Traffic DCP
-
సినీ నటి డింపుల్ హయతితో ఎలాంటి గొడవలు లేవు: ట్రాఫిక్ డీసీపీ
-
సిటీ స్ఫూర్తితో చెన్నైలో!
సాక్షి, సిటీబ్యూరో: తెలిసీ తెలియని వయస్సులో వాహనాలపై దూసుకెళుతూ మొగ్గలోనే రాలిపోతున్న మైనర్ల మరణాలు, ప్రమాదాలను తగ్గించడానికి నగర ట్రాఫిక్ విభాగం అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఇలాంటి కేసుల్లో మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారి తల్లిదండ్రుల పైనా కేసుల నమోదుకు నిర్ణయించారు. ఈ రకంగా దాదాపు 50 మంది తండ్రులు జైలుకు వెళ్లిన విషయం విదితమే. ఈ విధానం తమిళనాడులోని చెన్నై పోలీసులను ఆకర్షించింది. అక్కడి పరిస్థితులు, అనివార్య కారణాల నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ తరహాలో కాకుండా ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భంలో కేసుల నమోదుకు శ్రీకారం చుట్టారు. చెన్నై ట్రాఫిక్ పోలీసు చరిత్రలో తొలిసారిగా గత బుధవారం ప్రమాదంలో మరణించిన ఓ మైనర్ తల్లిపై కేసు నమోదు చేశారు. అంతిమ సంస్కారాలతో పాటు ఇతర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆమెను అరెస్టు చేయాలని భావిస్తున్నారు. చెన్నైలోని మొగప్పేర్ ప్రాంతానికి చెందిన మీన వెంకటేష్ కుమారుడు అవినాష్ (పేరు మార్చాం) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మీన ఇటీవల తన కుమారుడి కోసం ఓ హైస్పీడ్ బైక్ ఖరీదు చేశారు. అతడు మైనర్ కావడంతో తన పేరునే రిజిస్ట్రేషన్ చేయించారు. గత బుధవారం తన స్నేహితురాలితో కలిసి ట్యూషన్‌కు వెళ్తున్న అవినాష్ మితిమీరిన వేగం కారణంగా వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. డివైడర్ పైకి ఎక్కిన వాహనం ఓ పాదచారిని ఢీ కొట్టి పడిపోయింది. ఈ ఘటనలో పాదచారితో పాటు స్నేహితురాలికి స్వల్ప గాయాలు కాగా... తలకు బలమైన గాయమైన అవినాష్ స్థానిక ఆస్పత్రిలో కన్ను మూశాడు. ఈ ఉదంతాన్ని తిరుమంగళం ట్రాఫిక్ పోలీసు ఆధీనంలోని ఇన్వెస్టిగేషన్ వింగ్ సీరియస్‌గా తీసుకుంది. ప్రాథమికంగా అవినాష్‌పై ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కేసు నమోదు చేసినప్పటికీ అతడు చనిపోవడంతో ఈ కేసు మూసేసింది. మైనర్‌కు వాహనం ఇవ్వడంతో పాటు ఆ వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉండటంతో మీన వెంకటేష్‌పై కేసు నమోదు చేసింది. త్వరలో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని భావిస్తోంది. చెన్నై ట్రాఫిక్ డీసీపీ ప్రేమ్ సిన్హా ఈ విషయంపై ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం (ఎంవీ యాక్ట్) పదహారేళ్ల లోపు వారు ఎలాంటి వాహనాలనూ పడపకూడదు. వీరు వాహనాలను నడుపుతూ రోడ్ల పైకి రావడం నిషేధం. 16 ఏళ్లు నిండిన వారు కేవలం గేర్లు లేని సాధారణ వాహనాలు నడిపే అవకాశం ఉంటుంది. 18 నిండిన తరవాత మాత్రమే గేర్స్‌తో కూడిన వాహనాలు నడపడానికి అర్హులు. ఆర్టీఏ అధికారులు లైసెన్స్ సైతం వీరికే మంజూరు చేస్తారు. చట్ట ప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన యజమాని సైతం శిక్షార్హుడే. ఈ విషయంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చర్యలు ఆదర్శప్రాయంగా ఉన్నాయి. ఆ స్ఫూర్తితోనే మీన వెంకటేష్‌పై కేసు నమోదు చేశాం’ అని అన్నారు. పాశ్చాత్య దేశాల తరహాలో ఇక్కడ కఠిన చట్టాలు లేకపోవడంతోనే మైనర్, యూత్ విజృంభిస్తున్నారనేది అధికారుల వాదన. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనంపై బయటకు వస్తే వాహనం సీజ్ చేస్తారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ వస్తే వారితో పాటు తల్లిదండ్రులకూ జరిమానా విధిస్తారు. జరిమానాలు భారీ స్థాయిలో ఉండటం, మూడు ఉల్లంఘనలకు మించితే వారి లైసెన్స్ రద్దు తదితర చర్యలు తీసుకుంటారు. ఇక్కడ అంతటి కఠిన చట్టాలు లేకపోయినా... ఉన్న కొన్నింటినీ సంబంధిత శాఖలు పట్టించుకోవట్లేదు. మోటారు వాహనాల చట్టంలోని 180 సెక్షన్ ప్రకారం ఓ మైనర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే... అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమాని పైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
బాబోయ్... సెల్ఫీ డ్రైవింగ్
సర్వేలో తేలిన ఆసక్తికర అంశాలివే... - డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ మాట్లాడటం... సెల్ఫీలు దిగడం - మెట్రో నగరాల్లో ప్రాణం తీస్తున్న నయా పోకడలు - 70 శాతం మంది తీరిదే.. - తాజా అధ్యయనంలో వెల్లడి ► దేశంలో పలు మెట్రో నగరాల్లో 60నుంచి 70 శాతం మంది చోదకులు వాహనాలను నడుపుతూ, రోడ్డు దాటుతూ ఫోన్లు మాట్లాడుతున్నారట. వీరిలో చిన్నారులు, ట్రక్, బస్ డ్రైవర్లే అధికం. ► డ్రైవింగ్‌లో 18 శాతం మంది ఒకసారి ఫోన్ రింగ్ కాగానే సెల్ మాట్లాడుతున్నారట. ► ప్రయాణంలో ఉన్నప్పుడు 51 శాతం మంది మూడుమార్లు రింగయిన తరువాత ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారట. ► 14 శాతం మంది ప్రయాణంలో ఉన్నప్పుడు, వాహనాలను నడుపుతున్నప్పుడు కూడా సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారట. సాక్షి, హైదరాబాద్: కార్నెగి మిలన్ వర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (తిరుచ్చి), ఇంద్రప్రస్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఢిల్లీ)లు దేశంలోని 12 మెట్రో నగరాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగంపై అధ్యయనం చేశాయి. ఇందులో విస్తుగొలిపే అంశాలెన్నో బహిర్గతమయ్యాయి. వాహనం నడిపే ట ప్పుడు, రోడ్డు దాటేటప్పుడు మహానగరాల్లో 60 నుంచి 70 శాతం మంది సెల్‌ఫోన్ మాట్లాడుతున్నట్టు తేలింది. అలాగే సెల్ఫీలు దిగుతూ జరిగిన ప్రమాదాల్లో 50 శాతం భారత్‌లోనే చోటుచేసుకున్నట్టు అధ్యయనం వెల్లడించింది. కొన్నిసార్లు సెల్ఫీలూ ప్రమాదమే బహుళ అంతస్తుల భవనాలు, లిఫ్టులో ప్రయాణిస్తున్నప్పు డు, వాహనాలు నడుపుతున్నప్పుడు, చెరువులు, వాటర్ ఫాల్స్, డ్యామ్స్ వద్ద సెల్ఫీ తీసుకునే సరదా కొన్నిమార్లు ప్రాణాంతకమౌతోందని తాజా సర్వేలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీలు దిగే సమయంలో జరుగుతున్న ప్రమా దాల్లో 50 శాతం భారత్‌లోనే చోటుచేసుకుంటున్నాయంటే దేశంలో ఈ సరదా ఎంతలా ఉందో∙అర్థం చేసుకోవచ్చు. వాటర్‌ఫాల్స్, డ్యామ్‌ల వద్ద గ్రూపులుగా సెల్ఫీలు దిగుతున్న సమయంలో అత్యధికులు మృత్యువాత పడుతున్నట్లు తేలింది. ప్రేమికులు, స్నేహితులు రైల్వే ట్రాక్‌లపై తరచూ సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలకు గురవుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. గ్రేటర్లో 129 మందికి గాయాలు గ్రేటర్ హైదరాబాద్‌లోనూ సెల్‌ఫోన్ డ్రైవింగ్, రోడ్డు దాటుతున్నప్పుడు ఫోన్లు మాట్లాడడం, ప్రయాణిస్తున్న సమయంలో సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ వంటి కారణాలతో ప్రమాదాలకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గతేడాది ఇలాంటి సంఘటనల్లో సుమారు 129 మంది తీవ్రగాయాల పాలైనట్లు తెలిసింది. ఇందులో 35 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఫ్యాషన్‌గా మారిపోయింది వాహనచోదకులకు సంబంధించి ఒకప్పుడు డ్రంకెన్ డ్రైవింగ్, ఓవర్‌స్పీడింగ్ మాత్రమే అత్యంత ప్రమాదకరంగా భావించేవాళ్లం. ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్ వినియోగం ఈ రెంటినీ మించిపోతున్న పరిణా మాలుగా కనిపిస్తు న్నాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, రోడ్డుపై నడుస్తున్నప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడటం, సెల్ఫీలు దిగడం, చాటింగ్‌లు చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. ప్రస్తుతం రహదారిపై పాదచారులు సెల్‌ఫోన్ వినియోగిస్తున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో వీరిని కట్టడి చేయడానికి పెడస్ట్రియన్ చట్టాలు వచ్చే ఆస్కారం ఉందనే భావన కలుగుతోంది. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ డీసీపీ -
ఆపరేషన్ ట్రాఫిక్
విజయవాడలో భారీగా పెరిగిన వాహనాల రాకపోకలు సమస్య పరిష్కారానికి ఉపక్రమించిన ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక బస్ బేలు, సలహా మండలి ఏర్పాటుకు నిర్ణయం రోజురోజుకూ విజయవాడ నగరంలో తీవ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ట్రాఫిక్ పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో కంటే నగరం మీదుగా ప్రయాణించే వాహనాల సంఖ్య పెరిగినా రోడ్లు విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిసారించారు. ట్రాఫిక్ సలహా మండలి ఏర్పాటు, ప్రత్యేక బస్‌బేలు, ప్రత్యామ్నాయ మార్గాలకు వాహనాల మళ్లింపు వంటి చర్యలకు ఉపక్రమించారు. అమరావతి: విజయవాడ నగర రోడ్లపై 2014కు ముందు వరకు బస్సులు, లారీలు, కార్లు కలిపి రోజుకు 12 వేల వరకు ప్రయాణించేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 20 వేలకుపైగా చేరింది. వాటిలో 8 వేల వాహనాల వరకు ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు వస్తున్నవే. 2014కు ముందు నగరంలో ద్విచక్ర వాహనాలు రోజుకు 15 వేలవరకు ప్రయాణించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 30 వేలు దాటింది. వాటిలో దాదాపు 25 వేల వాహనాలు కృష్ణా జిల్లాకు చెందినవే. రోడ్లను విస్తరించకపోవడంతో ప్రయాణమంటేనే నరకప్రాయంగా మారుతోంది. ఈ ఏడాది ఆగస్టునాటికి నగరంలో జరిగిన 1,083 రోడ్డు ప్రమాదాల్లో 254 మంది దుర్మరణం చెందగా 1,118 మంది గాయపడ్డారు. 2015లో 1,644 రోడ్డు ప్రమాదాల్లో 379 మంది మృత్యువాత పడ్డారు. 1,548మంది గాయపడ్డారు. ట్రాఫిక్ పోలీసుల కార్యాచరణ ట్రాఫిక్ సమస్య పరిష్కారం దిశగా పోలీసులు కార్యాచరణకు ఉపక్రమిం చారు. ప్రత్యమ్నాయ మార్గాలు, ప్రత్యేక ‘బే’లు ఏర్పాటు దిశగా కసరత్తు చేపట్టారు. ట్రాఫిక్ సలహామండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ వెళ్లే బస్సులు, భారీ వాహనాలు ప్రస్తుతం వైవీరావు ఎస్టేట్, సీవీఆర్ ఫై ్లఓవర్, సితార జంక్షన్, గొల్లపూడి మీదుగా వెళ్తున్నాయి. ప్రత్యమ్నాయంగా జి.కొండూరు, కొండపల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లించాలని భావిస్తున్నారు. దశలవారీగా వాహనాలను అ మార్గంలోకి మళ్లించాలని యోచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్లాల్సిన భారీ వాహనాలు విజయవాడలోకి ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ మార్గంపై కసరత్తు చేస్తున్నారు. ఇటీవల గొల్లపూడి నుంచి ఇన్నర్‌రింగ్ రోడ్డు మీదుగా రామవరప్పాడు జంక్షన్‌కు వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీంతో రామవరప్పాడు, ప్రసాదంపాడు, గన్నవరం మార్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. అందుకే వాహనాలను ఇబ్రహీంపట్నం, ముస్తాబాద, కేసరపల్లి మీదుగా మళ్లించాలని భావిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయ మార్గంపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం మీదుగా హనుమాన్ జంక్షన్‌కు వాహనాలను మళ్లించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రోడ్లకు అధిక వాహనాల ట్రాఫిక్‌ను తట్టుకునేంత సామర్థ్యం లేదు. రోడ్ల విస్తరణతోపాటు, కొత్తవి నిర్మించాలని ప్రభుత్వానికి ట్రాఫిక్ పోలీసులు ప్రతిపాదించారు. అంతవరకు దశలవారీగా వాహనాలను ఆ మార్గాల్లో మళ్లించాలని భావిస్తున్నారు. లారీ యజమానులతో సమావేశం నిర్వహించి వారి సూచనలను కూడా తీసుకోనున్నారు. ‘బస్ బే - ఆటో బే’ల ఏర్పాటు విజయవాడలో సిటీ బస్సుల నిలుపుదల కోసం ప్రత్యేకంగా ‘బస్ బే’లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ అధికారులు సర్వే నిర్వహించి నగరంలో 10 ప్రాంతాలను గుర్తించారు. ఆటోలు నిలిపేందుకు ప్రత్యేకంగా ఆటో బేలు ఏర్పాటు చేయనున్నారు. వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని నగరమంతా విస్తరి స్తారు. నిబంధనల ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. రాత్రి వేళల్లో తనిఖీలు ముమ్మరం చేసి 252 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ‘రాజధాని స్థాయికి తగ్గట్లుగా విజయవాడ ట్రాఫిక్ నియంత్రణకు అత్యున్నత ప్రమాణాలు అమలు చేయాలని నిర్ణయించాం. ఎస్పీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా శాస్త్రీయంగా చర్యలు చేపడతాం. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విజయవాడను ట్రాఫిక్ సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం’ - టి. క్రాంతిరాణా, డీసీపీ (ట్రాఫిక్) ట్రాఫిక్ సలహామండలి మెట్రోపాలిటన్ నగరాల మాదిరిగా విజయవాడ కోసం ట్రాఫిక్ సలహా మండలిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్(ఎస్పీఏ) ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు శాస్త్రీయ విధానాలను రూపొందిస్తారు. ఈ సల హామండలిలో ఎస్పీఏ ప్రతినిధులతోపాటు ట్రాఫిక్ పోలీసు,సీఆర్డీఏ, కార్పొరేషన్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఎస్పీఏ సర్వే నిర్వహించి ప్రణాళికను రూపొందిస్తుంది. -
హెల్మెట్ లేకుంటే జరిమానా
సాక్షి, హైదరాబాద్: నగర వ్యాప్తంగా మంగళవారం నుంచి హెల్మెట్ తప్పనిసరి కానుంది. అలాగే బుధవారం నుంచి డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై న్యాయస్థానాల్లో చార్జ్షీట్లు దాఖలు చేయనున్నారు. వీటికి సంబంధించి ప్రత్యేకంగా డేటాబేస్లు సైతం రూపొందిస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ-2 ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నిబంధనలన్నీ మోటారు వాహనాల చట్టంలో సుదీర్ఘ కాలంగా ఉన్నాయని, సుప్రీం కోర్టు నియమిత కమిటీ సిఫార్సుల మేరకు పక్కాగా వీటిని అమలు చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఇకపై రోడ్లపైకి వచ్చే ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనన్నారు. ఉల్లంఘించిన వారికి రూ.100 జరిమానా విధిస్తారు. మరోసారి ఉల్లంఘనకు పాల్పడితే రూ.300 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లోనే హెల్మెట్‌పై స్పెషల్ డ్రైవ్‌లు చేస్తూ రోజుకు 1500 కేసులు నమోదు చేస్తున్నారు. నేటి నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. డ్రైవింగ్ లెసైన్స్ లేకుంటే జైలుకే.. డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ చిక్కితే వారికి జరిమానాతో పాటు వాహన యజమాని, ఉల్లంఘనుడి పైన న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేస్తారు. కోర్టులో నేరం నిరూపితమైతే కనిష్టంగా ఒకరోజు నుంచి గరిష్టంగా వారం రోజుల వరకు ఊచలు లెక్కపెట్టాల్సిందే. బుధవారం నుంచి దీన్ని అమల్లో పెడుతున్నారు. లెసైన్స్ లేకుండా వాహనం నడుపుతూ పదేపదే చిక్కే ఆటోడ్రైవర్ల పర్మిట్ రద్దుకూ సిఫార్సు చేయాలని నిర్ణయించారు. నగరంలో ట్రాఫిక్ వయోలేషన్స్‌కు సంబంధించిన చలాన్లు ఇప్పటి వరకు వాహన నంబర్ ఆధారంగానే జారీ అవుతున్నాయి. ఇకపై వాహనం నడిపినవారి డ్రైవింగ్ లెసైన్స్, ఆధార్, ఓటర్ ఐడీల్ని కూడా నమోదు చేయడం తప్పనిసరి చేయనున్నారు. దీనివల్ల ఓ వ్యక్తి ఎన్ని రకాలైన వాహనాలు మార్చి ఉల్లంఘనలకు పాల్పడ్డాడో తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఈ వివరాలన్నింటినీ డేటాబేస్‌గా రూపొందిస్తున్నారు. తద్వారా పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి డ్రైవింగ్ లెసైన్స్ రద్దుకు సిఫార్సు చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి మంగళవారం ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ట్రాఫిక్ విభాగంలోని అధికారులకు శిక్షణ ఇస్తారు. సుప్రీం సిఫార్సుల మేరకే చర్యలు రోడ్డు ప్రమాదాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల్ని సిఫార్సు చేయడానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సాధికారిక కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నాం. మోటారు వాహనాల చట్టంలో ఉన్న అంశాలనే కమిటీ పునరుద్ఘాటించింది. చార్జ్‌షీట్స్ దాఖలు అనేవి ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన రిపీటెడ్ వయోలేటర్స్కు మాత్రమే అమలు చేస్తాం. ప్రస్తుతం అన్నీ ఆన్లైన్ చేయడంతో వాహన చోదకుల వివరాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు పీడీఏ మిషన్ల సాయంతో సరిచూసుకోవచ్చు. - ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ-2