trally auto
-
ఆ ట్రాలీ ఆటోని దెయ్యం నడిపిందా?
-
ఆ ట్రాలీ ఆటోని దెయ్యం నడిపిందా?
అహ్మదాబాద్ : గుజరాత్లో ఓ ట్రాలీ ఆటో రోడ్డుపై హల్ చల్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. డ్రైవర్ లేకుండానే దానికదే ప్రయాణింటంతో అంతా అవాక్కవుతున్నారు. భరూచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సరుకులతో ఉన్న ఆ ట్రాలీ రహదారిపైకి ఎక్కేసి ముందుకు సాగింది. ఈ క్రమంలో మోటర్ బైక్ మీద వెళ్తున్న వెంటనే వీడియో తీయటం ప్రారంభించారు. డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత కూడా అది ముందుకు సాగింది. కొద్ది దూరం వెళ్లాక ఓ లారీని తగిలినప్పటికీ.. అది ఆగలేదు. అక్కడ బైక్ పై ఉన్న ఓ వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక ఓ ట్రక్కును ఢీకొట్టి అప్పుడు అది ఆగిపోయింది. ఈ ఘటనలో దాని అద్దం పగిలిపోయింది. ఇక ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహుశా దెయ్యం ఆ ఆటో నడిపి ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తే... ఇండియాలోనే ఇలాంటి ఘటనలు జరుగుతాయని మరికొందరు... ఇంకొందరైతే గూగుల్, యాపిల్, జీఎం లాంటి వాళ్లు చేస్తున్న డ్రైవర్ లెస్ వాహనాల ప్రయోగాల కంటే మనమే ముందున్నామంటూ సెటైర్లు వేస్తున్నారు. -
బైక్‌లపైకి దూసుకెళ్లిన ట్రాలీ ఆటో
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న ట్రాలీ ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని చింతల్ హెచ్ఎంటీ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన ఆటోను ఓ మైనర్ బాలుడు నడుపుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జాం అయింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ బీభత్సం.. ముగ్గురి మృతి
మనుబోలు(నెల్లూరు): వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆపిన ట్రాలీ ఆటోను, ఆ పక్కనే ఉన్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పక్కన నిల్చున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపుడి వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇందుకూరు పేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకయ్య, భాస్కర్ అనే ముగ్గురు వ్యక్తులు తమ గొర్రెలను తీసుకుని చిలుకూరులో జరుగుతున్న సంతకు ఆటోలో వెళ్తున్నారు. కొమ్మలపుడి వద్దకు రాగానే డీజిల్ అయిపోవడంతో వారు దిగి ఆటోను పక్కకు నెడుతుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఆటోతో పాటు ముగ్గురి పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఆటో ట్రాలీలో ఉన్న పది గొర్రెలు కూడా మృతిచెందాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు
నందవరం: కర్నూలు జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. నందవరం మండలం హాలహర్వి సమీపంలో ట్రాలీ ఆటో టైరు పేలడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో రాయచూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మడల్కల్కు చెందిన వారిగా గుర్తించారు.