విజయనగరం కంటోన్మెంట్: బదిలీలకు ఎమ్మె ల్సీ ఎన్నికలకూ సంబంధం లేదా..? ఇటీవల ప్రభుత్వం నిర్దేశించిన తేదీల్లోనే జిల్లా అధికారుల బదిలీలు జరిగాయా? అంటే అవుననే అం టున్నాయి అధికార వర్గాలు. జిల్లాలో ఇటీవల బదిలీలకు పలుమార్లు మార్గదర్శకాలు వె లువడ్డాయి. గత నెల 18న బదిలీలపై ఉన్న నిషేధా న్ని ఎత్తివేస్తున్నట్టు సాయంత్రం వేళ జీఓ విడుదల చేసింది ప్రభుత్వం. దీని సారాంశం ప్రకా రం మే 31లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చే యాలని వివరించారు. అందులో ఐదేళ్లు పైబ డిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని పే ర్కొన్నారు.
ఆ తర్వాత 23న మరో జీవో జారీ చేస్తూ మూడేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారి ని కూడా తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రకటించారు. అయితే బదిలీలు కోరుకున్నా, ప రిపాలనా సంబంధమైన బదిలీలు చేయాలన్నా దానికి సర్వీసు సమయాన్ని కేటాయించలేదు. ఆ తర్వాత మరో రెండు జీఓలు విడుదల చేశా రు. అయితే ఈ సమయంలో జిల్లా ఏజేసీ యూ సీజీ నాగేశ్వరరావు ఒక్కరే రిలీవ్ అయ్యారు. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో మంత్రులెవరికీ తెలియకుండా బదిలీలు అవుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి మంత్రులు తీసుకువెళ్లడంతో అన్ని బదిలీలను నిలిపివేయాలని, ఇప్పటికే బదిలీ చేసిన వారిని వెనక్కు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ప్రభుత్వానికి రిపోర్టు అయిన ఏజే సీ నాగేశ్వరరావు కూడా తిరిగి విధుల్లో చేరారు. అప్పటికి బదిలీలు అయిన ఆర్డీఓ జె.వెంకటరావు, డిప్యూటీ డీఈఓ నాగమణిలను రిలీవ్ చెయ్యలేదు. దీంతో వారు వెనక్కు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కోడ్ అమలులోకి వచ్చిందనీ, ఎన్నికల తతంగం పూర్తయ్యేవరకూ బదిలీలు నిలిపేయవచ్చని అన్నారు. అయితే ఇప్పుడు జన్మభూమి అయిన వెంటనే బదిలీలు చేపడతారనీ ఊహాగానాలు విని పిస్తున్నాయి. శాసన మండలి ఎన్నికలకు జిల్లా అధికారుల బదిలీ లతో పెద్ద ఇబ్బందికర, నిషేధిత అంశాలేవీ లేవని అంటున్నారు.
దీంతో ఈ నెల 9 తరువాత బదిలీలు జరిగే అవకాశముం దని తెలుస్తోంది.
జిల్లాలో సర్వే శాఖ సహాయ సంచాలకులు డీబీడీబీ కుమార్‌కు శ్రీకాకుళం బదిలీ అయింది. ఇంతకు ముందే ఈయనకు దీ నికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వగా జిల్లాలో ప్రత్యేకమైన పనులున్నందున జిల్లా కలెక్టర్ సూచనల మేరకు రిలీవ్ కాకుండా జిల్లాలోనే సేవలందిస్తున్నట్టు తెలుస్తున్నది. అదేవిధంగా పలువురు జిల్లా అధికారులకు కూడా బదిలీలు జన్మభూమి తరువాత బదిలీలు అయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం జిల్లా అధికారుల్లో ఈ విషయమై జోరుగా వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు వస్తే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
బదిలీలకు కోడ్ వర్తించదా..?
Published Sun, Jun 7 2015 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM
Advertisement