Totem Infrastructure
-
‘టోటెం’ ప్రమోటర్ల అరెస్టు
న్యూఢిల్లీ/చెన్నై: రూ. 1,394 కోట్ల మేర ఎనిమిది బ్యాంకుల కన్సార్టియంను మోసగించిన కేసులో టోటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్లు తొట్టెంపూడి సలలిత్, తొట్టెంపూడి కవితలను సీబీఐ శుక్రవారం బెంగళూరులో అరెస్టు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు. టోటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఇచ్చిన రూ. 313.84 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టారని, 2012లో ఆ రుణం నిరర్ధక ఆస్తుల జాబితాలో చేరిందని ఫిర్యాదులో యూబీఐ పేర్కొం ది. ఆ కంపెనీ మొత్తం రూ. 1394.84 కోట్ల మేర బ్యాంకుల కన్సార్టియంకు బకాయి పడిందని, వివిధ ప్రాజెక్టుల కోసం బ్యాంకుల నుం చి రుణాలు తీసుకుని సొంత పనులకు నిధుల్ని దారి మళ్లించిందని సీబీఐ ఆరోపించింది. నిధుల్లో కొంతమేర ప్రమోటర్ల వ్యక్తిగత ఖాతా ల్లోకి చేరాయని తెలిపింది. కాగా 2015లో ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన అతిపెద్ద పన్ను ఎగవేతదారుల జాబితాలో రూ. 400 కోట్ల ఎగవేతతో ఈ కంపెనీ కూడా ఉంది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌పై సీబీఐ కేసు యునైటెడ్ ఇండియా ఇన్సూ్యరెన్స్ కంపెనీ లిమిటెడ్(యూఐఐసీ)కి రూ. 30.54 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఆరోపణలపై డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్), దాని చైర్మన్ టి.వెంకటరామ్రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబైకి చెందిన కేర్ రేటింగ్ లిమిటెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కో లిమిటెడ్, ఇద్దరు యూఐఐసీ మాజీ ఉద్యోగులు ఏ.బాల సుబ్రమణియన్, కె.ఎల్ కుంజిల్వర్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది. కంపెనీకి చెందిన ప్రీమియం డబ్బుల్ని ఆ ఇద్దరు ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా డీసీహెచ్ఎల్లో డిబెంచర్ల రూపంలో పెట్టబడి పెట్టారని, ఆ సమయంలో కేర్ రేటింగ్ లిమిటెడ్ సాయంతో రుణ అర్హత సామర్థ్యాన్ని డీసీహెచ్ఎల్ ఎక్కువ చేసి చూపించిందని ఫిర్యాదులో యూఐఐసీ పేర్కొంది. -
పన్ను ఎగవేత సంస్థలపై కన్నెర్ర
31 డిఫాల్టర్ల పేర్లతో రెండో జాబితా విడుదల చేసిన ఐటీ శాఖ చెల్లించాల్సిన మొత్తం రూ.1,500 కోట్లు హైదరాబాద్ కంపెనీలూ ఉన్నాయ్ న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ బుధవారం పన్ను ఎగవేతలకు సంబంధించి రెండవ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 31 పేర్లు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆయా సంస్థలు చెల్లించాల్సిన మొత్తం రూ.1,500 కోట్లు. వీటిలో కొన్ని కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించినవీ ఉన్నాయి. నెల రోజుల్లో ఇది ‘డిఫాల్టర్ల’ రెండవ జాబితా. ఇటీవలే 18 ‘ట్యాక్స్ డిఫాల్ట్’ సంస్థల జాబితాను ఐటీ విడుదల చేసింది. సీబీడీటీ వెబ్సైట్లో డిఫాల్టర్ల జాబితాను పోస్ట్ చేశారు. ఇవీ కొన్ని సంస్థలు... హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టోటెమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (రూ.402 కోట్లు), ఇదే నగరం కేంద్రంగా ఉన్న మరో కంపెనీ రాయల్ ఫ్యాబ్రిక్స్ (రూ.159 కోట్లు) జాబితా లో ఉన్నాయి. పూణేకు చెందిన పతేజా బ్రోస్ ఫోర్జింగ్ అండ్ ఆటో పార్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (రూ.224 కోట్లు), ముంబైకి చెందిన హోమ్ ట్రేడ్ (రూ.72 కోట్లు) జాబితాలో ఉన్న మరికొన్ని కంపెనీలు. జాడ తెలిస్తే తెలపండి... రూ.10 కోట్ల పైబడిన ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారుల జాబితాను ప్రకటిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. పలు కేసుల్లో అసెస్సీల(పన్ను చెల్లింపుదారులు) జాడ కూడా తెలియడం లేదని వివరించారు. కొన్ని కంపెనీలకు సంబంధించి రికవరీకి తగిన ఆస్తులు లేవని కూడా పేర్కొన్నారు. ఎగవేతదారులకు సంబంధించి పాన్ నంబర్‌ను, అలాగే చివరిసారిగా అందుబాటులో ఉన్న డిఫాల్టర్ల చిరునామాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారి తెలిపారు. వీరి గురించి తెలిస్తే, సమాచారం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ జాబితాలో ఉన్న పేర్లకు సంబంధించిన అసెస్సీలు ఎక్కడ ఉన్నా... తక్షణం పన్ను బకాయిలను చెల్లించాలని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ‘నేమింగ్ అండ్ షేమింగ్’ విధానం కింద ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వివరాలను ఇలా ఎప్పటికప్పుడు వెల్లడించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పార్లమెంటులో ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం, 2014 డిసెంబర్‌నాటికి కార్పొరేట్ పన్ను బకాయిల విలువ దాదాపు రూ.3,11,080 కోట్లు.