధించిన భూమి వివరాలు పరిశీలించి.. వారికి ఇవ్వగలిగిన స్థాయిలో పంట రుణాన్ని మంజూరు చేయాల్సి ఉంది. అంతేతప్ప రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లను తమ వద్ద పెట్టుకోవద్దు. కానీ ఈ ఆర్డినెన్స్ అమలుపై ప్రభుత్వం ఇంకా దృష్టి సారించకపోవడంతో.. బ్యాంకులు పాత పద్ధతిలోనే పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్లను తనఖాగా పెట్టుకుని రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈనెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో దాదాపు 8.15 లక్షల మంది రైతుల పంట రుణాలు రెన్యువల్ చేయగా... కేవలం 1,712 మందికి మాత్రమే లోన్ మాడ్యుల్ పద్ధతిలో రుణాలు మంజూరు చేసినట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఇకపై ఒకటే ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు వేర్వేరుగా ఉండకుండా.. వాటి స్థానంలో టైటిల్ డీడ్–పాస్‌బుక్ పేరుతో ఒకటే రికార్డు ఉంటుంది. ఈ ఏడాది చివరిలోగా అత్యంత భద్రమైన ఎలక్ట్రానిక్ కార్డు రూపంలో దీనిని అందజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు బోగస్ రిజిస్ట్రేషన్లు, డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు కళ్లెం చేసేందుకు టీఎల్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో ఉన్న వివరాలతోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.