TPCC presidents
-
‘హస్తం’లో కొత్త కోణం.. ఏళ్లుగా వైరం.. సేవ్ కాంగ్రెస్‌తో ఒక్కటైన వైనం
సాక్షి,ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నిన్న, మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డిలదే పైచేయి. నాలుగు జిల్లాల్లో అయితే ఆ వర్గం లేని పక్షంలో ఈ వర్గం అన్నట్లుగా పార్టీ వ్యవహారాలు సాగుతూ వచ్చాయి. ముఖ్య నాయకులంతా వారి అనుచర వర్గంగానే కొనసాగారు. ఏళ్లుగా ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వైరం కొనసాగుతూ వచ్చింది. తాజాగా సేవ్ కాంగ్రెస్ నినాదంతో రాష్ట్రంలోని కొంత మంది ముఖ్యనేతలు తిరుగు బావుటా ఎగరవేసిన సంగతి విధితమే. ఇందులో భాగంగా మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు ఒక్కటవడాన్ని పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలా ఉంటే వారి తీరును ఖండిస్తూ కొంత మంది నాయకులు వ్యతిరేకంగా కదలడం పార్టీలో ఇప్పుడు సంచనలం కలిగిస్తోంది. తద్వారా ఈ రెండు వర్గాలకు ధీటుగా మరో వర్గం కీలకంగా తయారవుతుందన్న చర్చ సాగుతోంది. ఇటీవల ఆదిలాబాద్‌లో మీడియా సమావేశంలో ఏఐసీసీ సభ్యులు నరేశ్‌జాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు కొత్త కమిటీల తరువాత.. ఇటీవల పార్టీ అధిష్టానం కొత్త కమిటీలను నియమించింది. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సాజిద్‌ఖాన్‌ను పూర్తి స్థాయిలో నియమించింది. గతంలో ఆయన ఇన్‌చార్జీగా కొనసాగారు. మహేశ్వర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలిగా మరోసారి ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి కె.సురేఖనే నియమించారు. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి అనుచరుడు ముత్యంరెడ్డికి అవకాశం కల్పించారు. కుమురం భీం ఆసిపాబాద్‌లో పెండింగ్‌లో పెట్టారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి టీపీసీసీ ఎగ్జిక్యూటీవ్ కమిటీలో మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డికి చోటు కల్పించారు. ప్రస్తుతం ఆయన వయోభారంతో కీలకంగా వ్యవహరించకపోయినా తనకంటూ ప్రత్యేక అనుచరగణం ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గండ్రత్ సుజాతతో పాటు ఉట్నూర్‌కు చెందిన వెడ్మ బొజ్జుకు చోటు కల్పించారు. ఆయన నేరుగా రేవంత్‌రెడ్డి అనుచరుడిగా పేరుంది. తాజా రాజకీయాల నేపథ్యంలో సుజాత సైలెంట్‌గా ఉండగా, బొజ్జు పార్టీలో పట్టుసాధించేందుకు గట్టి యత్నాలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు ఎగ్జిక్యూటీవ్ కమిటీతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగానూ నియమించారు. పార్టీ పరిస్థితులపై ప్రస్తుతం ఆయన స్తబ్దుగానే ఉన్నారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో కొంత మంది నాయకులకు రాష్ట్ర కమిటీల్లో చోటు దక్కింది. వారు ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులుగా ఉన్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర కమిటీల పరంగా ముఖ్య నేతల అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూనే కొత్త నాయకులకు పార్టీ అవకాశం కల్పించింది. చదవండి: కేసీఆర్ డ్రగ్ టెస్ట్ సవాల్‌పై బండి సంజయ్ కౌంటర్ నేతల తీరుపై ధ్వజం.. కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థాయిలో కొంత మంది ముఖ్య నేతలు సేవ్ కాంగ్రెస్ నినాదం అందుకోగా అందులో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యనేతలు ఉండటం, వారి తీరును ఖండిస్తూ ఆదిలాబాద్‌లో కొంత మంది కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తద్వారా రానున్న రోజుల్లో ఈ రెండు వర్గాలే కాకుండా వారికి వ్యతిరేకంగా మరో వర్గం తయారైందనేది స్పష్టం అవుతోంది. ఇది ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే సేవ్ కాంగ్రెస్ నినాదం పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
టీపీసీసీ చీఫ్‌గా నేడు రేవంత్ బాధ్యతల స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు గాంధీభవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కొత్తగా నియమితులైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మాజీ నాయకుడు మలికార్జున ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్న నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యేలు, అనుబంధ విభాగాల చైర్మన్లు కూడా పాల్గొంటారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. యూసుఫైన్ దర్గాలో ప్రార్థనలు రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళతారు. అక్కడ పూజలు చేసిన తర్వాత ర్యాలీగా జూబ్లీ చెక్‌పోస్టు, నాగార్జున సర్కిల్, మాసాబ్‌ట్యాంక్ మీదుగా నాంపల్లి చేరుకుంటారు. అక్కడ యూసుఫైన్ దర్గాను సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత గాంధీభవన్‌కు చేరుకుని, మధ్యాహ్నం 1:30 గంటలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. భట్టి సహా పలువురు నేతలతో భేటీ రేవంత్‌రెడ్డి మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జెట్టి కుసుమకుమార్, మల్లు రవిలతో కలిసి పలువురు టీపీసీసీ నేతల నివాసాలకు వెళ్లి వారిని కలిశారు. ముందుగా మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఇంటికి, ఆ తర్వాత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, సీఎల్పీ నేత భట్టి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఇళ్లకు వెళ్లారు. తొలుత సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సోదరుడు, మాజీ ఎంపీ మల్లురవి బంజారాహిల్స్‌లోని భట్టి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాతే భట్టిని రేవంత్ కలుస్తారనే సమాచారం మీడియాకు అందింది. కాగా భట్టిని కలిసిన సందర్భంగా రేవంత్ ఆయనతో ఏకాంతంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తోన్న రేవంత్ విజయం సాధించాలని భట్టి ఆకాంక్షించారు. రేవంత్ మాట్లాడుతూ సీఎల్పీ, పీసీసీ అధ్యక్ష పదవులు జోడెడ్ల లాంటివని, భట్టి సూచనల మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. జగ్గారెడ్డి నివాసానికి వెళ్లిన సందర్భంగా రేవంత్‌ను శాలువాలతో సన్మానించారు. కాగా, రేవంత్‌కు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఉత్తమ్ నేరుగా బెంగళూరులోని జిందాల్ ఆశ్రమానికి వెళ్లి అక్కడ 10 రోజుల పాటు ప్రకృతి చికిత్స పొందనున్నారు. -
అవునా...రాజీనామాలిచ్చేశారా?
అటు ఏపీసీసీ, ఇటు టీపీసీసీ అధ్యక్షులు తమ తమ పార్టీ పదవులకు రాజీనామాలిచ్చారనే వార్త కాంగ్రెస్‌పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ నాయకత్వానికి వారు రాజీనామాలు సమర్పించేశారని ఇక వాటిని ఆమోదించడమే తరువాయి అన్న చర్చ కూడా సాగుతోందట. యువరాజు రాహుల్‌గాంధీని పార్టీ అధ్యక్షుడిగా చేయడానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామాలు చేయడంలో భాగంగానే ఇది కూడా చోటుచేసుకుందనే అసలు విషయాన్ని పార్టీ ముఖ్యనేతలు అంతర్గత చర్చల్లో చెబుతున్నారట. ఈ విధంగా ముందుగా తమ రాజభక్తిని, లాయల్టీని చాటుకుని, ఆ తర్వాత కూడా తమ పదవులను కాపాడుకునేందుకే ఈ ఎత్తువేశారని పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారట. ఏఐసీసీకి కొత్త అధ్యక్షుడు రాగానే తాము కొనసాగించాల్సిన పీసీసీ అధ్యక్షుల రాజీనామాలను తిరస్కరించి, తాము మార్చదలుచుకున్న వారి రాజీనామాలను ఆమోదించడానికి కూడా దీనిని నాయకత్వ ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుందని సీనియర్స్ సెలవిస్తున్నారట. ఏపీసీసీ, టీపీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేసినంత మాత్రాన ఇంకా వాటిని ఆమోదించనందున వారు పదవుల్లో ఉన్నట్లేనని చెబుతున్నారట. వారు రాజీనామాలు చేసినంత మాత్రాన ఆయా రాష్ట్ర కమిటీలు రద్దయినట్లు కాదని, అందువల్ల కార్యవర్గంలోని నాయకులు అనవసర భయాలు పెట్టుకోవద్దని భరోసానిస్తున్నారట. అయితే ఇవంతా ఉత్తుత్తి రాజీనామాలేనా అని ఈ నేతల వ్యతిరేక వర్గాల నాయకులు పెదవి విరుస్తుండడం కొసమెరుపు...