tress
-
ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా?
ఆత్మకూరు రూరల్(కర్నూలు జిల్లా): వృక్షోరక్షితి రక్షతః అంటారు పెద్దలు. అంటే వృక్షాలను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భావం. అయితే, అన్ని చెట్లు అలాంటివి కావని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కోనో కార్పస్. పచ్చదనం మాటున విరివిగా పెరుగుతున్న ఈ వృక్షాలు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారనున్నాయి. దుబాయి చెట్టుగా పిలువబడుతున్న ఈ వృక్షం ఇప్పటికే పలు దేశాలను కలవరపెడుతోంది. చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! శంకురూపంలో ఉండే కోకో కార్పస్.. అమెరికా ఖండాల్లోని తీరప్రాంతం మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా పెరిగే ఈచెట్టు పచ్చదనాన్ని అంతరించుకుని ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అరబ్, మధ్య ప్రాచ్యదేశాల్లో ఏడారినుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుపాన్ల నుంచి, వేడిగాలుల నుంచి రక్షణగా ఉండేందుకు ఈ మొక్క ను దిగుమతి చేసుకుని రహదారులు, గార్డెనింగ్, కమ్యూనిటీ అవెన్యూ ప్లాంటేషన్లలో విస్తృతంగా పెంచుతున్నారు. మనదేశంలోకి ప్రవేశించిందిలా.. వేగంగా పెరుగుతూ అధిక పచ్చదనాన్ని కలిగిన కోనోకార్పస్‌పై మనదేశంలోని నర్సరీ పెంపకం దారులు, ల్యాండ్‌స్కేప్ ఎక్స్‌పర్ట్‌ల దృష్టిపడింది. పచ్చదనంతో వెంచర్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రియల్ఎస్టేట్ వ్యాపారులు ఈ మొక్కలను తీసుకొచ్చారు. అలా ఈ మొక్క మనదేశంలో ప్రవేశించింది. అనంతరం నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు మొదలు సాధారణ నగర పంచాయతీల వరకు ఈ మొక్కలను డివైడర్లపై, రహదారుల్లో విరివిగా నాటడం మొదలు పెట్టారు. తూర్పుకనుమల్లో భాగమైన నల్లమల అడవుల కేంద్రీయ స్థానమైన నంద్యాల జిల్లాలో కూడా దుబాయ్ మొక్క ప్రభంజనం తక్కువేమి కాదు. ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ తదితర మున్సిపాలిటీలలో దుబాయ్ మొక్కలను రహదారుల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెద్ద ఎత్తున నాటుతున్నారు. జీవవైవిధ్యానికి మారు పేరైన నల్లమల సమీప ప్రాంతాల్లో ఈ ఖండాంతర మొక్క ప్రవేశంతో పర్యావరణ పరిస్థితులు తల్లకిందులయ్యే అవకాశం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. కోనోకార్పస్‌ను నిషేధించిన తెలంగాణ సర్కారు పలు పర్యావరణ సమస్యలకు కారణమవుతోందన్న కారణంతో కోనోకార్పస్ మొక్కలను నాటడాన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. హరితవనం కార్యక్రమంలో తొలుత ఈ మొక్కలనే ఎక్కువగా వినియోగించిన ప్రభుత్వం త్వరలోనే వీటి దుష్ప్రభావాలను గుర్తించడం గమనార్హం. వన్యప్రాణులకు సంకటం వేరే ఖండాలనుంచి తెచ్చి పెంచే మొక్కలతో పర్యావరణ సమతుల్యతకు విఘాతమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అలాంటి వాటిని ఎక్సోటిక్ వీడ్ గా పిలుస్తుంటారు. ఇవి ప్రపంచంలో ఒక ప్రాంతం నుంచి సహజంగా అవి ఉండని మరో ప్రాంతంలో ప్రవేశ పెట్టబడినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వీడ్స్(కలుపు మొక్కలు)తో స్థానిక వృక్ష, గడ్డి జాతుల విస్తరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో హెర్బీవోర్స్(గడ్డితినే జంతువులు)కు ఆహార కొరత ఏర్పడి అది కార్నీవోర్స్( మాంసాహార జంతువులు)ఉనికికే ప్రమాదకారణమవుతుంది. కోనోకార్పస్‌తో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తనున్నాయి. ఇది వేగంగా పెరిగే నిత్య పచ్చదనం మొక్క కావడంతో ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి ఇతర స్థానిక జాతి మొక్కలను, గడ్డిని ఎదగనీయదు.అలాగే పక్షులకు తమ జీవావరణంలో వచ్చిన ఈ కొత్త మొక్క గందరగోళానికి గురి చేయడంతో సహజ రక్షణలో గూళ్లు కట్టుకోవడంలో వైఫల్యం చెంది పునరుత్పత్తి అవకాశాలను తగ్గించుకుంటాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పలు ఆరోగ్య సమస్యలకూ కారణం కోనోకార్పస్‌మొక్కపర్యావరణాన్ని హాని చేయడంతో పాటు ప్రజారోగ్య సమస్యలకు కారణమవుతుందని పొరుగుదేశమైన పాకిస్తాన్ గుర్తించింది. ముఖ్యంగా కరాచీ నగరంలో హఠాత్తుగా పెరుగుతున్న ఊపిరి తిత్తుల వ్యాధిగ్రస్తుల సంఖ్యకు ఈ మొక్కలే కారణమని పరిశోధనల్లో తేల్చింది. గా లిలో ఎక్కువ సంఖ్యలో పుప్పొడి రేణువులు కనిపించడం అవి కోకోకార్పస్ పుష్పాలివిగా తెలియడంతో ఈ మొక్కల పెంపకాన్ని పూర్తిగా నిషేధించింది.అధిక సంఖ్యలో భూగర్భజలాలను వినియోగించుకునే సామర్థ్యం కలిగిన ఈ మొక్కలతో పర్యావరణానికి చేటు అని మరికొన్ని అరబ్‌దేశాలు గుర్తించాయి. దుబాయ్ మొక్కలతో పలు సమస్యలు దుబాయ్ మొక్కలు స్థానిక పర్యావరణ పరిస్థితులకు ముప్పుగా మారుతున్నాయి. చాలా మంది ఈ మొక్క గురించి తెలుసుకోకుండా పెంచుతున్నారు. ఆకురాల్చు అడవులున్న మన ప్రాంతంలో నిత్య పచ్చదనం కలిగిన దుబాయి మొక్కలు ఇతర వృక్షజాతుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయి. వీటి పుష్పాలు వెదజల్లె పుప్పొడి వల్ల పలు శ్యాసకోశ వ్యాధులు, అలర్జీ సమస్యలు తలెత్తుతాయి. – విష్ణువర్ధన్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి,ఆత్మకూరు ఈ మొక్కలను నిషేధించాలి మహారాష్ట్రలోని పూణే, మన పొరుగున ఉన్న తెలంగాణలో దుబాయి మొక్కలను నాటడాన్ని నిషేధించినట్లుగానే మన రాష్ట్రంలో కూడా నిషేధించాలి. పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలిగించే ఏ అంశానైనా ప్రభుత్వాలు అడ్డుకోవాలి. – సుబ్బయ్య ఆచారి, పర్యావరణ ప్రేమికుడు, ఆత్మకూరు -
Kondagattu: ఔషధాల ‘కొండగట్టు’
కొండగట్టు(చొప్పదండి): ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక నిలయం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని కొండపై ఈ క్షేత్రం ఉంది. సంవత్సరం పొడవునా ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఆరోగ్యం బాగోలేకపోయినా, మతిస్థిమితం సరిగా లేకపోయినా కొద్దిరోజులు కొండపై నిద్రచేస్తే నయం అవుతుందని భక్తుల విశ్వాసం. అయితే కొండపై ఆధ్యాత్మికతతో పాటు ఔషధ మూలికలు ఉన్నాయని ఇటీవల శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర ఆచార్యుల పరిశోధనలో వెల్లడైంది. 333 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండపై 300 రకాల ఔషధ మూలికల చెట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ చెట్టుపేరు కుమ్మరిపోనికి. ఇలాంటి మొక్కలు, చెట్లు కొండపై వందల సంఖ్యలో ఉన్నాయి. తెలుపు రంగులో ఉంటుంది. ప్రత్యేకంగా నిర్మల్ కొయ్యబొమ్మల తయారీలో వాడుకోవచ్చు. ఈ మొక్కలను వెటర్నరీ మందుల తయారీకి కూడా వాడుకోవచ్చని, మొత్తంగా కొండగట్టు అటవీ ప్రాంతాన్ని ‘కుమ్మరిపోనికి’ ఫారెస్టుగా కూడా పిలుస్తారని శాతవాహనయూనివర్సిటీ వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు నరసింహమూర్తి వెల్లడించారు. 333 ఎకరాలు.. 300 రకాల మొక్కలు కొండగట్టు గుట్ట విస్తీర్ణం 333 ఎకరాల్లో ఉంటుంది. కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ దాటాక కొండపైకి చేరుకునే మార్గంలో, ఘాట్‌రోడ్డు మార్గంలో, ఆలయం ఆవరణలో 300 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. గతంలోనూ కొండగట్టు అటవీప్రాంతంపై ఎస్సారార్ కళాశాల అధ్యాపకులు పరిశోధన చేశారు. మళ్లీ కొన్నేళ్లతరువాత శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు నరసింహమూర్తి, విద్యార్థి బాణవత్ సురేశ్ నాయక్ పరిశోధనలు చేయగా.. ఔషధమొక్కల గురించి తెలిసింది. జీవవైవిధ్యపరంగా ఇవి చాలా ముఖ్యమైనవని, వస్తువుల తయారీ, మనుషులు, జంతువుల మందుల తయారీలో ఉపయోగపడతాయని వారు వెల్లడించారు. మొక్కలు.. లాభాలు కొండగట్టు ప్రాంతంలో ఉన్నవి గిరి అడవులు(హిల్ఫారెస్ట్). ఎక్కువగా కుమ్మరిపోనికి చెట్లు ఉంటాయి. ఇవీ తెలుపు రంగులో ఉంటాయి. వృక్షశాస్త్ర పరంగా కైరోకార్పస్ అమెరికాన్స్గా పిలవబడతాయి. ప్రధానంగా ఎడ్లపాల, పాలకొడిసె, బిల్లుడు, తపసి, ఎర్రబోరుగా, నల్లకోడిసా, అందుకు, నల్లగా, ఎక్కువశాతం కుమ్మరిపోనికి, బ్యూటియా మోనోస్పెర్మ, టేకు, పోంగా, మియాపిన్, ఏటా కానుగు, తెల్లపోనికి, టేకు, నల్లాకోడిషా చెట్లతో పాటు వందల సంఖ్యలో ఔషధమొక్కలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తంగా కొండగట్టులోనే ఇలాంటి ఔషధమొక్కలు ఉన్నాయి. ఇవీ కొండపై ఆక్సిజన్ కలుషితం కాకుండా చేస్తాయి. వివిధ రకాల రోగాలు నయమయ్యేందుకు పనిచేస్తాయి. వర్షపాతం నమోదుకు దోహదపడి వర్షాలు పడేందుకు ప్రధానభూమిక పోషిస్తాయి. రామగిరి గుట్టల్లోనూ ఇలాంటి చెట్లు ఉన్నాయి. ఇతిహాసం చెబుతోందిదే..! ఇతిహాసంలో రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడి ప్రాణానికి అపాయం ఏర్పడినప్పుడు హనుమంతుడు సంజీవనిని తీసుకెళ్తున్న క్రమంలో కొండనుంచి ఓ రాయి పడి.. కొండగట్టుగా వెలిసిందని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలోనే వందలాది ఔషధమొక్కలు కొండపై పెరిగాయని, అవన్నీ ప్రాణాపాయంలో, దీర్ఘకాలికవ్యాధులతో బాధపడేవారికి సంజీవనిగా పనిచేస్తాయని, అందుకే చాలామంది అనారోగ్యంతో బాధపడేవారు కొండపై నిద్రచేస్తే, రోగాలు నయం అవుతున్నాయని భక్తుల విశ్వాసం. అడవి రక్షణ మనబాధ్యత వందలాది ఔషధమొక్కలున్న కొండప్రాంతంలోని అడవిని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పటికే ఇక్కడ వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. రోడ్డు, రైలుమార్గంతో ప్రజారవాణా పెరుగుతోంది. కొండపైకి వచ్చే భక్తులు విలువైన చెట్లను వంటచెరుకుగా వినియోగించడంతో అడవులు అంతరించిపోతున్నాయి. కొండగట్టు జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు మార్గాలు సిద్ధం చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవవైవిధ్యమండలికి అందిస్తాం. రాబోయేకాలంలో గుట్టపై సీట్బాల్ విసిరేలా సర్కారును కోరుతాం. కొండగట్టు పరిసర ప్రాంతాల వారు, వచ్చే భక్తులకు ఈ విషయంలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. మా పరిశోధన కూడా ఇంకా పూర్తికాలేదు... కొనసాగిస్తాం. – డాక్టర్ ఎలగొండ నరసింహమూర్తి, శాతవాహన విశ్వవిద్యాలయం, వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు మొక్కల సంరక్షణకు కృషి చెట్లతోనే మానవ మనుగడ. అవిలేకుంటే మనమూ లేము. కొండపై ఉన్న విలువైన ఔషధమొక్కల సంరక్షణ కోసం తోటమాలిని ఏర్పాటు చేశాం. ప్రతీ మొక్కకి నిత్యం నీరు పట్టడమే కాకుండా, నిత్యం సంరక్షిస్తున్నాం. కొండకు వచ్చే భక్తులకు చెట్ల ద్వారా ప్రశాంత వాతవరణం అందుబాటులో ఉంటోంది. నిత్యం నేనూ మై లైఫ్.. మై ట్రీస్ అనే విధంగా ఉంటా. – వెంకటేశ్, ఈవో, కొండగట్టు -
సచివాలయం చెట్లు బతికి బట్టకట్టేనా!
సాక్షి, హైదరాబాద్: పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రపంచమంతటా అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఏదైనా అభివృద్ధి పనుల కోసం చెట్లను తొలగించాల్సి వస్తే... నిర్దయగా నరికివేయడం లేదు. దశాబ్దాలుగా పెరిగిన చెట్లను శాస్త్రీయ పద్ధతిలో అత్యంత జాగ్రత్తగా పెకిలించి... మరోచోటికి తరలించి ప్రాణప్రతిష్ట చేస్తున్నారు. కానీ తెలంగాణ కొత్త సచివాలయం నిర్మిస్తున్న ప్రాంతంలో ఉన్న చెట్లు మాత్రం ప్రమాదంలో పడ్డాయి. ప్రస్తుతం సచివాలయ నిర్మాణానికి పునాదులు తవ్వే పని మొదలైంది. కాస్త ముందుచూపుతో ఇక్కడున్న చెట్లను ఈపాటికే మరో ప్రాంతానికి ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో తరలించి ఉంటే బతికేవి. కానీ ప్రస్తుతం పొడి వాతావరణం ఏర్పడటంతో ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో చెట్లకు ప్రాణదానం చేసే అవకాశాలు బాగా సన్నగిల్లాయి. రెండు వానాకాలాలు పోయాయి... కొత్త సచివాలయ భవన నిర్మాణానికి వీలుగా అక్కడి కార్యాలయాలను దాదాపు ఏడాదిన్నర క్రితమే బీఆర్కేఆర్ భవన్‌తో పాటు ఇతర భవనాల్లోకి తరలించారు. 2019 ఆగస్టు నుంచి సచివాలయ ప్రాంగణం ఖాళీగా ఉంది. గత జూలైలో పాత భవనాల కూల్చివేత మొదలైంది. అంటే.. మధ్యలో రెండు వానాకాలాలు వెళ్లిపోయాయి. ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో చెట్లను మరో చోటకు తరలించి బతికించుకునేందుకు జూన్ నుంచి నవంబర్ వరకు సానుకూల వాతావరణం ఉంటుంది. డిసెంబర్ నుంచి వాతావరణంలో తేమ శాతం తగ్గి పొడి పరిస్థితులు ఏర్పడటంతో చెట్లు బతికే అవకాశాలు సన్నగిల్లుతాయి. అదను దాటిపోయాక ప్రస్తుతం సచివాలయంలో చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు వీలుగా అధికారులు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అంటే ప్రక్రియ మొదలయ్యేందుకు ఎంత లేదన్నా మరో పక్షం రోజులకు పైగా సమయం పడుతుందన్న మాట. అప్పుడు ట్రాన్స్‌లొకేట్ చేసే చెట్లలో 30 శాతమే బతికే అవకాశం ఉంటుంది. స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చినా.. వాటా ఫౌండేషన్ అనే సంస్థ చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు ముందుకొచ్చింది. గత నెలలో దాదాపు 18 చెట్లను శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు స్థలానికి తరలించి తిరిగి నాటింది. ఆ తర్వాత ఆ సంస్థ ఈ ప్రక్రియ నుంచి తప్పుకుంది. సచివాలయ ప్రాంగణంలో దాదాపు 600కు పైగా చెట్లు ఉంటే, సరిగ్గా కొత్తభవనం నిర్మించే ప్రాంతంలో 90 వరకు ఉన్నాయి. ఈ 90 చెట్లను తొలగించాల్సిందే. ఇందులో 33 చెట్ల ట్రాన్స్లొకేçషన్‌కు అటవీశాఖ అనుమతించింది. మిగతావి కొట్టేయచ్చన్న మాట. కొట్టేసే చెట్లను కూడా ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు స్వచ్ఛంద సంస్థ ఆసక్తి చూపగా, ఆ విషయంలో అధికారులకు– ఆ సంస్థకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. తర్వాత ఆ సంస్థ ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియ నుంచి తప్పుకొన్నట్టు తెలిసింది. తరలించాలంటే సమయం అవసరం ఇలా ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలో 60 ఏళ్లకు పైబడ్డ చెట్లు కూడా ఉన్నాయి. తొలగించాల్సిన ప్రాంతంలో దాదాపు 50కి పైగా పెద్ద చెట్లు ట్రాన్స్‌లొకేషన్ ద్వారా మరోచోట కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంది. సాధారణంగా పెద్ద చెట్టును ట్రాన్స్‌లొకేట్ ప్రక్రియ ప్రారంభానికి ముందు కనీసం 21 రోజుల సమయం అవసరమవుతుంది. కొమ్మలు, పెద్ద వేర్లు తొలగించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో చిగుళ్లు, కొత్త పిల్ల వేర్లు రావాల్సి ఉంటుంది. అప్పుడు తరలిస్తేనే ఆ చెట్టు ఏనుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు టెండర్లు పిలిచి కొత్త సంస్థను ఎంపిక చేశాక.. మళ్లీ 21 రోజుల సమయం అవసరమవుతుంది. అప్పటికి వాతావరణంలో పొడి పరిస్థితులు పెరిగి వాటిని బతికించటం మృగ్యమవుతుంది. -
టేకు చెట్టుపై గొడ్డలి వేటు
టేకు చెట్టుపై గొడ్డలి వేటు నేరడిగొండ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మెుక్కలు నాటాలని చెబుతున్నా ప్రభుత్వం అడవులను నాశనం చేసే వారిని మాత్రం అదుపు చేయలేకపోతోంది. ఫలితంగా ఓ వైపు నాటుడు..మరోవైపు నరుకుడు కార్యక్రమం యథేచ్ఛగా కొనసాగుతోంది. బోథ్ అటవీ రేంజ్లో పచ్చని టేకు చెట్లపై నిత్యం గొడ్డలి వేటు పడుతోంది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బోథ్ రేంజ్లో అధికారుల పర్యవేక్షణ లేక స్మగ్లర్లు దర్జాగా అడవుల్లోకి వెళ్లి టేకు చెట్లు నరికివేస్తునారు. ఇక్కడ ఉన్న టేకు వనం మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. దీంతో స్మగ్లర్లు ఇక్కడి టేకుపై కన్నేశారు. దీంతో స్మగ్లర్ల వేటుకు పెద్ద పెద్ద టేకు వక్షాలు నేలకొరిగి మొదళ్లు దర్శనమిస్తున్నాయి. బోథ్ రేంజ్ పరిధిలోని పీచర, బోరిగాం, ఈస్పూర్, నాగమాల్యాల్, అద్దాలతిమ్మాపూర్, గోవింద్పూర్, మర్లపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసిన చెట్ల నరికివేత కనిపిస్తోంది. వాటిని చూస్తే ఇటీవలే నరికి వేసినట్లు తెలుస్తోంది. అడుగడుగునా కనిపిస్తున్న చెట్లమొదళ్లతో కలప భారీగా రవాణా అయినట్లు తెలుస్తోంది. అడవులను రక్షించాల్సిన అధికారుల్లో కొందరు పరోక్షంగా స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇల్లు కడితే అధికారులకు పండుగే.. బోథ్, సోనాల, కౌట, పొచ్చెర, కనుగుట్ట, నేరడిగొండ, వడూర్, కుమారి, తదితర గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యిందంటే చాలు కొందరు అటవీ అధికారులకు పండుగ వచ్చినట్టే. దర్వాజలు, కిటì కీలు, తలుపులకు రూ.20వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తూ రూ.10వేల నుంచి 20వేల వరకు రసీదులు ఇచ్చి మిగతాది జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. చర్యలు తీసుకుంటున్నాం అడవిలో చెట్ల నరికివేత జరగడం లేదు. ఎప్పుడో నరికేసిన మొదళ్లు మాత్రమే ఉన్నాయి. స్మగ్లింగ్ నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – మనోహర్, బోథ్ రేంజ్ అధికారి -
హరితహారంలో భాగస్వాములు కండి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి : నాటిన మొక్కలను, సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు. ఆదివారం మున్సిపాలిటీలో 18వ వార్డు రైల్వే స్టేషన్ ఏరియాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భావితరాల ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తోందన్నారు. ఖాళీ భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ల పరిసరాలు, రహదారుల పక్కన విస్తారంగా మొక్కలు నాటాలన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చైర్పర్సన్ సునీతారాణి మాట్లాడుతూ హరితహారంలో మహిళలు, చిన్నారులు, యువకులు ముందుకు రావడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు లింగంపల్లి రాములు, మధు, పుర్రçపజలు, మహిళలు పాల్గొన్నారు. నెన్నెల : మండలంలోని నందులపల్లి జీపీ కార్యాలయ ఆవరణలో, నెన్నెల పీఏసీఎస్ నూతన కార్యాలయ నిర్మించే స్థలంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మొక్కలు నాటారు. నందులపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 14 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాధాక్రిష్ణ, జెడ్పీటీసీ కొడిపె భారతి, పీఏసీఎస్ చైర్మన్ ఇందూరి రమేష్, మండల కోఆప్షన్ సభ్యుడు ఇబ్రాహీం, ఏపీఎం విజయలక్ష్మి, నందులపల్లి ఎంపీటీసీ పంజాల లక్ష్మి, సర్పంచ్ సాగర్‌గౌడ్, ఆర్ఐ గోవింద్, ప్రకాశ్ గౌడ్, నాయకులు బీమాగౌడ్, సున్నం రాజు, రాజాగౌడ్, గొళ్లపల్లి సర్పంచ్ తిరుపతిగౌడ్, పంచాయతీ కార్యదర్శి పద్మనాభం పాల్గొన్నారు. హరితహారం కళాజాత నెన్నెల, గొళ్లపల్లి గ్రామాల్లో ఆదివారం తెలంగాణ సంÜ్కతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో హరితహారంపై కళాజాత ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఆటపాటల ద్వారా మొక్కల ప్రాముఖ్యతను వివరించారు. మానవ మనుగడకు మొక్కలు ఎంతో ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ప్రదర్శనలు ఇచ్చారు. తహసీల్దార్ వీరన్న, నెన్నెల, గొళ్లపల్లి సర్పంచులు ఆస్మా, తిరుపతిగౌడ్, కళాకారులు ముల్కల్ల మురళి, సల్లూ ýSష్ణ, సురేందర్, చింత రాయమల్లు, రవీందర్, నిరోష, శిరీష, అపూర్వ ఉన్నారు. కాసిపేట : మండలంలోని సోనాపూర్‌లో తహసీల్దార్ కవిత మొక్కలు నాటారు. జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, సర్పంచ్ లక్ష్మి, పంచాయితి కార్యదర్శి కవిత, పాల్గొన్నారు. మండలంలోని కోమటిచేనులో జేపీవో ధరంపాల్ పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ ఇంటింటికి మొక్కలు పెంచుతు పచ్చదనాన్ని కాపాడటంతొ పాటు పర్యావరణ పరిరక్షణకు కషిచేయాలన్నారు. పోలీసు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. తాండూర్ : మండలంలోని బోయపల్లిలో పొలంగట్లపై పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఎంపీపీ మాసాడి శ్రీదేవి మొక్కలు నాటారు. రైతులకు వెయ్యి మొక్కలను పంపిణీ చేశారు. తాండూర్ సీఐ కరుణాకర్, సర్పంచ్ మిట్ట వేణుగోపాల్, తహశీల్దార్ రామ^è ంద్రయ్య, నాయకులు మాసాడి శ్రీరాములు, సునార్కార్ మల్లేష్ పాల్గొన్నారు. వేమనపల్లి : హరితహారం కార్యక్రమంలో మేము సైతం అంటూ మాజీ మావోయిస్టులు గట్టయ్య, గోదావరి దంపతులు, మధునయ్య, ఆటోడ్రైవర్లు పాల్గొనగా వీరికి నీల్వాయి పోలీసులు అండగా నిలిచారు. నీల్వాయి ఎసై ్స శ్రీకాంత్ ఆధ్వర్యంలో నీల్వాయి, మామడ వన నర్సరీల నుంచి మొక్కలు తెప్పించారు. మారుమూల గ్రామం బద్దంపల్లిలో, మంగనపల్లి రోడ్డు వెంట మాజీ మావోయిస్టులు, నీల్వాయికి చెందిన ఆటో డ్రై వర్, ఓనర్ల యూనియన్ నాయకులతో మొక్కలు నాటించారు. సుమారు 500 వరకు వేప, కానుగ, నేరేడు మొక్కలు నాటినట్లు ఎసై ్స తెలిపారు. ఎకై ్సజ్ ఎసై ్స దిలీప్, జేపీవోలు కమలాకర్, పర్వతాలు, గీత కార్మిక సంఘం అధ్యక్షుడు తాళ్ల మల్లాగౌడ్ పాల్గొన్నారు. -
పేదరికంతో ఆ పిల్లల చదువులు చెట్లకిందే !