trace
-
SOFIA telescope: గ్రహశకలాలపై నీటి జాడలు
గ్రహశకలాలు పూర్తిగా పొడి శిలలతో కూడుకుని ఉంటాయని ఇప్పటిదాకా సైంటిస్టులు భావించేవారు. కానీ అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా వాటిపై నీటి అణువుల జాడలను గుర్తించారు! సోఫియా (స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రా రెడ్ ఆ్రస్టానమీ ఎయిర్‌బోర్న్ టెలిస్కోప్) టెలిస్కోప్ అందించిన డేటాను అధ్యయనం చేసిన మీదట వారు ఈ మేరకు ధ్రువీకరణకు వచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో సోమవారం ప్రచురితమయ్యాయి. ఇలా చేశారు... గ్రహశకలాలపై నీటిజాడను కనిపెట్టేందుకు సైంటిస్టులు పెద్ద ప్రయాసే పడాల్సి వచి్చంది... ► ముందుగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలను దాదాపుగా పూర్తిగా అడ్డుకునే భూ వాతావరణానికి ఎగువన ఉండే స్ట్రాటోస్పియర్ను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ► అవసరమైన మార్పుచేర్పులు చేసిన బోయింట్ 747ఎస్పీ విమానంలో స్ట్రాటోస్పియర్ గుండా సోఫియా టెలిస్కోప్‌ను సుదీర్ఘకాలం ప్రాటు పయణింపజేశారు. ► ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. ఐరిస్, మస్సాలియా అనే గ్రహశకలాలపై నీటి అణువుల జాడను సోఫియా తాలూకు ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా (ఫోర్కాస్ట్) స్పష్టంగా పట్టిచ్చింది! ► సోఫియా కెమెరా కంటికి చిక్కిన నీటి పరిమాణం కనీసం 350 మిల్లీలీటర్ల దాకా ఉంటుందని అధ్యయన బృందం నిర్ధారించింది. ► ఈ గ్రహశకలాలు సూర్యుడి నుంచి ఏకంగా 22.3 కోట్ల మైళ్ల దూరంలో గురు, బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్‌లో ఉన్నాయి. ► ఈ ఉత్సాహంతో సోఫియా కంటే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మరో 30 గ్రహశకలాలపై నీటి జాడలను మరింత స్పష్టంగా కనిపెట్టే పనిలో నాసా సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. జాబిలిపై నీటి జాడలే స్ఫూర్తి... గతంలో చంద్రునిపై నీటి జాడలను కనిపెట్టింది కూడా సోఫియానే! ఆ స్ఫూర్తితోనే అదే టెలిస్కోప్ సాయంతో గ్రహశకలాలపైనా నీటి జాడల అన్వేషణకు పూనుకున్నారు. నిజానికి ఈ అధ్యయనానికి సహ సారథ్యం వహించిన నాసా సైంటిస్టు డాక్టర్ మాగీ మెక్ ఆడమ్ ఈ గ్రహశకలాలపై గతంలోనే ఆర్ర్దీకరణ(హైడ్రేషన్) జాడలను కనిపెట్టారు. కానీ దానికి కారణం నీరేనా, లేక హైడ్రోక్సిల్ వంటి ఇతర అణువులా అన్నదానిపై మాత్రం స్పష్టతకు రాలేకపోయారు. ఆ అనుమానాలకు తాజా అధ్యయనం తెర దించిందని దానికి సారథిగా వ్యవహరించిన రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ అనీసియా అరెడొండో తెలిపారు. ‘‘నిజానికి డాక్టర్ మెక్ ఆడమ్ తన పరిశోధనకు ఎంచుకున్న ఈ రెండు గ్రహశకలాలు పూర్తిగా సిలికేట్మయం. కనుక అవి పూర్తిగా పొడిబారినవే అయ్యుంటాయని తొలుత అనుకున్నాం. కానీ వాటిపై కనిపించింది నీరేనని మా పరిశోధనల్లో స్పష్టంగా తేలింది’’ అని వివరించారు. 2020లో చంద్రుని దక్షిణార్ధ గోళంలో నీటి జాడలను సోఫియా నిర్ధారించింది. ఏమిటీ గ్రహశకలాలు... ఒక్కమాటలో చెప్పాలంటే మన సౌర వ్యవస్థ రూపొందే క్రమంలో మిగిలిపోయిన అవశేషాలు. ఒకరకంగా సూర్యుడు, తన నుంచి నిర్ధారిత దూరాల్లో గ్రహాలు ఒక్కొక్కటిగా రూపొందే క్రమంలో మిగిలి విడిపోయిన వ్యర్థాల బాపతువన్నమాట. సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో సూర్యుడికి కాస్త దూరంలో ఉన్న భూమి వంటి గ్రహాలు రాళ్లు తదితరాలకు ఆలవాలంగా మారితే సుదూరంలో ఉన్న యురేనస్, నెప్ట్యూన్ వంటివి నింపాదిగా చల్లబడి మంచు, వాయుమయ గ్రహాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చాయట. గ్రహశకలాలు కోట్లాది ఏళ్ల క్రితం భూమిని విపరీతమైన వేగంతో ఢీకొన్న ఫలితంగానే మన గ్రహంపై నీరు ఇతర కీలక మూలకాలు పుట్టుకొచ్చాయని సైంటిస్టులు చాలాకాలం క్రితమే సిద్ధాంతీకరించారు. గ్రహశకలాలపై నీటి అణువుల ఉనికి దానికి బలం చేకూర్చేదేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రహశకలాల పరమాణు కూర్పును మరింత లోతుగా పరిశోధిస్తే అంతరిక్షంలో వీటి జన్మస్థానంపై ఇంకాస్త కచి్చతమైన నిర్ధారణకు రావచ్చన్నది సైంటిస్టుల భావన. అది అంతరిక్షంలో ఇతర చోట్ల నీరు తదితర కీలక మూలకాలతో పాటు జీవం ఉనికి కోసం చిరకాలంగా చేస్తున్న పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడగలదని వారంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శవాల కుప్పలోంచి కుమారుని శరీరాన్ని బయటకు లాగి...
ఒడిశా రైలు ప్రమాదం అనంతరం ఇప్పుడు బాధితుల హృదయ విదారక గాథలు వెలుగు చూస్తున్నాయి. ఈ కోవకే చెందిన ఒక కథ అందరి చేత కన్నీరు పెట్టిస్తోంది. తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాతో చెబుతున్నప్పుడు ఆ బాధితుడు ఎంతో ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నాడు. రైలు ప్రమాదం అనంతరం తన కుమారుడు స్పృహ తప్పిపోయాడని, రెస్క్యూ సిబ్బంది.. తన కుమారుడు మృతి చెందాడని భావించి, కొన్ని వందల మృతదేహాల మధ్య పడేశారని తెలిపారు. తాను సంఘటనా స్థలానికి వెళ్లి తన కుమారుడిని వెదుకుతున్నప్పుడు అతను మృతదేహాల మధ్య సజీవంగా కనిపించాడన్నారు. బాధితుడు హెలారామ్ మాట్లాడుతూ తనకు బాలాసోర్‌లో రైలు ప్రమాదం జరిగిందని తెలియగానే వెంటనే 230 కిలోమీటర్ల దూరంలోని ప్రమాద స్థలానికి చేరుకున్నానని, తన కుమారుని కోసం వెదకడం ప్రారంభించానని తెలిపారు. ఈ నేపధ్యంలోనే తాను మృతదేహాలు ఉంచిన శవాగారానికి వెళ్లానని అన్నారు. అక్కడ వందలాది మృతదేహాల మధ్య తన కుమారుడు సజీవంగా కనిపించాడన్నారు. దీంతో తన కుమారుని శరీరాన్ని తానే ఆ మృతదేహాల మధ్య నుంచి బయటకు లాగి, ఆసుపత్రికి తీసుకువెళ్లానని తెలిపారు. తన కుమారుని చేతికి గాయమయ్యిందని పేర్కొన్నారు. కాగా రైలు ప్రమాదం జరిగిన వెంటనే తన కుమారుడు తనకు ఫోన్ చేసి, గాయాలపాలయ్యానని తెలిపాడన్నారు. వెంటనే తాను సంఘటనా స్థలానికి చేరుకున్నానని హేలారామ్ పేర్కొన్నారు. తరువాత మృతదేహాలను ఉంచిన బహనాగా పాఠశాలలోని శవాగారానికి వెళ్లి, కుమారుని కోసం వెదికానన్నారు. ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం(జూన్ 2) నాడు జరిగిన రైలు ప్రమాదంలో 278 మంది మృతి చెందారు.1200 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చదవండి: మృతదేహాలలో నుంచి ఒక చేయి అతనిని పట్టుకోగానే... -
ఫోన్ పోతే ఇలా తేలికగా కనిపెట్టొచ్చని తెలుసా?
Trace Lost Android Phone Method: పడుకున్నా.. మెలకువతో ఉన్నా పక్కన స్మార్ట్ ఫోన్ కనిపించకుండా పోతే గుండె ఆగినంతగా ఫీలయిపోతుంటారు చాలామంది. ఒకవేళ నిజంగా ఫోన్ పోతే.. ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతుంటారు. అలాంటి టైంలో వేరే డివైజ్ నుంచి ఫోన్‌ను కనిపెట్టేందుకు సైతం ఆప్షన్స్ ఉన్నాయి. ఫోన్ ఆన్‌లో ఉండడం, ఇంటర్నెట్ కనెక్టివిటీ, జీపీఎస్ ఇవిగనుక ఆన్‌లో ఉంటే.. ‘ఫైండ్ మై డివైజ్’ యాప్, గూగుల్ అకౌంట్‌కు కనెక్ట్ అయ్యి ఉండడం.. ఇవన్నీ ఉండాలి. లేకుంటే పోయిన ఫోన్‌ను కనుగొనడం కష్టం అవుతుంది. గూగుల్ ఫైండ్ మై డివైజ్ ఫీచర్ ద్వారా ఎలా కనిపెట్టాలో చూద్దాం ఇప్పుడు. ► ముందుగా మరో డివైజ్‌ను తీసుకుని android.com/find లో గూగుల్ అకౌంట్‌తో (పోయిన ఫోన్లోని గూగుల్ అకౌంట్‌తోనే) లాగిన్ కావాలి. అప్పుడు ఆ రెండు ఫోన్లు ఒకే అకౌంట్‌కు లింక్ అయ్యి ఉంటాయి. కాబట్టి. ఫోన్ ఎక్కడుందనే ఆప్షన్‌ను ట్రేస్ చేసి లొకేషన్‌ను(సరైన లొకేషన్/లేదంటే ఆ దగ్గరి ప్రాంతంలో) గుర్తించడం తేలిక అవుతుంది. అయితే ఫోన్ ఉన్న లొకేషన్ చూపించినప్పుడు.. అక్కడికి ఒంటరిగా వెళ్లకపోవడం మంచిది. ► గూగుల్ ఫైండ్ మై డివైజ్ ఫీచర్లో ‘ప్లే సౌండ్’ అనే ఆప్షన్ ఉంటుంది. ఫోన్‌ను ఎక్కడో పెట్టి మరిచిపోయినప్పుడు, లేదంటే ఫోన్ దొంగతనానికి గురై దగ్గర్లోనే ఉన్నప్పుడు గుర్తించడానికి ఈ ఫీచర్ సాయపడుతుంది. ఫోన్ కనిపెట్టిన ప్రాంతానికి వెళ్లినప్పుడు ఈ ఆప్షన్‌ను గనుక క్లిక్ చేస్తే.. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా సరే ఐదు నిమిషాలపాటు ఏకధాటిన టోన్ మోగుతూనే ఉంటుంది. అప్పుడు ఫోన్‌ను కనిపెట్టుకోవచ్చు. ► ఫోన్ దొంగతనం అవ్వాలనే గ్యారెంటీ ఏం ఉండదు. ఒక్కోసారి ఎక్కడో పెట్టి మరిచిపోవచ్చు కూడా. ఆ టైంలో ఫోన్ రిటర్న్ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్ల కోసం ‘సెక్యూర్ డివైజ్’ ఆప్షన్ ఉంటుంది. దానిని గనుక క్లిక్ చేస్తే.. పోయిన ఫోన్ స్క్రీన్‌పై అవతలి వాళ్లకు ఓ మెసేజ్ పంపడానికి ఛాన్స్ వస్తుంది. అంతేకాదు ప్రత్యామ్నాయ నెంబర్‌ను కూడా వాళ్లకు పంపొచ్చు. అయితే ఈ ఆప్షన్, ఫోన్లోని డేటా సంరక్షణ కోసం ఫోన్‌ను లాక్ చేస్తుంది కూడా. ► ఒకవేళ ఫోన్‌ను కనుక్కోవడం కష్టతరంగా మారిన టైంలో.. ఆ ఫోన్లోని డేటాను మొత్తం ఎరేజ్ చేయొచ్చు. అందుకోసం అదే పేజీలో ఉండే.. ‘ఎరేజ్ డివైజ్’.. బటన్‌ను క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్‌లో ఉన్న డేటా మొత్తం డిలేట్ అయిపోతుంది. కానీ, ఎక్స్టర్నల్గా ఉన్న ఫోన్ డేటా మాత్రం అలాగే ఉండిపోతుంది. క్లిక్ చేయండి: బుల్లెట్ బండి! పుట్టింది ఇలా.. -
మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలకు చెక్ పడనుందా..!
ఇంటర్నెట్ యుగంలో సాంకేతికతతో ఎన్ని లాభాలు ఉన్నాయో..అంతే స్థాయిలో దుష్ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. కొంతమంది తమ స్వప్రయోజనాలకోసమో లేదా ఇతరులపై పగ పెంచుకోవడం వలనో సాంకేతికతను ఉపయోగించి వారి చిత్రాలను, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో సర్య్కూలేట్ చేస్తుంటారు. దీనిలో ఎక్కువగా అమ్మాయిలు బాధితులుగా ఉంటారు. కాగా ప్రస్తుతం భవిష్యత్తులో ఫేస్బుక్ తెస్తోన్న టెక్నాలజీతో ఫేక్ చిత్రాలను, వీడియోలు తీసే ఆగంతకులకు చెక్ పెట్టవచ్చును. ఫేస్బుక్ శాస్త్రవేత్తలు తెస్తోన్న టెక్నాలజీతో ప్రస్తుతం డీప్‌ఫేక్ చిత్రాలను, వీడియోలను గుర్తించడమే కాకుండా అవి ఎక్కడ నుంచి వచ్యాయో ఇట్టే పసిగడుతుంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది. మార్పింగ్ చేయబడిన చిత్రం ఫేస్బుక్ పరిశోధన శాస్త్రవేత్తలు టాల్ హాస్నర్, జి యిన్ మాట్లాడుతూ.. ఈ టెక్నాలజీపై మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీతో కలిసి చేశామని, రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా డీప్ ఫేక్ చిత్రాలను ఎలా తయారు చేశారో, అవి ఎక్కడ నుంచి ఉద్భవించాయో తెలుసుకోవడానికి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని తెలిపారు.ఈ సాఫ్ట్‌వేర్‌తో డీప్‌ఫేక్ చిత్రాలను, వీడియోలను పోస్ట్ చేసిన వారి వివరాలు సులువుగా ట్రేస్ చేయవచ్చునని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫేక్ చిత్రాలు, వీడియోలు తీసేవారి ఆటలు ఇకాపై సాగవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా, మైక్రోసాఫ్ట్ గత సంవత్సరం చివర్లో డీప్ ఫేక్ ఫోటోలు లేదా వీడియోలను గుర్తించడంలో సహాయపడే సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది, ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన హింసకాండలో క్లిష్టమైన ఫేక్ చిత్రాలను గుర్తించడానికి ఎంతగానో ఉపయోగపడింది. ప్రస్తుతం ఫేస్బుక్ సంస్థ వీడియో అథెంటికేటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక చిత్రాన్ని లేదా వీడియోలోని ప్రతి ఫ్రేమ్‌ను విశ్లేషించి, వాటిని ఎవరు చేశారనే విషయాన్ని గుర్తుపట్టనుంది. అసలు ఈ డీప్ ఫేక్ మీడియా అంటే.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ టూల్‌ను ఉపయోగించి ఇతర వ్యక్తుల ఫోటోల్లో, వీడియోల్లో నచ్చని వారి ఫోటోలను చొప్పించి, నకిలీ చిత్రాలను, విడియోలను తయారు చేసే సింథటిక్ మీడియా. ప్రస్తుతం కింద చూస్తున్న వీడియో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ది. ఈ వీడియోను డీప్‌ఫేక్ సింథటిక్ మీడియాగా చేసి ఇంటర్నెట్లో వదిలారు. ఇలాంటి వీడియోలతో తీవ్రమైన కల్లోలాలు చేలరేగుతాయి. కాగా ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలను భవిష్యత్తులో ఫేస్బుక్ వాటిని గుర్తించి, క్రియేటర్ల పేరును బయటపెట్టనున్నారు. చదవండి: శరీరాన్ని ఉపయోగించి స్మార్ట్‌వాచ్ ఛార్జింగ్..! -
కాంటాక్ట్ ట్రేసింగ్‌కు స్వస్తి
సాక్షి, హైదరాబాద్: కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్‌కు వైద్య ఆరోగ్యశాఖ స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఎవరికైనా పాజిటివ్ వస్తే, వారికి వైరస్ ఎలా వచ్చిందో గుర్తించేందుకు కాంటాక్ట్‌లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. కరోనా ఎలా సోకింది? నాలుగైదు రోజులుగా ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? ఏమేం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వారుండే అపార్ట్మెంట్ లేదా ఇంటి పక్కనవారిని కూడా కలిసి ఆరా తీస్తున్నారు. ఇతరులకు వైరస్ వ్యాపించకుండా పోలీసులు చేస్తున్న ట్రేసింగ్ బాధితులకు ఇబ్బందిగా మారుతోందన్న ఫిర్యా దులు వెల్లువెత్తాయి. దీంతో సాధారణ లక్షణాలతో ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒక్కోసారి సామాజిక బహిష్కరణ పాలవుతున్నారు. అపార్టుమెంట్లలో ఉండేవారైతే వారిని అక్కడ ఉండొద్దని, ఆసుపత్రికి వెళ్లమని ఒత్తిడి చేస్తున్నారు. గత నెల వైద్య ఆరోగ్యశాఖకు చెం దిన ఒక కీలకాధికారికి పాజిటివ్ వస్తే, సాధారణ లక్షణాలున్నా అపార్ట్‌మెంట్‌వాసుల ఒత్తిడితో ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంటాక్ట్ ట్రేసింగ్‌కు స్వస్తి పలకాలని నిర్ణయించినట్లు కరోనా రాష్ట్ర ఉన్నతస్థాయి సభ్యులు ఒకరు తెలిపారు. ఇళ్లలో ఉండి చికిత్స పొందేవారి గోప్యతకు భంగం కలిగించబోమన్నారు. తప్పుడు అడ్రస్‌లు... ఫోన్ నెంబర్లు పోలీసులు, స్థానిక వైద్యాధికారుల హడావుడితో సామాజిక బహిష్కరణకు గురవుతామని బాధితులు చాలామంది కరోనా నిర్ధారణ పరీక్షల సమయంలోనే ఆధార్, ఫోన్ నంబర్ల ద్వారా అడ్రస్ తెలుసుకుంటున్నారు. దీంతో కొందరు తప్పుడు ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. కొందరైతే తప్పుడు పేర్లు కూడా ఇస్తున్నారని తెలిసింది. మరీ ముఖ్యంగా ప్రముఖులుగా చలామణి అయ్యేవారు తమ పేర్లు కూడా తప్పుగా ఇస్తున్నట్లు సమాచారం. ఇలా తప్పుడు అడ్రస్‌లు, ఫోన్ నెంబర్లతో శాంపిళ్లు ఇచ్చిన వారిలో ఎవరిౖకైనా కరోనా పాజిటివ్ వస్తే, వారికి సమాచారం ఇచ్చే పరిస్థితి ఉండటం లేదు. ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని వస్తుంది. అడ్రస్‌కు వెళ్తే అక్కడ ఎవరూ ఉండటం లేదని తెలుస్తుంది. దీంతో అటువంటి వారికి సమాచారం ఇవ్వడం గగనంగా మారింది. ఇలా తప్పుడు వివరాలు ఇచ్చే వారు దాదాపు 20 శాతం మంది వరకు ఉంటారని ఆ అధికారి వెల్లడించారు. ఇది తమకు తలనొప్పిగా మారిందంటున్నారు. అలా తప్పుడు సమాచారం ఇచ్చినవారు తమకు తెలిసినవారి ద్వారా పాజిటివ్ వచ్చిందా... నెగెటివ్ వచ్చిందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకనుంచి బేఫికర్... ప్రస్తుతం కరోనా పాజిటివ్ వచ్చినవారిలో ఎక్కువమంది ఇళ్లల్లో ఉండి చికిత్స పొందుతున్నవారే. హైదరాబాద్‌లో దాదాపు 10 వేల మందికి పైగా ఇలా ఇళ్లల్లోనే ఉండి చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్షణాలు పెద్దగా లేనివారికి, ఇళ్లల్లో ఉండి చికిత్స పొందే వారికి ఇబ్బందిగా మారిన ట్రేసింగ్ విధానాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. కేవలం వైద్య ఆరోగ్యశాఖకు చెందిన స్థానిక అధికారులు లేదా డాక్టర్లు మాత్రమే వారిని పర్యవేక్షిస్తారని, వారితో టచ్‌లో ఉంటారని తెలిపాయి. -
కరోనా కట్టడికి కేంద్రం సరికొత్త వ్యూహం..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. ఇప్పటి వరకు కేవలం వైరస్ బారినపడిన, అనుమానితులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగంచెల వ్యూహంతో కరోనా సోకిన వారిని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నియంత్రణకు దక్షిణ కొరియా అనుసరించిన విధానాలను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై పలు విషాయలను కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్థన్ ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సరికొత్త విధానాలను అనుసరించాలని కేంద్రప్రభుత్వం సంకల్పించిందని మంత్రి తెలిపారు. (కేంద్రమంత్రిని వెంటాడుతున్న కరోనా భయం!) దీనిలో భాగంగానే వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం (ట్రేస్) పరీక్షలు నిర్వహించడం (టెస్ట్) క్వారెంటైన్‌కు పంపడం (ఐసోలేషన్) వైద్య చికిత్స అందించడం (ట్రీట్) లాంటి వ్యూహాన్ని అమలుపరుస్తున్నట్లు హర్షవర్ధన్ వెల్లడించారు. దీని వల్లన వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే నగర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించాలని కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మే చివరి నాటికి రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, లాక్డౌన్, సామాజిక దూరంతోనే పూర్తిగా అంతం చేయగలమని అన్నారు. (ఒక్కరోజులో 1,975 కేసులు) కాగా దక్షిణ కొరియా ఎలాంటి కఠిన చర్యలు పాటించకుండానే విజయవంతంగా కోవిడ్19 మహమ్మారిని తమ దేశంలో నిరోధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29న దక్షిణ కొరియాలో అత్యధికంగా 909 కేసులు నమోదు కాగా, మార్చి 17 నాటికి ఇది 74 కేసులకు తగ్గింది. పెద్ద ఎత్తున వైరస్ బాధితులను గుర్తించి పరీక్షలు నిర్వహించడంలో ఆ దేశం విజయవంతం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ దేశం అనుసరించిన విధానాల వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా అదే బాటలో నడవాలని భావించింది. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఆగడం లేదు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 1,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 24 గంటల వ్యవధిలో 47 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 27,892కు, మరణాల సంఖ్య 872కు చేరిందని ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. -
మావోల కోసం మళ్లీ వేట
సాక్షి, మోర్తాడ్: మావోయిస్టుల ప్రభావం ఉమ్మడి జిల్లాలో కనుమరుగై దాదాపు పుష్కర కాలం(12 ఏళ్లు) అవుతోంది. అయినా ఇతర రాష్ట్రాలలో పని చేస్తున్న మన ప్రాంత నక్సల్స్ కోసం నిజామాబాద్ జిల్లా పోలీసులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని గుర్తించిన పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్టేషన్లలోని తుపాకులను సైతం జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని కార్యాలయాల్లో భద్ర పరిచారు. అయితే రెండు జిల్లాలకు చెందిన ఎనిమిది మంది నక్సల్స్ కోసం జిల్లా పోలీసులు వేటను కొనసాగిస్తున్నారని చెప్పడానికి వివిధ ప్రాంతాలలో అంటించిన వాల్ పోస్టర్లే నిదర్శనం. నక్సల్స్ నాయకులకు సంబంధించిన పాత ఫొటోలతో పాటు వారిపై ప్రకటించిన రివార్డులు, పోలీసు ఉన్నతాధికారుల సెల్ నంబర్లను వాల్ పోస్టర్లపై ముద్రించారు. వీటిని ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోనద్న్ని పోలీస్స్టేషన్లతోపాటు జనసమ్మర్థం ఉండే కూడళ్ల వద్ద అంతికించారు. వాటి ద్వారానే జన జీవన స్రవంతిలోకి రావాలని మావోలను పోలీసు యంత్రాంగం విజ్ఞప్తిచేస్తోంది. మావోయిస్టుల ముఖ్యనేతగా ముద్రపడిన కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడకు చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామి, స్వామి కూతురు లోకేటి లావణ్య, కొడుకు లోకేటి రమేష్, మాచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన క్యాతం శ్రీను అలియాస్ సూరజ్, ఎల్లారెడ్డికి చెందిన లింబయ్యగారి వెంకట్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలం లింగాపూర్‌కు చెందిన మూడెడ్ల సాయిలు అలియాస్ రఘు, ఇందల్వాయికి చెందిన నాగపులి లక్ష్మాగౌడ్ అలియాస్ లచ్చాగౌడ్ కోసం పోలీసులు వేటను కొనసాగిస్తూనే ఉన్నారు. మావోలపై రివార్డులు.. వీరంతా గతంలో ఉమ్మడి జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతోపాటు పార్టీ మన ప్రాంతంలో కనుమరుగైనా వేరే రాష్ట్రంలో పని చేస్తుండటం గమనార్హం. అనేక మంది ఎన్కౌంటర్లలో మరణించడం, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సభ్యుల ఒత్తిళ్లు, అనారోగ్య కారణాలతో పోలీసులకు లొంగిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే పోలీసులు వాల్ పోస్టర్లలో పేర్కొన్న ఎనిమిది మంది మాత్రం ఇంకా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడవుతోంది. వీరిలో స్వామిపై అత్యధికంగా రూ.20 లక్షల రివార్డు ఉంది. కాగా సాయిలు, రవి, శ్రీనులపై రూ.5లక్షల చొప్పున రివార్డును ప్రకటించారు. అలాగే రమేష్‌పై రూ.4లక్షల రివార్డు, లావణ్య, లక్ష్మాగౌడ్, లింబయ్య గారి వెంకట్‌రెడ్డిపై రూ.లక్ష చొప్పున రివార్డును ప్రకటించారు. ప్రజలు మావోయిస్టుల ఉనికి లేదని భావిస్తున్నా పోలీసులు మాత్రం రివార్డులను ప్రకటించడంతో పాటు వాల్ పోస్టర్లను ముద్రించి నక్సల్స్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. -
'చనిపోయేవరకు అమ్మకు నేనెవరో చెప్పలేదు'
లండన్: పసిప్రాయం నుంచే 'మీ అమ్మ చనిపోయింది' అని ఎవరైనా చెబుతుంటే.. అలా అస్సలు జరిగి ఉండకపోవచ్చనే అనుమానం నిత్యం వెంటాడుతుంటే.. మనసు ప్రతిక్షణం అమ్మకోసం వెతికేందుకు పరుగులు తీయిస్తుంటే.. లండన్‌లో పిలీస్ విజెల్ అనే మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మొదట ఓ అనాథ బాలికగా తర్వాత, దత్త పుత్రికగా చిన్నతనంలోనే ఓ ఇంటికి వెళ్లిన ఆమెను తన తల్లి ఇంకా బ్రతికే ఉండొచ్చు.. అయితే ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అనే ప్రశ్నలు వేధిస్తుండేవి. దీంతో, ఆమె మౌనంగా కనిపించినప్పటికీ ఏ చిన్న అవకాశం దొరికినా తన తల్లికోసం ఆరా తీసేది. ఎట్టకేలకు తన తల్లిని గుర్తించేందుకు ఓ సుధీర్ఘ ప్రయాణం ప్రారంభించింది. తొలిసారి తాను ఏ అనాథ ఆశ్రమం నుంచి వచ్చిందో అక్కడికే వెళ్లి తన తల్లి గురించి వెతికింది. దీంతో వారు ఆమె వివరాలు చెప్పారు. ఆమె పేరు బ్రిడ్జెట్ మేరి లాకిన్ అని, మద్యానికి అలవాటైన ఆమె ఓ దుర్వ్యసనపరురాలని, కొంత సమస్యాత్మక ప్రవర్తన కలిగిన స్త్రీ అని చెప్పారు. ఐర్లాండ్‌లో ఉంటున్న ఆమెను దుష్ఫ్రవర్తన కారణంగా సోదరుడు రోజూ కొట్టేవాడని, చివరికి ఆమె భరించలేక ఇళ్లు వదిలి బయటకు వచ్చిందని, ఆ తర్వాత ఐదుగురు వ్యక్తులతో శారీరక సంబంధాలు పెట్టుకొని వారి ద్వారా ఐదుగురు సంతానం పొందిందని వివరించింది. కానీ, ఆ ఐదుగురు వ్యక్తుల్లో ఏ ఒక్కరు కూడా ఆమె బాగోగులు చూసుకోకుండా వదిలేశారని వారు చెప్పారు. అలా జన్మించిన వారిలో రెండో అమ్మాయివే నువ్వు(పిలీస్). అని, 1956లో పిలీస్ జన్మించిందని వివరాలు తెలిపారు. అయితే, పిలీస్ కేవలం ఎనిమిది నెలలు మాత్రమే తల్లి సంరక్షణలో ఉందని, నెలలపాప అని కూడా చూడకుండా పాపగా ఉన్నప్పుడు ఇంట్లో ఒంటరిగా వదిలేసి పబ్బుల్లో గడిపేందుకు వెళ్లేదని వివరించారు. చివరకు పిలీస్ సంరక్షణ తన వల్లకాదని తమ ఆశ్రమంలో చేర్చి వెళ్లిపోయిందని చెప్పారు. అలా, అనాథ ఆశ్రమంలో పెరుగుతున్న పిలీస్ను ఓ కుటుంబం వచ్చి తమకు అప్పటికే ఉన్న కూతురుకి తోడుగా ఉంటుందని చెప్పి దత్త పుత్రికగా తీసుకెళ్లారని బాల్యం నుంచి దత్తత తీసుకెళ్లిన ఘట్టం వరకు ఆశ్రమ అధికారులు పిలీస్ కు వివరించారు. ఈ కథనం విన్న తర్వాత ఎలాగైనా తన తల్లిని కలుసుకోవాలని తాపత్రయపడింది. పోలీసులను ఆశ్రయించింది. ఆమె పేరు చెప్పగానే పోలీసులు శివమెత్తారు. ఆమె ఒక పనికిమాలిన స్త్రీ అని, తాగుబోతు, తిరుగుబోతు అని అనరాని మాటలు అన్నారు. బర్మింగామ్ లోని రెడ్ లైట్ ఏరియాలో ఉంటోందని చెప్పారు. 'ఓ కూతురుగా నువ్వు పడుతున్న ఆవేదన అర్ధం చేసుకోగలం కానీ, ఆమె వల్ల నీ జీవితమే సమస్యల సుడిగుండం అవుతుంది' అని పోలీసులు చెప్పారు. అయినా, వెనక్కి తగ్గని పిలీస్ అప్పటికే గర్భవతి కావడంతో ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన బిడ్డను చంకన వేసుకొని భర్తతో కలిసి కార్లో వెళ్లి బర్మింగామ్ వీధులన్నీ గాలించింది. చివరకు ఓ ఇంట్లో తన తల్లి ఉందని గుర్తించింది. ఆమె కూతురిలా కాకుండా ఓ కొత్త వ్యక్తిలా ఆ ఇంటికి వెళ్లి డోర్ కొట్టి ఎవరూ తీయకపోవడంతో తనే తెరుచుకోని లోపలికి వెళ్లింది. లోపల అంతా చీకటి.. ఓ మూలవైపుగా ఉన్న మెట్లపైన కూర్చుంటు అక్కడ అసహాయ పరిస్థితుల మధ్యన ఉన్న తన తల్లిని చూసి పిలీస్ గుండె చెరువైంది. తన తల్లి ఓ మోడువారిన చెట్టులా దర్శనమిచ్చింది. ఆమె ముఖం వాడిపోయి, జుట్టు రేగిపోయి, చర్మం పెలుసులు తేలి వేరేవరూ కూడా దగ్గరకు వచ్చేందుకు సాహసించని పరిస్థితుల మధ్య ఆమెను చూసింది. బాధను తనలోనే దిగమింగుకుని కుటుంబం కోసం, భవిష్యత్తుకోసం తనే ఆమె కూతురనే విషయాన్ని గొంతులో అదుముకొని తన తల్లితో సంభాషణ సాగించింది. తొలుత బ్రిడ్జెట్కు అసలు ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరనే విషయంలో కొంత ఆందోళనగా అనిపించినా.. తనకు కూడా కాసేపు తోడు దొరికింది కదా అనుకుని తన గతాన్ని పిలీస్కు చెప్పింది. 'నాకు ఒక ముద్దుల కూతురు ఉండేది. కానీ, నేనే పోగొట్టుకున్నాను. ఓ అనాథ ఆశ్రమంలో వదిలివేశాను' అని చెప్పుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది బ్రిడ్జెట్. ఈ మాటలు తలుచుకుంటూ 'ఆ సమయంలో ఆమెకు నా పుట్టిన రోజు తెలుసు.. కానీ, నేను ఆమె పక్కన కూర్చున్నా నేనెవరో ఆమెకు తెలియదు' అని పిలీస్ చెప్పింది. అలా ఎట్టకేలకు తన తల్లిని కలిసి పిలీస్ ఎవరేమనుకున్నా పర్వాలేదు అనుకోని అప్పుడే వృత్తి రీత్యా నర్సు అయిన ఆమె.. తన తల్లికి ఓ నర్సులాగా తొమ్మిదేళ్లపాటు సేవలు చేసి మాతృరుణం తీర్చుకుంది. ఆమె చనిపోయాక అంత్యక్రియలు తానే స్వయంగా జరిపించింది. చనిపోయే చివరి క్షణంలో కూడా ఆమెకు తను ఎవరు అనే విషయం మాత్రం రహస్యంగానే ఉంచిపెట్టింది. -
పాపా ఎక్కడున్నావమ్మా ?
-
రేప్ వీడియోపై స్పందించిన సుప్రీం
న్యూఢిల్లీ: హైదరాబాద్ సామాజిక కార్యకర్త, ప్రజ్వల సంస్థ నిర్వహిస్తున్నసునీతా కృష్ణన్ పంపిన అత్యాచార వీడియోపై సుప్రీంకోర్టు స్పందించింది. అత్యాచార ఘటనలకు సంబంధించిన వీడియోలపై తక్షణమే చర్యలు చేపట్టాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. దీంతో పాటు అత్యాచార ఘటనలపై ఓ రిజస్టార్ ను ఏర్పాటు చేయాలంటూ హోంశాఖకు స్పష్టం చేసింది. ఓ మహిళను రేప్ చేస్తున్న వీడియోలను చీఫ్ జస్టిస్ కు సునీత ఒక లేఖ ద్వారా పంపారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ ను రెండు పెన్ డ్రైవ్ లలోసుప్రీంకు అందజేశారు. ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆ తరువాత బలాత్కారం చేసిన ఐదుగురు దుండగులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన సామాజిక కార్యకర్త సునీతాకృష్ణన్... మానవ మృగాలను పట్టుకోండి అంటూ జనాలను విజ్ఞప్తి చేశారు. రేపిస్టులను గుర్తించండి అంటూ యూ ట్యూబ్‌లో వీడియోను పోస్ట్ చేశారు. రేపిస్టుల అంశాన్ని బయటపెట్టిన అనంతరం ఆమెపై దాడి జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఆమెపై దాడికి ప్రయత్నించిన దుండగులు కారు అద్దాలు పగులగొట్టారు. అంతే కాదు, ఓ వైపు ఇంత చర్చ జరుగుతుండగానే.. మరో వైపు హ్యాకర్లు రంగంలోకి దిగారు. క్షణాల్లో పోస్టింగ్‌లను డిలీట్ చేశారు. తన పోస్టింగ్‌లు మాయమయ్యాయని తెలుసుకున్న సునీత నివ్వెర పోయారు. ఓ అన్యాయంపై పోరాటం చేస్తే.. ఇంత ప్రతి దాడిని ఊహించలేకపోయారు. -
వాంటెడ్: ఈ మృగాళ్ళ ఎక్కడ..?
-
ఈ మృగాళ్ళను పట్టించండి..!
-
రేపిస్ట్ లను పట్టుకోమన్నందుకు.. దాడికి యత్నం
హైదరాబాద్ : సామాజిక కార్యకర్త, ప్రజ్వల సంస్థ నిర్వహిస్తున్న సునీతా కృష్ణన్‌పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఆమె కారుపై దుండగులు రాళ్లు రువ్వారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ అమ్మాయిని అయిదుగురు యువకులు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. అన్నా విడిచి పెట్టండని ఆమె వేడుకున్నా అరణ్య రోదనే అయ్యింది. ఆ మృగాలు.. సామూహిక అత్యాచారాన్ని వీడియోలో చిత్రీకరించారు. తాము చేస్తుందేదో ఘనకార్యం అంటూ నవ్వుతూ వీడియోకు ఫోజులు ఇచ్చారు. సుమారు ఆరు నెలల క్రితం ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వాట్సప్‌లో ప్రచారంలో ఉంది. ఆ వీడియో సునీతా కృష్ణన్‌కు కూడా వీడియో చేరింది. దాంతో ఆ దుర్మార్గులు ఎవరు ? ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ రేపిస్టులను గుర్తించండి అంటూ.. సునీతా కృష్ణన్ యూ ట్యూబ్‌లో ఆ వీడియోను నిన్న పోస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కృషి చేయాలని కోరారు. రేపిస్టులకు తగిన శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ దారుణ ఘటనపై యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసిన వెంటనే.... సునీతా కృష్ణన్ వాహనంపై గుర్తు తెలియని దుండగలు దాడి చేశారు. కలకలం రేపిన ఈ ఘటనపై కేంద్ర స్త్రీ, శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ దృష్టి స్పందించింది. బాధ్యులు ఎవరో తెలుసుకునే పనిలో పడింది. సైబర్ క్రైం పోలీసుల సహకారంతో ఎక్కడి నుంచి ఈ ఫుటేజ్ బయటకు వచ్చిందో విచారణ ప్రారంభించారు. -
దావూద్ ఇబ్రహీం ఆచూకీ లభ్యం
-
దావూద్ ఇబ్రహీం ఆచూకీ దొరికింది
భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ కనుగొన్నారు. పాకిస్థాన్‌లోని కరాచీ నగర శివారు ప్రాంతం క్లిఫ్టన్ నుంచి దావూద్ ఫోన్లో మాట్లాడినప్పటి సంభాషణలను ఓ పాశ్చాత్య నిఘా సంస్థ రికార్డు చేసింది. ఆస్తి ఒప్పందానికి సంబంధించి దుబాయ్‌లో ఉంటున్న ఓ వ్యక్తితో దావూద్ మాట్లాడిన సమయంలో సంభాషణల్ని రికార్డు చేశారు. రెండు దశాబ్దాల క్రితం దావూద్ పాకిస్థాన్ పారిపోయిన తర్వాత భారత నిఘా సంస్థలు అతని ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో భారత్‌కు దావూద్‌ను అంతం చేసే అవకాశం వచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. భారత్ కమెండోలు దావూద్ ను టార్గెట్ చేసినపుడు, కొన్ని క్షణాలు ముందు భారత్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి కాల్చొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు కథనాలు వెలువడ్డాయి.