TPCC President uttamkumar Reddy
-
కేసీఆర్‌కు గుణపాఠం చెప్పండి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: మోసపూరిత హామీలతో ప్రజలను దగాచేసిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలను కేసీఆర్ ఏనాడు పరామర్శించలేదన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం, యాదాద్రి జిల్లా వలిగొండ ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన వారిని పరామర్శించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులను ఆదుకుంటామని, పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను కాపాడుకుంటామన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం పాలకవీడుకి చెందిన 400 మంది టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌లో బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. వారందరికీ ఉత్తమ్ కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వారు హుజూర్నగర్ నుంచి పోటీచేస్తున్న ఉత్తమ్‌కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘సోనియా దృఢసంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం’ మేడ్చల్: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ దృఢసంకల్పంతోనే తెలంగాణ ఏర్పడిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని సోనియా తెలంగాణను ఇస్తే మాయమాటలతో పీఠమెక్కిన సీఎం కేసీఆర్ ఏ ఒక్క హమీని నెరవేర్చలేదని విమర్శించారు. సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ కలిసి ఓకే సభలో పాల్గొనడం అరుదైన ఘటన అని అన్నారు. ఈ నెల 23న మేడ్చల్‌లో నిర్వహించే బహిరంగసభ ఏర్పాట్లను ఉత్తమ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బుధవారం వేర్వేరుగా పరిశీలించారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక సోనియా మొదటిసారి తెలంగాణకు వస్తున్నారని, కృతజ్ఞతా భావంతో ప్రజలు అధిక సంఖ్యలో సభకు హాజరుకావాలని కోరారు. -
చేనేత కార్మికులకు అండగా ఉంటాం
సాక్షి, యాదాద్రి: మహాకూటమి అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో 15 రోజులుగా చేనేత కార్మికులు చేస్తున్న రిలే నిరాహా ర దీక్షను బుధవారం రాత్రి ఆయన టీటీడీపీ అధ్యక్షు డు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ నాయకుడు ప్రభాకర్‌రెడ్డితో కలసి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ్ మాట్లాడుతూ పోచంపల్లి చేనేత కార్మికుల 12 డిమాండ్లను మహాకూటమి ఎజెండాలో చేర్చి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1,000 పింఛన్‌ను రూ.2,000కు పెంచుతామన్నా రు. భువనగిరికి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న భూములు, బంగారం, ఆస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నయీం ఆస్తులపై టీఆర్ఎస్ను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నీ చేస్తానని ప్రజలకు హామీలు ఇచ్చి ఏమీ చేయని కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి గోరీ కట్టాలని, మహాకూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కేసీఆర్ సీఎం అయితే ఏదో ఉద్ధ రిస్తాడని, ప్రజల బతుకులు బాగుపడతాయని గెలి పిస్తే వాటన్నింటినీ మరిచిపోయారన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పేద ప్రజలకు వారి సొంత స్థలంలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని తెలిపారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయలేకపోయారన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తామని, చేనేత సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. పేద ల బాధలు తొలగాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా మహాకూటమి అధికారంలోకి రావడం అవసరమని పేర్కొన్నారు. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. కేసీఆర్ వైఫల్యం వల్లే చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, నేతలు చింతకింది రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
టీపీసీసీకి 50 మందికి పైగా...
ప్రతి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిని నియమించాలని సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంతో ఆశావహుల్లో నూతనోత్సాహం నెలకొంది. అదే స్థాయిలో తీవ్ర పోటీ మొదలైంది. టీపీసీసీకి 50 మందికి పైనే దరఖాస్తు చేసుకోగా.. వారిలో కొందరు తమకున్న పరిచయాల ద్వారా పదవికోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీనియర్లతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు సైతం పదవిని దక్కించునేందుకు పావులు కదుపుతున్నారు. సాక్షి, యాదాద్రి (నల్గొండ) : ఆరు నెలల క్రితం ఉమ్మడి జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించినప్పుడు కొందరు నేతల్లో తెలియని అసంతృప్తి. కొత్త జిల్లాల వారీగా అధ్యక్షులను నియమిస్తారని, ఎలాగైనా పదవి దక్కించుకోవాలనుకుని ఆశపడ్డ ఆశావహులు.. నాడు హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో ఒకింత నిరుత్సాహానికి లోనయ్యారు. తాజాగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో వారిలో మళ్లీ ఉత్సాహం ఉరకలేస్తోంది. మరో తొమ్మిది, పది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలో పేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలన్నది ఆయన లక్ష్యం. అందుకోసం రాష్ట్రం లోని ప్రతి జిల్లాకు ఒక అధ్యక్షుడిని నియమించా లని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించడంతో ఆశావహులు అధ్యక్ష పదవికోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయన వద్దనుకుంటే పోటీ తీవ్రమే.. జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు నడుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ చీలిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మ డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న బూడిద భిక్షమయ్యగౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా వాసి. ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంలో ఉన్నాడు. అయనను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి అధిష్టానం నియమించింది. తాజాగా నూతన అధ్యక్షుల నియామ కం జరిగితే ఆయన యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్ష పదవి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన డీసీసీ పదవి వద్దనుకుంటే ఆ పదవికి పోటీ తీవ్రం కానుంది. పెద్ద ఎత్తున దరఖాస్తులు : జిల్లాలో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి స్థా యిలో ఉండగా మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం ఉంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే 50 మందికిపైగా టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయా నియోజకవర్గాల్లోని పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాకే అవకాశం కల్పించాలని, తమ సామాజిక వర్గాలను సైతం దరఖాస్తుల్లో ప్రస్పుటించారు. దీం తో పాటు పార్టీకోసం చేపట్టిన కార్యక్రమాలు, ప్ర జాప్రతినిధులుగా అందించిన సేవలతో కూడిన సంపూర్ణ సమాచారాన్ని పార్టీ సమర్పిస్తున్నారు. గాడ్ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు ఇదిలా ఉండగా జిల్లా అధ్యక్ష పదవికోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, వి.హన్మంతరావు, కొప్పుల రాజు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా నెల 13, 14తేదీల్లో రాహుల్‌గాంధీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాతే కొత్త జిల్లాలకు అధ్యక్షుల నియామకం ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయకూడదని అప్పట్లో ప్రకటించిన ఏఐసీసీ.. తన నిర్ణయాన్ని విరమించుకుంది. దీంతో పార్టీలో ఇప్పటికే వివిధ పదవులు అనుభవించిన వారు, ద్వితీయశ్రేణి నాయకత్వంతో పాటు ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేయాలనుకునే వారు సైతం అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అనుభవం కల్గిన నేతలతో పాటు ఈసారి యువనాయకత్వం పదవిని ఆశిస్తోంది. వీరందరూ ఎవరికి వారే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
30 మందికి మించకుండా కార్యవర్గం
టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ కార్యవర్గాన్ని 30 మందికి మించకుండా ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గం అంతా కలిపి 30 లోపు ఉండేలా చూస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ముసాయిదా జాబితా కూడా సిద్ధమైందని సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో చెప్పారు. ప్రభుత్వంపై పోరాటం, ఇతర కార్యక్రమాల వల్ల కార్యవర్గం ఏర్పాటులో జాప్యం జరిగిందని, త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ఏఐసీసీలో బాధ్యతల కోసం టీపీసీసీ నుంచి జాబితాను అడిగారని ఉత్తమ్ వెల్లడించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి 8 మంది పార్టీ నేతలు ఆసక్తితో ఉన్నారని, వారి బలాబలాలపై సర్వే జరుగుతోందన్నారు. భట్టి విక్రమార్క వరంగల్ టికెట్‌ను అడగడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మాజీ ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య అభ్యర్థిత్వంపైనా చర్చ జరగలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 17న కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. 18 నుంచి 30 వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో టీపీసీసీ నేతలు పాదయాత్రలు చేస్తారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీనికి నిరసనగా నియోజకవర్గ కేంద్రాల్లో 4న ధర్నాలను నిర్వహిస్తున్నామన్నారు. కాగా, సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి ..ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. నాటక ప్రదర్శనకు ఆహ్వానించడానికే ఆయనను కలిశానని చెప్పారు. ఆందోళనలకు టీ పీసీసీ పిలుపు లోక్‌సభలో తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ టీ పీసీసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్రం విధానాలను ఎండగట్టేలా మంగళవారం దీక్షలు, ధర్నాలు చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించింది.