town ship
-
సిటీ చుట్టూ 11 మినీ టౌన్‌షిప్‌లు
గ్రేటర్ హైదరాబాద్‌పై వలసల ఒత్తిడిని, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య శాటిలైట్ టౌన్‌షిప్‌లను నిర్మించాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో ఔటర్, ట్రిపుల్ ఆర్ మధ్య లే–అవుట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వస్తాయని.. వాటికి రహదారులను అనుసంధానం చేస్తే అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ 11 ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా.. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ మేడ్చల్, సంగారెడ్డి, షాద్‌నగర్, ఘట్కేసర్ తదితర మార్గాల్లోని 11 ప్రాంతాల్లో మినీ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ‘హైదరాబాద్ నగరాభివృద్ది సంస్థ (హెచ్ఎండీఏ)’ ప్రతిపాదించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద తుర్కపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలను మినీ నగరాలుగా నిర్మిస్తే బాగుంటుందని సూచించింది. ఈ ప్రాంతాల్లో మినీ నగరాలను నిర్మించేందుకు విధివిధానాలను కూడా రూపొందించినట్టు సమాచారం. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. భూసేకరణ పనులను హెచ్ఎండీఏ చేయాలని.. మౌలిక సదుపాయాల కల్పన వంటివాటిని ప్రైవేట్‌కు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. గ్రోత్ ఇంజిన్‌లా మార్చాలి ట్రిపుల్ ఆర్‌ను రవాణాపరమైన రోడ్డుగానే కాకుండా ఒక గ్రోత్ ఇంజిన్‌లా మార్చాలి. ఇరువైపులా పరిశ్రమల ఏర్పాటుతో ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ట్రిపుల్ ఆర్ ప్రవేశించే జిల్లాల్లో మూడు నుంచి పదెకరాల విస్తీర్ణాలలో నైపుణ్య కేంద్రాలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలి. దీంతో కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. – జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మినీ నగరాలలో ఏమేం ఉంటాయంటే..! ఒక్కో శాటిలైట్ టౌన్‌షిప్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, సుమారు 10 లక్షల జనాభా నివాసం ఉండేందుకు వీలుగా నిర్మించనున్నారు. 100 అడుగుల అప్రోచ్ రహదారి, 30 నుంచి 60 అడుగుల అంతర్గత రహదారులు ఉంటాయి. ఈ టౌన్‌షిప్‌లలో బహుళ అవసరాల కోసం భూమిని అందుబాటులో ఉంచుతారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు గృహాలు, బ్యాంకులు, మార్కెట్లు, హోటళ్ల, ఇతర వాణిజ్య సదుపాయాలతోపాటు విద్యా, వైద్య అవసరాలు, పౌర సేవలు, ప్రజారవాణా, క్రీడా సదుపాయాలు, పార్కులు, ఆట స్థలాలు ఉంటాయి. కాలుష్యాన్ని విడుదల చేయని, అంతగా ప్రమాదకరంకాని పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. -
ఔటర్ చుట్టూ టౌన్ షిప్ లు..మళ్లీ పరుగులు పెట్టనున్న రియలెస్టేట్
-
31న అమరావతి టౌన్షిప్ ప్లాట్లకు ఈ–వేలం
సాక్షి,అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి–నవులూరు వద్ద అభివృద్ధి చేసిన అమరావతి టౌన్‌షిప్‌లోని మిగిలిన ప్లాట్లకు కూడా ఈ–వేలం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) నిర్ణయించింది. ఈ ప్రాంతంలో మొత్తం 285.17 ఎకరాల్లో 1,327 ప్లాట్లను అభివృద్ధి చేయగా.. దాదాపు 931 ప్లాట్లను గతంలో విక్రయించారు. మరో 331 ప్లాట్లను వివిధ లాట్లుగా విభజించిన సీఆర్డీఏ.. ఇందులో 29 ప్లాట్లను వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ వివరాలను సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. 200 చదరపు గజాల చొప్పున 23 ప్లాట్లు, 1,000 చదరపు గజాల చొప్పున ఉన్న ఆరు ప్లాట్లకు ఆన్లైన్లో వేలం నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం చదరపు గజానికి రూ.17,800గా ధర నిర్ణయించిందని, ఆసక్తి గలవారు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 31వ తేదీ ఉదయం నుంచి ఆన్లైన్లో వేలం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వివరాలకు https:// konugolu. ap. gov. in Ìôæ§é https:// crda. ap. gov. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. క్రికెట్ స్టేడియం, ఎయిమ్స్‌కు అతి దగ్గరలో.. నవులూరు వద్ద జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఈ లే అవుట్‌లోని ప్లాట్లకు ప్రభుత్వ అనుమతులన్నీ ఉన్నాయని.. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ చెప్పారు. ప్లాట్లకు అతి దగ్గరలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అకాడమీ, ఎయిమ్స్ ఆస్పత్రితో పాటు మంగళగిరి రైల్వేస్టేషన్ తదితర సదుపాయాలు ఉన్నాయని, త్వరలో మరికొన్ని జాతీయ విద్యా సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.1,180 ఫీజు చెల్లించి ‘కొనుగోలు’ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అమరావతి టౌన్షిప్ ప్లాట్లను వేలంలో ఎవరైనా దక్కించుకోవచ్చని చెప్పారు. వివరాలకు 0866–246370/71/72/73/74 నంబర్లను సంప్రదించాలన్నారు. -
కేంద్రం కొత్త పథకం.. రియల్టీలో జోష్..
న్యూఢిల్లీ: జాతీయ రహదారులకు సమీపంలో పారిశ్రామిక సమూహాలు, లాజిస్టిక్స్ పార్క్‌లు, స్మార్ట్ పట్టణాలు, టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అనుమతి కోరుతూ కేబినెట్ నోట్‌ను తయారు చేసినట్టు కేంద్ర రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచస్థాయి ప్రమాణాలు, హంగులతో రహదారుల నెట్‌వర్క్‌ను నిర్మించాలన్న లక్ష్యం తో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుత రహదారుల ప్రాజెక్టులను విక్రయించేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. 400 ప్రాంతాల్లో రహదారుల పక్కన సౌకర్యాలను కల్పిస్తున్నట్టు చెప్పారు. -
హైదరాబాద్ సిటీ చుట్టూ టౌన్‌షిప్‌లు
సాక్షి, హైదరాబాద్: పట్టణీకరణతో హైదరాబాద్ మహా నగరం శరవేగంగా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదలకు తగ్గట్టు మౌలిక సదుపాయాల్లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నగరం చుట్టూ కొత్త పట్టణాలను నిర్మించి పట్టణీకరణను వికేంద్రీ కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ కాంప్రెహెన్సివ్ ఇంటి గ్రేటెడ్ టౌన్‌షిప్పుల పాలసీ’ని తీసుకొచ్చింది. ఇంటి నుంచి పని (వాక్ టు వర్క్) ప్రదేశానికి కాలి నడకన వెళ్లాలనే నినా దంతో.. నివాస/ వాణిజ్య/ సంస్థ/వ్యాపార/ కార్యాల యాల సమ్మిళితంగా అచ్చమైన కొత్త నగరాల నిర్మాణా నికి నడుం బిగించింది. నగరంలో ఎక్కడో మూలన నివాసముంటూ.. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం మరో మూలకు వెళ్లే క్రమంలో రోజూ లక్షల మంది ట్రాఫిక్‌ను ఎదురీదుతూ నరకాన్ని అనుభవిస్తు న్నారు. గంటల సమయం వృథా అవుతోంది. ఈ సమస్య లకు పరిష్కారంగా టౌన్‌షిప్పుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పాఠశాల, వైద్యం, ఖాళీ స్థలాలు, పచ్చదనం వంటి సదుపాయాలు, అత్యున్నత జీవన ప్రమా ణాలతో వీటి నిర్మాణానికి సమగ్ర విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్య దర్శి అరవింద్‌కుమార్ ఈ నెల 3న ఉత్తర్వులు జారీచేశారు. ఓఆర్ఆర్కు 5 కి.మీల ఆవల.. ఓఆర్ఆర్కు 5 కి.మీ. వెలుపల (నిషేధిత ప్రాం తాలు మినహా) కొత్త టౌన్‌షిప్‌ల నిర్మాణానికే ఈ పాలసీ వర్తిస్తుంది. ప్రస్తుత లేఅవుట్ రూల్స్ వీటికి వర్తించవు. పాలసీలోని నిబంధనలకు లోబడి టౌన్‌షిప్పులకు టీఎస్–బీపాస్ విధానం కింద హెచ్ఎండీఏ అనుమతులనిస్తుంది. వచ్చే ఐదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పాలసీని అవసరమైతే సవరణలతో గడువు పొడిగిస్తారు. పదేళ్లలో టౌన్షిప్ నిర్మాణం ముసాయిదా అనుమతి నాటి నుంచి పదేళ్లలోపు టౌన్‌షిప్పుల నిర్మాణాన్ని పూర్తిచేయాలి. అవస రాన్ని బట్టి ప్రాజెక్టు గడువును పొడిగిస్తారు. టౌన్‌షిప్పులను నిర్మించదలచిన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు/ప్రైవేటు డెవలపర్లు/ కంపెనీలు/స్పెషల్ పర్పస్ వెహికల్స్/సంస్థలకు ఈ పాలసీ వర్తించనుంది. వంద ఎకరాలు, ఆపై విస్తీర్ణంలో టౌన్షిప్ నిర్మాణానికి ఎంపికచేసే స్థలం కనీసం 30 మీటర్ల రహదారితో అనుసంధా నమై ఉండాలి. 300 ఎకరాలు, ఆపై స్థలాలకు 36 మీటర్ల రహదారి అవసరం. టౌన్షిప్ గరిష్ట నిర్మిత స్థలంపై ఎలాంటి పరిమితుల్లేవు. టౌన్షిప్ స్థలాన్ని దగ్గర్లోని 30 మీటర్ల రహదారితో అనుసంధానిస్తూ డెవలపర్లు 30 మీటర్ల రహదారిని నిర్మించాలి. మొత్తం సైట్ ఒకేచోట ఉండాలి. అయితే, జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులు సైట్ మధ్య నుంచి వెళ్తుంటే గనుక మినహాయింపునిస్తారు. సమీకృత వర్క్‌స్టేషన్ రోడ్లు, ఖాళీ స్థలాలు, పచ్చదనం వంటి మౌలిక సదుపాయాలకు కేటాయింపులుపోగా, మిగిలిన స్థలంలో కనీసం నాలుగో వంతు నుంచి రెండో వంతు వరకు స్థలాన్ని ‘వర్క్‌స్టేషన్’ ఏర్పాటుకు కేటాయించాలి. వాణిజ్య కార్యాలయాలు, మార్కెట్, ఐటీ, ఐటీఈఎస్, చిన్నతరహా పరిశ్రమలు, సేవారంగ పరిశ్రమలు, రవాణా కేంద్రం ఇతర ఆహ్లాదకర కార్యకలాపాలతో వర్క్‌స్టేషన్ ఏర్పాటుచేయాలి. 300 ఎకరాలు, ఆపై భారీ విస్తీర్ణంలో నిర్మించే టౌన్‌షిప్పుల్లో కనీసం ఎనిమిదో వంతు స్థలాన్ని వర్క్‌స్టేషన్‌కు కేటాయించాలి. మిగిలిన స్థలంలో సగభాగాన్ని నివాస అవసరాలకు కేటాయించాలి. ప్రధాన వాణిజ్య కేంద్రం, షాపింగ్ ఏరియా, క్లబ్‌హౌస్, కమ్యూనిటీ కేంద్రాలు, లైబ్రరీ.. ఈ ప్రాధాన్య క్రమంలో వాణిజ్య స్థలాన్ని వినియోగించాలి. ఉన్నతవిద్య సదుపాయాన్ని వర్క్సెంటర్లో కల్పించవచ్చు. టౌన్షిప్లో అంతర్గతంగా, వెలుపల సమీపంలోని రవాణా సదుపాయం వరకు ప్రజారవాణా (ఎలక్ట్రిక్ వాహనాలు) సదుపాయం కల్పించాలి. నిర్దేశించిన మేరకు ఎల్ఐజీ/ ఈడబ్ల్యూఎస్ గృహాలు, రోడ్లు, లే అవుట్లో చూపిన మేరకు పచ్చదనం అభివృద్ధి చేయాలి. మొత్తం ప్రాంతంలో 10 శాతాన్ని పచ్చదనానికి కేటాయించాలి. సబ్ స్టేషన్, నీటి సరఫరా సంపులు, మురుగునీటి వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ, పోలీస్‌స్టేషన్/ ఫైర్‌స్టేషన్ ఔట్ పోస్టులు, పబ్లిక్ పార్కింగ్ లాట్స్, శ్మశానవాటికలు, బస్‌స్టేషన్, ఇతర సదుపాయాలను వర్క్ సెంటర్లో భాగంగా స్థలం కేటాయించి అభివృద్ధి చేయాలి. పేదలకు 10 శాతం కోటా ఆర్థికంగా బలహీనవర్గాలు (ఈడబ్ల్యూఎస్), తక్కువ ఆదాయం వర్గాల (ఎల్‌ఈజీ)కు 10 శాతం ఇళ్లను కేటాయించాలి. అయితే, వీటిని ప్రత్యేక బ్లాకులు/సెక్టార్లుగా నిర్మించవచ్చు. ప్రణాళికాబద్ధ అభివృద్ధి నీరు, విద్యుత్ పొదుపు, ఘణ వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి పర్యావరణ అంశాలతో పాటు టౌన్‌షిప్‌ను ప్రణాళికాబద్ధంగా, ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలి. జీరో ఘన వ్యర్థాలు, జీరో వృథా నీరు కాన్సెప్ట్‌తో రీసైక్లింగ్ ప్లాంట్లు నెలకొల్పాలి. బ్లాకులు, సెక్టార్లవారీగా నివాస సముదాయాల్ని నిర్మించాలి. విద్యుత్ పొదుపు భవన నిబంధనలు (ఈసీబీసీ)ను అమలుచేయాలి. భూగర్భ కేబుల్ వ్యవస్థ, అధునాతన పరికరాలతో భద్రత వ్యవస్థ, గ్యాస్ పైప్‌లైన్ వంటి సదుపాయాలుండాలి. పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. సత్వర అనుమతులు ప్రాథమిక వివరాలతో టీఎస్–బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా తాత్కాలిక అనుమతులు జారీ చేస్తారు. అనంతరం 90 రోజుల్లోగా సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలి. 30 రోజుల్లోగా తుది అనుమతులు జారీ కానున్నాయి. అనుమతులొచ్చిన 6 నెలల్లోగా పనులు ప్రారంభించాలి. అసోసియేషన్లకే టౌన్‌షిప్పుల నిర్వహణ టౌన్షిప్ రెసిడెంట్స్, యూజర్స్ అసోసియేషన్ పేరుతో అన్ని టౌన్‌షిప్పులు సలహామండలిని ఏర్పాటు చేసుకోవాలి. పచ్చదనంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణను ఇవి పర్యవేక్షించాలి. డెవలపర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ప్రతినిధులూ దీనిలో ఉండాలి. టౌన్‌షిప్పుల నిర్మాణానికి ఇవీ ప్రోత్సాహకాలు – ఫీజు చెల్లిస్తే ఆటోమేటిక్‌గా భూవినియోగ మార్పిడి. గ్రీన్ ఏరియా పది శాతానికి మించితే ఆపై స్థలానికి ఈ ఫీజు మినహాయింపు. – భూములపై 90 శాతం అభివృద్ధి చార్జీల మినహాయింపు. టౌన్‌షిప్పులో సకల సదుపాయాలను డెవలపరే కల్పించాలి. ప్రభుత్వ ప్రధాన నీటి సరఫరా లైన్‌కు టౌన్‌షిప్‌ను అనుసంధానించడం, మురుగు కాల్వలు, సబ్స్టేషన్లు వంటివి డెవలపర్లు అభివృద్ధి చేయాలి. డెవలపర్ డబ్బులు చెల్లిస్తే స్థానిక అర్బన్ అథారిటీ ఈ ఏర్పాట్లు చేసిపెడుతుంది. – సైట్ ఏరియాలో 10 శాతం (గరిష్టంగా 10 ఎకరాలకు మించకుండా)లోపు ప్రభుత్వ/అసైన్డ్ భూములు వస్తుంటే, ప్రభుత్వం అంత మొత్తంలోని స్థలాన్ని ఇతర చోట తీసుకుని సదరు స్థలాన్ని డెవలపర్‌కు కేటాయిస్తుంది. – ప్లాన్ మంజూరు సమయంలో చెల్లించాల్సిన ఇంపాక్ట్ ఫీజును ఐదేళ్లకు వాయిదావేస్తారు. – ఈడబ్ల్యూఎస్/ఎల్ఐజీ ఇళ్ల నిర్మిత స్థలంపై 10 శాతం డెవలప్మెంట్ చార్జీలు మాఫీ. మధ్యతరహా ఆదాయ వర్గాలు (ఎంఐజీ) గృహాల నిర్మిత స్థలంపై 75 శాతం, ఉన్నత ఆదాయ వర్గాల (హెచ్ఐజీ) గృహాల నిర్మిత స్థలంపై 50 శాతం డెవలప్మెంట్ చార్జీలు మినహాయింపు. – టౌన్షిప్ నిర్వహణను రెసిడెంట్స్, యూజర్స్ అసోసియేషన్లు పర్యవేక్షించనున్న నేపథ్యంలో క్లబ్‌హౌస్ వంటి మౌలిక సదుపాయాలపై వంద శాతం ఆస్తిపన్నును, ఇతర అన్ని రకాల ఆస్తులపై 50% ఆస్తిపన్నులను ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీచేసిన తొలి ఐదేళ్ల పాటు రాయితీ కల్పిస్తారు. – స్టార్ కేటగిరీ హోటళ్లు/ఆస్పత్రులు, మల్టీప్లెక్సులకు రాయితీ, ప్రోత్సాహకాలను అమల్లో ఉన్న ప్రభుత్వ విధానాలకు లోబడి అందిస్తారు. – అనుమతుల జారీ కోసం స్థలం తనఖా రిజిస్ట్రేషన్‌ను రూ.100 స్టాంప్ పైపర్‌పై నామమాత్రపు ఫీజుతో నిర్వహిస్తారు. – నాలా చార్జీలను నిబంధనల ప్రకారం చెల్లించాలి. – క్యాపిటలైజేషన్ చార్జీలు వంద శాతం మినహాయింపు. – సింగిల్ విండో పాలసీ కింద సమర్పించే అన్ని రకాల దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ 60 రోజుల్లోగా పరిష్కరిస్తారు. – వర్క్‌స్టేషన్‌లో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల ఏర్పాటుకు పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమలు, ఐటీ శాఖలు, టీఎస్–ఐఐసీ వంటి ప్రభుత్వ విభాగాలు సహకరిస్తాయి. -
మేల్కొంటే సిరులపంటే..
విశాఖసిటీ: విదేశీ మోడళ్లతో నిర్మాణమన్నారు.. కోట్ల రూపాయలు పెట్టి ఇళ్లు కట్టేశారు. కానీ.. స్థానికుల్ని ఆకర్షించడంలో మాత్రం విఫలమయ్యారు. ఫలితం.. దశాబ్దకాలంగా సగానికిపైగా గృహాలు నిరుపయోగమైపోయాయి. హాట్ కేకుల్లా అమ్ముడై పోతాయని భావించిన వుడాకు పరాభవం ఎదురైంది. సగమైనా చెల్లకపోవడంతో దశాబ్దం గడిచినా.. ఆ ప్రాజెక్టు వుడాకు పీడకలలా వెంటాడుతూనే ఉంది. అసలే ఆదాయ వనరులు సమకూర్చుకోలేక ఆపసోపాలు పడుతున్న వుడాకు రోహౌస్‌లు కుంపటిలా మారాయి. తాజాగా శాటిలైట్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టేందుకు వుడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 900 ఎకరాల్లో ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో కూడిన టౌన్షిప్ నిర్మించాలని యోచిస్తోంది. ఇప్పటికే దీనిపై కలెక్టర్ ఆదేశాలతో తహశీల్దార్ల నేతృత్వంలో ఎంజాయ్మెంట్ సర్వే రెండు నెలల క్రితమే నిర్వహించారు. ఏఏ ప్రాంతంలో ఎంత భూమి ఉంది. ఇందులో కొండ పోరంబోకు ఎంత, ఎంత మేర కాంటూరుని వినియోగించుకోవచ్చు, ఆక్రమిత భూమలు, పట్టాలిచ్చిన స్థలాలు ఎంతమేర ఉన్నాయి, ఏఏ మండలాలకు చెందిన భూములున్నాయనే అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదికను అందించారు. మూడు మండలాల్లో భూములు శాటిలైట్ టౌన్షిప్ కోసం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ భూముల్ని బదలాయింపు కింద వుడా కోరుతోంది. గతంలో వుడాకు చెందిన భూముల్ని చాలా వరకూ రెవెన్యూ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన నేపథ్యంలో వాటి బదులుగా ఈ ట్రై జంక్షన్ పరిధిలో ఉన్న భూములు తమకు ఇస్తే అభివృద్ధి చేస్తామని వుడా కోరింది. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. సబ్బవరం మండలం గంగవరం, నంగినారపాడు గ్రామాల పరిధిలోనూ, పరవాడ మండలం పెదముషిడివాడ, ఈమర్రిపాలెం గ్రామాల్లోనూ, గాజువాక మండలం అగనంపూడిలో కలిపి 1570.04 ఎకరాలుండగా ఇందులో అభివృద్ధికి పనికిరాని కొండల ప్రాంతాలు 669.15 ఎకరాలున్నాయి. మిగిలిన 899.27 ఎకరాల స్థలాల్ని శాటిలైట్ టౌన్షిప్ కోసం గుర్తించారు. ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం భూముల వివరాలిలా ఉన్నాయి. సామాన్యుల్ని విస్మరిస్తారా..? హైదరాబాద్‌లో నిర్మించిన శాటిలైట్ టౌన్‌షిప్‌లు విజయవంతమయ్యాయి. దీనికి కారణం అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా టౌన్షిప్ నిర్మాణం జరగడమే. ముందుగా చిన్న వర్గాల వారికి అంటే పనులు చేసుకునేవారి కోసం అందుబాటులో ఉండేలా గృహ నిర్మాణాలు చేపట్టారు. వాటికి మౌలిక సదుపాయాలు కల్పించి నగరానికి బస్సు సౌకర్యం కూడా కల్పించారు. ఆ తర్వాత మధ్యతరగతి, ధనిక వర్గాల వారికి ఆకట్టుకునే ధరలతో ఇళ్లు నిర్మించారు. క్రమంగా అది విస్తరించి అన్ని మౌలిక సదుపాయాలతో మరో ఊరిలా మారింది. విశాఖలోనూ అదే తరహాలో నిర్మిస్తే తప్ప వుడా ప్రయత్నాలు సఫలీకృతమవ్వవు. కానీ.. వుడా ఆలోచనలెప్పుడూ ధనికవర్గాలను దృష్టిలో పెట్టుకొనే జరుగుతున్నాయి. ఫలితంగా నష్టాల్ని మూటకట్టుకుంటోంది. లంకెలపాలెం వద్ద నిర్మించాలనుకుంటున్న టౌన్‌షిప్‌ను అన్ని వర్గాల వారికి అనుగుణంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇందులో 150 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్ గా అభివృద్ధి చేయనున్నారు. మిగిలిన వాటినిల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించినప్పుడు నిర్వాసితులకు కొంత స్థలం కేటాయించి.. మిగిలిన భూముల్లో టౌన్షిప్ అభివృద్ధి చెయ్యాలని ప్రణాళికలు రూపొందించినట్లు వుడా అధికారులు చెబుతున్నారు. సరైన ప్రణాళికతో రూపొందిస్తే ఈ శాటిలైట్ టౌన్షిప్ వుడాకు కాసుల వర్షం కురిపిస్తుంది. లేదంటే రో హౌసింగ్ ప్రాజెక్టులా నష్టాల ఊబిలోకి నెట్టేస్తుంది. -
తాత్కాలిక రాజధాని ఎక్కడ?
మంగళగిరి : తాత్కాలిక రాజధాని విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అమరావతి టౌన్షిప్లో ఓ వైపు భూమిని చదును చేస్తున్నా దీనిపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రాక పోతుండడంతో తాత్కాలిక రాజధానిని మంగళగిరిలో ప్రకటిస్తే తుళ్లూరు మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారనే భయంతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి పర్యటనలో తాత్కాలిక రాజధానిని పరిశీలిస్తారని, స్పష్టత ఇస్తారని భావించినా ఇక్కడి రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో పాటు వ్యతిరేకిస్తూ 9.2 ఫారాలు ఇస్తున్నారని అలాంటప్పుడు తాత్కాలిక రాజధానిని సైతం తుళ్లూరు మండలంలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులకు సూచించినట్లు తెలిసింది. అక్కడకు ఉద్యోగుల రాకపోకలు రవాణా, తాగునీరు తదితర అవసరాలపై సమగ్ర నివేదిక అంద జేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అధికారులు ఆ దిశలో చర్యలు చేపట్టారు. బుధవారం అమరావతిటౌన్షిప్ను పరిశీలించిన పురపాలక మంత్రి పి. నారాయణ సైతం తుళ్లూరు మండలంలోని కొన్నిగ్రామాల వారు తాము తాత్కాలిక రాజధానికి ఉచితంగా భూములు ఇస్తామని ముందుకు వస్తున్నారని, వారి కోరికను పరిశీలిస్తామని చెప్పడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.