Transfer GO
-
32 మంది పోలీసులను బదిలీ చేసిన కర్నూలు ఎస్పీ
సాక్షి, కర్నూలు: పోలీసుశాఖలో అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన 32 మందిపై బదిలీ వేటు పడింది. కర్నూలు ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి 32 మంది పోలీసులను బదిలీ చేశారు. ముగ్గురు ఏఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లు..17 మంది కానిస్టేబుళ్లను ఎస్పీ బదిలీ చేశారు. వారు పనిచేస్తున్న స్థానాల నుంచి తప్పించి మరో ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మట్కా, గుట్కా, అక్రమ మద్యం వ్యవహారాల్లో ఆరోపణలు నేపథ్యంలో బదిలీ చేసినట్లుఓ తెలుస్తోంది. ప్రస్తుతం బదిలీ వేటు పోలీసుల శాఖలో చర్చనీయాంశంగా మారింది. -
బదిలీ జీవోలపై ఏపీ ఉద్యోగ సంఘాలు అసంతృప్తి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులను బదిలీ చేస్తూ జారీ చేసిన జీవోపై ఏపీ ఎన్జీఓలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కలిసి తమ అసంతృప్తిని ఉద్యోగ సంఘాలు వెళ్లగక్కాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెంటనే మార్పులు చేయాలని చంద్రబాబుకు ఏపీ ఎన్జీఓలు సూచించారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అంటూ విడదీయడం, విభజించడం బాధాకరమని ఏపీఎన్జీవోలు అన్నారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని మార్పులు చేయాలని ముఖ్యమంత్రికి ఏపీఎన్జీవోలు సూచించారు.