Trans Troy
-
ట్రాన్స్ట్రాయ్పై డీఆర్‘ఐ’
సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంస్థ ట్రాన్స్ట్రాయ్ ఆర్థిక అక్రమాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దృష్టి సారించింది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం)లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పునాది (డయా ఫ్రమ్ వాల్) పనులు చేసిన బావర్‌కు.. కాఫర్ డ్యామ్‌ల పునాది (జెట్ గ్రౌటింగ్) పనులు చేసిన కెల్లర్ సంస్థకు బిల్లుల చెల్లింపులో ట్రాన్స్ట్రాయ్ నిబంధనలను అతిక్రమించడంపై ప్రధానంగా దర్యాప్తునకు సిద్ధమైంది. తమ దేశ సంస్థలకు ట్రాన్స్ట్రాయ్ ఇవ్వాల్సిన బిల్లులను చెల్లించేలా చూడాలని డీపీఐఐటీ (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్)కు, పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం)కి జర్మనీ రాయబారి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై డీపీఐఐటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరా తీసింది. ట్రాన్స్ట్రాయ్ వద్ద ఆ రెండు సంస్థలు సబ్ కాంట్రాక్టు కింద పనులు చేశాయని.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులున్నీ ట్రాన్స్‌ట్రాయ్‌కి చెల్లించిందని.. బావర్, కెల్లర్‌లకు ట్రాన్స్ట్రాయ్ బకాయి పడిందని, వాటితో తమకు సంబంధం లేదని డీపీఐఐటీకి తేల్చి చెప్పింది. పీఎంవోకూ ఇదే అంశాన్ని నివేదించింది. దీంతో 2015–19 మధ్య కాలంలో పోలవరం బిల్లుల చెల్లింపు వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసి, నివేదిక ఇవ్వాలని పీఎంవో ఆదేశించడంతో డీఆర్ఐ రంగంలోకి దిగింది. బ్యాంకులకు రూ.పది వేల కోట్లను ఎగ్గొట్టడంపై సీబీఐ, రూ.3,822 కోట్లను దారి మళ్లించడంపై ఈడీ ఇప్పటికే ట్రాన్స్ట్రాయ్పై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ట్రాన్స్ట్రాయ్ ముసుగులో స్వాహా ► పోలవరం హెడ్ వర్క్స్‌ను ట్రాన్స్ట్రాయ్–జేఎస్సీ–యూఈఎస్ (జేవీ) రూ.4,054 కోట్లకు దక్కించుకుని 2013 మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. జేవీలో విదేశీ సంస్థలైన జేఎస్సీ, యూఈఎస్ వాటా 87 శాతం. అప్పటి ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ వాటా కేవలం 13 శాతమే. ► చిన్న తరహా ప్రాజెక్టుల పనులే చేయలేని ట్రాన్స్‌ట్రాయ్‌కి 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎలా అప్పగిస్తారని అప్పట్లో విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాయపాటి భారీ ఎత్తున ముడుపులు ఇవ్వడం వల్లే ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్టు దక్కిందంటూ అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేశారు. ► కానీ.. 2014 ఎన్నికలకు ముందు రాయపాటి కాంగ్రెస్‌ను వీడి టీడీపీ తీర్థం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. విభజన చట్టం ప్రకారం పోలవరంను శరవేగంగా పూర్తి చేయడానికి పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ను ఏర్పాటు చేసిన కేంద్రం.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు సూచించింది. ► పీపీఏతో ఒప్పందం చేసుకుంటే సత్తాలేని రాయపాటి సంస్థపై వేటు పడటం ఖాయం. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రం చేపడితే కమీషన్లు వసూలు చేసుకోలేమని భావించిన చంద్రబాబు.. పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా మోకాలడ్డారు. ► ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నాక.. ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి స్వాహాకు తెరతీశారు. కమీషన్ల కోసం కేబినెట్ తీర్మానం తుంగంలోకి.. ► ట్రాన్స్ట్రాయ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో సబ్ కాంట్రాక్టు కింద పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని 2015 అక్టోబర్ 10న కేబినెట్లో అప్పటి సీఎం చంద్రబాబు తీర్మానం చేయించారు. ► ఆ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ట్రాన్స్ట్రాయ్ – సబ్ కాంట్రాక్టు సంస్థలు, పోలవరం ఎస్ఈల పేరు మీదుగా ఎస్క్రో ఖాతాను తెరిచారు. ఆ ఖాతా ద్వారా బిల్లులు చెల్లిస్తామని చూపి.. బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా రూ.300 కోట్ల రుణాన్ని ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇప్పించారు. ► కానీ.. ట్రాన్స్ట్రాయ్ చేసిన పనులకు 2018 జనవరి వరకు రూ.2,362.22 కోట్లను చెల్లిస్తే.. ఇందులో కేవలం రూ.95 కోట్లను మాత్రమే ఎస్క్రో అకౌంట్ ద్వారా చెల్లించారు. మిగతా రూ.2,267.22 కోట్లను నేరుగా ట్రాన్స్‌ట్రాయ్‌కి చెల్లించారు. ► ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లిస్తే రుణం కింద బ్యాంక్ ఆఫ్ బరోడా మినహాయించుకుంటుందని.. కమీషన్లు వసూలు చేసుకోలేమని భావించిన అప్పటి ప్రభుత్వ పెద్ద దాన్ని తుంగలో తొక్కి నేరుగా బిల్లులు చెల్లించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ► రూ.422 కోట్లతో డయా ఫ్రమ్ వాల్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పునాది) పనులను చేయడానికి బావర్ – ఎల్ అండ్ టీ సంస్థ.. రూ.125.91 కోట్లతో జెట్ గ్రౌటింగ్ (కాఫర్ డ్యామ్‌ల పునాది) పనులు చేయడానికి కెల్లర్ సంస్థలు ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందం చేసుకున్నాయి. డయా ఫ్రమ్ వాల్ పనులకు మాత్రమే ఎస్క్రో ఖాతా ద్వారా రూ.95 కోట్లను సర్కార్ చెల్లించింది. మరో రూ.237.09 కోట్ల బిల్లులు నేరుగా చెల్లించారు. ► 2018 నాటికే పనులు పూర్తయినా రూ.89.91 కోట్ల బిల్లులు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ చెల్లించలేదు. జెట్ గ్రౌటింగ్ పనులు చేసిన కెల్లర్ సంస్థకు రూ.44 కోట్లు బకాయిపడ్డారు. 2018 నుంచి 2019 మే వరకు చంద్రబాబు ప్రతి సోమవారం నిర్వహించిన వర్చువల్ రివ్యూల్లో ట్రాన్స్ట్రాయ్ నుంచి ఆ బిల్లులు ఇప్పించాలని ఆ రెండు సంస్థల ప్రతినిధులు కోరినా ఫలితం లేకపోయింది. -
ట్రాన్స్ ట్రాయ్ కేసు సీబీఐ దర్యాప్తులో కీలక మలుపు
-
‘ఎస్క్రో’ నుంచి ఎస్కేప్.. అడ్డదారిలో బిల్లులు
ఎస్క్రో అకౌంట్ అంటే.. ప్రభుత్వం తరఫు అధికారి, ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్లతో కూడిన జాయింట్ అకౌంట్‌నే ఎస్క్రో అకౌంట్ అంటారు. అన్నీ సక్రమంగా ఉంటేనే వీరందరి సంతకాలకు అవకాశం ఉంటుంది. అప్పుడే డబ్బు డ్రా చేసుకోవాలి. ఆ సమయంలో బ్యాంకుల అప్పు మినహాయించుకునే వీలుంటుంది. సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) నిబంధనలనే కాదు.. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాన్ని తుంగలో తొక్కి ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లించకుండా టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి నేరుగా బిల్లులు చెల్లించేలా అప్పటి సీఎం చంద్రబాబు చక్రం తిప్పడాన్ని 14 బ్యాంకుల కన్సార్షియం సీబీఐ దృష్టికి తీసుకెళ్లింది. దీని వల్ల ట్రాన్స్ట్రాయ్ నుంచి రుణాలు వసూలు చేయకుండా చంద్రబాబు పరోక్షంగా అడ్డుకున్నట్లయ్యిందని బ్యాంకుల కన్సార్షియం వాపోతోంది. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్లే ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.300 కోట్ల రుణం ఇచ్చామని, కానీ ఆ మేరకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పును వసూలు చేయలేకపోయామని బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నతాధికారులు సీబీఐకి వివరించినట్లు సమాచారం. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించడంతో ఎస్క్రో అకౌంట్ గుట్టు విప్పడంపై సీబీఐ దృష్టి సారించింది. పోలవరం హెడ్ వర్క్స్‌లో ట్రాన్స్ట్రాయ్ను ముందుపెట్టి పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. తద్వారా లబ్ధిపొందాలని 2015లో అప్పటి ప్రభుత్వ పెద్ద స్కెచ్ వేశారు. కానీ.. ట్రాన్స్ట్రాయ్ వ్యవహార శైలిపై నమ్మకం కుదరని సబ్ కాంట్రాక్టర్లెవరూ పనులు చేయడానికి ముందుకు రాలేదు. 2015 అక్టోబర్ 10న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్, సబ్ కాంట్రాక్టర్లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారి పేరుతో సంయుక్తంగా ‘ఎస్క్రో అకౌంట్’ తెరుస్తామని.. ఆ అకౌంట్ ద్వారానే చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తామని తీర్మానం చేయించారు. మంత్రివర్గం ఆమోదించిన తీర్మానం మేరకు హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎస్క్రో అకౌంట్‌ను తెరిపించారు. సర్కారు హామీతో రూ.300 కోట్ల రుణం పోలవరం హెడ్ వర్క్స్‌లో చేసిన పనులకు ఎస్క్రో అకౌంట్ ద్వారానే బిల్లులు చెల్లిస్తామని.. ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.300 కోట్ల రుణం ఇవ్వాలని అప్పటి సీఎంవోలోని కీలక అధికారి ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నతాధికారులతో నాటి ప్రభుత్వ పెద్ద రాయబారాలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్లే తాము ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.300 కోట్ల రుణం ఇచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు వాపోతున్నారు. హెడ్ వర్క్స్ నుంచి ట్రాన్స్‌ట్రాయ్‌ని 60సీ నిబంధన కింద పూర్తిగా తప్పించే వరకు.. అంటే 2018 జనవరి వరకు చేసిన పనులకు రూ.2,362.22 కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే ఇందులో కేవలం రూ.95 కోట్లను మాత్రమే ఎస్క్రో అకౌంట్ ద్వారా, మిగతా మొత్తం రూ.2,267.22 కోట్లను (ఆడిటింగ్‌లో రూ.5.64 కోట్లు తగ్గింది) నేరుగా ట్రాన్స్ట్రాయ్కే చెల్లించారు. కమీషన్ల కోసం కేబినెట్ తీర్మానం తుంగలోకి.. ట్రాన్స్‌ట్రాయ్‌కి రుణం ఇచ్చిన 14 బ్యాంకుల కన్సార్షియంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఒకటి. ఆ ఖాతా ద్వారా ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు చెల్లిస్తే.. వాటిని అప్పుల కింద కన్షార్షియం మినహాయించుకుంటుంది. దీంతో కమీషన్లు వసూలు చేసుకోవడం కష్టమవుతుందని భావించిన అప్పటి ప్రభుత్వ పెద్ద.. మంత్రివర్గంలో ఆమోదించిన తీర్మానాన్ని తుంగలో తొక్కి, ఇతర బ్యాంకుల ద్వారా బిల్లులు చెల్లించేలా చక్రం తిప్పారు. ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమన్న ఆర్థిక శాఖ అభ్యంతరాలను తోసిపుచ్చారు. పోలవరం హెడ్ వర్క్స్‌లో పనులు జరగాలంటే ట్రాన్స్‌ట్రాయ్‌కి ఆర్థిక వెసులుబాటు కల్పించాలని.. సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే వారు పనులు చేయరని.. దాని వల్లే ఇతర బ్యాంకుల నుంచి బిల్లులు చెల్లించాలని అప్పట్లో తన నిర్ణయాన్ని చంద్రబాబు సమర్థించుకున్నారని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. నిబంధనల ఉల్లంఘనలపై సీబీఐ దృష్టి ఆర్బీఐ నిబంధనల ప్రకారం ట్రాన్స్‌ట్రాయ్‌కి రుణం ఇచ్చిన కన్సార్షియంలోని బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలి. కానీ, ట్రాన్స్ట్రాయ్ రూ.2,261.58 కోట్ల విలువైన లావాదేవీలు ఇతర బ్యాంకుల నుంచి జరిపినట్లుగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ నిర్వహించిన ఆడిటింగ్‌లో వెల్లడైన అంశాన్ని ఆధారాలతో బ్యాంకుల కన్సార్షియం సీబీఐ దృష్టికి తీసుకెళ్లింది. ఎస్క్రో అకౌంట్ నిబంధనను కూడా తుంగలో తొక్కి.. ఆర్బీఐ నిబంధనలను తోసిపుచ్చి ప్రభుత్వం చెల్లింపులు చేసిందని స్పష్టం చేసింది. బ్యాంకుల కన్సార్షియం కన్నుగప్పి.. ఇతర బ్యాంకుల ద్వారా బిల్లులు చెల్లించడంలో అప్పటి సీఎం చంద్రబాబు పాత్ర ఉందన్న ఫిర్యాదుపై సీబీఐ దృష్టి సారించి.. గుట్టువిప్పేందుకు కసరత్తు చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
అవినీతి బురద..అక్రమాలపై పరదా
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో మట్టి పనులు చేయకుండానే చేసినట్లు చూపి.. రూ.112.47 కోట్లు కాజేయడంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించేందుకు రంగం సిద్ధం చేసిందని తెలియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమయ్యారు. కేంద్రం విచారణకు ఆదేశించేలోగా అక్రమాలను కప్పిపుచ్చడానికి పావులు కదుపుతున్నారు. అక్రమంగా కాజేసిన సొమ్ములో ఇప్పటికే రూ.10.57 కోట్లను ఏలూరు పీఏవో(పే అంట్ అకౌంట్స్ విభాగం) ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు చెల్లించే క్రమంలో వసూలు చేసింది. ట్రాన్స్‌ట్రాయ్‌కి బ్యాంకు గ్యారెంటీలను వెనక్కి ఇచ్చి.. వాటి ద్వారా మిగతా రూ.101.89 కోట్లను వసూలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రూ.101.89 కోట్ల బ్యాంకు గ్యారంటీలను ట్రాన్స్‌ట్రాయ్‌కి వెనక్కి ఇచ్చేస్తూ సాక్షాత్తూ సీఎం చంద్రబాబే ఫైల్‌పై రెండు రోజుల క్రితం సంతకం చేయడాన్ని బట్టి చూస్తే కాజేసిన సొమ్ము ఏ బాబు జేబులోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. గుట్టుచప్పుడు కాకుండా రికవరీ చేసే యత్నం పోలవరం ప్రాజెక్టులో మట్టి పనులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లుల రూపంలో ముఖ్యనేత ప్రజాధనాన్ని దోచుకోవడాన్ని మార్చి 24న ‘మట్టిలో రూ.150.93 కోట్లు మింగేశారు’ శీర్షికన ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా బహిర్గతం చేసింది. ఈ కథనంపై స్పందించిన ఆడిటింగ్.. పే అండ్ అకౌంట్స్ విభాగం(పీఏవో) క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసింది. పనులు చేయకుండానే చేసినట్లుగా రికార్డులు సృష్టించి.. రూ.112.47 కోట్లు కాజేశారని ఆడిట్, పీఏవో విభాగాలు నిర్ధారించాయి. కాజేసిన సొమ్మును గుట్టు చప్పుడు కాకుండా రికవరీ చేసి, అక్రమాలను కప్పెట్టాలని పీఏవో విభాగం అధికారులపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారు. అందుకు తలొగ్గిన అధికారులు కాంట్రాక్టర్‌కు 37వ బిల్లును చెల్లించేటపుడు రూ.10.57 కోట్లు మినహాయించుకున్నారు. మిగతా రూ.101.89 కోట్లను రికవరీ చేయాల్సి ఉంది. ఈలోగా పోలవరం ప్రాజెక్టు పనులను ట్రాన్స్ట్రాయ్ నుంచి తప్పించి నామినేషన్ విధానంలో ఇతర కాంట్రాక్టర్లకు అప్పగించారు. దాంతో ట్రాన్స్ట్రాయ్ ఎలాంటి పనులు చేయడం లేదు. కేంద్రం చర్యలపై లీకులు పోలవరం ప్రధాన జలాశయం పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటూ ఏలూరు పీఏవోకు ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపారు. రూ.101.89 కోట్లు రికవరీ చేసేవరకూ బిల్లులు చెల్లించే ప్రశ్నే లేదని తేల్చిచెబుతూ జూలై 10న పోలవరం అధికారులకు ఏలూరు పీఏవో కె.సోమయ్య లేఖ రాశారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన యూసీలను(యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) నిశితంగా పరిశీలించి, ఆడిటింగ్ చేసింది. మట్టి పనులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు చేసుకోవడం.. అందులో కొంత సొమ్మును ఏలూరు పీఏవో అధికారులు రికవరీ చేయడం.. ఇంకా రికవరీ చేయాల్సిన మొత్తం భారీగా ఉండటాన్ని పీపీఏ గుర్తించింది. ఇదే అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు జూలై 16న పీపీఏ సమగ్రంగా నివేదిక ఇచ్చింది. పనులు చేయకుండా భారీ ఎత్తున నిధులు కాజేయడంపై నివ్వెరపోయిన యూపీ సింగ్.. ఈ అంశాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ దోపిడీ పర్వంపై దర్యాప్తునకు కేంద్రం సిద్ధమవుతోందన్న విషయం కేంద్రంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అధికారి దృష్టికి వెళ్లింది. వెంటనే సదరు అధికారి ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేసి, అప్రమత్తం చేసినట్లు సమాచారం. నిధుల స్వాహాపై విచారణకు ఆదేశిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసేలోగా, అక్రమాలను సరిదిద్దుకోవాలంటూ ఆ అధికారి సీఎం చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. లీకువీరుడు సూచన మేరకు.. పోలవరం మట్టి పనుల్లో సాగించిన అక్రమాలను కప్పిపుచ్చుకుని, దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు కేంద్రంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న లీకువీరుడి సూచనల మేరకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ట్రాన్స్ట్రాయ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో ఆ సంస్థ నుంచి రికవరీ చేయడం సాధ్యం కాదని భావించిన చంద్రబాబు మదిలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పోలవరం హెడ్ వర్క్స్‌ను దక్కించుకుని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సమయంలో బ్యాంకు గ్యారంటీగా చూపిన నిధులను ఆ సంస్థకు వెనక్కి ఇచ్చి.. వాటినే రికవరీ చేస్తూ ఏలూరు పీఏవో వద్ద జమా చేసేలా వ్యూహం రచించారు. ఇందులో భాగంగా ట్రాన్స్‌ట్రాయ్‌కి బ్యాంకు గ్యారంటీలను వాపసు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలవరం సీఈ శ్రీధర్ గత నెల 3న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేలా చక్రం తిప్పారు. ఆ ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేయాలంటూ జలవనరుల శాఖ అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ట్రాన్స్‌ట్రాయ్‌తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలోని 47(1) నిబంధన ప్రకారం.. ప్రాజెక్టు పనులు పూర్తయ్యే వరకూ బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చిచెప్పారు. బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇవ్వాలంటే ఆ నిబంధనను సడలించాలని, అది తమ పరిధిలో లేదని స్పష్టం చేశారు. దాంతో ఆ ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపాలంటూ చంద్రబాబు ఆదేశించారు. ఆ మేరకు జలవనరుల శాఖ పంపిన ఫైల్‌ను ఆర్థిక శాఖ తోసిపుచ్చింది. ఆ నిబంధనను సడలించే అధికారం తమ పరిధిలో లేదని పేర్కొంది. దాంతో సీఎం చంద్రబాబు ఆ నిబంధనను సడలిస్తూ, ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.101.89 కోట్ల బ్యాంకు గ్యారంటీని వెనక్కి ఇచ్చే ఫైల్‌పై రెండురోజుల క్రితం సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వెలువడనున్నాయి. ఆ ఉత్తర్వులు వెలువడిన వెంటనే బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చి, వాటిని ఏలూరు పీఏవో విభాగంలో జమా చేసేలా మాస్టర్ ప్లాన్ వేశారు. ఒక తప్పును దిద్దుకునే క్రమంలో మరో తప్పు పోలవరం హెడ్ వర్క్స్‌ను రూ.4,054 కోట్లతో పూర్తి చేసేందుకు 2013 మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో ట్రాన్స్ట్రాయ్ ఒప్పందం చేసుకుంది. అదే సమయంలో ఆ సంస్థకు ప్రభుత్వం రూ.314.86 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించింది. నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ రూపంలో ట్రాన్స్ట్రాయ్ సంస్థ ప్రభుత్వం వద్ద రూ.52 కోట్లను డిపాజిట్ చేసింది. పనులు పూర్తయిన తర్వాత బ్యాంకు గ్యారంటీని ప్రభుత్వం వడ్డీతో సహా కాంట్రాక్టర్‌కు చెల్లిస్తుంది. పనులు ప్రారంభమైన తర్వాత చెల్లించే తొలి బిల్లు నుంచే 10 శాతం చొప్పున మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను వడ్డీతోసహా వసూలయ్యే వరకూ ప్రతి బిల్లులోనూ ప్రభుత్వం మినహాయించుకోవాలి. ట్రాన్స్ట్రాయ్ నుంచి మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను వసూలు చేయకపోగా కేబినెట్లో తీర్మానం చేసి మరీ 2017 ఫిబ్రవరి 6న రూ.95 కోట్లను మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చేశారు. దాంతో మొబిలైజేషన్ అడ్వాన్స్ రూ.409.86 కోట్లకు చేరుకుంది. 2013 మార్చి 2 నుంచి ఇప్పటివరకూ రూ.314.86 కోట్లపై.. 2017 ఫిబ్రవరి 6 నుంచి రూ.95 కోట్లపై ఇప్పటిదాకా వడ్డీ రూ.200 కోట్లు అయ్యింది. అసలు, వడ్డీ కలిపి రూ.609 కోట్ల మేర ట్రాన్స్ట్రాయ్ సర్కార్‌కు బకాయిపడింది. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయకుండా ఎప్పటికప్పుడు సడలింపును ఇస్తూ కేబినెట్లో తీర్మానం చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన సడలింపు గడువు ఈ నెల 30తో ముగియనుంది. హెడ్ వర్క్స్‌లో పనులన్నీ ఇతర కాంట్రాక్టర్లకు అప్పగించారు. కాంట్రాక్టర్లు చేసిన పనులకు గాను వారికే బిల్లులు చెల్లిస్తున్నారు. ట్రాన్స్ట్రాయ్ పనులు చేయకపోవడంతో ఆ సంస్థకు బిల్లులు చెల్లించే అవకాశం లేదు. దాంతో ట్రాన్స్ట్రాయ్ నుంచి మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఎలా వసూలు చేయాలో తెలియక అధికారులు అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు బ్యాంకు గ్యారంటీ, వడ్డీలను కలిపి రూ.101.89 కోట్లు వెనక్కి ఇచ్చేస్తే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఎలా వసూలు చేస్తామని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఒక తప్పును దిద్దుకునే క్రమంలో ప్రభుత్వం మరో తప్పు చేస్తోందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు చెప్పారు. -
పోలవరం పనులకు బ్రేక్
సాక్షి, పోలవరం : ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా పోలవరం ప్రాజెక్టు పరిస్థితి తయారైంది. ప్రాజెక్టు నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. నిర్మాణ సంస్థ తీరు కారణంగా పోలవరం పనులు మరోసారి ఆగిపోయాయి. రెండు మూడు నెలలుగా ట్రాన్స్ ట్రాయ్ జీతాలు ఇవ్వడం లేదంటూ విధులు బహిష్కరించి నిన్నటి నుంచి కార్మికులు, ఉద్యోగులు నిరసనకు దిగారు. నేడు పూర్తి స్థాయిలో పనులు ఆపివేశారు. దీంతో కాంక్రీటు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇంత జరుగుతున్నప్పటికీ ఇరిగేషన్ అధికారులు మాత్రం స్పందించడం లేదు. దివాలా దిశగా పయనిస్తున్న ట్రాన్స్ట్రాయ్ రుణాలు చెల్లించకపోవడంతో దేనా బ్యాంకు అధికారులు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆ సంస్థకు చెందిన వాహనాలను, సాంకేతిక యంత్రాలను సీజ్ చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులకు సంస్థ స్పందించపోవడంతో దేనా బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి నాలుగు రోజులు కాకమునుపే ఇప్పుడు పోలవరం పనులకు మళ్లీ బ్రేక్ పడింది. 200 మందికి పైగా డ్రైవర్లు, ఆపరేటర్లు, సూపర్ వైజర్లు, సాంకేతిక సిబ్బంది విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. పోలవరం వెళ్లే రోడ్డులో రాళ్లు, టైర్లు పెట్టి వారు తమ ఆందోళనను తెలుపుతున్నారు. వీరంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వారే. కాగా, ఇంత జరుగుతున్నా కూడా ట్రాన్స్స్టాయ్కు వత్తాసు పలుకుతున్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకుండా పోతోందని అంటున్నారు. -
ట్రాన్స్ట్రాయ్కు అ‘ధనం’ ఇచ్చేలా నివేదిక
సాక్షి, అమరావతి: పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం) కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి అదనపు బిల్లులు ఇచ్చేలా నివేదిక ఇవ్వాలంటూ త్రిసభ్య కమిటీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. సోమవారం సీఎం, త్రిసభ్య కమిటీ పోలవరం పనులను పరిశీలించింది. పనుల ప్రగతిపై సమీక్ష అనంతరం జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, త్రిసభ్య కమిటీ సభ్యులు ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సలహాదారు భార్గవ, పీపీఏ సభ్య కార్యదర్శి డాక్టర్ ఆర్కే గుప్తాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆదివారం తాము నిర్వహించిన సమావేశంలో గుర్తించిన అంశాలను త్రిసభ్య కమిటీ సీఎం చంద్రబాబుకు వివరించింది. కాంట్రాక్టర్, ప్రభుత్వాల మధ్య మార్చి 3, 2013న జరిగిన ఒప్పందం ప్రకారం వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. అప్పట్లో ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచారని, కాంట్రాక్టర్ అధికంగా పనిచేసినా, తక్కువ పనిచేసినా ప్రభుత్వానికి సంబంధం ఉండదని పేర్కొంది. టెండర్లలో ఇతరులతో పోటీ పడి 14.55 శాతం తక్కువ ధరలకు కోట్ చేసి పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు అన్ని విషయాలపై అవగాహన ఉండే ఉంటుంది కదా? అని పీపీఏ సభ్య కార్యదర్శి డాక్టర్ ఆర్కే గుప్తా ప్రశ్నించినట్లు సమాచారం. కాంట్రాక్టర్ ఐదు అంశాలకు సంబంధించి అదనపు బిల్లుల కోసం క్లెయిమ్‌లు పంపినట్లు సీఎం చంద్రబాబుకు త్రిసభ్య కమిటీ వెల్లడించింది. తొందరగా తేల్చేయండి.. అదనపు బిల్లులకు సంబంధించిన క్లెయిమ్‌ల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ సమావేశమై ఏదో ఒక నిర్ణయాన్ని త్వరగా వెల్లడించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తక్కువకు టెండర్లు కోట్ చేయడం వల్ల కాంట్రాక్టర్ నష్టపోయారని, ఈ నేపథ్యంలో అదనపు బిల్లులకు సంబంధించిన క్లెయిమ్‌లపై సానుకూలంగా నివేదిక ఇవ్వాలని త్రిసభ్య కమిటీని కోరినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీపై ఒత్తిడి తెచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ మంగళవారం మరోసారి విజయవాడలో సమావేశం కావాలని నిర్ణయించింది. పోలవరం పనులు ట్రాన్స్‌ట్రాయ్‌కి సాక్షి ప్రతినిధి,ఏలూరు/పోలవరం రూరల్: ట్రాన్స్ట్రాయ్ పనులు సక్రమంగా చేయనందున 60 సీ నిబంధన కింద నోటీసు ఇచ్చి కొత్తగా టెండర్లు పిలిచామని, అయితే కొత్త సంస్థలతో కలసి కన్సార్షియంగా ఏర్పడితే ఆ పనులు ట్రాన్స్ట్రాయ్కు ఇవ్వడానికి తమకు ఇబ్బంది లేదని చంద్రబాబు ప్రకటించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన తర్వాత సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన చంద్రబాబు సుమారు రెండు గంటల పాటు పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన అనంతరం లేవనెత్తిన అంశాలపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుకు అడ్డుపడేవారికి సహకరించవద్దని మీడియాను కోరారు. స్పిల్‌వే కాంక్రీట్ ఎర్త్‌వర్క్ పనుల్లో 15 రోజులుగా పురోగతి లేకపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్ ‘వరం’
టెండర్ నిబంధనలను సవరించి మరీ రూ. 200 కోట్ల చెల్లింపులు తొలుత అంగీకరించని ఆర్థిక శాఖ.. ప్రభుత్వ పెద్ద ఆదేశంతో చివరకు విడుదల సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్కు 200 కోట్ల రూపాయలను అడ్వాన్స్‌గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. టెండర్ నిబంధనలను సవరించి మరీ ఈ చెల్లింపులను చేశారు. గత ప్రభుత్వంలోనే ట్రాన్స్ట్రాయ్ సంస్థ మిషనరీ కొనుగోలు చేసినందున మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని కోరింది. అయితే ఆర్థిక శాఖ మాత్రం టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ట్రాయ్ పేరుమీద మిషనరీని కొనుగోలు చేసినందున మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపు సాధ్యం కాదంది. ప్రధాన వాటా రష్యాకు చెందిన జేఈఎస్యూఐఎస్ (యునెటైడ్ ఇంజనీరింగ్ సర్వీసు) సంస్థ అయినందున ఆ కంపెనీ పేరుమీదనే మిషనరీ కొనుగోలు చేయాలనేది టెండర్ నిబంధనలో ఉంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ట్రాన్స్ట్రాయ్ సంస్థ యాజమాన్యం ప్రభుత్వ పెద్దలపై మొబిలైజేషన్ అడ్వాన్స్ కోసం ఒత్తిడి తెచ్చింది. ఆ పెద్దలు ఆ మొత్తం చెల్లించాల్సిందిగా ఆర్థిక శాఖను కోరారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం సాధ్యం కాదని, కాంట్రాక్టులో 13 శాతమే వాటా ఉన్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ పేరు మీద మిషనరీ కొనుగోలు చేసినందున టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వలేమని ఆ శాఖ అధికారులు తొలుత పేర్కొన్నారు. పోలవరం కాంట్రాక్టులో 87 శాతం వాటా రష్యాకు చెందిన జేఈఎస్యూఐఎస్ కంపెనీది. జాయింట్ వెంచర్ అయినందున రెండు సంస్థల పేరుమీదనే మిషనరీ కొనుగోలు చేయాల్సి ఉందని, అలా కాకుండా ట్రాన్స్ట్రాయ్ పేరుతో కొనుగోలు చేసినందున మొబిలైజేషన్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. దీంతో ఏకంగా ప్రభుత్వ పెద్ద జోక్యం చేసుకున్నారు. అవసరమైతే టెండర్ నిబంధనలను సవరించి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని ఆదేశించారు. జాయింట్ వెంచర్ పేరు మీద మిషనరీ కొనుగోలు చేయకపోయినా సరే పోలవరం ప్రాజెక్టు కోసం ట్రాన్స్ట్రాయ్ సంస్థ కొనుగోలు చేసినందున మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వొచ్చంటూ టెండర్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దీంతో రూ.200 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అంగీకరించింది. అంతకుముందే ట్రాన్స్ట్రాయ్ సంస్థకు మూడు శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది. సుమారు 140 కోట్ల రూపాయలు గతంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినా ఇప్పటి వరకు ఒక్క తట్ట మట్టి తీయలేదని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ఇప్పుడు మిషనరీ కొనుగోలు అంటూ బిల్లులు చూపెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ పొందాలని ఎత్తుగడ వేశారని, మిషనరీ కొనుగోలుపైనా అనుమానాలున్నాయని అంటున్నాయి. తాజాగా ఇచ్చిన 5 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్‌తో మొత్తం ఇప్పటి వరకు 8 శాతం మేర అడ్వాన్స్ (రూ.340 కోట్లు) ఇచ్చినట్లయింది.