Tony Abott
-
మోదీ కోసం ప్రపంచ నేతల పోటాపోటీ
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాల అధినేతలంతా ఒక వ్యక్తి కోసం చూశారు. ఆయనను ఎప్పుడు కలుస్తామా, ఆయనతో చేతులు ఎలా కలపాలా, ఆయనను ఎలా ఆలింగనం చేసుకోవాలా అని ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. అలా ఎదురు చూసిన వాళ్లలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా పాశ్చాత్య మీడియానే వెల్లడించింది. ద గార్డియన్ పత్రిక మోదీని 'రాజకీయ రాక్‌స్టార్'గా అభివర్ణించింది. ఆయనతో కలిసి కనిపించడానికి ప్రపంచ దేశాల అధినేతలంతా పోటీలు పడ్డారని కూడా తన కథనంలో పేర్కొంది. జి20 రిట్రీట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్.. ఇలా అగ్ర రాజ్యాల అధినేతలంతా మోదీని కలిసి మాట్లాడేందుకు తహతహలాడారు. ఆసీస్ ప్రధాని టోనీ అబాట్ తమ సంప్రదాయ బార్బెక్ విందు ఇచ్చారు. తనతోను, ఒబామాతోను కలిసి మోదీ ఉన్న ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు జి20 సదస్సుకు నరేంద్రమోదీని ఆస్ట్రేలియన్ ప్రధాని సాదరంగా స్వాగతించారు. నల్లటి బంద్గలా సూటు వేసుకుని వెళ్లిన మోదీ.. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. మోదీ కేవలం చేతులు కలపడమే కాక, ఆలింగనం చేసుకోవడంతో ఒక్కసారిగా మీడియా సెంటర్ నుంచి 'ఆవ్..' అనే కేకలు వినిపించాయని ద ఏజ్ పత్రిక పేర్కొంది. అబాట్‌కు మంచి స్నేహితులుగా పేరొందిన డేవిడ్ కామెరాన్, స్టీఫెన్ హార్పర్ల నుంచి మాత్రం ఇలాంటి ఆలింగనాలు ఏమీ లేవని తెలిపింది. The BBQ lunch with @narendramodi and @BarackObama was an opportunity for #G20 Leaders to talk in a relaxed atmosphere pic.twitter.com/zxYcUa28et — Tony Abbott (@TonyAbbottMHR) November 15, 2014 -
'ఆ చావులకు మీరు క్షమాపణ చెప్పాల్సిందే'
మలేసియా విమానం ఎంహెచ్17 కూలిపోయి మొత్తం అందులో ఉన్నవారంతా మరణించిన ఘటనపై మృతుల కుటుంబాలకు రష్యా క్షమాపణ చెప్పి, తగిన పరిహారం చెల్లించాలని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అబాట్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అపెక్ సమావేశాల నేపథ్యంలో అబాట్ పావుగంట పాటు చర్చించారు. వీరిద్దరి మధ్య చర్చల్లో కూడా ప్రధానాంశం మలేసియన్ ఎయిర్‌లైన్స్ విమాన దుర్ఘటనేనని సిన్హువా వార్తాసంస్థ తెలిపింది. జూలై నెలలో ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎంహెచ్17 దుర్ఘటనలో అందులో ఉన్న మొత్తం 298 మందీ మరణించారు. వాళ్లలో 38 మంది ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ స్పందించినట్లు తెలుస్తోంది. -
భారత స్వాగతానికి ఆస్ట్రేలియా ప్రధాని ఖుషీ
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ ఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ''ఆస్ట్రేలియా ప్రధానికి సాదర స్వాగతం. ఆయన పర్యటన ఆస్ట్రేలియా, భారతదేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తుందని నేను నమ్ముతున్నాను'' అని తన ట్విట్టర్లో కూడా పెట్టారు. దాంతో అబాట్ కూడా ఎంతగానో సంతోషించారు. 'భారత ప్రధాని నరేంద్రమోడీ అద్భుతమైన అధికారిక స్వాగతం పలికారు' అని ఆయన ట్వీట్ చేశారు. విమానాశ్రయంలో అబాట్‌కు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. టోనీ అబాట్ గురువారమే భారత్ వచ్చి.. ముందుగా ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. A warm welcome to PM @TonyAbbottMHR! I am sure his visit will further strengthen ties between Australia & India pic.twitter.com/RMkykY7zFD — Narendra Modi (@narendramodi) September 5, 2014 A spectacular official welcome to India by Prime Minister @narendramodi pic.twitter.com/M57eI9b5ss — Tony Abbott (@TonyAbbottMHR) September 5, 2014 -
మలేషియా విమాన అన్వేషణలో భారత్
-
విమానం ఆధారం దొరికింది!
హిందూ మహాసముద్రంలో రెండు వస్తువులు ఒకటి విమానం రెక్కలోనిది కావొచ్చని అనుమానం ఆస్ట్రేలియా శాటిలైట్ చిత్రాల్లో వస్తువుల గుర్తింపు తేలాడే వస్తువులు ఉన్న ప్రాంతానికి బయల్దేరిన నిఘా విమానాలు కనుక్కోలేకపోయిన అమెరికా నేవీ విమానం కౌలాలంపూర్/మెల్బోర్న్/న్యూఢిల్లీ: గల్లంతైన మలేసియా బోయింగ్ విమానం జాడ కనుక్కోవడానికి తొలిసారిగా మంచి ఆధారం దొరికింది! దక్షిణ హిందూ మహాసముద్రంలో రెండు భారీ వస్తువులు తేలాడుతూ కనిపించాయి. ఇవి 13 రోజుల కిందట అదృశ్యమైన మలేసియా విమాన శకలాలో, కావో నిర్ధారించేందుకు ఆస్ట్రేలియా సైన్యం నేతృత్వంలో నిఘా విమానాలు గురువారం ఆ ప్రాంతానికి బయల్దేరాయి. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ఒకటైన ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి నైరుతి దిశలో 2,500 కి.మీ దూరంలో రెండు తేలాడే వస్తువులను నాలుగు రోజుల కిందట తమ శాటిలైట్ చిత్రాల్లో గుర్తించినట్లు ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. వీటిలో ఒకటి 24 మీటర్లు(80 అడుగులు), మరొకటి ఐదు మీటర్ల(15 అడుగులు) పొడవు ఉంది. పెద్దదాని కొలతను బట్టి అది విమానం రెక్కలో పెద్ద భాగం కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా తమ సైనిక విమానం ఆ వస్తువులు ఎక్కడున్నాయో కనిపెట్టలేకపోయిందని, అయితే మిగతా విమానాలు గాలింపు కొనసాగిస్తాయని, దీనికి సమయం పడుతుందని అస్ట్రేలియా అధికారులు చెప్పారు. బోయింగ్ కోసం ఇంతవరకు దశా, దిశా లేకుండా సాగిన గాలింపులో పలు తప్పుడు ఆధారాలు బయటపడ్డంతో ఈ వస్తువులకు సంబంధించి ముందస్తు నిర్ధారణకు రాకూడదన్నారు. ఇవి వేల మీటర్ల దూరం నుంచి కొట్టుకొచ్చినట్లు కనిపిస్తోందని తెలిపారు. వీటి గుర్తింపు ప్రస్తుతానికి మంచి ఆధారం కావొచ్చని ఆస్ట్రేలియా సముద్ర భద్రతా సంస్థ అధికారి జాన్ యాంగ్ తెలిపారు. అయితే సరుకు రవాణా నౌకల నుంచి అప్పుడప్పుడూ కంటైనర్లు జారి నీటిలో పడుతుంటాయి కనుక ఈ వస్తువులు సముద్రంలో చెత్త అయ్యుండే అవకాశమూ ఉందన్నారు. విశ్వసనీయ ఆధారం: మలేసియా తేలాడే వస్తువుల గురించి ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ గురువారం ఉదయం తమ ప్రధాని నజీబ్ రజాక్‌కు ఫోన్లో తెలిపారని మలేసియా రక్షణ, రవాణా మంత్రి హిషాముద్దీన్ హుసేన్ చెప్పారు. తమకు విశ్వసనీయ ఆధారం దొరికిందని, ధ్రువీకరించడానికి సమయం పడుతుందని అన్నారు. వస్తువులు కనిపించిన ప్రాంతాన్ని గుర్తించేందుకు డేటా మార్కర్ బాల్స్‌ను విమానాల ద్వారా జారవిడవనున్నట్లు చెప్పారు. ఈలోగా దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి దక్షిణ, మధ్య ఆసియా వరకు ఉన్న రెండు కారిడార్లలో గాలింపు సాగుతుందన్నారు. వస్తువులున్న చోటికి న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియాల సైనిక విమానాలు, నౌకలు పయనమయ్యాయి. కాగా, వస్తువులు కనిపించిన ప్రాంతంలో గురువారం పొద్దుపోయాక గాలించిన తమ నేవీ నిఘా విమానం ఎలాంటి వస్తువులనూ కనుక్కోలేకపోయిందని అమెరికా తెలిపింది. ఈ ప్రాంతానికి నార్వే నౌక కూడా చేరుకుంది. అక్కడికి మంచును పగలగొట్టే తమ నౌకను పంపాలని చైనా యోచిస్తోంది. మరోపక్క.. విమానాన్ని గాలించేందుకు అండమాన్ సముద్రంలోకి తమ నాలుగు యుద్ధనౌకలను అనుమతించాలన్న చైనా విజ్ఞప్తిని భారత్ తోసిపుచ్చింది. తమ భద్రతా బలగాలు అభ్యంతరం చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాం తంలో భారత నేవీ, వాయుసేనలు ఇప్పటికే గాలిస్తున్న నేపథ్యంలో చైనా వినతిని తోసిపుచ్చారు. గాలింపు కోసం భారత్ భారీ విస్తీర్ణంలో గాలించగల పీ-81, సూపర్ హెర్క్కు లస్ నిఘా విమానాలను రంగంలోకి దింపనుంది. మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ఈ నెల 8న ఐదుగురు భారతీయులు సహా 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళ్తూ.. బయల్దేరిన గంటకే అదృశ్యమవడం, దాని ఆచూకీ కోసం 26 దేశాలు గాలిస్తుండడం తెలిసిందే. -
మలేషియా విమానం ప్రమాదానికే గురైందా?
లోహ విహంగం మృత్యు విహంగంగా మారిందా? అదృశ్యమైన మలేషియా విమానం ప్రమాదానికే గురైందా? అందువల్లే ఆ విమానం జాడ గుర్తించడం ఆలస్యమయిందా? విమానంలో ప్రయాణిస్తున్న 239 మంది ప్రయాణికులు మృత్యువాత పడినట్లేనా? ఆస్ట్రేలియా ప్రధాని తాజా వ్యాఖ్యలతో ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాకు సమీపంలోని దక్షిణ హిందూ సముద్ర పరిసరాల్లో విమాన శకలాలను గుర్తించామని, అవి మలేషియా విమానానికి చెందినవి కావొచ్చంటూ ఆస్ట్రేలియా ప్రధాని చేసిన వ్యాఖ్యలు గత అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. మలేషియ విమానం హిందూ మహాసముద్రం లేదా బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చంటూ మూడు రోజుల క్రితం కథనాలు వెలువడ్డాయి. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బోట్ వెల్లడించిన తాజా సమాచారం ఈ కథనాలకు బలం చేకూరుస్తున్నాయి. ఒకవేళ దక్షిణ హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో గుర్తించిన శకలాలు మలేషియన్ విమానానివే అయితే... ప్రమాదం జరిగే ఉంటుందని, విమానం కూలిపోవడం వల్లే ఆ ప్రమాదం జరిగి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సముద్రంలో విమానం కూలిపోవడం వల్లే శకలాల గుర్తింపు ఆలస్యం అయిందని పేర్కొంటున్నారు. మరోవైపు... టోనీ అబ్బోట్ తాజా వ్యాఖ్యలు విమాన ప్రయాణికుల కుటుంబాల్లో కలకలం రేపుతున్నాయి. విమానం ఆచూకీ లభించక 13 రోజులు గడిచి పోయినా తమ వారు బతికి ఉండే ఉంటారనుకుంటూ కాస్తో కూస్తో పెట్టుకున్న ఆశలు తాజా సమాచారంతో ఆవిరైపోయినట్లేనని అభిప్రాయపడుతున్నారు. కాగా విమానం మలేసియా, వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంటోల్ సరిహద్దులో ఉన్నప్పుడు అందులోని ట్రాన్స్‌పాండర్‌ను స్విచాఫ్ చేశారు. ఆ తర్వాత విమానం వెనక్కి వెళ్లి, పశ్చిమంగా, వాయవ్య దిశగా వెళ్లింది. ఇవన్నీ అందులోని ఎవరో ఒకరు ఉద్దేశపూర్వకంగా చేసిన పనులే. ఈ నెల 7న అర్ధరాత్రి దాటాక 12.41కి బయల్దేరిన విమానం నుంచి 8న ఉదయం 8.11 గంటలకు శాటిలైట్ చివరి సిగ్నల్ అందింది. అంటే విమానం కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగిపోయాక 7 గంటలకు పైగా గాల్లోనే ఉంది. కొత్త విషయాలు తెలుస్తుండడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులపై మళ్లీ విచారణ జరపాల్సిన అవసరముంది. -
మలేషియా విమాన ఆచూకీ లభ్యం !
-
అదృశ్యమైన మలేషియా విమాన శకలాలు గుర్తింపు?
కౌలాలంపూర్ : దాదాపు రెండు వారాలు క్రితం గల్లంతు అయిన మలేషియా విమానం ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. ఎమ్హెచ్-370 విమానం భాగాలు ఆస్ట్రేలియాలో కనిపించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో విమాన శకలాలను పోలిన చిత్రాలను ఉపగ్రహా ఛాయాచిత్రాల ద్వారా గుర్తించామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబ్బోట్ వెల్లడించారు. విమానం గుర్తింపునకు ఉద్దేశించిన ఉపగ్రహాలు రెండు భాగాలను గుర్తించాయని, ఆ శకలాలు ఎమ్హెచ్-370 బోయింగ్ విమానానికి సంబంధించినవి కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మలేషియా ప్రధానికి తెలిపానని చెప్పారు. శకలాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించడానికి ఓ యుద్ధ విమానాన్ని పంపించామని తెలిపిన ఆస్ట్రేలియా ప్రధాని మరో మూడు ఎయిర్క్రాప్ట్లను కూడా పంపించనున్నట్లు వివరించారు. అయితే ఆ ప్రాంతాన్ని గుర్తించే పని చాలా కష్టంతో కూడిన పని అని పేర్కొన్న ఆయన.... ఆ శకలాలు ఎమ్హెచ్-370విమానానివి సంబంధించినవి కాకుండా పోయే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు... విమాన గుర్తింపు ప్రక్రియను అమెరికా, న్యూజీలాండ్‌లు మరింత తీవ్రం చేశాయి. ఆస్ట్రేలియాతో కలిసి విమాన శోధన ప్రక్రియ ముమ్మరం చేసిన యూఎస్, కివీస్‌లు... దక్షిణ హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో తమ అన్వేషణను కొనసాగిస్తున్నాయి.