బీ-ట్రాక్‌కు రూ.11 కోట్లు కేటాయింపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరు ట్రాఫిక్ అభివృద్ధి ప్రాజెక్టు ‘బీ-ట్రాక్’కు రాష్ట్ర మంత్రి వర్గం రూ.11 కోట్లను కేటాయించింది. 2010లో చేపట్టిన ఈ ప్రాజెక్టును విడతల వారీ చేపట్టి 2015 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రి వర్గంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు ..
= ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చేస్తున్న బీసీ విద్యార్థిని, విద్యార్థుల కోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక హాస్టళ్లు. ఒక్కో హాస్టల్‌కు వంద మంది విద్యార్థులు
= తుమకూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలో హిరేహళ్లిలో పండ్ల పరిశోధనకు 25 ఎకరాల కేటాయింపు.
= చిక్కబళ్లాపురం జిల్లా శిడ్లఘట్టలో మెట్ట సేద్యంపై పరిశోధనలకు 84 ఎకరాల కేటాయింపు.
= వ్యవసాయ విశ్వ విద్యాలయాల్లో పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య 23 నుంచి 12కు తగ్గింపు.
= ప్రభుత్వ కళాశాలల్లోని 362 మంది అతిథి ఉపన్యాసకుల బకాయిలు, ఏప్రిల్ వరకు గౌరవ భృతి చెల్లింపునకు రూ.61.16 కోట్ల విడుదల.
= సైబర్ పోలీసు స్టేషన్లలో ఎస్ఐల నియామకానికి విద్యార్హత బీ.టెక్ లేదా బీసీఏగా నిర్ణయం.
= తుమకూరు జిల్లా శిరా తాలూకా చీలేనహళ్లి వద్ద ఆధునిక వధ్య శాలకు 20 ఎకరాల కేటాయింపు. ఇక్కడి నుంచి ఆరోగ్యకరమైన గొర్రె మాంసం బెంగళూరుకు సరఫరా.
= పలు నిబంధనలతో తిరిగి క్వారీయింగ్‌కు అనుమతి. ఇసుక విధానం కూడా దాదాపుగా తయారీ.