Transfers officers
-
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) డైరెక్టర్ జనరల్ అధర్‌సిన్హాను పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఎ.వాణీప్రసాద్‌ను ఈపీటీఆర్ఐ కొత్త డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వెయిటింగ్లో ఉన్న కె.నిర్మలను ప్రభుత్వ రంగ సంస్థల కార్యదర్శిగా బదిలీ చేసి ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి జయేశ్‌రంజన్‌ను తప్పించారు. కె.మనిక్కారాజ్‌ను రెవెన్యూ శాఖ కార్యదర్శిగా బదిలీచేస్తూ ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి రాహుల్ బొజ్జాను తప్పించారు. పౌసుమి బసు, శ్రుతి ఓఝాలను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా, ఎం.హరితను విద్యాశాఖ ఉప కార్యదర్శిగా, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రను ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా బదిలీచేశారు. -
‘మార్పు’ మంచిదేగా!
పోలీసులంటే..ప్రజా రక్షకులు. శాంతిభద్రతల పరిరక్షకులు. జనం మాన, ప్రాణాలను, ఆస్తులను కాపాడుతూ..వారితో మమేకమై పనిచేయాల్సిన బాధ్యత వారిది. కానీ ‘మమేకం’ అనేది మాటలకే పరిమితమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణ సంగతి పక్కనపెడితే...వారి వ్యవహారశైలి ప్రజల అసంతృప్తికి కారణమవుతోంది. స్టేషన్ మెట్లెక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. కానీ నేడు ఆ శాఖలో చేపడుతున్న ప్రక్షాళన చర్యలు ఈ పరిస్థితిలో మార్పు తీసుకొస్తాయన్న ఆశలను రేకెత్తిస్తున్నాయి. సాక్షి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లా పోలీసు శాఖలో భారీ మార్పులు జరిగాయి. డీఎస్పీలు మొదలుకుని కానిస్టేబుళ్ల వరకు బదిలీ అయ్యారు. దాదాపు అన్ని సర్కిళ్లకు కొత్త సీఐలు వచ్చారు. ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన ఎస్ఐలను కూడా బదిలీ చేశారు. ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, భారీసంఖ్యలో కానిస్టేబుళ్లు సైతం ఇటీవల బదిలీ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని స్టేషన్లలోనూ ‘కొత్త ముఖాలు’ కొలువుదీరిన నేపథ్యంలో పోలీసు శాఖ పనితీరులో మార్పుపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. సీఐలే కీలకం.. పోలీసు శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్ల పాత్ర కీలకం. కేసులను లోతుగా దర్యాప్తు చేయాలంటే వీరి వల్లే సాధ్యం. స్టేషన్లలో కొన్ని సంస్కరణలు చేయాలన్నా వీరి పరిధిలోనే ఉంటుంది. రెండు,మూడు స్టేషన్లకు బాధ్యులుగా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సీఐల బదిలీలు దాదాపు పూర్తయ్యాయి. కొందరు స్టేషన్ల వరకే మారగా.. మరికొందరు ట్రాఫిక్, ఏసీబీ, ఎస్బీ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాలకు బదిలీ అయ్యారు. లా అండ్ ఆర్డర్‌కు వచ్చిన వారంతా శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. జిల్లాలోని స్టేషన్లలో పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి. వీటిని ఏ మేరకు పరిష్కరిస్తారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో భారీ పోలీసు వ్యవస్థ జిల్లాలో భారీ పోలీసు వ్యవస్థ అందుబాటులో ఉంది. 83 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. దాదాపు 32 స్టేషన్లకు ఎస్‌హెచ్‌ఓలుగా సీఐలే ఉన్నారు. వీటి పరిధిలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే ప్రజా విజ్ఞప్తుల దినంలో వచ్చే అర్జీలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ పరిస్థితి మారాలి! మామూళ్లు ఇవ్వనిదే పోలీసులు పలికే పరిస్థితి లేదని సామాన్యులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వసూళ్ల కోసం కొన్ని స్టేషన్లలో మఫ్టీ బృందాలను నియమించుకున్నారు. మరికొన్ని స్టేషన్లలో రైటర్లదే రాజ్యం. ముఖ్యంగా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న స్టేషన్లలో ప్రతి పనికీ చేయి తడపాల్సిందే. ఏదైనా పనిపై స్టేషన్‌కు వెళితే కనీసం రూ.5 వేలు ముట్టజెప్పాల్సి వస్తోంది. రాష్ట్ర సరిహద్దు కావడంతో కర్నూలు మీదుగా నిత్యం భారీ వాహనాలు వెళ్తుంటాయి. వాటి నుంచి ఏదో రూపంలో మామూళ్లు దండుకోవడం పోలీసులకు అలవాటుగా మారింది. ఇలాంటి వాటిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే పలు ప్రాంతాల్లో రాత్రిపూట గస్తీ పెంచాల్సిన అవసరం ఉంది. పాత నేరస్తులపై నిఘా పెరగాలి. వారి కదలికలపై నిత్యం ఆరాతీస్తే తప్ప దొంగతనాలకు అడ్డుకట్ట పడదు. ఇటీవల కర్నూలు శివారులోని దిన్నెదేవరపాడు రోడ్డులో రెండు కుటుంబాలపై దాడి చేసి.. దోపిడీకి పాల్పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగర పరిధిలో ఆరుగురు సీఐలు కర్నూలు నగర పరిధిలో నాలుగు స్టేషన్లతో పాటు కర్నూలు అర్బన్ తాలూకా, రూరల్ తాలూకా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో ఈ ఆరు స్టేషన్లకూ ఎస్‌హెచ్‌ఓలుగా సీఐలే వ్యవహరిస్తున్నారు. వీరి పరిధిలోనే స్టేషన్ల పర్యవేక్షణ ఉంటుంది. పెద్ద కేసులన్నీ వీరే చూస్తుంటారు. ప్రస్తుతం ఆరు స్టేషన్లలోనూ కొత్తవారు కొలువుదీరారు. వీరి ఆధ్వర్యంలో నగరంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొంతకాలంగా నగరంలో దొంగతనాలు పెరిగాయి. ఇళ్ల ముందు పార్క్ చేసి ఉంచిన వాహనాలు మాయమవుతున్నాయి. రౌడీషీటర్లు పేట్రేగిపోతున్నారు. వివాదాలు ఎక్కువయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి దోపిడీ ముఠాలు సునాయాసంగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. పోలీసులు రాత్రిళ్లు గస్తీ మరిచారు. ఈ నేపథ్యంలో దొంగలు తడాఖా చూపుతున్నారు. వీటిపై నూతన సబ్‌డివిజన్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. పేరుకుపోయిన పెండింగ్ కేసులు పోలీసు స్టేషన్ స్థాయి నుంచి సబ్‌డివిజన్ స్థాయి వరకు పెండింగ్ కేసులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. బాధితులు తమ కేసులు పరిష్కారం కావడం లేదంటూ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఒక వైపు అధికారులు చెబుతున్నప్పటికీ.. కర్నూలు మీదుగా వెళ్లే రెండు జాతీయ రహదారుల్లోనూ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రతి సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు కొరవడ్డాయి. కొత్త అధికారుల పాలనలోనైనా శాంతిభద్రతలు గాడిన పడతాయని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. -
రవాణాశాఖలో ప్రారంభమైన బదిలీల ప్రక్రియ
సాక్షి, ఒంగోలు: రవాణాశాఖలో బదిలీల ప్రక్రియకు కసరత్తు ప్రారంభమైంది. రవాణాశాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సీనియర్ అసిస్టెంట్, హెడ్‌కానిస్టేబుల్ వరకు బదిలీలను జోనల్ స్థాయి ఉప రవాణాశాఖ కమిషనర్ నిర్వహిస్తారు. అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, పరిపాలనాధికారి పోస్టులకు సంబంధించి బదిలీల ప్రక్రియను జోనల్ డీటీసీ స్థాయిలో పర్యవేక్షించి అభ్యర్థుల నుంచి ఆప్షన్ ఫారాలను తీసుకుని ప్రధాన కార్యాలయానికి పంపుతారు. వారు వాటిని పరిశీలించి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. అందులో భాగంగా శుక్రవారం జోన్ నెల్లూరు ఉప రవాణాశాఖ కమిషనర్ ఎన్.శివరామప్రసాద్ గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులు, సిబ్బందితో కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన కసరత్తును స్థానిక రవాణాశాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో చేపట్టారు. ముందుగా రవాణాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఒకే ప్రాంతంలో 5 సంవత్సరాలు పనిచేసిన వారికి బదిలీలు తప్పనిసరి. కనీసం రెండు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో పనిచేసినవారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. స్పౌజ్ కేటగిరీ, దివ్యాంగులకు సంబంధించిన అంశాల్లో మినహాయింపులు వర్తిస్తాయని తెలిపారు. 2020 మార్చి 31 నాటికి రిటైరయ్యే వారికి బదిలీలు నిర్వహిస్తారన్నారు. ప్రతి విభాగంలోను సీనియార్టీ ప్రకారమే బదిలీలు ఉంటాయన్నారు. ఎవరైనా బదిలీకి అర్హులైన, ఆసక్తి ఉన్నవారు తాము పనిచేస్తున్న ప్రదేశం కాకుండా మరో మూడు ప్రాంతాలను ఎంచుకోవాలని సూచించారు. తమ ఆప్షన్లు పూర్తిచేసి సంబంధిత ఆప్షన్ ఫారంను అందజేస్తే ఉన్నతాధికారులకు త్వరగా పంపుతామని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం జారీ చేసిన జూలై 5వ తేదీలోగా బదిలీలు పూర్తి చేస్తారని పేర్కొన్నారు. అయితే మూడు జిల్లాల్లో కలిపి 60 మంది వరకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా. సమావేశంలో జిల్లా ఉప రశాణాశాఖ కమిషనర్ సీహెచ్‌వీకే సుబ్బారావు, గుంటూరు ఉపరవాణాశాఖ కమిషనర్ రాజారత్నం, నరసరావుపేట ఆర్టీవో కెవి సుబ్బారావు, ఏపీ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్, గుంటూరు ఆర్టీవో వై.రామస్వామి హాజరయ్యారు. -
బదిలీల టెన్షన్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఆరునెలలకు పైగా కొనసాగిన ఎన్నికల కోడ్ ఇటీవలే ముగిసింది. కోడ్ నేపథ్యంలో ఎన్నికల ముందు బదిలీలు అయిన రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డిలను రెండు రోజుల క్రితమే వారి వారి పూర్వస్థానాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరుగుతాయని స్పష్టమవుతోంది. పలు ప్రభుత్వ విభాగాల ప్రక్షాళనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో పై స్థాయి నుంచి రెవెన్యూ డివిజన్ అధికారుల వరకు స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు జిల్లా స్థాయి ముఖ్య అధికారులు పలువురు బదిలీలకు సిద్ధమవుతున్నారు. సెలవులో కలెక్టర్, కమిషనర్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతాయని స్పష్టం కావడంతో అధికారులు అందుకు సిద్ధమయ్యే ఉన్నారు. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి జిల్లాల పునర్విభజన నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్ల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో సాధారణంగా జరిగే బదిలీల్లో భాగంగా వీరికి స్థాన చలనం తప్పనిసరి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వీరి బదిలీ జరుగుతుందని ఉన్నత వర్గాల్లో ఇప్పటికే చర్చలు సాగాయి. ఈ మేరకు వారు కూడా అందుకు సిద్ధపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత ఇద్దరు జిల్లా ఉన్నతాధికారులు వ్యక్తిగత పనులపై సెలవుల్లో వెళ్లిపోయారు. కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఈ నెల 16 వరకు సెలవులోనే ఉండడం గమనార్హం. ఈ లోపు బదిలీల ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఐజీ, డీఐజీ సైతం.. కరీంనగర్ రేంజ్ ఐజీ వై.నాగిరెడ్డి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు ఐజీగా వ్యవహరిస్తున్నారు. నార్త్ జోన్ పరిధిలోని వరంగల్, కరీంనగర్ రేంజ్‌లకు ఆయనే ఐజీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జరిగే బదిలీల్లో నాగిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే డీఐజీ ప్రమోద్‌కుమార్‌కు ఇటీవలే ఐజీగా పదోన్నతి లభించింది. ఆయనను ఐజీగా ఏదైనా జోన్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా జిల్లాల్లో సైతం... రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా తిరిగి పాత స్థానానికి వచ్చిన కృష్ణ భాస్కర్‌ను కొనసాగిస్తారా? సాధారణ బదిలీల్లో మారుస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. సిద్దిపేట ప్రత్యేక అవసరాల దృష్ట్యా ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని సిరిసిల్ల నుంచి సిద్దిపేటకు బదిలీ చేసినప్పటికీ, సిరిసిల్లకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే బదిలీ అయి ఏడాది కూడా పూర్తి కానందున అక్కడే కొనసాగవచ్చు. ఇక జగిత్యాల జిల్లా ఏర్పాటైన నాటి నుంచి కలెక్టర్‌గా కొనసాగుతున్న శరత్‌కు ఈసారి స్థాన చలనం తప్పనిసరి. ఇక్కడ ఎస్పీగా సింధూశర్మ బాధ్యతలు స్వీకరించి కూడా ఏడాది పూర్తి కాలేదు. అయితే సింధూశర్మ భర్త శశాంక జోగులాంబ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున ఆమె హైదరాబాద్ వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ గత సంవత్సరమే బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన బదిలీ ఉండకపోవచ్చని సమాచారం. పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, కలెక్టర్ శ్రీదేవసేన సైతం వచ్చి ఏడాది కూడా కానందున వీరిని యథాస్థానాల్లో కొనసాగించే అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు అన్ని జిల్లాల్లోని డీఆర్ఓ, ఆర్డీవో, ఇతర శాఖల్లోని కీలకస్థానాల్లో ఉన్న అధికారులకు సైతం బదిలీ వేటు తప్పదని, ఈ మేరకు పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతుందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర స్థాయి బదిలీల తరువాతే జోన్లలో.. రాష్ట్ర స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల ప్రక్రియ పూర్తయిన తరువాతే జిల్లా స్థాయిల్లో అధికారుల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐజీ, డీఐజీ నుంచి కమిషనర్ల వరకు బదిలీల జాబితాలో ఉన్నందు వల్ల కొత్త అధికారులు వచ్చిన తరువాత పోలీస్ శాఖలోని ఏసీపీ తరువాత స్థాయి అధికారులను మార్చే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్‌లోని జిల్లా కేంద్రాల్లో, కొన్ని మండలాల్లో సీఐ, ఎస్ఐ స్థాయిల్లో బదిలీలన్నీ వీరి నేతృత్వంలోనే జరుగుతాయి. కరీంనగర్లో కోరుకున్న స్థానాలకు బదిలీ కావాలని కొందరు సీఐలు ప్రయత్నిస్తున్నప్పటికీ, కమిషనర్ కమలాసన్‌రెడ్డి వేచిచూసే ధోరణితోనే ఉన్నట్లు సమాచారం. మండలాల్లో తహసీల్ధార్లు, ఎంపీడీవోల బదిలీలకు రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు లింక్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా ఎన్నికలు ముగిసిన వెంటనే బదిలీలపై అధికార యంత్రాంగంలో టెన్షన్ పెరుగుతోంది. -
ఎన్నికల బదిలీలు..
కరీంనగర్‌సిటీ: జిల్లాలో డిసెంబర్లో జరిగే శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తప్పనిసరి బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జిల్లా పరిధిలో మూడేళ్లకు పైగా విధులు నిర్వహించిన, సొంత జిల్లాలకు చెందిన అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. జిల్లావ్యాప్తంగా 13 మంది తహసీల్దార్లను ఇతర జిల్లాలకు కేటాయించారు. అలాగే 12 మంది ఇతర జిల్లాలకు చెందిన తహసీల్దార్లను కరీంనగర్ జిల్లాకు కేటాయించారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు జరిగే సమయాల్లో కచ్చితంగా దీర్ఘకాలికంగా జిల్లాలో విధులు నిర్వహించే, సొంత జిల్లా వర్తించే అధికారులను బదిలీ చేయడం సాధారణంగా మారింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేస్తున్న క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అధికారుల నుంచి ఎలాంటి సహకారం లభించకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ దృష్టి సారిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో పనిచేసిన వివిధ శాఖల అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉంటాయని భావించి బదిలీలు చేపట్టారు. బదిలీలకు సంబంధించి 2018 నవంబర్ 30 నాటికి కటాఫ్‌గా తీసుకోవాలని ఈసీ నిర్ణయించింది. ఈ తేదీ నాటికి ఏ పోస్టింగులోనైనా మూడేళ్లు పూర్తి చేసుకునే అధికారులను తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 57 మండలాలతోపాటు కొత్తగా ఏర్పడిన 14 మండలాలతో కలిపి 71 మండలాలలో తహసీల్దార్లు పనిచేస్తున్నారు. వీరంతా ఎన్నికల విధుల్లో సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. దాదాపు 15 మండలాల్లో డీటీలు ఇన్చార్జి తహసీల్దార్లుగా ఉన్నారు. వీరిలో దాదాపు సగానికి పైగా బదిలీలు జరిగాయి. ఎన్నికల సమయంలో సంబంధిత అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటే ఏదైనా సందర్భంలో అవకతవకలకు ఆస్కారముంటుందని ఈసీ భావించింది. రెవెన్యూ యంత్రాంగంలో తహసీల్దార్లతోపాటు ఎంపీడీవోలు, పోలీసులకూ బదిలీలు తప్పవు. ఎంపీడీవోల బదిలీలపై కసరత్తు సాగుతోంది. అయితే.. ఎంపీడీవోలను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన తీసుకోవాలా? కొత్త జిల్లాల ప్రామాణికమా? అనే విషయంపై ఉన్నత స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించే ఆర్డీవోల బదిలీ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. కరీంనగర్‌కు ఇటీవలే కొత్త ఆర్డీవో, డీఆర్వోలను కూడా కేటాయించారు. కరీంనగర్ నుంచి ఇతర జిల్లాలకు.. కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న 13 మంది తహసీల్దార్లను ఇతర జిల్లాలకు కేటాయిస్తూ సీసీఎల్ఏ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో సీహెచ్ కోమల్‌రెడ్డి జగిత్యాలకు, డి.రాజయ్య జగిత్యాలకు, జి.సవిత జగిత్యాలకు, బి.రాజేశ్వరి జగిత్యాలకు, ఎన్.వెంకట్‌రెడ్డి జగిత్యాలకు, జె.జయంత్ పెద్దపల్లికి, కె.రమేశ్ పెద్దపల్లికి, టి.రవీందర్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు, చిల్ల శ్రీనివాస్ కొమురంభీం ఆసిఫాభాద్‌కు, సయ్యద్ ముబీన్ అహ్మద్ మంచిర్యాలకు, జి.సదానందం వరంగల్ రూరల్‌కు, ఎ.జగత్సింగ్ వరంగల్ అర్బన్, ఐ.బావ్‌సింగ్ వరంగల్ అర్బన్ జిల్లాలకు కేటాయించారు. ఇతర జిల్లాల నుంచి కరీంనగర్‌కు.. ఎ.మోథీరామ్ (ఆదిలాబాద్), కె.రవిరాజా కుమార్‌రావు (జయశంకర్ భూపాలపల్లి), జె.రాజలింగం (మంచిర్యాల), డి.కవిత (మంచిర్యాల), సాయిబాబా (మంచిర్యాల), జి.కుమారస్వామి (మంచిర్యాల), ఎ.రజిత (పెద్దపల్లి), కె.కనకయ్య (వరంల్ రూరల్), జి.శ్రీనివాస్ (వరంగల్ రూరల్), పి.హరికృష్ణ (వరంగల్ రూరల్), కె.రత్నవీరచారి (వరంగల్ రూరల్), కె.నారాయణను కరీంనగర్ జిల్లాకు కేటాయించారు. -
పెద్దసంఖ్యలో బదిలీలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఒక వైపు ఎన్నికల మేఘాలు ముంచుకొస్తున్నాయి. అందుకు తగినట్లే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనులు వేగవంతం చేసింది. ఈనెల 10న ఎన్నికల ముసాయిదా జాబితాను విడుదల చేయగా ఈనెల 25 వరకు అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. ఇక వచ్చే నెల 8న తుది ఓటర్ల జాబితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గత శుక్రవారం హైదరాబాద్‌లో కలెక్టర్లతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజిత్‌కుమార్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇదేక్రమంలో జిల్లాలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల వివరాలు పంపాలని, బదిలీ పరిధిలోకి వచ్చే అధికారుల వివరాలు అందజేయాలని సూచించారు. దీంతో జిల్లా యంత్రాంగం ఎన్నికలతో ప్రత్యక్ష్యంగా సంబంధం ఉండే అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓల వివరాలు సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. తాజాగా సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి బదిలీలకు సంబంధించి సూచనలు చేశారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో స్థానచలనం కలిగిన అధికారులు వెంటనే విధుల్లో చేరకపోతే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలో ఈఆర్వోలు, ఏఈఆర్వోల ఖాళీలు, భర్తీలపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో చర్చించారు. పెద్దసంఖ్యలో బదిలీలు ఎన్నికల సమయంలో బదిలీలు సహజం. అయితే రాష్ట్రంలో జిల్లాల విభజన నేపధ్యంలో బదిలీలు, సర్వీస్ కాలం లెక్కింపులో ఉమ్మడి జిల్లాను ప్రాతిపదికగా తీసుకుంటారా, కొత్త జిల్లాల ప్రాతిపదికన చూస్తారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇదే విషయంలో జిల్లా అధికా రులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అక్కడినుంచి ఆదేశాలు రాగానే అమలు చేసేందు కు జాబితాలు సిద్ధం చేసుకున్నారు. జోనల్ వ్యవస్థపై స్పష్టత వచ్చినందున కొత్త జిల్లాల ప్రాతిపదికన సర్వీస్ లెక్కిస్తారని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. అదే ఖాయమైతే జిల్లాలోని 26 మం డలాల తహసీల్దార్లు, ఆర్డీఓ కార్యాలయం, డీఏఓ, కలెక్టరేట్లోని సెక్షన్ సూరింటెండెంట్లు కలిపి సుమారు 10 మంది తహసీల్దార్లు బదిలీ జాబితాలో ఉండే అవకాశమున్నట్లు సమాచారం. అలాకాకుం డా ఉమ్మడి జిల్లా పరిధిని తీసుకుంటే సుమారు 35 మంది వరకు తహసీల్దార్లు స్థానచలనం తప్పకపోవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అది కూడా కొత్త జోనల్ ప్రకారం మహబూబ్‌నగర్‌లోని అధికారులను జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాలకు బదిలీ చేసే అవకాశాలు ఉంటాయి. పాత జోనల్ ప్రకారం బదిలీలు చేస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 34 తహసీల్దార్ పోస్టులకు గాను 33 మంది తహసీల్దార్లు విధుల్లో ఉండగా ఒక స్థానం ఖాళీగా ఉంది. ఎన్నికల తర్వాత.. గతంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఎన్నికల అనంతరం తహసీల్దార్ స్థాయి అధికారులను ఎన్నికలు ముగిసిన నెలలో వారు గతంలో పనిచేసిన జిల్లాలకు తిరిగి పంపించేవారు. ప్రస్తుతం ఇదే ఆనవాయితీ కొనసాగితే ఇబ్బందిలేదు. ఒకవేళ ఎక్కడి వారక్కడే ఉండాల్సిందే అంటే మాత్రం ఎన్నికల బదిలీల్లో వెళ్లిన వారికి ఇబ్బందులు తప్పవు. ఎన్నికల బదిలీ నిబంధనలు ఎన్నికల ప్రక్రియతో ప్రమేయం ఉన్న సొంత జిల్లా అధికారులను తప్పక బదిలీ చేయాలి. ఇతర జిల్లాల అధికారులు అయినప్పటికీ గత నాలుగేళ్లలో ప్రస్తుత జిల్లాలో మూడేళ్ల కాలం పూర్తయిన వాళ్లు బదిలీకి అర్హులు. పదోన్నతి పొంది పనిచేస్తున్నా.. గతంలో ఇక్కడే పనిచేసి ఉంటే మొత్తం సీనియారిటీని లెక్కిస్తారు. -
బదిలీలకు కోడ్ వర్తించదా..?
విజయనగరం కంటోన్మెంట్: బదిలీలకు ఎమ్మె ల్సీ ఎన్నికలకూ సంబంధం లేదా..? ఇటీవల ప్రభుత్వం నిర్దేశించిన తేదీల్లోనే జిల్లా అధికారుల బదిలీలు జరిగాయా? అంటే అవుననే అం టున్నాయి అధికార వర్గాలు. జిల్లాలో ఇటీవల బదిలీలకు పలుమార్లు మార్గదర్శకాలు వె లువడ్డాయి. గత నెల 18న బదిలీలపై ఉన్న నిషేధా న్ని ఎత్తివేస్తున్నట్టు సాయంత్రం వేళ జీఓ విడుదల చేసింది ప్రభుత్వం. దీని సారాంశం ప్రకా రం మే 31లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చే యాలని వివరించారు. అందులో ఐదేళ్లు పైబ డిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని పే ర్కొన్నారు. ఆ తర్వాత 23న మరో జీవో జారీ చేస్తూ మూడేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారి ని కూడా తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రకటించారు. అయితే బదిలీలు కోరుకున్నా, ప రిపాలనా సంబంధమైన బదిలీలు చేయాలన్నా దానికి సర్వీసు సమయాన్ని కేటాయించలేదు. ఆ తర్వాత మరో రెండు జీఓలు విడుదల చేశా రు. అయితే ఈ సమయంలో జిల్లా ఏజేసీ యూ సీజీ నాగేశ్వరరావు ఒక్కరే రిలీవ్ అయ్యారు. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో మంత్రులెవరికీ తెలియకుండా బదిలీలు అవుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి మంత్రులు తీసుకువెళ్లడంతో అన్ని బదిలీలను నిలిపివేయాలని, ఇప్పటికే బదిలీ చేసిన వారిని వెనక్కు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వానికి రిపోర్టు అయిన ఏజే సీ నాగేశ్వరరావు కూడా తిరిగి విధుల్లో చేరారు. అప్పటికి బదిలీలు అయిన ఆర్డీఓ జె.వెంకటరావు, డిప్యూటీ డీఈఓ నాగమణిలను రిలీవ్ చెయ్యలేదు. దీంతో వారు వెనక్కు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కోడ్ అమలులోకి వచ్చిందనీ, ఎన్నికల తతంగం పూర్తయ్యేవరకూ బదిలీలు నిలిపేయవచ్చని అన్నారు. అయితే ఇప్పుడు జన్మభూమి అయిన వెంటనే బదిలీలు చేపడతారనీ ఊహాగానాలు విని పిస్తున్నాయి. శాసన మండలి ఎన్నికలకు జిల్లా అధికారుల బదిలీ లతో పెద్ద ఇబ్బందికర, నిషేధిత అంశాలేవీ లేవని అంటున్నారు. దీంతో ఈ నెల 9 తరువాత బదిలీలు జరిగే అవకాశముం దని తెలుస్తోంది. జిల్లాలో సర్వే శాఖ సహాయ సంచాలకులు డీబీడీబీ కుమార్‌కు శ్రీకాకుళం బదిలీ అయింది. ఇంతకు ముందే ఈయనకు దీ నికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వగా జిల్లాలో ప్రత్యేకమైన పనులున్నందున జిల్లా కలెక్టర్ సూచనల మేరకు రిలీవ్ కాకుండా జిల్లాలోనే సేవలందిస్తున్నట్టు తెలుస్తున్నది. అదేవిధంగా పలువురు జిల్లా అధికారులకు కూడా బదిలీలు జన్మభూమి తరువాత బదిలీలు అయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం జిల్లా అధికారుల్లో ఈ విషయమై జోరుగా వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు వస్తే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. -
అవునంటే.. కాదంటారు!!
అధికారుల బదిలీల విషయంలో తెలుగుదేశం నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఒకరు అవునంటే.. మరొకరు కాదంటున్నారు. లోపాయికారీ ఒప్పందాలతో ఎటూ తేలని పరిస్థితి నెలకొంది. దీంతో అందరిలో ఒకటే చర్చ మొదలైంది. నాడు అంత హడావుడి చేసిన నాయకులంతా ఇప్పుడెందుకు మాట్లాడటం లేదన్న విషయం చర్చనీయూంశమైంది. అయితేనేం తమకు ఇబ్బంది ఉండదని అధికారులు ఆనందంగా ఉన్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : అధికారంలోకి రాగానే మండల స్థాయి అధికారు ల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మార్చేయాలని, కాంగ్రెస్ నేతలకు వంతపాడిన అధికారులను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని టీడీపీ నేతలు కొద్ది నెలల కిందట నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే సమావేశాల్లో అధికారులపై అంతెత్తుకు లేచేవా రు. కాస్త గట్టిగానే మాట్లాడేవారు. ఇంకేముంది తామం టే ఇష్టం లేకనే అధికార పార్టీ నేతలు అసహనంగా చూస్తున్నారని అధికారులు కూడా ఆలోచనకొచ్చారు. బదిలీ ఖాయమని భావించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా బదిలీల జీఓ ఇచ్చింది. తమకనుకూలంగా బదిలీలు చేసుకునేలా అవకాశాన్ని కల్పించింది. దీంతో దాదాపు బదిలీలు తప్పవని అధికారులంతా అనుకున్నారు. ఇంతలోనే పలువురు టీడీపీ నేతల బలహీనతలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. వారు చెప్పినట్టు నడుచుకుంటే, వారి ఆశించినట్టు చేతులు కలిపి వెళ్లిపోతే ఇబ్బందేముండదనే విషయం ప్రచారంలోకి వచ్చింది. దీంతో సంపాదనే యావగా పని చేస్తున్న నేతలను అధికారులు కలుస్తున్నారు. లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. బదిలీలు జరగకుండా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఉన్నచోటే కొనసాగించాలని సిఫార్సు, అంగీకార లేఖలిస్తున్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా అధికారులు తమ ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు.మరోవైపు ఈ విషయం తెలియని కొందరు నేతలు తమకు అనుకూల అధికారులను తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. అందుకు తగ్గట్టుగా వారు కూడా లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. కొంతమంది నేతలైతే ఇతర జిల్లాల్లో పని చేస్తున్న తమ బంధువులను కూడా తీసుకురావాలని తెగ ప్రయత్నిస్తున్నారు. వారే అధికారులైతే పనులు సులువుగా చేసుకోవచ్చని ఆశిస్తున్నారు. ఈ విధమైన పరిస్థితుల మధ్య సంబంధిత అధికారులకు పోస్టింగ్ వచ్చేలా అంతా తామే చూసుకుంటామని భరోసా ఇవ్వడమే కాకుండా సిఫార్సుల లేఖలు ఇస్తున్నారు. దీంతో ఇక్కడికొద్దామనుకున్న అధికారులంతా మూటాముళ్లు సర్దుకుని సిద్ధమవుతున్నారు. ఈ విధంగా అటు ఆసక్తి ఉన్న అధికారులు, ఇటు తిష్ట వేద్దామనుకున్న అధికారులు చెరో వైపు ప్రయత్నిస్తున్నారు. డబ్బులు భారీగా ముట్టజెప్పుతున్నారు. చెప్పాలంటే ఒకరి ప్రయత్నానికి మరొకరు చెక్ పెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా రెండు వైపులా నుంచి చెరో అభిప్రాయంతో సిఫార్సుల లేఖలు రావడంతో ఉన్నతాధికారులు తేల్చుకోలేకపోతున్నారు. సంబంధిత మంత్రులు కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. రెవెన్యూ, డీఆర్డీఏ, డ్వామా, జిల్లా పరిషత్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖల్లో పలు కీలక పోస్టులపై ఈ రకమైన సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వమిచ్చిన బదిలీల జీఓతో దాదాపు బదిలీ ఖాయమనుకున్న సందర్భంలో టీడీపీ నేతలు అనుసరిస్తున్న తీరుతో అధికారులకు కాసింత ఉపశమనం కలుగుతోంది. పార్టీ వర్గాల్లో విసృ్తత చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు అంతా ఇంతా అని... అంతు చూస్తామని గాంభీర్యం ప్రదర్శించిన నేతల్లో ఒక్కసారిగా స్వరం మారడంతో బదిలీల తంతులో వేలి పెట్టని నేతలంతా గుసగుసలాడుకుంటున్నారు. మనోళ్లని మేనేజ్ చేయగలిగితే నిన్న తప్పు అనుకున్న వారంతా నేడు ఒప్పు అయిపోతారని చర్చించుకుంటున్నారు. చెప్పాలంటే బదిలీల సీజన్ మన నేతలకు పండుగలా వచ్చిందని, అధికారుల తాపత్రయం వరంగా మారిందని చెవులు కొరుక్కొం టున్నారు. వాళ్లు అనుకుంటున్నారని కాదుగాని ప్రస్తుత పరి స్థితులు కూడా అందుకు తగ్గట్టుగానే కన్పిస్తున్నాయి.